కొత్త కలెక్టర్ వచ్చి, 2 ఏళ్లుగా ఇలాగే గమ్ముగా ఉన్నారు అంటే, మీకు విలువ ఉంటుందా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,863,748; 104 తత్వాలు (Tatvaalu) and views 224,709.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ఇది కేవలం మన జిల్లా అధికారులు కు మాత్రమే, మనలో మాట.

జిల్లా అధికారులు, మీరు ప్రజలను గౌరవించి, కనీసం 2 ఏళ్ళ తర్వాత అయినా, దయచేసి ఏమి చర్యలు మొదలు పెట్టారో, సోషల్ మీడియా గురించి, మీ శాఖలలో చెప్పగలరు.

2 ఏళ్లుగా మిమ్మల్ని వేడుకుంటున్నాము. మీకేదన్నా సమస్య ఉంటే, మాకు అర్థం అయేలా చెప్పగలరు, మీరు ఎదుర్కుంటున్న సమస్యల పై, అవగాహన పెంచగలరు. ఎందుకు నవ్వుల పాలు అవడం, రాష్ట్రం అంతా?

మన రెవెన్యూ శాఖ అధికారులు కూ, దయచేసి చెప్పగలరు. ఓ విలేఖరి కి దూరంగా, శాఖ మొత్తం పారిపోవడం అన్యాయం, అది వారికే అవమానం. వారు వాట్సప్ ఆపుకున్నంత మాత్రాన, వారి నిర్లక్ష్యం ప్రజలంటే లెక్కలేనితనం, అలాగే వారిపై విమర్శలు రాష్ట్రం మొత్తం, వారి గురించి పోకుండా ఉంటాయా?

ఇలాంటి వారా, ఈ జిల్లా రెవెన్యూ అధికారులు అని, వారి పరువు పోతుందా, లేక ఇంక ఎవరదన్నా నా పోతుందా? వారు అవినీతి అధికారులు, అని వారే ఒప్పకున్నట్లు గదా? నిజాయితీ ఉన్న అధికారులు పారిపోరు కదా, కనీసం గమ్ము గా పరిస్తితులు మార్పులు తెలుసుకుంటూ ఉంటారు.

సాధారణంగా మీకు పంపే కధనాలు అన్ని, అన్ని జిల్లాల అధికారులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కు అంటే, కనీసం జిల్లా కు ఒకరికి చొప్పున వెళుతుంది, ప్రజలతో పాటుగా. ఇది నిజం.

అంటే మన జిల్లా పరువు నట్టేట కలుస్తుంది. వారు ఏమీ చేయలేక పోవచ్చు ఇప్పుడు, కానీ తెలీదు ఏ రూపంలో ఎప్పుడు ఇబ్బంది ఉంటుందో. కానీ మనం బదిలీ అయినప్పుడు ఆ జిల్లా లకు, చులకన భావం ఉంటుంది.

ఈ లింక్ లు అన్ని, గూగుల్ సెర్చ్ లో పర్మినెంట్ గా ఉంటాయి. రేపు మంత్రులు లేదా పై అధికారులు, మిమ్మల్ని బదిలీ చేయడానికి, ఇవే కారణాలు చూపవచ్చు. అవసరమా ఈ తలనొప్పి అంతా?

మాకు మీ మీద కోపం లేదు. మీ గొప్ప పనులు బయటకు చాటాలని, మా ప్రయత్నం.

చూడండి, అనంత జిల్లా ను మేము పొగుడుతూ ఉన్నాం, కలెక్టర్ కి అండగా ఉన్నాం. వైసీపీ అధిష్ఠానం కు, అక్కడ సమస్య కు మా వివరణలు జవాబులు పంపితే, ఆరోపణలు చేసిన, ఆ ఎమ్మెల్యే సైలెంట్ అయ్యారు, ఏమీ అనలేక. ప్రకాశం జిల్లా నుంచి, ఈ విధంగా అధిష్ఠానం స్ధాయిలో, సపోర్ట్ వస్తుంది అని ఊహించలేదు ఆయన.

అలా మన జిల్లా ను అధికారులు ను పొగడాలి, అధిష్టానం దగ్గర, మంచిగా రాసిన బాగుంటుంది కదా.

మీరు చర్యల కు ఉపక్రమించారు అంటే, దాని మీద కొత్త కధనాలు లేకుండా ఆపేద్దాం, మన జిల్లా అధికారులు గురించి. మా బాంధంతా, ముందు ప్రజలకు, సోషల్ అభివ్రుద్ది సూచనలు, మీ నుంచి రోజూ ఉండాలి అని.

మీలో నిజాయితీ గల అధికారులు, నిర్లక్ష్యం బాధ్యత రాహిత్యం ఒప్పకోని వారూ, ఉండవచ్చు. కానీ మీరు నోరు ఎత్తి సమస్య ఇది అని చెప్పనిదే, మాకు సమస్య అర్థం కాదు కదా? ఈ కధనాలు, పాతవి ఉటంకిస్తూ, వస్తూనే ఉంటాయి, వచ్చే 3 ఏళ్ళు ఇలాగే. అంటే ఇంటర్నెట్ లో 100 లింకు లు వస్తాయి ప్రతి శాఖకు.

ఇంతలో కొత్త కలెక్టర్ వచ్చి, రెండు ఏళ్లుగా, మీరంతా ఇలాగే గమ్ముగా ఉన్నారు అంటే, ఆయన దగ్గర మీకు విలువ ఉంటుందా? ఇప్పుడు అనంత కలెక్టర్ ఇక్కడ కు బదిలీ అయినా, మన సంగతులు పనితనం, అన్ని తెలుసు కదా?

ఇంక వేరే ఏదైనా సమస్యలు వలన, సోషల్ మీడియా అప్డేట్ చేయకుండా, మిమ్మల్ని ముందుకు పోనీయక ఆపుతూ ఉంటే, దయచేసి చెప్పగలరు.

ఎమ్మెల్యే, మంత్రి, లేదు సమాచార శాఖ లతో, సమస్యలు ఉంటే చెప్పండి. అప్పుడు మీ జోలికి రాకుండా, వాళ్ళ గురించి మాత్రమే, పై అధికారులు మంత్రులు దగ్గరకు పోదాం. అనవసరంగా మీరంతా ఎందుకు, చెడ్డ వారు కావాలి? ఆ ఒకరు ఇద్దరు చెడ్డ అధికారుల వలన, అని మా ఆవేదన.

మీరు వ్యక్తిగతం గా మాట్లాడిన మాటలు, ఏనాడూ బయటకు రావు. ఎంత బాధ్యత గల వారమో, 75 ఏళ్ల అమ్మ గురించి విన్నారు కదా, శనివారం ఫోటోలు చూసారు కదా?

మనం కొంత అయినా మంచి చేద్దాం. సోషల్ మీడియా లో, మీ అభివ్రుద్ది పనులు, మీ ఫోటోలు నే కదా, పెట్టుకునేది. మీ ఇబ్బంది కష్టం నష్టం సమస్య ఏమిటో, ఇంతవరకు మాకు అర్థం కాలేదు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,863,748; 104 తత్వాలు (Tatvaalu) and views 224,709
Dt : 06-Apr-2021, Upd Dt : 06-Apr-2021, Category : General
Views : 727 ( + More Social Media views ), Id : 1078 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : prakasam , collector , District , officials , update , social media , value
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content