సాత్వికులు, లాక్ డౌన్ రోజుల లో బాధ పడరు, ఎందుకంటే, దేవుళ్ళే రాజులే, మనకన్నా ఎక్కువ కష్టాలు? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2107 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2142 General Articles and views 2,105,389; 104 తత్వాలు (Tatvaalu) and views 238,171.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

సాత్వికులు, శివాజ్ఞ ప్రకారం వచ్చిన దైవ దూత, కరోనా కు తగ్గట్లుగా, తమను తాము మార్చుకుని, తమ చెడు అలవాట్లు ను పద్దతులను వదలుకొని, తమ కళ్ళు తెరిపించి, వాస్తవం తెలియజేసింది అని, కరోనా కు ధన్యవాదాలు తెలుపుతారు. జరిగే ప్రపంచనాటకాన్ని, భగవంతుని లీలను, సాక్షిగా చూస్తూ గమ్మున ఉంటారు. ఇంట్లో నే ఉండి, తమ కుటుంబం ను రక్షిస్తారు.

ఎందుకంటే, విశాల రామరాజ్య చక్రవర్తి శ్రీ రామ చంద్రుడు, సకల సౌకర్యాలు రాజ భోగాలు అన్ని వదలి, ఒంటరిగా కేవలం ముగ్గురు మాత్రమే అడవుల్లో తిరుగుతూ, కంద మూలలను తిని, నేల మీద ఆనందముగా పవళించారు. ఏ రోజు కూడా, ఇది కష్టము అనలేదు.

అలాగే కృష్ణుని అండ ఉండి కూడా, పాండవులు వనవాసం చేసారు, అన్ని కష్టాలు ఆనందముగా భరిస్తూ. ఆఖరికి కృష్ణుడు కూడా చిన్నప్పటి నుంచే, రాజ భోగాలు మామ కంసుని తో పంచుకోకుండా, దూరంగా వ్రేపల్లె లో గోవులు కాస్తూ, సాధారణ కుటుంబం లో పెరిగాడు. ఎవరూ కష్టాల గురించి మాట్లాడలేదు, బాధ పడలేదు.

నల మహారాజు మరియు హరిశ్చంద్రుడు కూడా ఎన్నో కష్టాలు పడ్డారు, అడవుల్లో. సాత్వికులు కు ఇవన్నీ తెలుసు , తమ పిల్లల కు కూడా, ఈ కధలు కష్టాలు చెప్పి ఉంటారు చిన్నప్పుడే. కాబట్టి, ఏ సాత్విక కుటుంబం కూడా, ఈ లాక్ డౌన్ రోజుల లో బాధ పడదు, తిట్టుకోదు. ఎందుకంటే, దేవుళ్ళే రాజులే, మనకన్నా ఎక్కువ కష్టాలు పడ్డారు. సాత్వికులు, మరలా మరలా తమ పిల్లలు, బంధువులు, స్నేహితులు కు ఈ పురాణ కధలు చెప్పి, వారికి ధైర్యం కలిగిస్తారు.

కానీ అరిషడ్వర్గాలు లో మునిగి తేలే, రాజస తామస గుణాల వారు, తమను తాము మంచి మార్గాల లో కి మార్చుకునే అవకాశం ను, ఉపయోగించు కోరు. వారికి మంచి మార్పు నచ్చదు, విషయ వాసనల ప్రపంచంలో విహరించాలని, తపన పడతారు.

తమ విలాస సౌకర్యాలు భోగాలు, దూరం ఆయినాయి, అన్న బాధతో కసితో కోపంతో, ప్రతిక్షణం కరోనా ను తిడుతూ, భగవంతుని కర్తవ్యం ను కార్యాన్ని ఆక్షేపిస్తూ, పెద్దల మరియు ప్రభుత్వం మాట వినకుండా, బయటకు పరుగెత్తాలని, బంధించిన జైలు నుంచి విముక్తి పొందాలన్న తపనతో, ఊగిపోతూ ఉంటారు.

శివయ్య ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. మన జాగ్రత్తలు లేకుండా, చీమను లేదా కరోనా ను , తిట్టాము అంటే, శివయ్య ను తిట్టినట్లే గదా. మనసారా దైవాన్ని ఆరాధన చేద్దాం, మంచి ఆచరణలో చేస్తూ , ఆయనను అనుసరిద్దాం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2142 General Articles and views 2,105,389; 104 తత్వాలు (Tatvaalu) and views 238,171
Dt : 13-Apr-2020, Upd Dt : 13-Apr-2020, Category : General
Views : 958 ( + More Social Media views ), Id : 493 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : corona , kovid 19 , satvik , arishadvargalu , sri rama , sri krishna , naluDu , panDavulu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content