పదవీ హోదా ప్రచార ధన సంసార వ్యామోహం కు, దూరం ఎలా? మాయ నుంచి, జాగ్రత్త? ఇతరుల అర్ధం? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,877,662; 104 తత్వాలు (Tatvaalu) and views 225,926.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*పదవీ హోదా ప్రచార ధన సంసార వ్యామోహం కు, దూరం గా ఎలా వుండాలి? ఆ మాయ నుంచి, ఎలా జాగ్రత్త పడాలి? ఇతరులు దూరంగా ఉన్నారని, ఎలా అర్ధం చేసుకోవాలి?*

జవాబు, గురువు గారు చాలా చిక్కు ప్రశ్న, కాకపోతే ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. మానసిక బలం లేక, వ్యామోహ మత్తులో కూరుకు పోయి పతనం అవుతారు, ఇతరులను పతనం చేస్తారు. చూడండి చాలామంది, 60 దాకా బ్రహ్మాండం గా బతికి, చివరకు వాళ్ళ పిల్లల చేతిలోనే ఒంటరిగా అధోగతి పాలవుతారు. ఎందుకు సంపాదిస్తున్నామో, ఎలా పెంచుతున్నామో, వారు 60 కి ముందు పట్టించుకోరు. సంస్కారం గురించి మాట్లాడితే, వెకిలి నవ్వు నవ్వుతారు.

ఎవరో పరిస్థితి గురించి మాట్లాడితే, వారికి కోప తాపాలు, మన చిన్న తాత్కాలిక వాలంటరీ ఉచిత పదవి లాంటిది గురువారం 2 గంటల పూజారి (5 ఏళ్ళు ఎంపీ ఎమ్మెల్యే అయినా, కంపెనీ సీయీవో, తెలుగు సంఘం/ పార్టీ ప్రెసిడెంట్ అయినా ఇదే కధ) ఉదాహరణ తోనే, జవాబు చెప్పుకుందాము. ఆత్మ జ్ఞానం లేని మనుషులు నిజాన్ని, తమ తప్పును ఎటూ అంగీకరించరు. అందుకే జీవితం చివరలో, ఎవరూ వారి మాట ఆలకించరు.

మనము ఏ పని చేసినా, దానిలో మనకు అవగాహన ఉందా, ఎంత వరకు మనము చేయాలో ఉండాలో, ఆత్మాభిమానం చంపుకోకుండా, అంత వరకే ఉండాలి. కేవలం మన సామర్ద్యం తోనే, ఇతరుల లేదా ప్రభుత్వ ఆస్తులు అమ్మి/ తాకట్టు పెట్టి, బానిసత్వం తో కాదు. మన మంచిని ఆదరించలేదా, వారి ఖర్మకు వారిని వదలి, నవ్వుతూ పక్కకు వచ్చేయడమే, వారితో తగవులు అనవసరం.

మన నీతి గుణం మారకూడదు. అధికారం ఐశ్వర్యం అహంకారం ఆధిపత్యం మంది బలం అన్ని ఉన్న తప్పుడు కౌరవులు కూడా, ఎవరినీ నమ్మలేక, ఆఖరికి విరుద్ద గుణమైన స్వచ్చమైన విదురునే, ధనమిచ్చి ఉద్యోగం ఇచ్చి, పక్కన సలహా దారులు గా పెట్టుకున్నారు, మంచి చెడు 2 వైపులా విచారించారు, విన్నారు.

విదురుని మాటలు అమలు చేయకపోయినా, ఎప్పుడూ వారు అగౌరవపర్చలేదు, ఎందుకంటే అతని గుణం నీతి నియమం వారికి తెలుసు. వారిలో ఉంటూ కూడా, విదురుడు తన పద్దతులు ఏవీ మార్చుకోలేదు, వారూ ఒత్తిడి చేయలేదు, అపనిందలు వేయలేదు, గేళి చేయలేదు. అది వారి సంస్కారం విదురుని విషయములో.

ఇవే ప్రశ్నలు అన్ని పదవులకు బాధ్యతలకు సంసారానికి, దేనికైనా. ఇలా వివరముగా, పది మందికి, మన నిజాయితీని చెప్పగలమా? చెప్పలేము అంటే, మనలో లోపం ఉంది.

*1. మనకు అసలు కనీస అర్హత, చిత్తశుద్ది ఉన్నదా?*

దేవుని దయవలన, స్పష్టమైన శ్లోక పద్య ఉచ్చారణ ఉంది. కాలేజీ లోనే, దేవీ నవరాత్రులకు, పల్లెటూళ్ళో, 9 మంది దంపతులకు, పూజ చేయించే భ్యాగ్యం దక్కింది. సూక్తాలు మంత్ర పుష్పం నోటికి వచ్చు లేదా చూసైనా, ఎన్నో సాయంత్రాలు అదే ఊళ్ళో, ఊరి చివర చిన్న గుడిలో, వల్లె వేసాము దేవుని ఎదురుగా.

బ్రహ్మం రాఘవేంద్ర వేమన మొదటి గురువులు. ఇంకా ఎంతో మంది గురువుల మాటలు ఉన్నాయి. బాబాయి హారతులు 4 కూడా నోటికి వచ్చు 20 ఏళ్ళు గా, లేదా కనీసం వింటూ, చూస్తూ అయినా పాడతాము. ఎంతో మంది కష్ట సుఖాలు విని, ఓదార్చాము 20 ఏళ్ళు గా. సజీవ గురువు సేవ, 8 ఏళ్ళు గా ఉంది. టీటీడీ నే దళితులకు పూజారి బాధ్యతలు ఇచ్చింది. ఇక బాబాయి దగ్గర అసలు పట్టింపే లేదు, కుల మత భాషా విషయంలో, ఎందుకంటే, అయన అసలు మన వారు కాదు.

*2. ధనం, కులం, వర్గం, మంది, బలం, కుట్ర, మోసం, అబద్దం, చెంచాగిరి, బానిసత్వం, చరిత్ర, తండ్రి/ మామ బలం పేరు కావాలా? పక్కవారిది బలవంతంగా లాక్కోవాలా? చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవాలా?*

కేవలం నిస్వార్ధ సేవకు, అంత అవసరం లేదు, మంచి గుణం, నీతి నిజాయితీ ఉంటే చాలు. మనకు మన రాత ప్రకారం, ఎంత ప్రాప్తం ఉంటే అంత వస్తే, అది నిలిస్తే చాలు. అసలు రాకపోయినా, ఇబ్బంది లేదు. ఇంకొకరి కన్నీళ్ళ ఎంగిలి పాపం మనకు వద్దు. రాత ఉంటే, కల్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు అంటారు కదా?

ఇంట్లో మన సాధన మనకు ఎటూ ఉంది. తల్లి సేవ కన్నా, ఇంకో ఉత్తమ సేవనే, సాధనే అవసరము లేదు. మాత్రుదేవో భవ అని శాస్త్రం చెప్పింది కదా. ఆదిశక్తి పెద్దమ్మే, మన ఇంట్లో ఉంది 8 ఏళ్ళు గా, మనకు అండగా, మనల్ని కాపాడుతూ.

*3. మనమే ఎందుకు తీసుకోవాలి?*

అక్కడ ఎవరూ నిలబడి సరిగ్గా జరిపే వారు, నోటితో పెద్ద గా పలుకుతూ, చప్పట్లు కొట్టిస్తూ, హారతులు అప్పుడు చుట్టూ తిరగకుండా అప్పడం, హారతి నేర్చుకోమని ప్రోత్సాహపరిచే ఉత్సాహపరిచే వారు, బొట్టు పెట్టుకుని గుడికి రమ్మని చెప్పే వారు, ఎవరూ లేరు.

కాబట్టి చక్కదిద్దే ప్రయత్నం, కొంతైనా చేద్దాము, కొంత కాలమైనా, అని చిన్న నిస్వార్ధ సాత్విక ఆశ.

ఎందుకంటే, రేపు దేవుడు, కలియుగం లో నీకు తెలియని/ తెలిసిన వ్యక్తుల దగ్గర, నీకు ఇచ్చిన జ్ఞానాన్ని పరుల మంచి కోసం వాడి, కనీసం ఓడిపోయావా, పెద్ద ప్రయత్నం తో అంటే? అవును ప్రయత్నం చేసి, ఓడిపోయాను అనాలి కదా.

*4. మరి అది తేలికైన పనేనా?*

అరగంట, అరగంట 2 సార్లు మొత్తం 2 గంటల్లో, గట్టిగా అరవాలి, పాడాలి, ఇతరులను ప్రోత్సాహం చెయ్యాలి. 2 గంటల సమయం అమ్మతో కూడి అక్కడి ఉండాలి. గొంతు నొప్పి, మనకు ఒంట్లో బాగోకపోయినా, మనము నియమం తప్పకుండా, 47 వారాలు చేసాము. దేవుడు ఇచ్చిన సంకల్పాన్ని, శిరస్సు వంచి పూర్తి చేసాము.

మనకు ఎన్ని సొంత పనులు ఉన్నా, అన్ని వెనక్కో ముందుకో నెట్టేసాము. కరోనా సమయం లో కూడా, ఇంట్లో ఉండకుండా, అక్కడకు వెళ్ళి ఉండాలి.

ఇక రకరకాల మనుషుల స్వభావాలకు తగ్గట్లు గా మాట్లాడాలి, సంస్కారం నేర్పాలి, వారితో ఎన్నో మాటలు తిట్లు కూడా పడాలి. ఇవన్నీ మనకు అవసరమా? మరి మానవ సేవ ఎలా?

*5. దీని వలన ధన, లేదా ఇతర లాభం ఉందా?*

మనకు ధనం ఏమీ రాదు, వద్దు కూడా, ఎవరన్నా ఇవ్వబోయినా మనము తీసుకోము. అందులో వెయ్యండి లేదా అసలు వారికి ఇవ్వండి అంటాము. ఎందుకంటే, మనము అక్కడ ఉంది, ఆ పరిస్తితిని సరి చేసే ప్రయత్నం మాత్రమే.

కేవలం భగవంతుని/ గురువు/ బాబాయి సేవ భాగ్యం కొంత కాలం దక్కింది అన్న త్రుప్తి. మనము ఆ 2 గంటలు ఇతర తప్పుడు పనులు చేయకుండా ఉండగలం, ఇది లాభం. గొంతు వాక్సుద్ది వ్రుద్ది, లాభం.

ముక్కు మొఖం తెలియని వారు, నవ్వుతూ ఏవేవో చెప్పాలని ప్రయత్నం చేస్తారు, సున్నితము గా తిరస్కరించి, మన పనిలో మన ఉండడమే, మోహ వ్యామోహ పొగడ్తలకు దూరం గా ఉండాలి. ఆ 2 గంటల తర్వాత అక్కడ, ఒక్క క్షణం కూడా ఉండము.

కాళ్ళ కు నమస్కారం చేయబోయినా, ధన్యవాదాలు తెలుపబోయినా కూడా, నిర్మొహమాటము గా, తప్పు మీ తల్లి దండ్రులకు మరియు దేవుడికి చెప్పండి చేయండి అని వారించాము.

*6. జనం మారరు అని తెలిసి, ప్రయత్నం చేస్తాను, అనడం మూర్ఖం కాదా? వాళ్ళు తిట్టరా, ఈసడించుకోరా, అవమానించరా, గేళి చేయరా, పలకకుండా స్పందన లేకుండా, గమ్ముగా నిర్లక్ష్యం గా ఉండరా?*

ధర్మాన్ని కాపాడు, అది మనల్ని కాపాడుతుంది అంటూ ఓ వైపు నటిస్తూ ఆచరించకుండా నే, మనుషులము మనమే కనీస ప్రయత్నం చేయకపోతే, జంతువులు చేస్తాయా? అప్పుడు మనం, భక్తులమా లేక నటశిరోమణులమా? మన అర్హత, మన సాధన కూడా చెప్పలి కదా?

ఒకరిని మార్చడం తర్వాత, ముందు మనం మారకుండా ఉండాలి అంటే, ఏదో ఒక సాధన చేస్తూ ఉండాలి, దాచుకోకుండా నలుగురికి నేర్పాలి కదా?

మన చుట్టూ ఎలాంటి మనుషులు ఉన్నారు, ఒక మంచిని మంచి అనలేరు, చెడును చెడు అనలేరు, నోరు పెగలదు, చేతి వేళ్ళు కదలవు. పిల్లలను దోవలో పెట్టలేరు. వారి గురించి ఒక్క మంచి మాట, ఒక్క సాధన కూడా చెప్పరు.

సంపాదన సుఖాలు స్వార్ధం మాత్రమే వారికి కావాలి. 3 ఏళ్ళ నుంచి ప్రతి నమస్కారం, ప్రతి శుభాకాంక్షలు చెప్పడం రాని, సంస్కార జీవులు కూడా ఉన్నారు. హోదా అధికారం ఐశ్వర్యం శాశ్వతం కాదని వారే చెపుతారు పైకి మరలా.

కన్న ముదుసలి తల్లి దండ్రులనే, దూరంగా విదిలించి, తమ స్వార్ధ సుఖం చూసుకునే, అధములు ఉన్నారు.

ఆ జీవచ్చవాలను, ఎవరు కదిలిస్తారు? జంతువులా, పక్షులా, క్రిములా, రోగమా, మ్రుత్యువా, మనమా?

వారి పిల్లలకు సంస్కారం ఎలా నేర్పుతారు, ప్రాపంచిక మత్తులో జోగుతూ? తోటి వారి గురించి, జాలి పడాల్సింది మనమే కదా? అవకాశ అవసర కోటీశ్వరులకు, స్వార్ధం లేకుండా సమయం మనసు మమత ఉండదు, కాబట్టి భక్తులే ఆ ప్రయత్నం చేయాలి, కదా?

అందుకే పురాణాలు, గీత చదవమనేది. మూర్ఖపు కౌరవుల మంద దగ్గరకు రాయబారానికి వెళితే, వారు వినరు మారరు తిడతారు కొట్టబోతారు అని, క్రిష్ణునికి తెలీదా? ఎందుకు వెళ్ళారు? ఆయనకన్నా మనము జ్ఞానులమా?

ముందు మెత్త గా, తర్వాత కటువుగా కఠినంగా ఎందుకు చెప్పారు? ఆ మంద బుద్దులకు ఆనాలి అనే కదా? వారు ఆయననే దూషించలేదా? పట్టి బంధించబోలేదా? అదే గీతా సారాంశం, ప్రయత్నం చెయ్యి, ఫలితం నాకు వదిలెయ్యి.

మార్చడానికి ప్రయత్నం చేస్తూ, మనం మోహం లో పడి, మనమే మారి పోకుడదు వారి లాగా, సహవాస దోషం తో జాగ్రత్తలు సుమా. అందుకే, శ్రీ క్రిష్ణుడు ఏనాడూ, కౌరవుల తో కలసి తిరగలేదు, వారి ఇంట, భోజనం నిద్ర కూడా ఉండదు.

ఆఖరికి రావణ యుద్దము లో కూడా, శ్రీ రాముడు నీతి చెప్పి, రావణుని మంచి ఆలోచన చేసి రేపు రమ్మని పంపాడు. శ్రీ రాముడికి తెలీదా, రావణుడు మారడని?

మరి మన మాటలు కటువుగా ఉంటే, వారి పనులు చేష్టలు కటువు గా లేవా? అమ్మ అయ్య చెపితే వినరు, భాగస్వామి చెపితే వినరు, పక్క వాడు చెపితే వినరు, పూజారి చెపితే వినరు. అందుకే కరోనా, రోగం, యముడు చెపితేనే వింటారు కదూ? వీరు పోతే, వారి పిల్లల పరిస్తితి? చుట్టూ విషం గక్కుతూ తగలబడుతుంటే, మనం మాత్రం ప్రశాంతము గా ఉండగలమా?

చేసే మంచి పని నిస్వార్ధం గా చిత్తశుద్ది తో చెయ్యి. ఇతరుల తిట్లు కోపాలు పొగడ్తలు ఫలితాలు అన్ని ఆ దేవునికే, మనం నిమిత్త మాత్రులం. రాముని, క్రిష్ణుని నిజముగా నమ్మితే, మంచి చెప్పడం చెయ్యడం ఆచరించడం ప్రాణం పోయినా మానము. అదే కదా త్రికరణ శుద్ది అంటే?

*7. ఈ పదవి శాశ్వతమా? ఆశ ఉందా?*

అసలు దేవాలయమే మనది కాదు. అందులో ఎవరూ మనకు తెలీదు. ఈ 2 గంటల పదవి లేదా దేని పై ఆశలేదు. అసలు మనమే శాశ్వతం కాదు, పోతా తీసుకు పోయేది లేదు. ఈ రోజు అయినా, ఇంకోకరు, మేము నడుపుకుంటాము అని వస్తే, దండం పెట్టి, పక్కకు వస్తాము.

లేదా గుడి వారు అయినా, మీరు నీతులు చెప్పవద్దు అన్నా, ఇతరులు మంచిని ఆపడానికి మన నోరు మూయించే ప్రయత్నం చేసినా, పక్కకు నవ్వుతూ తొలుగుతాము.

భక్తులు కూడా, మాకు మా అమ్మ అయ్యనే బొట్టు పెట్టుకోమని, హారతి పాడమని, చప్పట్లు భక్తి తో కొట్టమని, చెప్పే ధైర్యం చేయలేదు, ఆ సంస్కారం వారికే లేదు, మాకెందుకు అది. అయినా ఆ విషయం మీకెందుకు పోవయ్యా అన్నా కూడా, పక్కకు తొలుగుతాము.

10 మంది లో, 7 గురు కోపము గా చూస్తారు. ఎప్పుడో నోరు ఎత్తుతారు, మన మీద అపవాదుకు ప్రయత్నం చేస్తారు. దానితో మనకు అక్కడ బాధ్యత తీరిపోతుంది, దేవుని నుంచి మార్కులు వస్తాయి మన మంచి నిస్వార్ధ విఫల ప్రయత్నం కు.

అంతే గానీ, అక్కడ ఉంటే లేదా ఎవరితోనైనా మాట్లాడుతూ ఉంటే, వారి పతనాన్ని ఆపే ప్రయత్నం మాత్రం మానము. ఎందుకంటే, నా లాంటి వారి, మాటలు కూడా దాటిపోయిన తర్వాత, వారికి నేరు గా చేతలలో కఠిన దైవ లేదా ఇంట్లో భాగస్వామి/ పిల్లల/ కోడలు/ అల్లుడు శిక్షణ మొదలు అవుతుంది.

ఆ దౌర్భాగ్య పరిస్థితి కి వారిని పోకుండా చెయ్యడమే, ఆపడమే మన పని. అది చెప్పలేనప్పుడు, అక్కడ లేదా వారితో మనకు స్థానం లేదు, వద్దు.

*8. బంధుప్రీతి ఆశ్రిత పక్షపాతం ఉందా? పేరు బొమ్మ ల తో, పధకాల ప్రచారం ఉందా?*

తప్పు చేస్తే ఎవరైనా ఒక్కటే. మార్చుకోమని మనం బలవంతం పెట్టము, కానీ నిజాన్ని ఒప్పుకుని, శిక్ష తగ్గించుకోమని మాత్రమే ప్రాధేయపడతాము. సామర్ధ్యం నిజాయితీ అర్హతలేని వారికి పని అప్పగించము.

నువ్వు నేను ఆత్మ సత్యం దైవం అన్ని ఒకటే, ఎవరికైనా. అలా నమ్మిన వారు, మనల్ని వీడరు. నమ్మని వారు, ఎప్పుడూ దూరంగానే ఉంటారు. ఇంక పక్షపాతం ఎక్కడిది? ముదుసలి కన్న తల్లి నే వద్దన్న వారిని, మరలా గడప కూడా ఎక్కనీయలేదు.

పండ్లు పలహారాలు పంచమని చెప్పారు, దేవాలయ పెద్దలు. కేవలం పంచడం వరకే. అంతే గాని, మన పేరుతో, నా ఉచిత పండ్ల పంపిణీ పధకం అని పెట్టుకుంటే, మన వంశాన్నే అవమానించినట్లు. ఎవరో దాతలు ఇచ్చిన ప్రసాదానికి ధనానికి పంపిణీ కి, మన పేర్లు? అంతకన్నా నీచం, పాపం ఉందా?

3 ఏళ్ళు పైగా, ఎందరికో ఎన్నో పంపుతూ, ఎక్కడ కూడా మన ఫొటో కానీ పూర్తి పేరు కానీ రాయలేదు పెట్టలేదు. ఎందుకంటే, మన మాటలు చేతలు భావాలు హ్రుదయాలను కదల్చాలి గానీ, మన పేరు బొమ్మ తో పని ఏముంది?

ఇలా ప్రతి విషయములో ఆత్మ విమర్శ చేసుకుంటే, మోహానికి లోను కాము, మన గుణము మారదు, దురాశ రాదు. ఇతరుల గుణాలు అర్ధం అవుతాయి. దేవుని అండ ఎప్పుడూ ఉంటుంది.

పంచభూతాల ముందు మనము పనికి రాము, చీమంత బలం విలువ లేదు, అని కరోనా గురువు నిరూపించారు కదా. ఇప్పుడే మనది, రేపు మనది కాదు, రేపు ఉదయం లెగుస్తామా? మన చేతిలో లేదు. కాబట్టి ఇప్పుడే, అరిషడ్వర్గ సాధన మొదలు పెట్టాలి. గురువు/ శిష్యుడు నీ వెంటనే ఉన్నాడు.

How to stay away from maya of power position publicity money samsar? illusion, how to be careful? How to know others are far away?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,877,662; 104 తత్వాలు (Tatvaalu) and views 225,926
Dt : 03-Jun-2022, Upd Dt : 03-Jun-2022, Category : General
Views : 727 ( + More Social Media views ), Id : 1413 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : away , maya , power , position , publicity , money , samsar , illusion , careful , others
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content