తమ శపథాలకు జీవం పోసి, పోరాడి సగర్వంగా చంద్రన్నను సీయెం గా సభలోకి తెచ్చిన పవనన్న - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2114 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2149 General Articles and views 2,149,435; 104 తత్వాలు (Tatvaalu) and views 240,826.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*Pawananna, who gave life to their vows, fought and proudly brought Chandrananna into the assembly as CM*

- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva

Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు 21-Jun-24

ఈ పోస్టర్ ను, కలర్ ప్రింట్ తీసి ఇంట్లో పెట్టుకోండి. మన చంద్రన్న పవనన్న ఇచ్చిన హామీలు ఉన్నాయి, మనము గుర్తు చెయాలి. మన కూటమి, మాట నిలబెట్టుకోలేదు అన్న చెడ్డ మాట మనకు 2029 లో ఉండకూడదు. అలాగే జగనన్న వైపు వారు కూడా పెట్టుకుంటారు, మనము మాట తప్పామని చూపడానికి, జాగ్రత్తలు సుమా, పవనన్న గట్టి గా ప్రయత్నం చేసి అన్ని హామీలు నెరవేర్చాలి చంద్రన్న అనుభవముతో సంపద స్రుష్టించి, రాష్ట్ర అప్పులు తగ్గించి దినం దినం. మరలా భూముల ఆస్తుల తాకట్టు, అప్పులకు కేంద్రం, సింగపూర్ కు భాగం, అలాంటి మాటలు వద్దు.

పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!

విన్నారు కదా, ఈ పద్యం. కుమారుడు (పిల్లలు) పుట్టగానే తల్లి/తండ్రి కి సంతోషం కలగదు. ప్రజలు ఆ కుమారుడ్ని/పిల్లలును మెచ్చిన రోజుననే, ఆ కుమారుడే/పిల్లలే తమకు అండయై నిలిచిన రోజునే, నిజమైన సంతోషం కలుగుతుంది. అది మీకైనా, మాకైనా, చంద్రన్నకైనా, పవనన్నకైనా.

78+ ఏళ్ళ ముదుసలి అమ్మకు, ఒంటరిగా బయట తూలుతూ పడతూ నడవలేక, బిడ్డ చేయి పట్టుకుని 10 ఏళ్ళుగా రోజూ మైలు నడిచే అమ్మకు, నిండు బిళ్ళ నుంచి అరబిళ్ళ బీపీ షుగర్ మందులు తగ్గించి, సొంత ఆయుర్వేదం వాడుతున్న అమ్మకు, పౌష్టిక ఆహారముతో మానసిక ఉల్లాసముతో సజీవ గురువు సేవ పొందే అమ్మకు, తనతో పాటే అన్ని చోట్లకు కారులో వారం వారం తిప్పే అమ్మకు, 16+ లక్షల పైగా రామకోటి రాసిన అమ్మకు, విదేశీ డాక్టర్లు, షాపులో గుడిలో తెలిసినవారు, అలాగే నడిచేటప్పుడు అందరూ కన్నీళ్ళుతో నమస్కరిస్తూ, మీ కొడుకులాగా ఎవరూ ఇన్నేళ్ళు ఎక్కడకూడా, సొంత కూతురులా పువ్వులలో పెట్టి, ఇంత బాగా చూడలేదు, అదీ 3+ ఏళ్ళు పైగా రూపాయ ఆదాయం లేకపోయినా, ఏ కష్టాలు కన్నీళ్ళకు అవమానాలకు చీదరింపులకు నిస్సహాయతకు ఏలినాటిశని 7 1/2 ఏళ్ళ శిక్షణకు అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం కు దేనికీ లొంగకుండా స్తిరముగా ఆశయానికి అన్ని పోయినా అందరూ వదిలేసినా దైవం అండతో నిలబడి, అన్నప్పుడు అభినందించినప్పుడు, అమ్మకు/ నాన్నకు ఎంత సంతోషం కలుగుతుంది?

తమ సొంత ముదుసలి తల్లి తండ్రులను అత్త మామలను దేవతలుగా చూసే ప్రతి ఒక్కరూ అలాగే రేపు తమ బిడ్డల దగ్గర దేవతలు గా చూడబడే ప్రతి ఒక్కరూ, చుట్టాలు స్నేహితులు కూడా నెలకు ఒకసారి ఫోన్ చేస్తూ, అమ్మా నువ్వు అద్రుష్టవంతురాలివి, మా కోట్ల ధన, దయ క్రుతజ్ఞత విశ్వసనీయత లేని, తమో రజో గుణ రాక్షస పిల్లల చేతిలో, నరకం అవమానం చీదరింపు దూరం పెట్టడం, ఒంటరిగా లేదా పని మనుషులతో లేదా ఆశ్రమములో, మా హీన ఒంటరి పాప బతుకులు ఏమి చెప్పమంటావు తల్లీ ఇంత మంది పశువులను కని, మీ బిడ్డ దేవుడమ్మా, మిమ్మల్ని దేవతలా చూసుకుంటున్నారు అమ్మా 10 ఏళ్ళుగా అంటుంటే, ఆ తల్లి తండ్రి ఆనందం చెప్పగలమా?

* * *

తమో గుణ చంద్రన్న, ఇన్నాళ్ళ రాజకీయ జీవితములో, ఉత్తమ దైవ కొడుకు లాంటి వ్యక్తి సత్వ గుణ పవనన్న, అదీ తనకు రాజకీయ ప్రత్యర్ధి, తాము కుళ్ళు కుట్రలతో ఇన్నాళ్ళు ఓడించిన ఇతర వర్గ ప్రత్యర్ధి, ఈనాడు నిస్సహాయతలో ఉన్న తనకు ఆసరాగా అండగా దైవముగా దేవుడు ఇచ్చిన బిడ్డగా నిలబడి, తాను కేంద్రాన్ని రాష్ట్రాన్ని కలిపి, అంతా తన భుజాన వేసుకుని, పోరాడి గెలిచి, తమ ఇద్దరి శపధాన్ని నెరవేర్చిన, తన కన్నీళ్ళను తుడిచిన, తనను తల ఎత్తుకుని తిరిగేలా చేసిన, అపూర్వ సంఘటన విచిత్ర త్యాగం, ప్రపంచ చరిత్రలో ఇంకోటి లేదు.

ఇవన్నీ క్రుతజ్ఞత విశ్వసనీయత లేని పసుపు మీడియా రాయదు చెప్పదు, పవనన్న గొప్పతనాన్ని, మనకు మన వర్గానికి మన పార్టీకి మన ప్రతిష్టకు ఇచ్చిన రాజకీయ పునర్జన్మ భిక్షను, వారి వర్గములో చాటదు మిత్రమా పక్షపాతముతో. బులుగు మీడియా కూడా చెప్పదు, ఎందుకంటే, బాబాయి గుండేపోటు పనితనం మనది అయితే, బాబాయి ని సీయెం గా నిలబెట్టిన ఘనత పవనన్నది, వారూ భరించలేరు.

పవనన్న తన సొంత తల్లి తండ్రుల, అన్నా వదినల గౌరవాన్ని పెంచుతూ, అనంత సంతోషం కలిగిస్తూ, ఇంకో తండ్రి అవమానాన్ని తనది గా భావించి, ఆ ఇంకో తండ్రిని ఉన్నత స్థానం లో నిలబెట్టిన, ఆ ఇంకో తండ్రి బిడ్డ అమాయకపు లోకన్నను అలాగే ఇతర పసుపు నాయకులను మంత్రులు గా నిలబెట్టిన, ఖ్యాతి నభూతో నభవిష్యతి - పవనన్న ఖ్యాతికి సమానమైన దాత, భూతకాలంలో కాని, భవిష్యత్తులో కాని ఉండడు.

అందుకే మేము గతములో చెప్పాము, ఈ ఆనంద సమయములోనే, అంతా ఆరోగ్యముగా బాగున్న సమయములోనే, చంద్రన్న తనకు తాను పశ్చాత్తాపము పొంది మారిన సత్వ గుణ ఛాయతో, తానూ అంత గొప్ప దాత గా ఉండాలి అంటే, యువతరం చేతిలో సీయెం పదవి అలాగే పార్టీని త్యాగధనుడిగా పెట్టి, తన వారసుడిగా, పవనన్న ను ప్రకటించుకుని, అధికారా మాయ నుంచి బయటకు వచ్చి, అనుభవ భీష్మ సలహాదారుడి గా ఉంటే, ఈ ముదుసలి వయసులో అంతకు మించిన అపురూప త్యాగం ఉండదు.

2029 మరలా మన చేతిలో లేదు, మన తమో గుణ నాయకులు పిచ్చి పనులతో, మనకు ఎటూ అప్రతిష్ట తేకుండా ఉండరు. జగనన్న మరలా యాత్రలు అంటు తిరుగుతూ, జనములో ఉంటారు. గతములో జగనన్న కు సొంతం గా 151 వస్తే, కూటమితో మనకు వచ్చింది 135 నే. కాబట్టి, ముందే గౌరవముగా చేతులు దులుపుకోవడం మంచిది. ఎందుకంటే, మన పాపాలు, మరలా మన పిల్లలు, మనుమలు అనుభవించాలి. పంచభూత శిక్షణ మనల్ని ఎటూ విడువదు జన్మలకు, ఈ త్యాగం తో దాని తీవ్రత తగ్గించవచ్చు.

మనమూ మన వర్గం మన పార్టీ మన ప్రతిష్ట గొప్పగా చెప్పుకోవచ్చు, బలి చక్రవర్తి అలాగే విష్ణువు లాగా, మేమూ ఇరువురము త్యాగాలలో తీసిపోము అని. ఇక వెన్నుపోటు అనేది కనుమరుగు అవుతుంది, ఎందుకంటే అందరూ ఈ అధికార త్యాగం మెచ్చుకుంటారు, ప్రపంచం మొత్తం. అప్పుడు ప్రభుత్వం సత్వ గుణ ప్రభుత్వం అవుతుంది, దేవలోకములో కూడా పుణ్యమే. వైసీపీ వైపు వేలు చూపిస్తూ, పదవి కోసం సొంత బాబాయి ఉసురు మీరు తీస్తే, మా దేవుడు ఇచ్చిన అబ్బాయి కోసం ఈ బాబాయి పదవినే త్యాగం చేసారు అనవచ్చు మనం.

నాది నాది అనుకున్నది నీది కాదురా
నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా
కూరిమి గలవారంతా కొడుకులేనురా
జాలి గుండెలేని కొడుకుకన్న కుక్క మేలురా

చూడండి ఎంత జీవిత సత్యం ఉందో ఈ 4 లైన్లలో. నాది నాది అని అనుకున్న పదవులు, చంద్రన్నను జగనన్నను దూరం చేసాయి 23 మరియు 11 ఇచ్చి తీవ్ర అవమానముతో. వీరు ఇద్దరూ, వేస్ట్ వేస్ట్ అన్న పవనన్న ఈ రోజూ రత్నమై, ఇద్దరికీ ఉపయోగపడ్డారు. జగనన్న కు కూడా ఇది పుణ్యమే, తాను దత్తపుత్రుడు అనబట్టే, తానూ పుత్రుడినే అని నిరూపించారు పవనన్న. కూరిమి గలవారంతా కొడుకులేనురా అంటే, మనల్ని గౌరం ప్రేమతో చూసే, బయటవారైనా సొంత కొడుకులతో సమానం. జాలి గుండెలేని కొడుకు/ కూతురు కన్న, కుక్క మేలురా అనేది జగమెరిగిన సత్యం.

ముఖ్యమంత్రి చంద్రన్న, అలాగే ఉప ముఖ్యమంత్రి పవనన్న గతములో శపథం చేసిన విషయం అందరికీ తెలుసు. ఇది కౌరవ సభ గౌరవ సభ కాదు తాను ఉండలేనని, మళ్లీ ముఖ్యమంత్రి గానే సభలో అడుగుపెడతానని గత 2021 నవంబరు 19వ తేదీన శపథం చేశారు. ఆనాడు సతీమణి గురించి నిందారోపణలు వినలేక, కన్నీళ్ళతో ఆనాడు సభను వీడారు.

గత ఎన్నికల్లో పవనన్న పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓడిపోయారు. దీంతో పవనన్న ను లక్ష్యంగా చేసుకుని వైకాపా నేతలు గేళిచేసారు. పవన్‌ను కనీసం అసెంబ్లీ గేట్లు కూడా తాకనివ్వం అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు.

కానీ, 2024 ఎన్నికల్లో వైకాపా ఓటమికి పవనన్న ప్రధాన కారకుడయ్యాడు. అంతేనా, ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని, అధికారంలోకి తెచ్చిన ఘనత కూడా ఆయనదే, అని దేశమంతా కోడై కూసింది, మనము కధనం రాశాము.

ప్రాణంపోతున్న టీడీపీకి ఊపిరి పోసారు, చంద్రన్న భుజం తట్టారు. లోకన్న మీద నమ్మకం లేక, కునారిల్లిపోతున్న చంద్రన్న ను, జైలు లో కలసి వెన్ను తట్టారు, అభయం ఇచ్చారు. మీకు నేనున్నాను, మిమ్మల్ని పతనం కానివ్వను, తమ్ముడు లోకన్న ఢిల్లీలో అజ్ఞాతములో ఉన్నా సరే, నేనె తెదేపాను పైకి లేపుతాను అని మాట ఇచ్చారు, జీవాన్ని పోసారు.

151 సీట్లున్న వైకాపాను అధఃపాతాళానికి. ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే వైకాపా పరిమితమయ్యేలా చేయడంలో, పవనన్న కీలక పాత్ర పోషించారు. నాడు అసెంబ్లీ గేట్లు కూడా తాకనివ్వమంటూ భీకరాలు పలికిన వారంతా, ఇపుడు అసెంబ్లీకి అడుగుపెట్టలేక, అవమానముతో ఇళ్లకే పరిమితమయ్యారు.

* * *

ఈ గురువారం అసెంబ్లీలో అడుగుపెట్టారు. గురువారం నుంచి కొత్త ప్రభుత్వ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇందులో పాల్గొనేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు సభకు వచ్చారు. గౌరవ సభకు స్వాగతం అంటూ టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్‌ కూడా సగర్వంగా సభలో అడుగుపెట్టారు.

ఎమ్మెల్యేలుగా చంద్రబాబు, పవన్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో తొలుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.

అనంతరం మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, నారా లోకేశ్‌, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌, నాదెండ్ల మనోహర్‌, టీజీ భరత్‌, డోలా బాల వీరాంజనేయస్వామి, బీసీ జనార్దన్‌రెడ్డి, సవిత, గుమ్మడి సంధ్యారాణి, కందుల దుర్గేశ్‌, ఎన్‌ఎండీ ఫరూక్‌ ప్రమాణం చేశారు. పొంగూరు నారాయణ, కొలుసు పార్థసారథి, ఆనం రామనారాయణరెడ్డి, రామ్‌ప్రసాద్‌రెడ్డి, గొట్టిపాటి రవికుమార్‌, కొల్లు రవీంద్ర, సత్యకుమార్‌, అనగాని సత్యప్రసాద్‌, కొండపల్లి శ్రీనివాస్‌, వాసంసెట్టి సుభాష్‌ తదితరులతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణస్వీకారం చేయించారు. స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఎన్నికవ్వవచ్చు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2149 General Articles and views 2,149,435; 104 తత్వాలు (Tatvaalu) and views 240,826
Dt : 21-Jun-2024, Upd Dt : 21-Jun-2024, Category : Politics
Views : 108 ( + More Social Media views ), Id : 2120 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Chandranna , Pawananna , life , vows , fought , jagananna , proudly , brought , assembly , CM
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content