పాము అంటే భయమా లేక పులి? ఏది మనశ్శాంతి లేకుండా? దేనిని ముందు వదిలించుకోవాలి? ఎందుకు? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,814; 104 తత్వాలు (Tatvaalu) and views 225,101.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Someone asked us, do you have fear of snake or tiger/ Jurassic Park Dinosaur? What makes without peace of mind? Which one to get rid of first? Why so? If we have sattvic spirituality divine worship, and teaching same thing to home folks, must be able to answer this.

We understood their depth philosophy and bowed our heads happily and saluted them. We have a clear divinely inspired answer, and see how clearly you can illustrate it. It is necessary in our real life as well as in the maturity of our practice.

*ఒకరు ఇలా అడిగారు మమ్మల్ని- మీకు పాము అంటే భయమా లేక పులి/జురాసిక్ పార్క్ డైనోసార్ అంటే నా? ఏది మనశ్శాంతి లేకుండా చేస్తుంది? దేనిని ముందు వదిలించుకోవాలి? ఎందుకు అలా? సాత్వికత ఆధ్యాత్మికత దైవ పూజ ఉంటే, ఆచరణలో ఇంట్లో వారికి సంస్కారం నేర్పిన లేదా నేర్పుతూ ఉంటే తప్పక జవాబు చెప్పగలరు? అని అన్నారు.*

వారి లోతు తత్వం అర్ధము అయ్యి, ఆనందముగా శిరస్సు వంచి వారికి నమస్కారం చేసాము. స్పష్టమైన దైవ ప్రేరిత జవాబు మన దగ్గర ఉంది, చెప్పాము వారికి. మరి మీరు ఎంత స్పష్టముగా ఉదాహరణతో చెప్ప గలరో చూడండి. మన నిజ జీవితములో అలాగే మన సాధన పక్వత లో అది అవసరము.

ధన్యవాదాలు జవాబులు పంపిన వారికి, తప్పా ఒప్పా గురించి ఆలోచన వద్దు. నేర్చుకుందాం సాత్వికతను పంచుకుందాము. చూద్దాం మిగతా గురువుల ఆలోచన కూడా. తెలియని వారు, ఒప్పుకున్నారు, చెప్పలేమని, తప్పు లేదు అందులో.

మనకు సంస్కారము స్తితప్రజ్ఞత ఉండి, మన పిల్లలకు సంస్కారం నేర్పే తీరిక ఉంటే, మనలాంటి అజ్ఞాన శిష్యులకు కూడా అదే సంస్కారం జవాబుతో నేర్పుతారు కదా, దాచుకోలేరు మంచి బుద్దిని.

సూర్యుడు చంద్రులు దైవం గురువులు తమ తత్వాన్ని దాచుకోరు, మనుషులను హోదాలను ధనమును బట్టి తేడాలు చూపరు, తన మన బేధం ఉండదు కదా - చల్లదనం వెచ్చదనం ఒకటే, కదూ?

నీతి నిజాయితీ దైవభక్తి ఆచరణ లో గల గురువులు అంతే. వారి పిల్లల పై వారికి జాలి కలిగితే, మనలాంటి ఇతరులపై కూడా తప్పక జాలి కలుగుతుంది. వారి సొంత పిల్లలకే సంస్కారం నేర్పడానికి సమయం లేకపోతే, విషయం తెలియకపోతే, ఇక మనల్ని పట్టించుకుంటారా? చూద్దాము.

ఇది అర్ధం అయితే, తర్వాత వచ్చే, నేటి రాజకీయ ఉదాహరణ తేలికగా కూడా అర్ధం అవుతుంది సుమా.

జవాబు - జాగ్రత్త గా గమనించండి ప్రశ్నలో అంతరార్ధం, అలాగే విశ్లేషణ కూడా. మనకు సమాజములో ఎలా బతకాలో కూడా ఇది తెలియజేస్తుంది. ముందు పామర భాష లో మొదలు పెట్టి, తర్వాత పండిత ఆధ్యాత్మికతకు వెళదాము.

30 ఏళ్ళ లోపు వారు లేదా జీవిత ప్రాక్టికల్ అనుభవం లేని వారు, వెంటనే, ఏమిటీ ఈ తిక్క ప్రశ్న, పులి మనల్ని తినేస్తుంది కదా, పులి అంటేనే భయం కదా, దీనినే ముందు వదిలించుకోవాలి అంటారు. ఇప్పుడు 2 ఉదాహరణలు చూద్దాము.

డైనోసార్ మనం కనపడనంత వరకు మన జోలికి రాదు. అది వస్తే, అసలు ఊరే ఉండదు. కాబట్టి పులితోనే పోలుద్దాము.

1. మనము ఇంట్లో ఉన్నాము - పులి, పాము బయట ఉన్నాయి అనుకుందాము. పులి ఏమి చేస్తుంది, గర్జిస్తూ తలుపుల మీద కొడుతూ ఉంటుంది. చుట్టూ తిరుగుతుంది. తలుపు తీయనిదే లోనకి రాలేదు, మనల్ని ఏమీ చేయదు, ఇబ్బంది లేదు, 2 రోజులైనా. అంత పెద్ద ఆకారాన్ని మనము గుర్తించగలము, మనల్ని చంపేది అదే అని స్పష్టముగా తెలుస్తుంది, పోయేలోపు.

కానీ పాము అలా కాదు. ఇల్లు చుట్టూ ఏ చిన్న కంత దొరికినా, వెంటనే లోనికి వస్తుంది. మనకు ఎటునుంచి వస్తుందో తెలీదు. నిద్రపోతుంటే, కనీసం కాటు వేసింది అదే, అని కూడా చాలా మందికి తెలీదు. ఏదో తెలు కుట్టింది లేదా ఇంకోటి అనుకుంటా, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే ఏది చంపిందో కూడా మనకు తెలీదు. కాబట్టి మనశ్శాంతి లేకుండా ఉంటాము ఆ 2 రోజులు బిక్కు బిక్కు మంటూ.

2. బయట చెట్టు కింద నిద్రపోతున్నాము - పులి నక్కి వచ్చినా, పైన పడగానే స్పష్టముగా పులి అని మనకు తెలుసు, తప్పించుకునే ప్రయత్నం కొంతైనా ఉండవచ్చునేమో. కానీ నిద్రలో పాము కాటు వేస్తే, అది ఏమిటో కూడా తెలియకపోవచ్చు.

కాబట్టి ఎక్కువ ప్రమాదం, పాముతో, ఎందుకంటే, ఎప్పుడు ఎలా, ఎవరు అనేది కూడా మనకు తెలీదు. ముందు వదిలించుకోవాల్సింది పామును.

ఇప్పుడు ఆధ్యాత్మికతకు వద్దాము. ఈ 2 కూడా, మనుషులనే చంపేవే, అంటే నాశనము చేసేవే. అంటే ఇవి 2 కూడా అరిషడ్వర్గాలలో భాగమే లేదా అలాంటివే. అంటే, ఒకటి నేరుగా మనకి కీడు చేసేవి. రెండోవి తెలియకుండానే కీడు చేసేవి.

అంటే, వాటితో మనము జాగ్రత్త గా ఉండాలి, మన సాధనకు భంగము కలగకుండా, లేదంటే ఏదో విధముగా మాయలో పడవేస్తాయి, దేవునికి దూరం చేస్తాయి. మన ధ్యానం లో కూడా, వింత వింత ఆలోచనలు, మనల్ని పక్కదోవ పట్టించి, ధ్యానం ముందుకు నడవకుండా ఇక చాలు లెగవమని ఆపుతాయి.

ఇప్పుడు అదే ప్రశ్నను ఇలా క్రిందివిధముగా అడిగితే, మీకు జవాబు తేలిక కదా - కానీ బుర్ర కు పదును పెట్టాలంటే అలాగే నర్మగర్భముగా అడగాలి.

మీకు పాము/ నక్క (శకుని, మంధర, శూర్పణఖ/ 2 నాల్కలు కపటం కుట్ర, రీడ్ రిసీప్ట్ ఆపే చాటు గుణం వారు, కపటం తో అరిషడ్వర్గాల బానిసత్వం) అంటే భయమా లేక పులి/ సిమ్హం (దుర్యోధనుడు/ రావణుడు/ రాక్షసులు/ కపటం లేని అరిషడ్వర్గాల బానిసత్వం) అంటే నా?

పాండవులకు ఖచ్చితముగా దుర్యోధనుడు (పులి) తో పొసగదని తెలుసు, తమకు కీడు చేస్తారు అని తెలుసు. కానీ దుర్యోధనుడు కి, శకుని (పాము/ నక్క) తమ వైపు ఉండి, తమ వంశ వినాశనానికి ఇంత ఓపికగా పావులు కదుపుతాడు అని, రారాజు కి అనిపించలేదు.

దుశ్శాసనుడు (పులి), శకుని (పాము) లాంటి వారు గుణాలు తనతో ఉన్నంత వరకు, రారాజు, దేవుడైన క్రిష్ణుని గుర్తించలేడు. ధర్మం వాస్తవం వైపు నిలబడడు, బ్రమలలో ఉంటాడు.

అందుకే మన స్నేహితులలో కూడా, వారి మాటలు కఠినముగా ఉన్నా, మనసు విప్పి చెప్పేవారే మనల్ని మందలించే వారే, మనకు నిజమైన స్నేహితులు, శ్రేయోభిలాషులు. కీడు/ నష్టం చేయబోతుంటే కలగబోతుంటే కూడా, స్పష్టముగా చెబుతారు.

అలాకాకుండా, తమ అవసరాల కోసం, నక్కి నటించే వారు, ఏమీ మంచి చెప్పని వారు, మందలించని వారు, ఏనాటికైనా మనల్ని విడుస్తారు, గొయ్య తీస్తారు సుమా.

విశ్వామిత్రుడు తపములో ఉంటే, దేవతలు ఎన్ని ఆటంకాలు పెట్టినా తన మనసు చెక్కు చెదరలేదు. కానీ మేనక కపటము తో రాగానే, మోహముతో తన తపస్సు కు భంగము కలిగింది.

విషం ఒకసారే చంపుతుంది. కానీ కూల్డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్, బయట తిండి, చిన్న చిన్న గా బలహీనం చేసి చంపుతాయి.

కాబట్టి సాధకుడు, అరిషడ్వర్గాలు ఏ రూపములో అయినా అంటే నేరుగా లేదా చాటుగా, మనల్ని పతనము చెయ్యడానికి, సిద్దముగా ఉంటాయి, అన్న స్రుహతో, నిత్య జాగరూకతతో, దైవ ప్రార్ధన సాధనతో, ఒక కంట వీటిని కనిపెట్టుకుని, వాటికి దూరముగా ఉండాలి, ఆధ్యాత్మిక ప్రగతిని, మనసు పై పట్టును సాధించాలి సుమా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,814; 104 తత్వాలు (Tatvaalu) and views 225,101
Dt : 24-Jun-2022, Upd Dt : 24-Jun-2022, Category : General
Views : 766 ( + More Social Media views ), Id : 1441 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : fear , snake , tiger , peace , mind , rid , first , why , Jurassic , Park , Dinosaur
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content