త్రికరణ శుద్ధి గా, ఎలాంటి లక్షణాల వారిని, గౌరవిస్తూ అండగా? పాము (నక్క), పులి, ఆవు ల లో? ఉదాహరణ - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,866,539; 104 తత్వాలు (Tatvaalu) and views 224,971.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*మనము త్రికరణ శుద్ధి (ఆలోచనలు, మాటలు మరియు మంచి పనులు) గా, ఎలాంటి లక్షణాలు ఉన్న, వారిని వాటిని, గౌరవిస్తూ అండగా ఉంటాము, ఉన్నాము? పాము (నక్క), పులి/ జురాసిక్ పార్క్ డైనోసార్, ఆవు ల లో? ఉదాహరణతో చెప్పగలరా? ముందు మనము ఆచరిస్తున్న లక్షణం/స్వభావం/గుణం ఏమిటి వాటిలో?*

We have Trikarana Suddhi (Thoughts, Words and good Deeds), with what characteristics, we are respecting and supporting folks/ them? In Snake (fox), Tiger, Cow? Can you give an example? What are the Characteristics (Nature/ GuNa) that we have and practicing?

అబ్బా ఎంత తేలిక ప్రశ్న ఇది, అని అందరూ ఆవు అని చెపుతారు. మేము ఆవు లాంటి వారము అండి, భక్తితో ఆవుని గౌరవిస్తాము, మా స్నేహితులు కూడా ఆవు లాంటి వారే. అబ్బే అసలు పాము, పులి, నక్క లాంటి లక్షణాలు, కపటం నాటకం 2 నాల్కలు, మాకు మా కుటుంబానికి మరియు మా స్నేహితులకు లేవు, అని అబద్దాలు చెపుతారు, ఆత్మ ద్రోహం చేసుకుంటూ.

Wow, what an easy question, everyone says cow. We are like a cow and respect the cow with devotion, and our friends are also like cows. Really our family and our friends don't have snake, tiger, fox-like qualities, hypocritical play drama 2 words - liars say, betraying their soul.

నిజము చెప్పండి దేవుని మీద, మన బిడ్డల మీద ప్రమాణం చేసి, ఉదాహరణల తో మీ స్టేటస్ లో స్నేహితులు బంధువులు అందరికీ తెలిసేటట్లు, అప్పుడు వారే తెలియచేస్తారు మన లోని అసలు గుణం, మనకు తెలియనివి, మనము ఊహించుకుంటున్నవి.

Tell the truth, swear on God, on our children, with examples in your status so that all friends and relatives know it, then they will tell us the real quality in us, what we don't know, what we imagine.

నక్కజిత్తుల తెలివి ఉన్న వారు కూడా, పాము కాటగిరీ కిందకే వస్తారు సుమా.

Even those who have the intelligence of foxes, almost fall under the snake category.

ఎవరికీ కీడు చేయకపోయినా, మెదలకుండా గమ్ముగా ఉన్నా (మన్ను తిన్న పాము), తప్పు ఒప్పు చెప్పకున్నా, మంచి అనేది చేయకున్నా, పాము/ పులికి లక్షణాలకు అండగా ఉన్నా, వారు అదే కోవకు చెందుతారు సుమా.

Even if they do no harm to anyone, if they are quite (like snake will sleep after eating), if they do not speak the truth and lie, if they do not do good, even if they support the characteristics of a snake/tiger, they will fall into the same category.

ఎవరి ఆత్మకు మనసుకు, వారి ఆచరణ తెలుసు. పంచభూతాలు చూస్తున్నాయి, నమోదు చేసుకుంటున్నాయి. ఎవరూ తప్పించుకోలేరు ఈ లేదా తర్వాతి జన్మలో.

Whose soul knows the mind and their practices. Panchabhut are watching and registering. No one can escape in this or the next life.

మనము స్వేచ్చగా ఓటువేసి లేదా వేయకుండానే ఎన్నుకునే, మన అస్సెంబ్లీ పార్లమెంట్ సీయెం పీయెం అభ్యర్ధులు, కూడా మన ప్రాంత సగటు జనాభా లక్షణాలను భావాలను తెలియచేస్తున్నారు. కాబట్టి, మన ఆలోచనలు ఆచరణలు దాచలేము, వాటి ఫలితాలు కూడా దాచలేము.

Our Assembly Parliament CM PM candidates, whom we elect freely or without voting, also reflect the characteristics of the average population of our region. Therefore, our thoughts and actions cannot be hidden, nor can their results be hidden.
link

మనము ముందు కధనము లో, లింక్, వాటి లక్షణాలు చూసాము. పాము నే చాలా ప్రమాదకరము, కపటము చాటుతో ఎప్పుడు ఎలా వస్తుందో తెలీదు కనపడదు, మనకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది అని నిర్ధారించుకున్నాము.

We have seen the features of them, link, in the previous article. We have made sure that the snake is very dangerous, we never know when the hypocrite will come with a charm, and it will leave us with no peace of mind.

పాము/ పులి కూడా మనల్ని నాశనం చేస్తాయి, అరిషడ్వర్గ లాంటివి అని కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు ఇంకొన్ని లక్షణాల ను చూద్దాము. ఎందుకంటే, మన బుద్ది కి తగిన లక్షణాలు కావాలి ఇంకొన్ని.

We also learned that snake/tiger can also destroy us, like Arishadvarg. Now let's see some more features. Because, our intellect needs some more suitable qualities.

1) *పాము Snake (తమో గుణం Tamo Gunam)* తనకంటూ ఒక స్థలం ఏర్పాటు చేసుకుంటుంది. అంటే పుట్ట. దాని చుట్టూ ఉండటానికి ఎవరు ఇష్టపడరు. భయముతో కూడిన భక్తితో మాత్రమే పాలు పోస్తాము. పాలుపోసినా, కాటు తప్పదని తెలుసు. పగ ప్రతికారం గుర్తుంచుకోవడం మెండు అంటారు మరి సినిమాలలో. మొత్తము మీద, తన కంటూ చోటు, అవలక్షణాలు, కపటం చాటు పగ అన్ని ఉన్నాయి. వంకర దోవలో అయినా, మోసముతో జయించాలి.

2) *పులి/జురాసిక్ పార్క్ డైనోసార్ (రజో గుణం) Tiger/Jurassic Park Dinosaur (Rajo Gunam)* కూడా నివాసానికి తనకంటూ ఒక ప్రాంతము ఎంచుకుంటుంది, అక్కడ చుట్టుపక్కల ఎవరు వెళ్ళడానికి కూడా భయపడతారు. మనకు కూడా, పెద్ద మనుషులు ఫాం హౌస్ లు విశ్రాంతి మందిరాలు అని ఊరికి దూరముగా కట్టుకుంటారు. ఇతరులు అటువైపు వెళితే, గల్లంతే. పులి క్రూర జంతువు, దొరికితే లేదా ఆకలివేస్తే లేదా అవసరమనిపిస్తే, ఏదీ వదిలిపెట్టదు, ఎంత ఘాతుకానికైనా వెనకాడదు తన ఆనదం కోసం. బలవంతులదే రాజ్యం. ఏదైనా నేరుగా చేస్తుంది, చాటు ఉండదు.

3) *పాము (నక్క)/ పులి Snake (Fox)/ Tiger* కి, రెండిటికీ కనికరము జాలి దయ ఉండదు సుమా. స్వార్ధం మాత్రమే ముఖ్యం. తమకు నచ్చిన వారితోనే, తమ స్థాయిలోనే స్నేహం చేస్తాయి. అవసరానికి నటిస్తాయి, నక్కుతాయి. అంతా మన చేతిలో ఉండాలి. తమ ఆహారం అవసరం అవకాశం కోసం ఏమైనా చేస్తాయి. ఎవరినీ ప్రేమించవు. కాసేపు నటించినా, ఏదో ఒక సమయములో, అసలు లక్షణాలు బయటపడతాయి. అరిషడ్వర్గాల బానిసలు. జాతి ప్రేమ ఉంటుంది, కానీ తమకు అడ్డు అవసరము వస్తే, తమ జాతి వారినైనా లేదా సొంత అనుచరులును అయినా లేదా అన్నము పెట్టిన చేతినైనా లేదా ఇంట్లో వారినైనా, అంతమొందిస్తాయి.

-- వీరు బ్రమలలో మాయలో ఉంటారు, తమ సంతానాన్ని బ్రమలలో మాయలో పెంచుతారు. వాస్తవం అంగీకరించరు, ఆచరించరు, మాట్లాడరు, గౌరవించరు. వీరికి భవిష్యత్ అర్ధం కాదు చెప్పినా వినరు. తాగుబోతు కు తాగవద్దు అంటే ఆపరు, ముందు జరగబోయే నష్టాలు కనరు. అలాగే రాక్షసులకు ఇతరులను పీడించవద్దు దురాశ మోసం కుట్ర కుతంత్రం వద్దు అంటే వినరు, తమ పతనాన్ని అంగీకరించరు.

- వీరు అర్హతకు సంబంధము లేకుండా, తాము తమ పిల్లలకే పదవులు రాజ్యాధికారం అని పట్టుపడతారు. ఇతర ఉత్తములు ఉన్నా, వీరు అంగీకరించరు, తోడ్పాటు అందించరు. దివ్యాంగుడైన ద్రుతరాష్ట్రునకు, రాజ్యాధికారం లేదు. పాండు రాజునే రాజు కావాలి. కానీ అన్న నే కూర్చొబెట్టి, తాను సహాయం చేసాడు. కానీ దుర్యోధనుడు మాత్రం, అరిషడ్వర్గాలకు బానిసనని తెలిసి కూడా, మంచివాడైనా ధర్మరాజుకు రాజ్యం ఇవ్వలేదు, సూది మోపినంత కూడా ఇవ్వను అని గేళి చేసాడు. ధర్మం అంటే గిట్టని, 99 సోదరులు కూడా, రారాజుకే అండ. చివరకు స్మశాన రాజ్యాన్ని రారాజు ఏలుకున్నారు.

-- పాము తన గుడ్లను తానే తింటుంది అంటారు. అలాగే ద్రుతరాష్ట్రుడు/ గాంధారి (ఈనాడు కళ్ళు ఉండి మంచి చూడలేనివారు) లాంటివారు, తమ పిల్లల పతనానికి దోవ వేస్తారు, అన్ని తప్పులు సమర్ధిస్తారు, ప్రోత్సహిస్తారు. సంపాదన లేదా భోగాలలో పడి, తల్లి దండ్రులు ఇద్దరకు, పిల్లల సంస్కారం కోసం అసలు సమయం ఉండదు, పిల్లలకు అన్ని తెలుసు తెలివి గల వారు అని వీరే సర్టిఫికేట్ ఇస్తారు. మోటారు బైకు కార్లు ధనం హోదా పదవి అండ ధైర్యం ఇచ్చి, రింగ్ రోడ్ కు, క్లబ్ లకు, మత్తుకు లేదా ఇతర తప్పుడు పనులకు వదులుతారు. యాక్సిడెంట్ లు చేసినా లేదా ఎంత మందిని హింసించినా లేదా కాటికి పంపినా, ధనముతో కాపాడతారు. ఆఖరుకు తమ పిల్లలు పోయినా, పద్దతి మార్చుకోరు.

దుర్యోధనుడు బాల భీముని చంపడానికి ప్రయత్నం చేసారు అంటే, చిన్న పిల్లల ఆటలా కొట్టేసారు. తమ పిల్లలు పోయాక కూడా, ద్రుతరాష్ట్రుడు భీముని చంపబోయాడు కౌగలించుకుని. దుర్యోధనుడికి సంపాదన అధికారం హోదా ఉన్నా, సంస్కారం లేదు, తెలీదు, నేర్పలేదు, నేర్చుకోలేదు.

-- కానీ రాక్షసులలో కూడా, బలి, ప్రహ్లాదుడు లాంటి వారు, ఆ లక్షణాలను ఛేదించుకుని బయటకు వచ్చారు. పాములలో ఆదిశేషుడు, వాసుకి కూడా, ఆ దుర్గుణాలనుంచి బయటకు వచ్చారు. శివుని, విష్ణువుని అంటే మంచి వారిని నమ్ముకుని, నీతికి నియమానికి కట్టుబడి ఉన్నారు. కాబట్టి తనను తాను మార్చుకునే శక్తి అన్ని గుణాలకు ఉంది. అందరిలో నూ 3 గుణాలు ఉన్నాయి, సాత్వికతనే మనము బలపరచుకోవాలి సామాన్య భక్త జనముగా.

-- వీరు పూర్తి మాంసాహారులు, మాంసము లేకపోతే బతకలేరు, ఏదో పోగొట్టుకున్న లోటు. పాము కప్పను గుటుక్కున మింగుతుంది, పాలు గుడ్లు ఇచ్చినా. పులి జింకను వేటాడుతుంది, తగిన ఇతర తిండి దొరికినా. తమ సంతోషానికి, ఇంకో ప్రాణానికి మానానికి జీవితానికి విలువ ఇవ్వరు. ఆకులు పండ్లు పప్పు లాంటి దానిలో పోషకాలు కల్తీ లేకుండా, ఉంటాయని చెప్పినా నమ్మరు. ఇతరులకు ప్రాణహాని లేకుండా, మా జీవితం సాగదు మా మనసు వినదు అని మొసలి కన్నీరు పెడతారు. దేవుడు మాకు హక్కు ఇచ్చారు అంటారు. జింక లాగా మేము గడ్డి తిని సాత్వికము గా బతకలేము అని బాధపడతారు. తమ చెడు అలవాట్లు అన్ని, తమ దుష్టచతుష్టయ (దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని) మరియు రాక్షసులు లాంటి స్నేహితులతో గొప్ప గా చెప్పుకుని, విందుకు పిలిచి, ఆదరిస్తారు, ఏనాటికైనా, మిగతావారు తమ చేతిలో గొర్రె కాకపోతారా అని.

-- ప్రజలు మరియు దేశం/ రాజ్యం కోసం, యుద్దభూమిలో పొరాడేవారు ప్రాణాలు కోల్పోయేవారు అంటే, ఆనాటి క్షత్రియ రాజులు భటులు సైనికులు పోలీసులు అలాంటి వారు, మాంసము తినవచ్చు, డ్యూటీ లో ఉంటే సుమా. మనము ఇక్కడ కేవలం, పై 3 కి తేడా మాత్రమే చెపుతున్నాము, దైవ సాత్వికత తో పోలుస్తూ.

-- పాము తత్వం వారు తమకు 100 రూపాయలు ఆస్తి ఉంటే, 40 రూపాయలు గా (లేకున్నా 200 గా) చూపుతారు. వారి ఆస్తులు వ్యాపారాలు స్వదేశం/ విదేశాల లో, ఇతర వ్యాపారాలలో, గోప్యముగా ఉంటాయి. పులి తత్వం వారు, స్వదేశం/ విదేశం లో ఆస్తులు వ్యాపారాలు కనీసం 50 శాతం పైన పబ్లిక్ గా చూపిస్తారు, ఇదిగో మాకు 30 గదులు ఇల్లు లు 3 ఉన్నాయి 300 ఎకరాల తోట ఉంది అని. అప్పు 100 ఉంటే, కేవలం 50 కన్నా తక్కువగా చూపుతారు. టాక్స్లు పూర్తిగా కట్టరు. ఇద్దరికీ బినామీలు ఉంటారు, ఆస్తులు అధికారం ఇష్టం వచ్చినట్లు పెరుగుతాయి. వీరి అనుచరులు, వారికి ఉంటే చాలులే, మాకు ఇంత విదిలిస్తే చాలు అని ఉంటారు. ఉదాహరణ కౌరవులు మరియు వారి అనుచరులు. రారాజు విదిలించిన రాజ్యం ధనం చాలు అని, కర్ణుడు బానిస అయి, తన మంచి స్వభావాన్ని మరచారు. రారాజు అనుచరులు, ఏ ఘాతకాలకైనా రెడీ.

-- పులి దేనినైనా చంపి తను ఒకటే 50/80 శాతం తిని, మిగతా ఎంగిలి అందరికీ 50/20 శాతం వదిలేస్తుంది. పోనీలే ఇతర నక్క కుక్క లాంటి ఇతర జాతులు తింటాయి అని. ఆ మిగతా జంతువులు అంతా, హై హై నాయకా, ఎంత దయగల స్వామివి, జాలితో కరుణతో 20 శాతం మాకు వదిలారు అని పొగుడుతాయి, నీరాజనాలు పడుతాయి. పాపం, అవి తమకు రాబోయే ప్రమాదాన్ని గుర్తించవు, తర్వాత రోజు భోజనములో పులికి తామే ఆహారం అవుతాయని అవి ఏనాటికీ నమ్మలేవు. పాము గుటుక్కున కప్పను మింగుతుంది, ఎవరితోనూ ఏదీ పంచుకోదు. మిగతా కప్పలు, దేవుడివి స్వామీ మమ్మల్ని తినలేదు అంటాయి. రేపు వాటి వంతు అంటే నమ్మవు. దుర్యోధనుడు, రావణుడు దగ్గర పని చేసిన ఇతరులు.

-- తమ గురించి ఏ మాటలు అయినా ఇతరులు అనే దానికి, పులి, పాము, లేదా ఆవు నా అనే దానిని బట్టి, వీరి ప్రతి స్పందన ఉంటుంది. మొదటి రెండు జాతులు అయితే, వారు పట్టించుకోరు, నవ్వుకుంటారు, తమ రాక్షస క్రూర జాతి దే కదా, ఇలా అంటున్నారు సరదాకు మత్తులో అని. శకుని ఎన్ని చురకలు వేసినా, రారాజుకు కోపం రాదు, మామ అని. అదే క్రిష్ణుడు పాండవులు, ఏది చెప్పినా, దానిని వ్యతిరేకిస్తాడు, యుద్దానికి రెడీ అంటారు.

మూడవది అంటే ఆవు, ఇలా ఏమైనా అంటే నీతి చెపితే మాత్రం, రోషం తో ఊగిపోతూ, ఊరుకోరు. అబ్బో నీతి వంతులు బయలు దేరారు, వీరే దేవతలు అయినట్లు మాకు నీతులు, మాకు తెలీదా, మీకెందుకు మా గొయ్యి మేము అని, మీ అంతు చూస్తాం, మీకు గొయ్యి తీస్తాం, ఇంటికి వచ్చి తంతాం అంటూ, పవిత్రమైన సంస్కార బాతు పురాణం. ఓ వైపు పూజిస్తున్నాము అంటూ, ఆవుని అసమర్ధ చేతగాని జీవిగా, ఎగతాళి చేస్తారు, ఇంకా పాపం మూట గట్టుకుంటారు, పతనానికి తొందరలో.

-- చిత్రం ఏమిటి అంటే, వీళ్ళు ఇద్దరూ కూడా, తమ అంతరంగిక, కుటుంబ లేదా ఇతర విషయాలకు సలహాదారులు గా, మంచి జీతం ఇచ్చి నమ్మకమైన సాధుజీవి ఆవు లాంటి వారినే పెట్టుకుంటారు. ఎందుకంటే తమ జాతి వారిని నమ్మరు, వెన్నుపోటు లేదా ఎదురుపోటు పొడుస్తారు అని. ద్రుతరాష్ట్రుడు విదురిని చాల గౌరవించి పోషించారు. రాముని తో యుద్దం రానంత వరకు, రావణుడు విభీషణుని చాలా గౌరవించాడు. విభీషణుడు రాముని వెంటనే నమ్మారు.

-- పొనీ ఇంత అరాచకం చేసి వీరు మనశ్శాంతి గా ఉంటారా అంటే, చచ్చినా ఉండరు. తమ నీడను చూసి కూడా భయపడతారు. వీరు మనశ్శాంతి గా ఉండేది, ఆవు లాంటి వారి దగ్గరే సుమా. అదే విధి విచిత్రం. కాబట్టి, ఆవు లాంటి మనసున్న వారిని ఎన్నుకుంటే, రామరాజ్యం వస్తుంది, మనము మంచివారమైనా చెడ్డవారమైనా, కడుపు నిండా తిండి ఉండి, సుఖము గా నిద్రపోతాము. అదే పాము పులిని ఎన్నుకుంటే, బలవంతులు మోసగాళ్ళదే రాజ్యం, ఎవరికీ తిండి నిద్ర ఉండదు. మన స్నేహితులు బంధువులు అయినా అంతే, ఆవు లాంటి లక్షణాలు తోనే మనకు రక్షణ, మనశ్శాంతి, సుఖనిద్ర. విభీషణుడు, సుగ్రీవుడు కూడా, రాముని దగ్గర ఎంతో శాంతిని పొందారు కదా?

ఇప్పుడు అర్ధము అయ్యిందా, రామాయణ భారతాలలో, నేటి సమాజపు ఆలోచనలు అన్ని స్పష్టము గా పొందు పరచారు, ముందు చూపుతో. అందుకే అవి అన్ని యుగాలకు ఇలవేల్పులే. పిల్లలు ఇవి చదివి నేర్చుకుంటే, జీవితములో ఎదురు వచ్చే మాయలు మోసాలు అన్ని, ధైర్యముగా ఎదుర్కొని, నీతి వంతులు గా రాణిస్తారు సుమా. అందుకే బద్దకముతో వారికి అవి నేర్పము, వారు తెలికగా బలహీన మనసుతో, పతనము అవుతారు, మాయలకు లొంగుతారు, చెడు వైపు పయనం సాగిస్తారు.

4) మరి *ఆవు (సాత్విక గుణం) Cow (sattvic quality)*? తనకంటూ ప్రత్యేక స్థలము లేదు, పేదది ఆస్తులలో, గుణములో చాలా గొప్పది. ఎన్ని కష్టాలు నష్టాలు లో కూడా, మంచి తనం వదలదు. నలుగురితో ఉంటుంది. ఇతరుల కోసమే తను. బయట కట్టెస్తే, బయట, దొడ్లో పెడితే అక్కడ. కనికరము జాలి దయ ఉంది. స్వార్ధం అనేది అసలు లేదు. పెడితే తింటుంది, లేకపోతే ఆకలితో అంబా అని అరుస్తుంది. తన బిడ్డల పాలు కూడా, మనము దొంగిలించినా, ఏమీ అనదు. ఇతరుల క్షేమం కోరుతుంది, సేవ చేస్తుంది. తాను గడ్డి తిని, మనకు ఔషధాల పాలు ఇస్తుంది. ఎవరితోనైనా కలసిపోతుంది. కుట్ర కుతంత్రము కీడు అనేవి కలలో కూడా తెలీవు. తన మన, ఎక్కువ తక్కువ, వర్గ, కుల, జాతి బేధము లేదు. అహంకారము లాంటి అరిషడ్వర్గాలు, ఆడంబరాలు ఆర్భాటము అప్పులు అనేవి లేవు. ఆడిన మాట తప్పదు. నమ్మిన వారిని మోసము చేయదు, వారివి లాక్కోదు, చేయి చాచదు (అప్పు). ఎవరు ఎన్ని అన్నా, ఓర్చుకుంటుంది, ఓపిక, సహనం, నిజాయితీ ఉంటుంది.

మరి ఇప్పుడు చెప్పండి? మన లక్షణాలు ఏవి ఆ మూడు టి లో? మన ఇంట్లో వారివి ఏవి? మనము ఓటేసి లేదా ఎగ్గొట్టి ఎన్నుకునే నాయకులవి ఏవి?

ఉదాహరణకు మనము ఆవు అని చెప్పాలి అంటే, దానికి తగిన ఉదాహరణలు ఇవ్వాలి, నిస్వార్ధముగా త్యాగముతో నీతి నియమాలు తో ఉండాలి. లేదా ధైర్యముగా మాది, పాము (శకుని/ మంధర/ శూర్పణక/ కైక) లేదా పులి (రాక్షసులు/ దుర్యోధణుడు/ రావణుడు) లక్షణాలు అని చెప్పాలి సుమా. కనీసం రాక్షసుల స్థాయిలో నిజాయితీగా ఉందాము. లేదంటే కపటత్వం రాక్షసులకన్నా నీచము, ఎక్కువ శిక్షలు.

1. మేము ఏళ్ళుగా రోజూ 10 మందికి మంచి చెడు చెపుతు, మా ఆచరణలు తెలుపుతూ, సందేశాలు పంపుతాము, వారు పలికినా పలకకపోయినా.

2. రెండు నాల్కలు, కపటము, మోసము, పీడించడము, బాదించడము, అరిషడ్వర్గాల బానిసత్వం, అప్పులు గోల, అష్ట వ్యసనాలు, అబద్దాలు, బేధాలు, దాపరికము, రీడ్ రిసీప్ట్లు ఆపటాలు లేవు. అన్ని మా స్టేటస్ లో అందరూ చూడవచ్చు.

3. మేము లక్షల ధనమును, ప్రభుత్వ ఉద్యోగాన్ని, సజీవ గురువులు తల్లి దండ్రుల/ ఇతర పెద్దల సేవ కోసము త్రుణ ప్రాయముగా వదిలి, ఎంత ఖర్చు అయినా ఎంత కష్టమైనా వారికి అండగా నిలచాము.

4. మాకు ఎంత ధనము ఉన్నా, నేల మీద పడుకుంటూ, 20 ఏళ్ళు పైగా శాఖాహారము మాత్రమే తింటూ జీవహింసకు మేము కారణం కాకుండా, నిరాడంబరముగా ఎటువంటి ఆభరణాలు మేకప్పులు లేకుండా, సాధారణ మనుషులుగా ఉంటాము ఎప్పుడూ ఎక్కడైనా.

5. మేము 60+ దాటిన నడవలేని రోగస్త తల్లి దండ్రులు అత్తమామలు ను, మాతోనే ఇంట్లో పసి పాపలుగా ప్రేమించి సమాన సౌకర్యాలు ఇచ్చాము. భాగస్వామి, పిల్లలు, తల్లి దండ్రులు అన్ని సౌకర్యాలు ఒకటే.

6. మేము ఎప్పుడూ ఆవు లాంటి లక్షణాలు ఉన్న పేద నాయకునికే పంచాయితీ, మున్సిపల్, ఆసెంబ్లీ, జిల్లా, పార్లమెంట్ ఎన్నికలలో ఓటు వేసాము. లేదా ముగ్గురు లో తక్కువ అవలక్షణాలు ఆరోపణలు కేసులు స్టేలు ఉన్న వారికే మిగతా అభ్యర్దులు కన్నా.

7. మేము నీతి నియమాలను పెట్టుకుని, రోజూ 30 నిమిషాలు దైవ పూజ, ధ్యానము, ఉదయం 5 కే లెగవడం, రాత్రి 10 కే పడుకోవడం, యోగాసనము, ప్రతి శని వారము 2 గంటలు గుడిలో ప్రదక్షిణాలు లేదా కఠిన సేవ మరియు ప్రసాద పంపిణీ, రోజు భగవద్గీత/ రామాయణం/ భారతం/ భాగవతం ఒక శ్లోకము.

8. మేము గుణవంతులకు కష్టాలు కన్నీళ్ళలో తోడుగా సహాయముగా ఉన్నాము.

ఇంకా ఎన్నో . . .

ఇలా ప్రత్యక్ష ఉదాహరణలు ఇవ్వాలి. ఆవు లాంటి లక్షణాలు మనకు ఉంటేనే, మనపై దేవుని క్రుప దయ అండ ఉంటుంది. పులి/ పాము/ నక్క/ విష క్రుర జంతువుల లక్షణాలు అయితే, పతనము కష్టాలు కన్నీళ్ళు తప్పవు. పంచభూతాలు ఊరుకోవు. అందుకే ఏ ఆసుపత్రి ఖాళీగా ఉండదు. కరోనా, భూకంపాలు, వరదలు లాంటి ప్రళయాలు వస్తాయి. సొంత భాగస్వామి, పిల్లలు కూడా వీరిని ఛీత్కరిస్తారు.

Our thought, practice - Snake (Fox), Tiger, Cow? మన ఆలోచన, ఆచరణ - పాము (నక్క), పులి, ఆవు?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,866,539; 104 తత్వాలు (Tatvaalu) and views 224,971
Dt : 10-Jul-2022, Upd Dt : 17-Mar-2024, Category : General
Views : 813 ( + More Social Media views ), Id : 1458 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : trikarana , suddhi , characteristics , respect , support , snake , fox , tiger , cow , practice , Jurassic , Park , Dinosaur
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content