పార్టీ అధిష్ఠానం కు తలనొప్పి - కేరెడ్డి, జేరెడ్డి పౌరుషాల దాగుడు మూతల సుమోల ఆట - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,909; 104 తత్వాలు (Tatvaalu) and views 225,110.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

సినిమా లలో చూసాం, ఓ 10 తెల్ల సుమోలు వచ్చి ఇంటి ముందు ఆగడం, అందులో నుంచి, ఓ 10 మంది గబగబా దిగడం పరుగులు, ప్రత్యర్థి ఇంట్లో దేవులాడటం, చిందరవందర చేసి, కనపడిన వారిని కొట్టడం. వార్నింగ్ ఇచ్చి, మీ నాయకుడు కి చెప్పు అని, మీసాలు మెలేసుకుంటూ ఆనందం గా వెళ్ళడం.

ఇప్పుడు అనంతపురం జిల్లా లో, అలాగే జరిగింది అంట. ఎవరు ఏలుతున్నా కూడా, పోలీసు వ్యవస్థ నిస్సహాయత స్పష్టంగా కనపడుతుంది. ఎప్పుడూ ఇక్కడ అంతా బహిరంగంగానే ధర్నాలు, అరుపులు ఉంటాయి. అరాచక వాదులు, తమ గొప్ప పనులు సంస్కృతి ని, ప్రపంచం అంతా చూసి ఆనందించాలేమో అని.

మరి పార్టీ ల నాయకులు, అలాంటి బాధ్యత లేని నాయక అనుచరులు ను, ఎందుకు ప్రోత్సాహం చేస్తున్నారో తెలీదు. తొడగొట్టిన దుశ్శాసనుడు, విర్రవీగిన దుర్యోధనుడు, రావణుడు చివరకు ఏమయ్యారు? అందుకే కదా, పురాణములను చదవమనేది. ఎప్పుడూ ఉండే రాహువు, కేతువు, శని మాయాజాలం నుంచి బయటకు రాలేమా?

కారణం ఏదైనా, గత వైరాలు ఎన్ని ఉన్నా, గతములో ఎన్ని ఇబ్బందులు పెట్టినా, అలా భయం భక్తి లేకుండా, సమాజం అంటే గౌరవం లేకుండా, పిల్లల కు మంచి నేర్పకుండా, అధిష్టానం ఏమంటుందో అన్న గౌరవం లేకుండా, నాయకులే ఇతరుల ఇళ్ళు మీదకు రౌడీలు గూండాల లా పోతుంటే, ఇక సామాన్య కార్యకర్తలు పరిస్థితి ఏమిటి?

కరోనా భయం కూడా లేదా? సీమ ను ప్రశాంతంగా ఉండనీయరా? 4 జిల్లా ల సీమ పరువు తీస్తారా? సీమ మంచితనాన్ని దాచి, ఈ రౌడీయిజం ని ప్రచారం చేస్తారా? తెలంగాణ లో కూడా, కలపడం వద్దు అన్నారు కదా?

అనంతపురం జిల్లా అభివృద్ధి కోసం మంచి కలెక్టర్ ఉన్నారు, రాయలసీమ బాగు కోసం, ఇలా తమ పార్టీ అధిష్ఠానం ను 10 సుమోలు లో వెళ్లి, అడిగి, పని చేయించుకుంటే బాగుంటుంది.

ఎవరూ తక్కువ కాదు, ఈ నాయకులు ను, ఏమీ అనలేం కాబట్టి, మాస్ అభిమానులు కోసం, కనీసం కొంచెం కామెడీ గా చెప్పుకుందాం, ఎప్పుడూ సీరియస్ గా ఎందుకు. ఆ ఇద్దరు నాయకులు కూడా, మనస్పూర్తి గా నవ్వు కోవాలి. రేపు సంక్రాంతి కి, ఇద్దరూ కలసి నాన్ వెజ్ విందు చేయాలి.

* ఏంది కేరెడ్డి, మా ఇంటి కొచ్చావంట. పరువు తీసావు కదయ్యా. కనీసం, 10 తెల్ల సుమోలు అన్నా లేకపోతే ఎలా, ప్రిస్టేజీ తగ్గదూ? మరీ కక్కుర్తి గా, 3 సుమోలు ఏందబ్బా. సీమ పరువు తీసావు,

నాకు చెపితే, మన సుమోలు 7 పంపే వాడిని. బాలయ్య సమర, చిరంజీవి ఇంద్ర సినిమా లు చూడలేదా?

అసలు ఎందుకు వచ్చావు, నేను లేకుండా?

- లేదు జేరెడ్డి, పండగ కదా, నాటు కోడి దొరకలేదు. మీ ఇంటి దగ్గర ఉంది అన్నారు. మనోడివే కదా, దోవలో కదా, నువ్వు ఇంట్లో ఉంటే కాఫీ తాగుదాం, అని వచ్చినా.

కరోనా తో, డ్రైవర్ లు దొరకడం లేదు, అబ్బీ. నీకు తెలుసు కదా. బిర్యానీ కన్నా, కుటుంబం ప్రాణాలు ముఖ్యం అంటున్నారు.

ప్రభుత్వ పధకాలు లో ఉచితంగా దుడ్డు వస్తోంది, ఎవరూ రాలేము అంటున్నారు తన్నులాటలకు, పనులు కు కూడా.

రెండో ది, నీకు కెమెరా లు ఉండాయని తెలీదు. ఈ దెబ్బ వస్తే, 10 కి తగ్గదు, అమ్మ తోడు, నామాట నమ్ము, మాటంటే మాటే.

* ఏందబ్బా, ఏదో ఇసుక వసూళ్లు గొడవలు అంట?

- ఏం లేదులే అబ్బీ, పుకార్లు ఏవో వస్తూ ఉంటాయి, మనల్ని మీడియాలో ఉంచడానికి. అందరం చేసే పనే కదా, వసూళ్ల గురించి ఇప్పుడు ఎందుకులే? బస్సులు గురించి ఎప్పుడు అయినా, నేను అడిగానా?

* సరే గానీ, ఈసారి వస్తే, కాస్త ఇల్లు దుమ్ము దులిపి వెళ్ళమను కుర్రాళ్ళ ను, దుడ్డు ఇస్తాలే. మాకు కుర్రాళ్ళు దొరకడం లేదు.

మరి ఇప్పుడే ఎందుకు వచ్చావు? చెప్పి రావచ్చు కదా?

- అందరూ మనల్ని మరచి పోయారు, ఏ పేపరు వాళ్ళు మన గురించి రాయడం లేదు. కాస్త పబ్లిసిటీ ఉంటే బాగుంటుంది, అని అలా వచ్చిన, ఏమనుకోకు.

పార్టీ కోసం, జనం కోసం, ఏదో ఓ ఆట, మీతో నాకు దొమ్మీలు ఎందుకబ్బా. రోడ్డు మీద దగ్గర లో ఉండి , ఈ మాత్రానికే ఫోన్ ఎందుకు, అని చేయలేదు. పోలీసులు కాల్ లిస్టు తీస్తున్నారు కదా.

* సరే కానీ, ఏదో ఆయుధాలతో వచ్చావు అంట? పొలీసులు చూస్తే, లోన వేయరా?

- ఏమీ లేదు. మొన్న దసరాకు గడ్డి కోయడానికి, ఆయుధాలు సాన పట్టలేదు. తుప్పు పడుతుంటే, సాన పెడదాము, ఇంటికి ఎల్లే ముందు, అని తెచ్చాలే, భయపడకు, అంతా మనవాళ్ళే కదా.

* సరే కేరెడ్డి, వచ్చిన వాడివి, ఇంటి చుట్టూ తిరగకుండా, బండలా సోఫాలో కూర్చున్నావేంటి? నీ దెబ్బ కి, సొట్ట పడి, చినిగి పోయింది అది.

- అక్కడ నుండి వచ్చే సరికి, ఎండకు ఆయాసం వచ్చింది అబ్బీ, చెమటలు కక్కుతూ తిరగ లేక , సోఫాలో కూర్చున్నా.

ఏందబ్బా జేరెడ్డి, సోఫా కాల్చావంట? ఇంట్లో కి వచ్చినా అని, ఇల్లు కాలుస్తావా ఏంది కొంపముంచి.

* లేదు లే కేరెడ్డి, భలే జోకులు పేలుతున్నాయి సోషల్ మీడియా లో దీని మీద. పాత సోఫా నిండా, ఒకటే నల్లులు ఉండాయి, ఎలుక కూడా దూరింది. నువ్వు కూర్చుని లెగిచే సరికి, మొత్తం చచ్చాయి. అందుకే తగలేసా, కొత్త ది కొందామని.

ఏమిటి, మా వాడిని, కొట్టావంటా. తప్పు కదా? మనకు సుమోలు నిండా, జనం కనపడాలంటే కుర్రాళ్ళు కావాలి, బిర్యానీ పెడితే చాలు కదా, మనమే కొట్టి భయపెడుతున్న, ఎలా అబ్బీ, వాళ్ళు మరలా మన వెంట తిరగవద్దా?

- లేదు, జేరెడ్డి, నాటు కోడి వెతుక్కుంటూ, మా వాళ్ళు లోనికి వెళుతుంటే, మీ వాడు, ఆల్రెడీ కోసి కూర వండాం తిన్నాం, అన్నాడు అంట.

మా వాళ్ళ కు కోపం వచ్చి, ఏందబ్బా ఇంత కష్టపడి, 3 సుమో బళ్ళుతో, నిండా పెట్రోలు పోయించి, అన్నం కూడా తినకుండా వస్తే, కాస్త కూర కూడా మిగల్చలేదా ఇంట్లో, అన్యాయం కదా అని అడుగుతూ ఉంటే, వెనక్కు నడుస్తూ పడ్డాడు, మీ వాడు. ఒట్టు, మేము దూరంగా ఉన్నాము.

* సరే కేరెడ్డి, మొఖాన మాస్క్ లు ఏడ పోయినాయి. సోషల్ మీడియా లో కోడై కూస్తోంటే.

కరోనా తో అందరూ పోతే, సుమో లో మనిద్దరం మాత్రమే, ఒంటరిగా తిరగాలి. జై అనే వాడు ఉండడు, కర్ర పట్టుకుని దూకే వాడు ఉండడు, మన కోసం చచ్చేవాడు ఉండడు కదా.

కాస్త ప్రభుత్వం చెప్పేది అన్నా, వినబ్బీ. మా కుర్రాళ్ళు తో ఓ 100 మాస్క్ లు, శానిటైజర్ లు, గ్లౌజులు పంపుతాలే.

ముగింపు - నాయకులూ, జనం కు మీరు ఆదర్శంగా ఉండాలి. ఇలా మీరే వీధుల్లో సుమోలు తో, రౌడీలు లా, అధికారులు ఆఫీసులు ఇళ్ళు మీదకు పోతుంటే, కరోనా మాస్క్ లు లేకుండా తిరుగుతూ ఉంటే, మీ పరువు పోతుందో లేదో తర్వాత సంగతి, మన పార్టీ అధిష్ఠానం పరువు పోతుంది, జాగ్రత్తలు సుమీ.

రతనాల సీమను, రక్తపోటు సీమగా దయచేసి మార్చకండి. మీ పట్టింపులు పంతాలకోసం, ప్రజల మరియు అనుచరుల ప్రాణాలతో, చెలగాటం ఆడకండి బాబులూ.

చంద్రన్న, జగనన్న లాగా సంస్కారం గా, సీమ ప్రాంత జనాలకు ఆదర్శంగా నిలవండి.

వేమన, రాఘవేంద్ర, బ్రహ్మం గారు పుట్టిన నేలకు, ఈ విధంగా చెడ్డ పేరు తీసుకుని రాకండి.

జై రతనాల రాయల సీమ.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,909; 104 తత్వాలు (Tatvaalu) and views 225,110
Dt : 26-Dec-2020, Upd Dt : 26-Dec-2020, Category : Politics
Views : 753 ( + More Social Media views ), Id : 885 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : headache , party presidents , jagan , chandranna , anantapur , sumo game , hide seek , ketireddy , jc reddy
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content