పెన్షన్ లేదా కార్డులు లేదా ఇంకో సమస్య కోసం, పంచాయతీ లేదా ఎమ్మార్వో దగ్గరకు వెళితే, నెలలు పడితే - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1488 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1523 General Articles, 51 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ధన్యవాదములు మరియు నమస్కారములు, మన గ్రామ పంచాయతీ అధికారి ఈవో గారికి. పేరు, తప్పు సరి చేయబడినది. మంచి మనసు సహ్రుదయంతో తో వెంటనే, స్పందించి సహాయం చేసిన, జిల్లా పంచాయతీ అధికారి గారికి కూడా ధన్యవాదాలు.

mpanchayat వెబ్సైట్ సమాచారం ప్రకారం కంగారు పడి, మార్చి నెలలో మిమ్మల్ని మార్పు అడగడం జరిగింది.

అప్పుడే, ఇది పాత వెబ్సైట్ వాడుక లో లేదు, కొత్త గా PRIS వచ్చింది, కానీ ప్రజలకు అందుబాటులో లేదు అని చెప్పినట్లు అయితే బాగుండేది. ఇంక పంచాయితీ ఇంటి పన్నులు, ఆన్లైన్లో కట్టేది ఎప్పుడో?

పాత వెబ్సైట్ ప్రజల లాగిన్ పని చేయకుండా చేసిన లేదా ఇది ఓల్డ్ వెర్షన్ కొత్త అప్డేట్ PRIS వెబ్సైట్ లో ఉన్నాయి అని మెసేజ్ అక్కడ నే ఉంచిన, రాష్ట్ర ప్రజలు కంగారు పడరు.

ఇంత చిన్న పనికి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు, మన్నించాలి. మాకు ఏ అధికారిని కూడా, ఇబ్బంది పెట్టాలని లేదు. మీ ముందు చిన్న వాళ్ళం, మా మీద కోపం దయచేసి మనసులో పెట్టుకోవద్దు.

ఎందుకంటే నేను కూడా, దూరప్రాంతం లో జిల్లా మరియు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయంలో పని చేసాను. ఉద్యోగ సాధక బాధలు, పని మరియు ఇతర ఒత్తిడి లు, లోపల ఉండే రాజకీయాలు తెలుసు.

మాకు, జీతం తీసుకునే ప్రతిసారి కూడా, ఇది ప్రజల పన్నుల డబ్బు, వారి వలన నాకు ఇన్ని సౌకర్యాలు వచ్చింది, అన్న మాట క్షణం క్షణం గుర్తు కు వచ్చి, చాలా మర్యాద గా నడచుకుంటాము.

ఇప్పుడు ముదుసలి కన్నతల్లి కోసం రాజీనామా చేసినా కూడా, ఇప్పుడు కీ ప్రజలు ప్రభుత్వం అన్నా గౌరవం. అందుకే మన దగ్గర కూడా, ప్రజలకు పనికి వచ్చే కార్యక్రమాల మీద, కధనాలు రాస్తుంది. కొంత అయినా మంచి చేయగలమేమో నని భావించి.

సమస్య చిన్న పేరు మార్పు గురించి కాదు. పేదలు మరియు ఎవరి అండ లేని వారు, పెన్షన్ లేదా కార్డులు కోసం లేదా ఇంకో సమస్య కోసం, పంచాయతీ లేదా ఎమ్మార్వో దగ్గరకు వెళితే, ఇంత చిన్న పనికే నెలలు పడితే, ఆ పేదలు సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి, ఎవరి చుట్టూ తిరగాలి, వారి గోడు వినేది ఎవరు? ఎప్పుడు వారి పనులు పూర్తి అవుతాయి.

మంచి మనసు తో ఆలోచన చేయండి. అర్థం చేసుకోండి.

ఇలాంటి చిన్న పనులు కు కూడా ఎంపీడీవో గారు, జిల్లా అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఇతర పెద్ద పనులు మానుకుని రాకూడదు కదా.

ఉద్యోగం లో ఉన్నంత వరకు ప్రజలే మన దేవుళ్ళు. ఈ విషయములో, ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే, మన్నించాలి. అని పెద్దలకు పంపాను అని రాము, గోపీ తో చెప్పాడు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1523 General Articles, 51 Tatvaalu
Dt : 10-Jul-2020, Upd Dt : 10-Jul-2020, Category : General
Views : 545 ( + More Social Media views ), Id : 593 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : public , panchayat , eo , mro , pension , ration cards , how long it take , mpanchayat , PRIS
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content