తోటి మనిషి పై లేని, ప్రేమ అభిమానం జాలి కృతజ్ఞతలు, పెంపుడు జంతువుల పై ఉంటుందా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,870,038; 104 తత్వాలు (Tatvaalu) and views 225,267.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

రోజూ వాట్సాప్ స్టేటస్ లో, 24 గంటలలో మారే, మంచి మాటలు మరువద్దు. మీ గురించి కూడా మంచి చెప్పగలరు. రీడ్ రిసీప్ట్ ఆపడం చాటు గా చూడటం ప్రొఫైల్ ఫోటో లేకుండా ఉండటం దయచేసి వద్దు, తర్వాత మనకే నష్టం సుమా.

ఇప్పుడు ప్రతి ఓంటరి మనిషి మరియు ఇతరులు, పెంపుడు జంతువులను, ఉదాహరణకు కుక్క పిల్లి లాంటివి, సాకుతున్నారు. వాటి ముద్దు ముచ్చటా చూస్తున్నారు. రోజూ స్నానం చేపిస్తూ, నడిపిస్తూ, తిండి కొనిపిస్తూ, అబ్బో చాలా చేస్తున్నారు. ఇంట్లో సొంత మనుషులకు తల్లి దండ్రులకు కూడా అంత సేవ చేయరు.

చూడటానికి వినడానికి బాగానే ఉన్నా, నిజమైన ప్రేమ జాలి ఆప్యాయత క్రుతజ్ఞత, సాకే వారిలో ఉందా? కేవలం తమ స్వార్ధముతో ఒంటరితనాన్ని, బాధను పోగొట్టుకోవడానికి, తాత్కాలికముగా, వాటిని తెచ్చి లాలిస్తున్నారా? చెప్ప గలరా ఉదాహరణలు? పోనీ ఇవి చదివాక చెప్పగలరు.

పిల్లలూ, కూరలు కోద్దురు, ఇల్లు చిమ్ముదురు, అమ్మమ్మకు పండ్లు ఇద్దురు, నాన్నకు సైకిల్ తుడుద్దురు, రాండి రా, అని అమ్మ పిలుపు.

లేదమ్మా మాకు కుదరదు. మేము పెట్స్ (పెంపుడు జంతువుల) తో ఆడుకుంటున్నాము, వాటి ఆలనా పాలనా చూస్తున్నాము, వాటికి కావల్సిన తిండి నీరు సమకూరుస్తున్నాము అని అటువైపు నించి జవాబు. ఇది సరైన జవాబేనా?

పిల్లల జవాబు లో తప్పులేదు, అని 50 మంది అనవచ్చు. ఎందుకంటే, వారికి మనుషుల కన్నా, జంతువులే ఎక్కవనా? అదైనా నిజమేనా?

ఇది ఖచ్చితము గా తప్పే, 2 పిల్లలను పెంచే అమ్మకు తెలీదా జంతుప్రేమ? పిల్లలు అలా చెప్పవచ్చునా? ముందు అమ్మ సేవ, అమ్మమ్మ సేవ కదా, జంతువుల కన్నా? ఏది ముందు?

కుక్క పిల్లి లేదా ఇంకో జంతువుల తో, ముద్దులు మురిపాలు నడకలు సేవలు, ఎన్నో చూస్తున్నాము వింటున్నాము. మరి తోటి ఇంటి మనుషులు, పిల్లలు, ముదుసలి వారికి, భాగస్వామి కి, ఎందుకు చేయలేరో ఈ సేవలు అంత ఓపికగా? అంటే వారికి చిత్తశుద్ధి ఉందా?

ఇంట్లో వారు తో పడక నచ్చక, ఇంకొకరు తో తిరిగి తే తప్పు పడతారు పాడు మనుషులు. అదే నోరు లేని, ఎదురు తిరగని, ఇది కావాలని ఏమీ అడగని, జంతువులు తో తిరిగితే ఉంటే ఏమీ అనరనా?

ముదుసలి తల్లి దండ్రులను ఇంట్లో పెట్టుకుని ఆప్యాయము గా చూస్తూ, పిల్లలకు సంస్కారము నేర్పుతూ, ఎన్ని పెంపుడు జంతువులను సాకినా, ఇబ్బంది లేదు, తప్పు పట్టలేము. ఇంట్లో అందరిమీదా ప్రేమ చూపిస్తూ, జంతువుల మీద చూపించినా తప్పు లేదు. కానీ మనుషులను వదిలి, జంతువుల పై కపట అవసర స్వార్ధ ప్రేమ మాత్రం, మనకే నష్టం, ఆత్మద్రోహం.

కానీ పెళ్ళి అయ్యి, భాగస్వాములు ఇద్దరు, తన్నుకుంటూ, మాటలు లేకుండా, దూరముగా ఉంటూ, మేము జంతువులను పెంచుకుంటున్నాము స్నేహితులు గా అంటే, ఎవరిని వారు అవమానించినట్లు?

అది అవసర తోడు ప్రేమ కదా జంతువులపై? జంతువు ల తో స్నేహం అలవాటు పడ్డాక, ఇక ఆ భాగస్వాములు ఇద్దరూ, తగ్గి, ఒకరినొకరు గౌరవించుకుంటూ ఆప్యాయత తో ఉండగలరా?

అలాగే ఒంటరి వారు, ఇంకొక తోడు తెచ్చుకోలేక లేదా ఇతరులతో పడక, మేము జంతువులను పెంచుకుంటున్నాము స్నేహితులు గా అంటే? అది అలవాటు పడ్డాక, ఇంకో మనిషితో సర్దుబాటు చేసుకుంటూ, ఒకరినొకరు సరి చేసుకుంటూ ఉండగలరా? ఎన్నాళ్ళు ఉండగలరు అలా?

వారి అమ్మమ్మ తాతలకు మరియు దగ్గరి ముదుసలి బంధువులకు, ఇదే విధముగా సేవ చేయమంటే చేస్తారా? ఎన్నో అనాధాశ్రమములు మరియు దేవాలయాలు ఉన్నాయి, వారికి సేవలు చేస్తారా?

భారతం, రామాయణం, భాగవతం, భగవద్గీత, దైవ శ్లోకాలు చదవండి, రామకోటి రాయండి, పది మందికి చెప్పండి అంటే, అబ్బే మాకు ఖాళీ లేదు టూ బిజీ అంటామే? మరి పెంపుడు జంతువులకు ఖాళీ సమయం ఎలా వచ్చింది?

మానవ సేవ యే మాధవ సేవ అన్నది తెలీదా? మానవ సేవ లేకుండానే జంతు సేవ వస్తుందా?

తోటి మనిషి పై లేని, ప్రేమ అభిమానం జాలి కృతజ్ఞతలు, జంతువుల పై నిజముగా ఉంటుందా?

రోగాలు, దివ్యాంగం, ముదుసలి తనం వచ్చిన జంతువులు ను ఆదరించి ఇంట్లో ఉంచుతామా, మార్చి కొత్తవి తీసుకుని రాకుండా?

అంతా నటన, స్వార్ధం, అవసర, అవకాశ వాదం, కాదా?

రేపు ముదుసలి తనములో ఈ జంతు ప్రేమికులకు సేవ, తోటి మనుషులు చెయ్యాలా? లేక జంతువులే చేస్తాయా? తోటి మనుషులు కు సేవ చేయకుండా ఇన్నాళ్ళు, చివరలో అడిగే నైతిక హక్కు వీరికి ఉంటుందా?

These people may not like humans and cant mingle with them, they don't even serve/ respect their old parents and relatives. But love pets so much. Any use or good for God? Who will serve them in old
age, pets?

Love humans first, serve samskar older folks and kids first, then if you have time serve many pets as you wish.

What is not on fellow man, love, affection, pity, gratitude, is there on animals?  

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,870,038; 104 తత్వాలు (Tatvaalu) and views 225,267
Dt : 08-Jul-2022, Upd Dt : 08-Jul-2022, Category : General
Views : 520 ( + More Social Media views ), Id : 1456 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : fellow , person , man , love , affection , pity , gratitude , service , animals , cat , dog , pets
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content