పసిపిల్లల కు పంచేంద్రియాలు కర్మేంద్రియాలు పని చేయడం ఆనందం, అదే పెద్దలు కు అవి ఆగిపోవడం? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2119 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2154 General Articles and views 2,159,449; 104 తత్వాలు (Tatvaalu) and views 241,401.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*Happiness when the five senses karmendriya start working for babies, and when they stop for adults? పసిపిల్లల కు పంచేంద్రియాలు కర్మేంద్రియాలు పని చేయడం మొదలు పెట్టినప్పుడు ఆనందం, అదే పెద్దలు కు అవి ఆగిపోవడం?*

- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva

Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు

ఇంద్రియాలు - ఐదు; వాటిలో కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అని రెండు విధాలు.

పసిపిల్లల కు పంచేంద్రియాలు పని చేయడం మొదలు పెట్టినప్పుడు ఆనందం,
అదే పెద్దలు కు అవి ఆగిపోవడం మొదలు పెట్టినప్పుడు బాధ. జ్ఞానేంద్రియ పంచకం: త్వక్కు = చర్మం, చక్షువు = కన్ను, రసన = నాలుక, శ్రోతం = చెవి, ఘ్రాణం = ముక్కు

అలాగే కర్మేంద్రియాలు ఐదు, అవి: హస్త, పాద, బక, గుద, ఉపస్థ. 1. వాక్కు (నోరు), 2. పాణి (చేయి), 3. పాదం, 4. పాయువు (మలద్వారం), 5. ఉపస్థ.

ఇవి క్రియలు చేయడానికి అనుభవించే ఆత్మ ఉపయోగించే ఇంద్రియాలు. ఇవి పెద్దలకు, అన్ని అణిగిపోతాయి.

అది సొంత తల్లి దండ్రులను, క్రుతజ్ఞత విశ్వసనీయత దైవ భక్తి తో దగ్గర పెట్టుకుని, సజీవ గురువు సేవ చేస్తున్న వారికే అర్ధం అవుతుంది, అవతల ప్రాణం ఎలా విల విల లాడిపోతుందో.

రజో తమో గుణ బానిసలకు ఇవి అర్ధం కావు, మనసుకు ఎక్కవు, వారూ ఆ ముదుసలి స్తితి వచ్చిన దాకా. కనీసం సొంత అలాగే ఇతర ముదుసలి వారిని వారానికి ఒకసారి వెళ్ళి లేదా కనీసం ఫోన్ లో ఓ 10 నిమిషాలు పలకరించరు.

ఈ లోపు మేము పోతాములే, ఆ ముదుసలి కష్టాలు మాకు లేకుండా, మేము ఇంకొకరి చేత చెయించుకోకుండా అని కలలు కంటారు, కానీ విధి వారి చేతిలో ఉండదు అని, కర్మ ఫలితాలు తప్పించుకోలేరు అని, వయసు ధన అహంకారముతో తెలుసుకోలేరు ఇప్పుడు.

మనము దేవాలయములో, అలాగే ఇంటి చుట్టుపక్కల ఎవరైనా పెద్దవారు కనపడితే, పలకరిస్తాము తప్పకుండా.

చెవుల వినికిడి తగ్గిపోతూ ఉంటే, చేతి స్పర్శ తగ్గిపోతూ ఉంటే, కంటి చూపు కనపడక తగ్గిపోతూ ఉంటే, నడక నడవలేకపోతే కుర్చీలోనుంచి లేవలేక, నిద్ర సరిగ్గా పోలేకపోతే, ముక్కు వాసన తగ్గిపోతూ ఉంటే, నోటికి రుచి తెలీకుండా పోతుంటే, మతిమరుపు పెరుగుతూ ఉంటే, ఇంక ఎవరికి బాధ, సంతోషం చెప్పుకోవాలి.

మనం లేకపోతే, అమ్మ ను అంటే కూతురు ను, అంత ప్రేమ గా దేవతలా చూసేదెవరు. అందుకే మన ఆయుష్షు పంచేంద్రియాలు కూడా ఇచ్చి, ఆమె ను కాపాడుకుం(టున్నాం)దాం.

రేపు మన బతుకు ఇంతే. ఇప్పుడు అయినా కళ్ళు తెరచి, అరిషడ్వర్గ అష్ట వ్యసన బానిసత్వం వీడాలి, నక్క పులి పాము గుణం ఓటు నోటు సపోర్ట్ వీడాలి, లేదంటే సత్వ గుణం దరి చేయలేము, అంటే భగవంతుని కు దూరంగా ఉంటాం.

కాబట్టి దగ్గర లో ఉన్న సత్వ గుణం అండ పొందండి, వెతకండి. ఆశ్రమాలకు రోగాలకు అందరూ ఉండి ఒంటరై వద్దు. మనకు నమ్మకమైన, సత్వ గుణ సంపన్నులు సాక్ష్యం తో మనకు అండగా ఉంటే, ఎన్ని కష్టాలనైనా అనందముగా ఎదుర్కొంటాము దైవము చల్లని నీడలో.

నిన్న తెల్లవారు ఝామున 4 గంటలకు, మోకాళ్ళు కాళ్ళు పీక్కు పోతున్నాయి అంటే, అప్పుడు నువ్వుల నూనె 2 కాళ్ళకు బాగా రాసి మర్ధనా చేసాము. హాయిగా నిద్ర పోయింది, పసి బిడ్డలా.

అలాగే పాదాల మీద కుర్చీ పడింది అని, బాధపడుతుంటే, తన మనశ్శాంతి కోసం, అవసరం లేకపోయినా, తన భయం తగ్గించడానికి, డాక్టర్ దగ్గరకి తీసుకుని వెళ్ళాము, అప్పాయింట్మెంట్ లు దొరక్క లేటుగా. డాక్టర్ చెప్పింది, మీ అబ్బాయి చెప్పింది అంతా కరెక్ట్, మీకేమి ఇబ్బంది లేదు, పాదానికి ఏమి నష్టం లేదు అని.

చెవి వినపడటం లేదు అంటే, డాక్టరు దగ్గరకు తీసుకుని వెళ్ళి చూపించాము, అలాగే గొంతు దగ్గర ట్రాన్సిల్ లాగా ఇబ్బంది గా ఉంది అంటే. డాక్టరు ఏమీ లేదు, నీళ్ళు పోయి గుబిలి తో, అలా అనిపించింది. త్వరలో గుబిలి తీస్తాను, చెవిలో మందు వేసుకుని రమ్మంది. ఇవన్నీ మనము క్రుతజ్ఞత ప్రేమతో చేస్తాము కాబట్టి, దేవతా ఆరాధనగా ఇబ్బంది లేదు.

కానీ ధనం కోసం, పించన్ కోసం, ఆస్తి కోసం, అధికారం కోసం చూసే సొంత కడుపున పుట్టిన దుర్మార్గులు లేదా బయటి వారు, పట్టించుకోరు, ముందు జాగ్రత్తలు ఉండవు. ఉదాహరణకు, షుగర్ పెరిగాక, కాలి వేళ్ళు తీసి ఆపరేషన్ చేస్తే, అప్పుడు ఆసుపత్రిలో/ ఇంట్లో సేవలు చేస్తారు.

అంతే గానీ, అది జరగకుండా, అమ్మకు 10 ఏళ్ళుగా కాపాడుకొచ్చినట్లు, ముందు జాగ్రత్తలు తో కాపాడరు. ఎందుకంటే వారిది, ధన అవసర అవకాశ సేవ.

ముదుసలి తనం లో కష్టాలు, రజో తమో గుణాల బతుకులు, అస్తవ్యస్తం. ఇప్పుడైనా, బుద్ది తెచ్చుకుని, అరిషడ్వర్గం అష్టవ్యసనం జయించి, సత్వ గుణం వారిని అండగా పెట్టుకోండి దగ్గరలో.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2154 General Articles and views 2,159,449; 104 తత్వాలు (Tatvaalu) and views 241,401
Dt : 30-Jun-2024, Upd Dt : 30-Jun-2024, Category : General
Views : 72 ( + More Social Media views ), Id : 2127 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Happiness , five , senses , start , working , babies , stop , adults , karmendriya
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content