మరి దేవుడిని ఎలా చేరతాము, ఇంట్లోనే పిల్లల చేతిలో ఓడిపోయి అనాధలమైతే? ఆలోచన చెయ్యండి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,876,389; 104 తత్వాలు (Tatvaalu) and views 225,831.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

How can we reach God, if we are defeated by children at home and become orphans? Think about it!

వెనకటి రోజుల్లో కేవలం విని మాత్రమే వేదాలు, పద్యాలు, శ్లోకాలు పాడారు. తినిగ తినగ వేము తియ్యగ నుండు లాగా, వినగ వినగ పద్యం నోట వచ్చు, అలాగే అనగ అనగ రాగం మంచిగా వచ్చు.

ఇప్పుడు కాగితాలపై, మొబైల్ పై, కంప్యూటర్ పై పద్యాలు, శ్లోకాలు కోకొల్లలు. మరి మన మనసు మన మాట వినదా? సాధనా రాదా, నియంత్రణ లేదా? మీ ఎదురుగా ఇప్పుడు సజీవ ఉదాహరణ లేదా?

అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
దినగ దినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమ.

పాడగా, పాడగా రాగం చక్కగా కుదురుతుంది. వేపాకు రోజు తింటూ ఉంటే ఏదో ఒక రోజు ఆ చేదు తెలియదు. ఈ లోకంలో అన్ని పనులు సాధన చేయడం ద్వారా సాధ్యపడతాయి.

నేడు శ్లోకాలు నోటితో అనడం రాకపోయినా, కన్నీటి తో దేవుని మన్నించమని, సరస్వతీ కటాక్షం కలిగించమని, మా వంశములో కూడా, దేవుని పై నమ్మకముతో ధ్యానంతో క్రుతజ్ఞతతో విశ్వసనీయతతో, నోరు తిరిగే ఆత్మలను ప్రసాదించమని, మోక్షానికి అర్హత కలిగించమని అర్ధిస్తూ, వేడుకోలేమా?

కనీసం, మనము ఇతరులు పాడిందైనా, పూర్తిగా నాలుగు ఐదు సార్లు వినాలి, నలుగురికి పంచాలి, అవి మనసులో రికార్డ్ అవుతాయి సుమా. పుణ్య శాతం పెరుగుతుంది. తర్వాత, పలుకులు అవే వస్తాయి. మనము రోజు అంటూ ఉంటే, పిల్లలకు అలవాటు అవుతుంది. మనం ఇవన్నీ నేర్చుకుంది, అమ్మ దగ్గరే, మొదటి గురువులు అమ్మ నాన్న. యోగాసనం నేర్చుకుంది, నాన్న దగ్గర.

అరిషడ్వర్గాలను అష్టవ్యసనాలను జయించాలి అంటే, దేవుని చూపు మనవైపు ప్రసరించాలి అంటే, మానసిక శాంతి బలం రావాలి అంటే, శని రాహు కేతు ల క్రుప రావాలి అంటే, వాక్సుద్ది రావాలి అంటే, ఈ చిన్న సాధన అయినా చెయ్యలేమా?

మరి ఎన్ని జన్మలకు చెయ్యగలమో ఆలోచన చెయ్యండి. మనము పాడిన వాటిలో కొన్ని తప్పులు ఉండవచ్చు. కనీసం ప్రయత్నం తో, వచ్చే జన్మలో ఇంకా బాగా స్పష్టముగా తప్పులు లేకుండా పాడించే పలికించే గురువు దొరుకుతారేమో. మరి మనము అసలు ప్రయత్నము చెయ్యకుండా, మంచి గురు అర్హత ఎలా సంపాదిస్తాము?

మన సిరి సంపదలు పదవీ అధికారం ప్రాపంచిక భ్రమలు, మన పిల్లల బుద్దులు ఎదగనీయకుండా చేస్తాయి, సొమరిపోతులుగా చేస్తున్నాయి కూడా. అన్నా లేదా బ్రదర్ అని కూడా అనలేక బ్రో అంటున్నారు, కుక్క భౌ భౌ లాగా, నక్కను చూసి కుక్క వాత పెట్టుకోవడం అంటే ఇదే. ప్రాపంచిక భ్రమలు, మనకు చివరలో ఉరితాళ్ళు అవుతున్నాయి. అవే మన రోగాలకు కరిగి పోతున్నాయి. మరి చివరికి సాధించిందేమిటి?

కనీసం సంస్కారం నేర్పని కారణముగా, మన ముదుసలి తల్లి దండ్రులను దూరంగా విసిరేసినందుకు, మన పిల్లలే మనల్ని ముదుసలి వయసులో ఇంట్లో పెట్టుకుని, సజీవ గురుసేవ చేయాలి అంటే, మనస్సు అంగీకరించక, క్రుతజ్ఞత విశ్వసనీయత విడిచి, ఊళ్ళో తక్కువ సౌకర్యాలతో ఒంటరిగా లేదా అనాధాశ్రమంలో దిక్కులేని వారుగా వదులుతున్నారు.

మనము పశ్చాత్తాపం లేకుండా, మన తప్పులు పాపాలు ఒప్పుకోకుండా, ఇంకా తప్పుడు నీచ మరు జన్మకు రాతలు రాసుకుంటున్నాము, అరిషడ్వర్గాల బానిసత్వముతో.

మరి దేవుడిని ఎలా చేరతాము, ఇంట్లోనే ఓడిపోయి, వదిలేసి, అనాధలమైతే? ఆలోచన చెయ్యండి, ఎందుకోసం భూమిపైకి వచ్చాము? చివరకు ఏమి తీసుకుని వెళుతున్నాము, భగవంతుని ఎదురు తలవంచుకోకుండా ఉండటానికి? ఒక పద్యమా, మంత్రమా, రాగమా, వ్యాసమా, సజీవ గురు సేవనా, కఠిన సాధనా, త్యాగమా, అరిషడ్వర్గాల అష్టవ్యసనాల జయమా?

పంచభూతాలను, కాల చక్రాన్ని మనము ఏమార్చలేము. అవి ప్రతి క్షణం, మనల్ని కనిపెట్టుకుని, మన ప్రతి పనిని ఉద్దేశ్యాన్ని, తర్వాత ఫలితాల కోసం, నమోదు చేస్తున్నాయి. ఎవరమూ తప్పించుకోలేము.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,876,389; 104 తత్వాలు (Tatvaalu) and views 225,831
Dt : 20-Dec-2022, Upd Dt : 20-Dec-2022, Category : Songs
Views : 405 ( + More Social Media views ), Id : 1663 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : reach , god , defeated , children , home , orphans , think
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content