ప్రజా తీర్పు గౌరవిస్తు- ఇంత చేసినా? లోపం ఎక్కడ? అంతర్మధనం? విక్టిం ఆఫ్ ద మాచ్? ఓడి గెలిచెనా?- జగనన్న - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2114 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2149 General Articles and views 2,149,440; 104 తత్వాలు (Tatvaalu) and views 240,826.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Respecting verdict of people - We did so much? Where is fault? Intermediary/ Agitation of mind? Victim of the match? Lose but win? - Jagan

- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva - మన గాత్ర నైవేద్య సేవ Our Gatra Naivedya Seva
Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు

ఏపీలో కూటమికే ఊహించని విజయం అధికారం, వైసీపీకి ఊహించని పరాజయం, అధికారం దూరం - భవిష్యత్ పయనం? మన తప్పులు ఒప్పుకుందామా?

Unexpected victory for alliance in AP, unexpected defeat for YCP, distance from power - future journey? Do we admit our mistakes?

2024 మే నెల లో మా 4 గురు పిల్లలు, పెద్దోడు బీజేపీ, 2 వ వాడు తెదేపా, 3 వ వాడు వైసీపీ, 4 వ వాడు జనసేన మరలా ఎన్నికల రంగంలో దిగింది మీకు తెలుసు. గెలుపు ఓటములు దైవాధీనం. గెలిచిన వారికి శుభాకాంక్షలు, ఓడిన వారికి తర్వాత గెలుపుకై ఆరాటం పోరాటానికి శుభాకాంక్షలు.

తండ్రిగా, మా పిల్లల ఓటమి కి ఎలా ధైర్యం చెపుతూ, అన్ని తప్పులు ఎలా కడిగామో, తమకు భవిష్యత్ ఆలోచన పెరగడానికి మీరే చూడండి. మీరూ కూడా, పక్షపాతం లేకుండా, మీ పిల్లల/ భాగస్వామి గుణ గణాలు, తప్పు ఒప్పులు నిజాయితీగా చెప్పాలి, లేదంటే మీ ముదుసలి జీవితం ఒంటరే ఇంట్లో పనిమనుషులతో లేదా అనాధ ఆశ్రమములో. జగనన్న చేసిన తప్పులు, చంద్రన్న పవన్ కూడా ఇప్పుడు చేయకుండా ఉండాలి, వారికీ ఇది ఉపయోగమే.

చంద్రన్న తమో, జగనన్న రజో, పవనన్న సత్వ గుణం. అంటే మిగతా 2 గుణాలు వీరికి లేవు అని కాదు, ఇవి ఎక్కువగా కనపడతాయి. సొంత పార్టీ వారు ఇద్దరే, అది జగనన్న అలాగే పవనన్న. కాబట్టి మూల ధర్మం వీరిద్దరితోనే ఉన్నది.

ఒక్కడిగా జగనన్న 39 శాతం తెచ్చుకోవడం గొప్పనే, ఒక్కడిని ఓడించలేము అని ముగ్గురు కలవడం జగనన్న మొదటి విజయం. అంటే జనాలు కాదు జగన్ ను ఓడించింది, కూటమి మాత్రమే. చంద్రన్నకు వచ్చింది 45 శాతం మాత్రమే, అదీ కూటమి ఓట్లతో. అంటే తేడా, 6 శాతం, అందులో సగం, కేవలం 3 శాతం తేడా. ఎందుకంటే, పవన్ కలవక పోతే, జగనే గెలిచేవారు, అంటే జనం ఇంకా జగన్ తోనే ఉన్నారు. జగనన్న చేసిన ఎన్నో మంచి పనులు ఉన్నాయి, వాలంటీర్లు గ్రామ వైద్యం ఇంగ్లీషు చదువు, ఇంకా ఎన్నో. ఇది సత్యం, కానీ జగనన్న ఓటమి జరగాలి, అధికార మత్తు దిగాలి, తమో గుణ పాప ఫలిత గుణపాఠాలు నేర్చుకోవాలి, తనను ముంచిన వారెవరో తెలుసుకోవాలి, ఇంకా రాటుదేలాలి. అది దైవ నిర్ణయం. చిత్రములో ఎన్నో సాక్ష్యాలు ఇచ్చాము.

గతములో జగనన్న ఒంటరిగా 151 సీట్లు తెచ్చుకున్నారు. ఇప్పుడు చంద్రన్న కూటమి అంటే పవనన్న అండ తో కలిపి కేవలం 135 నే కదూ? పసుపు మీడియా ఇవి రాయవు.

ఇప్పుడు పవనన్న సత్వ గుణం వెళ్ళి, చంద్రన్న తమో గుణం తో కలసింది, కాబట్టి ఇప్పుడు చంద్రన్న సీయెం గా, కూటమి తమో గుణ సంపన్నం. పవనన్న తాను సేద తీరుతున్నది, పాము పడగలో, నక్క తోడుతో అన్నది, క్షవరం అయితే కాని వివరం తెలీదు అంటున్నారు ఆలోచన ఉన్న జనసైనికులు. ఇక తాత రాజారెడ్డి రక్త చరిత్ర, నాన్న రాజన్న చేసిన ఘోరాల చరిత్ర సీయెం కాకముందు, ఫాక్షనిజం బాక్గ్రౌండ్, మన కేసులు, స్టేలు, పేజీలు పేజీలు, మనము ఇక్కడ రాయలేము.

జగనన్న, పవనన్న ఆవేశపరులు, యువ రక్తం, భవిష్యత్ ఆలోచన తక్కువ. జగనన్న అధికార మత్తులో దిగాక, తమో గుణ లక్షణాలు పెంచుకున్నారు. అలాగే పవనన్న కూడానా తమో గుణ లక్షణాల పెంచడంలో, చూద్దాము రాబోయే రోజుల్లో.

ఇప్పుడు చంద్రన్న తమో గుణం లో అలవాటు గా చేసే, మంచి చెడు మాయ పనులు అన్నిటిలో, పవనన్న కూడా మనసా వాచా కర్మణా భాగం పంచుకోవాలి, ఉప సీయెం గా. 6 నెలల సావాసం తో వారు వీరు, వీరు వారు అవుతారు అన్న సామెత, ఎవరు ఎలా నిజం చేస్తారో, రాబోయే రోజుల్లో చూద్దాము. ఇప్పుడు మన టాపిక్ జగనన్న ఓడడం గురించి, ఇటువైపు మాట్లాడదాము.

విదేశాల నుంచి కూడా, ఈ తమో, రజో గుణాల ను గెలిపించడానికి, ఎంతో మంది వచ్చి, ఎంతో ధనం పంచి, తమ పాప శిఖరాలను పెంచుకున్నది, మీకు తెలుసు. మంచి కోసం, సత్వ గుణం కోసం, ఆవును గెలిపించడం కోసం, వీరు ముందుకు రారు. అది వారి కుటుంబ పెంపక సంస్కారం. తమ ముదుసలి తల్లి దండ్రులకు సేవ చేయరు, తమ పిల్లలు రేపు వీరి ముదుసలి వయసులో వీరిని దేవతలు గా గౌరవిస్తారు అని చెప్పలేని కపట నటన ధన వీరులు వీరు.

కానీ జగనన్న ప్రభుత్వం లో జరిగిన తప్పులను కొన్ని చూద్దాము. కర్ణుని చావుకు 1000 కారణాలు, అని పురాణాల్లో చదివాము కదా. ఒక్కోటి, ఒక్కోటి కలసి, పాప శిఖరాలను పెంచుతాయి. పైసా, పైసాకూడ బెడితే రూపాయి అవుతుంది అంటారు కదా.

జగనన్నా, నువ్వు ఇప్పుడు ఓడటం అన్నది జరగాలి, ఎందుకంటే ఈ అనుభవ పాఠాలు నువ్వు నేర్చుకోవాలి. నీ ఓటమి నుంచి, అలాగే గత చంద్రన్న ఓటమి నుంచి, ఇప్పుడు చంద్రన్న మాయల నుంచి, పవనన్న భవిష్యత్ రాజకీయ పాఠాలు నేర్చుకోవాలి. రేపు భవిష్యత్ రాజకీయం మీ ఇద్దరిదే. కాబట్టి నీ ఓటమి, పంచభూతాలకు సమ్మతే. ఈవీయెం ల గొడవ ఎత్తి, మోదీ ని దురం చేసుకోకు. పవన్ తో చేసిన పిచ్చి పనే, మరలా మోదీ తొ చేయకు. తప్పులు సరి చేసుకోవడం పై మాత్రమే ద్రుష్టి పెట్టు.

ఎప్పుడైతే, సజ్జల, ఎన్నికలకు ముందు, అసలు ప్రభుత్వం/అధికారం లో ఉన్నది మేమా లేక ప్రతిపక్షమా, మాకే అనుమానం వస్తుంది అన్నారో, అప్పుడే మన ఓటమి, అలాగే కూటమి ప్రభావం, ప్రపంచానికి అర్ధం అయ్యింది, ఇక ఓటమి తప్పదు అని.

కానీ మేము మాట్లాడకూడదు అప్పుడు, దైవ నిర్ణయం ను సాక్షీభూతునిగా చూడటమే మా పని. ఎందుకంటే 5 ఏళ్ళుగా, మీకు మంచి చెప్పి చెప్పి, మా పని పూర్తి అయినది. ఇంక మన చేతులు దాటి, పంచభూత శిక్షణకు వెళ్ళింది. ఇదే అందరికీ మొత్తుకుని చెప్పేది, మెత్తటి శాంతి మాటలతో ముందే మారండి అని.

1) జగనన్న మాటతప్పుతా మడపతిప్పుతా అంటూ, చాలా విషయాలలో కుప్పిగంతులు వేసారు - ఉద్యోగుల విషయం లో, మద్యం విషయములో, 3 రాజధానుల 3 ముక్కలాట లో. అదే రజో గుణం నుంచి, దిగజారిన తమో గుణం కు సాక్ష్యం, అధికార మత్తులో.

ఆఖరికి వైజాగ్, ఆ భూతల స్వర్గ భవంతుల నిర్మాణం కూడా, చాటుగా గుట్టుగా చేసారు. 500 కోట్ల విలువైన ప్రభుత్వ ఖర్చు అని, అప్పుడే పబ్లిక్ గా ఎందుకు చూపలేదో తెలీదు. అదే తమో గుణ లక్షణం, మన రజో గుణం పౌరుషం ఎక్కడ దాంకుందో తెలీదు సిగ్గుతో.

అంటే అధికార మత్తులో ఉంటే, చంద్రన్న జగనన్న ఒక్కటే. కొత్త సీసాలో పాత సారాయి అంటున్నారు అభిమానులు. ఎన్నో మంచి పనులు చేసినా, అహంకారం అలాగే తమో గుణం, మనలను మన కుటుంబం ను, మన చుట్టూ ఉన్న వారిని, పతనం చేస్తాయి.

2) వాలంటీర్లను ఇళ్ళకు పంపి సేవలు ఇంత చేసినా? ఇళ్ళ గోడకు, మన ఫోటోలు అతికించినా, భూముల రాళ్ళకు మన బొమ్మలు వేసినా, కనపడ్డ ప్రతి పధకానికి, ప్రజా పన్నుల సొమ్ముతో నడిచే సహాయాలకు, మన పేరు పెట్టినా, ఎందుకు ఫలితం లేదు? - ఏమిటీ పేర్ల మరియు బొమ్మల పిచ్చి? ఇది కూడా 1 కారణం, మన పతనం కు.

2019 లో చంద్రన్న ను గెలిపించిందా, ఆ పేర్ల మరియు బొమ్మల పిచ్చి? ఇది తమో గుణ లక్షణం.

50 ఇళ్ళకు ఒక వాలంటీర్ అనేది ఒక గొప్ప ఆలోచన, ఇంటికే ప్రభుత్వ పనులు, ప్రభుత్వ అధికారులకు లంచాలు సలాములు లేకుండా, పది సార్లు తిరగకుండా.

ఉదాహరణకు, ఇప్పుడు 100 మంది వాలంటీర్లు ఉంటే, 5 వేలు ఇస్తుంటే, అంత మందికీ 10 వేలు చంద్రన్న ఎలా ఇస్తారో, సంపద పెంచి అరచేతిలో స్రుష్టించి మాయలు మంత్రాలతో తన అద్భుత మేధాశక్తితో, కొన్ని రోజుల్లో చూడబోతున్నాము.

100 మందిని ఉంచుతారా లేక 75, 50, 25, 10 మంది కు తగ్గింపు చేసి, తన కపట నటన 2 నాల్కల ధోరణి చూపుతారా చూద్దాము. ఎంత మంది సామాన్యుల గొంతు కోస్తారో ఆ 5 వేలు కూడా లేకుండా తీసేసి, చూద్దాము. 50 ఇళ్ళకు ఒకరా, లేక 30 ఇళ్ళకు ఒకరా లేక గ్రామం మొత్తానికి 5 గురా? లేక అందరూ పంచాయితీ ఆఫీస్ కు రాండి క్యూలో నిలబడండి లేదా రోజుకు కొంతమంది చొప్పున ఇంటికి నెలలోపు పించను పంచుతాము అంటారా, చూడాలి. వీరికి జీతాలు, మరలా అప్పుల పప్పుకూడు తోనా?

3) పని పాట లేకుండా, ఇంట్లో కూర్చోబెట్టి సోమరిపోతులుగా చేసి, అప్పులతో పప్పుకూడు తినమని, బటన్లు ఎన్ని నొక్కినా, ఈ దురద్రుష్టం, ఊహించని మలుపు, ఎలా జరిగింది? ఏది తాకట్టు పెట్టి, ఏది అమ్మి, ఎవరిది అమ్మి, ఎక్కడ ఎంత అప్పు చేసి పంచుతున్నామో, ఏది కేంద్ర భాగమో ఏది రాష్ట్ర భాగమో, ఎందుకు దాస్తున్నాము?

ప్రజలలో బద్దకం నిర్లక్ష్యం తమో గుణం పెంచితే, అది మన గెలుపు ను కూడా, తమో గుణం లోకే నెడుతుంది కదా? ఎవరు ఎక్కువ చేతిలో పెడితే, ఎక్కువ పించన్ ఇస్తే, వారికి ఓటు కదా, తమో గుణ బానిసలుగా? ఇంక మీ మంచి ఎవరికి కావాలి, అసలు మీ మంచి ఏముంది తమో గుణం లో? క్రుతజ్ఞత విశ్వసనీయత నాయకులు ప్రజలలో ఉంటుందా? పోనీ మీలో ఉందా? 4 వేలు అంటే వారికి వేస్తారు. 5 వేలు అంటే మీకు వేస్తారు. అది నేటి జనాల మానసిక బలహీన పెంపక పరిస్తితి.

అక్క చెల్లెళ్ళ తాతా అవ్వల ప్రేమాభిమానాలు ఎటు వెళ్ళాయి అన్నది పిచ్చి ప్రశ్న కాదా? అత్త సొమ్ము అల్లుడు దానానికి, మన మీద ప్రేమా అభిమానం ఎందుకు ఉండాలి? మన ఇంట్లో సొమ్మా? కోట్లతో పెంచిన సొంత పిల్లలే, ముదుసలి అమ్మ నాన్న అత్త మామ ను వదిలేస్తున్నారు కదా?

ఆశ్చర్యం లో వైసీపీ నాయకులు/ అనుచరులు ఎందుకు, ఇంత తెలివి తక్కువ వారా? సొంత కొంపల్లోనే, పార్టీలలోనే ప్రేమ అభిమానాలు జనాలకు లేవని తెలీదా? ఆసుపత్రులు, అనాధాశ్రమాలు, వ్రుద్దాశ్రమాలు చూడలేదా? పసుపు కుంకుమ అని, పందారం చేసిన చంద్రన్నను, 2019 లో ప్రజలు ఓడించలేదా, మీ నవ రత్నాల పందారం ను చూసి? ఇప్పుడూ అంతే.

చంద్రన్న కన్నా ఎక్కువ అప్పులతో, ఎక్కువ ఉచితాలు ఇవ్వలేకపోవడమా? ఇది ఒక కారణం కావచ్చు కదా. ప్రజల ఉచిత ధనాశకు, ఉచిత బస్సు ప్రయాణం, పిల్లలు ప్రతి ఒక్కరికి 15 వేలులకు మానసిక దౌర్భల్యము తో లొంగి, మరలా కపట నటన 2 నాల్కల వెన్నుపోటుకు సిద్దమయ్యారా?

4) పవన్ ను అనవసరముగా గెలకడమా? పవన్ జోలికి వెళ్ళోద్దు అని, మొదటి నుంచి చెప్పాము. ఒక నాయకుడు గా, రాష్ట్ర పార్టీ పెద్దగా, ఒక ముఖ్యమంత్రిగా, పవన్ వ్యక్తిగత పెళ్ళిళ్ళ గురించి అనవసరముగా మాట్లాడితే, మనము తమో గుణానికి దిగజారిపోయినట్లే కదా, అధికార అహంకార మత్తులో? అది మనకు నెగటివ్. నాయకుడు దిగజారితే, మన బుద్ది జ్ఞానం లేని అనుచర బానిసలు మీకు నచ్చ చెప్పక పోగా, అదే పతన దోవతో ఇంకో 2 ఎక్కువ అనవసరముగా మాట్లాడతారు. అహంకారముతో కోరి తెచ్చుకున్న కొరివి.

5) మంత్రులు నోటికి వచ్చిన విధముగా మాట్లాడటం, ఇష్టం వచ్చిన విధముగా చేయడం, మనము ఎన్నో విషయాలు మడమ తిప్పడమా? అన్ని జిల్లాలలో ఇలాగే ఉంది. ఉదాహరణకు ఒక జిల్లా చూద్దాము. ప్రకాశం జిల్లాలో, బాలినేని తమో గుణ అరాచకాల గురించి, మీకు ఎన్నో విషయాలు విన్నవించాము, వారికీ పంపాము. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు, పదవి లో నుంచి తీసి పక్కన పెట్టారు గానీ, జరిగిన నష్టాన్ని పూడ్చగలమా? ముందు చూపు ఎందుకు లేదు? మీ సలహాదారులు అంతా నిద్రపోతున్నారా, ఉచిత జీతాలతో?

6) చీరాల తెదేపా ఎమ్మెల్యేని, రాజీనామాతో మరలా గెలిపించకుండా, ఎలా తీసుకున్నాము, మాట తప్పి మడమ తిప్పి? పొనీ వారిని తెచ్చి, ఫలానా మంచి పని ఒక చీరాల జిల్లానో, ఫిషింగ్ హార్బరో, ఇంకోటో పెద్ద పని చేయించారా? అదీ లేదు, మీరు మునిగి, వారిని ముంచారు.

కరణం బాబాయి కి చెప్పాము, కనీసం ఓ ధర్నా చెయ్యండి జిల్లా కోసం లేదా అభివ్రుద్ది కోసం, లేదా బయటకు రాండి అని, వారూ వినలేదు. ఇప్పుడు తమ్ముడు వెంకటేష్ ను పతనం చేసారు, అందరూ కలసి మూర్ఖముగా.

అటు మాజీ ఎమ్మెల్యే ఆమంచి అన్న కూడా స్వయం పతనము. మాజీ మంత్రి సిద్దా ఎందుకు మనకు అప్పుడు, అహంకారం కాకపోతే ఆనాడు? ఇప్పుడు తను ఇటు అటు మారలేక, విలువలు లేని మనిషిగా గుర్తింపు. ఎంత ధనం ఉన్నా, ఉపయోగం ఏమిటి, తమో గుణం తో?

7) అనంతపురం జిల్లాలో, పెద్దారెడ్డి దౌర్జన్యము గుర్తు ఉన్నదా, ఇళ్ళ మీదకు వెళ్ళి, ఫర్నిచర్ ద్వంసం చేసి? ఎందుకు అంత ప్రతీకారాలు కోపాలు కక్షలు? ఫాక్షనిజం వదలమా? అది తప్పు అన్నాము.

ధర్మవరం కేతిరెడ్డి మరియు ఇతర ఎమ్మెల్యే ఎంపీలు, ఆనాటి కలెక్టర్ చంద్రుడు గారిని బదిలీ చేయాలని చూస్తుంటే, తప్పు అని చెప్పాము. పల్లెటూరి దేవుని ఉత్సవం తగవులో కూడా, మనము తగ్గాలని చెప్పాము. విన్నారా? లేదు కదా?

8) ఆ రోజా, నాని, పోసాని, అనిల్, అంబటి, ఇంకా ఎంతో మంది, ఏమిటి ఆ అరుపులు కోప ఆవేశ వెకిలి అర్ధం లేని మాటలు? మీరు గమ్ముగా ఎందుకు ఉన్నారు? ఎమ్మెల్యేల ఎంపీల పాపం, నాయకుని కే కదా చుట్టుకునేది? వీళ్ళ చెత్త మాటలు నేర్చుకుని, పిల్లలు ఎంత మంది చెడిపోయారు. చంద్రన్న పసుపు గుంపు/మంద కన్నా, మనము ఉత్తములము అని ఎక్కడ నిరూపించాము?

మీ ఆధిపత్యం పౌరుషం పెద్దతనం ఏమైంది ఇక్కడ? వారి తిట్లు, మీకు శాపాలు, అని మేము ఆనాడే చెప్పాము కదా, మీ పెద్ద నాయకులకు పంపాము కదా? కదిలారా, అదుపు చేసారా? ఇది ఒక కారణం కాదా?

9) సజ్జల, విజయ సాయి, వైవీ సుబ్బారెడ్డి - ఎందుకు వీరు? నమ్మకస్తులు, మనకు మంచి చేస్తారు, అంత వరకు ఓకే. కానీ అబ్బాయి, మన పరిపాలన, మన నాయకుల పనితనం, ఇలా పక్క దోవ లో వెళుతున్నది, ఇదిగో ఈ విలేఖరి ఇలా చెప్పారు, ఇక్కడ తగ్గుదాము అని మీకు బుద్ది చెప్పలేనప్పుడు, అంత ధైర్యం లేనప్పుడు, ఆ సలహా దారులతో ఉపయోగం ఏమిటి?

బయట జరిగే నిజాలు చెప్పలేని, స్వార్ధ పిరికి తమో గుణ కోటరి, మనకు ఎందుకు? వారి పబ్బం వారు గడుపుకున్నారు. ఇదే స్వార్ధ పిరికి కోటరీ కదా, చంద్రన్న ను పతనం చేసింది? ఈ రోజు పవన్ రాకపోతే, చంద్రన్న దీనపరిస్తితి ఎలా ఉండేది? రేపు మీ పరిస్తితి అంతే.

వైవీ సుబ్బారెడ్డి కి ఎందుకు తిరుమల పనులు? ఇంట్లో వారి చేత, పరాయి మత పుస్తకం పట్టించడం ఆపలేక పోయిన వ్యక్తికి, ఆ పదవి అవసరమా?

చుట్టరికం, మన పార్టీని నాశనం చెయ్యడానికి కాదు కదా? సలహాదారుడి గా పెట్టుకో లేదా, ఇంకో మంత్రి పదవి ఇచ్చుకో.

10) రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది. మా నాయకులు, కార్యకర్తలపైనా ఉన్మాదంతో దాడులు చేస్తున్నారు - అంటున్న/ భోరుమంటున్న జగనన్న మరియు ఇతర నాయకులు.

మరి మనం అధికారం లో ఉన్నప్పుడు, ఇవి చెయ్యలేదా? ఆ డాక్టర్ ను, ఎంత ఘోరముగా నడి రోడ్ పై హింసించారు? వాటి పాప ఫలితాలు రావద్దా? బాబాయి హత్య చేసింది ఎవరు, మనము తేల్చలేక పోయాము. చంద్రన్న జైలు జీవితం లోపల ఇబ్బందులు, అవసరమా మనకు?

2019 లో అధికారం వచ్చినప్పుడు, మనము ఎలా హద్దు అదుపు లేకుండా ఊగిపోయామో, ఇప్పుడు చంద్రన్న అనుచరులు అలా ఊగిపోతున్నారు, అది పవన్నకు చెడ్డపేరు అని తెలిసి కూడా.

పవనన్న కొత్త అధికార మోజులో ఉన్నారు, చుట్టూ గమనించే స్తితిలో లేరు ఇప్పుడు. పవనన్న స్రుహలో ఉండి, మొత్తం ప్రభుత్వ పని తీరును కూడా గమనించాలి, ఉప సీయెం గా, దయచేసి మరువద్దు.

ఎన్నో కేసులు ఊసులు ఫేకులు నిందలు అబద్దాలు అవమానాలు, మెడకు చుట్టుకోవడానికి సిద్దమా జగనన్నా?

మరలా 2029 లో అదే పగలు, ప్రతీకారాలు, ఇంతేనా మన తమో, రజో గుణ దాసుల బతుకులు.

11) అభివ్రుద్దికి, అప్పుల తగ్గింపుకు, ఆదాయం పెంపుకు ఎవరూ అడగకూడదు అంటే, అవి మర్చిపోవాలి అంటే, నాడు మీరు చేసిన వంకర రాజకీయమే, నేడు వీరూ చేస్తారు.

కాకపోతే, ఒకటే తేడా, ఈ పాపాలలో, పవన్ కూడా చిత్తశుద్దితో పాలు పంచుకుంటున్నారు, తెలిసీ తెలియక.

ఏమి జరిగింది, ఎలా జరిగింది, ఎలా సరి చేసుకోవాలి. మన తప్పులు ఏమిటి? 2019 లో కూడా, మా అబ్బాయి చంద్రన్న కు చెప్పాము. తమో గుణం లో వారు, సోది అంటూ వదిలేసారు, ఏ గుణము మార్చుకోలేదు. మరి మీరు ఇప్పుడు అంతేనా?

12) చంద్రన్న ది రజో గుణము పాళ్ళు తక్కువ, అలాగే తమో గుణము పాళ్ళు ఎక్కువ. అంటే, అంతా చాటు మాటు. ఏదీ నేరుగా ఉండదు, నోటికీ చేతకు కుదరదు. ఎంటీయార్ కే చివరి నిమిషం దాకా, తనకు వెన్నుపోటు పొడిచారు అని తెలియలేదు అంటే, మనం ఎంత? పాపం పవన్. చంద్రన్న, తనకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో కూడా, తను చూపలేరు ధైర్యముగా.

అదే జగనన్న 50+ గదుల ఇళ్ళు లాంటి పాలస్లు, అన్ని నగరాలలో చూపుతారు ధైర్యముగా. ఇద్దరుదీ అక్రమార్జన అని ఇరు నాయకులు నిందించుకుంటారు, సాక్ష్యాలు కోర్టులో చూపరు. సరే, అది మనకు వద్దు.

జగనన్న ది రజో గుణము, దేని కైనా సిద్దం అని కాంగ్రెస్స్ తోనే యుద్దం. నేడు సోనియమ్మ పిలిచినా, నేను రాను, నా మద్దతు మోదీ కే అని జవాబు. గత 5 ఏళ్ళుగా, కేసులతో గానీ గౌరవముతో కానీ, మోదీ వెంటే. స్తిర మనస్తత్వం.

జనం ఎక్కువ గా పులి నే ఇష్టపడతారు, నక్క పాముల కన్నా అని గతములో చదివాము. కానీ మనము కూడా తమో గుణానికి వెళ్ళాము. ఇప్పుడు చంద్రన్న తమో గుణమే బెస్ట్ అనుకున్నారు, ఉచిత ధన ఆశతో, పవనన్న సత్వ గుణ అండతో.

13) ఆ వైజాగ్ పాలసులు కూడా, పేపర్లో ఆనాడే పెద్ద పెద్ద ఫోటొలతో వేస్తే సరిపోయెది కదా? ప్రభుత్వం ది అయినప్పుడు, ఇప్పటిదాకా దాపరికం ఎందుకు? ఆ తాడేపల్లి ఇంటి చుట్టూ, ఆ కంచెలు ఆంక్షలు ఏమిటి? ఆ లాండ్ టైటిలింగ్ యాక్ట్, జనానికి భయం కలిగించింది. ఇంకా ఎన్నో అవి ఇవి, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది.

బలమైన ప్రతిపక్షం ఉండాలి, కానీ మనకు 11 వచ్చింది అంటే, మనము ఎన్ని అరాచకాలకు పోయామో, ఆలోచించు జగనన్నా. ఇప్పుడైనా సరి దిద్దుకో, మన సలహాదారుడు తమ స్వార్ధం మాత్రమే చూసుకోకుండా, నిజాన్ని మాలాగా నిర్భయముగా, నాయకునితో చెప్పాలి, అది జగన్ పవన్ చంద్రన్న అయినా.

ఎందుకంటే, మీరు ముగ్గురు అలాగే మీ పిల్లలు చల్లగా ఉండాలి, తప్పు తెలుసుకుని, చిన్నగా సాధనతో, సత్వ గుణం వైపు రావాలి. మనకు పెద్దలు చెప్పిన గుణపాఠాలు మరువద్దు. మన తప్పులు, మన పిల్లలు, మన మనుమలు కూడా అనుభవించాలి.

రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ‌‌‌, కాఫీడేఅయ్య, మాల్యయ్య, సింఘానియయ్య, మీ ఇంట్లో మా ఇంట్లో, లాంటి మహానుభావుల చివరి పేజీలు చదవండి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2149 General Articles and views 2,149,440; 104 తత్వాలు (Tatvaalu) and views 240,826
Dt : 19-Jun-2024, Upd Dt : 19-Jun-2024, Category : Politics
Views : 157 ( + More Social Media views ), Id : 2118 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Respecting , people , verdict , fault , match , Victim , Lose , win , jagan , pawan , chandranna , andhra , election , 2024
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content