మనము నేర్చుకోనంత మాత్రాన, బడి, గుడి, సంస్కార తల్లి దండ్రుల, విలువ పోదు - చేదు దోస, కాకర పూజ - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2023 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2058 General Articles and views 1,786,397; 104 తత్వాలు (Tatvaalu) and views 217,095.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

if we don't learn, the value of school, temple, sanskara parents will not be lost - Chedu/ Bitter Dosakaya, Kakara/ Bitter gourd Puja

తల్లి దండ్రుల యందు సంస్కార తల్లి దండ్రులు వేరు అని మన అందరికీ తెలుసు. పాండు రాజు, కుంతి వంటి వారు. 5 గురు పిల్లలే అయినా, ఆణిముత్యాలు, దేవుడు క్రిష్ణునికి ఇష్టులు. గంగి గోవు పాలు గరిటెడు అయినా చాలు అంటే ఇదే. తల్లి దండ్రులు పిల్లలు ఎవరూ కూడా, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసలు కారు, విలువలు మానవత్వం సజీవ గురువు సేవ ఉన్న మనుషులు.

మన చుట్టూ ఉండే వారిలో ఎక్కువ మంది 80 శాతం ద్రుతరాష్ట్ర (ఇంకా దుర్యోధన, రావణ, ..) గాంధారులు వంటి వారే, తమ 100 పిల్లల సంస్కారమును తాము పట్టించుకోరు, ప్రాపంచిక మోహములు అంటే అరిషడ్వర్గ అష్టవ్యసనము లో తాము మునుగుతూ, తమ పిల్లలను అదే బాటలో తరింపచేస్తారు. ఉదాహరణకు అప్పు చేసి పప్పుకూడా తప్పు కాదు, విలువలు అంటూ పట్టించుకోకు అని 2 నాల్కల కపట నటన చెపుతూ, తామ చివరకు ఒంటరిగానో లేదా అనాధాశ్రమాలలోనో, ధనముతో ఆస్తులతో తమ చివరి జీవితాన్ని నిస్సహాయముగా గడుపుతారు.

మన మనసు సాధనతో మారకుండా అంటే. అరిషడ్వర్గ అష్ట వ్యసన బానిసత్వం వీడకుండా, త్యాగం ఓర్పు సహనం లేకుండా, ఎన్ని క్షేత్రాలు తిరిగి నా, యాత్రలు పూజా పునస్కారాలు యాగాలు చేసినా, ఉపయోగం శూన్యం.

అంటే చిత్తశుద్ధి, త్రికరణ శుద్ధి, ఆచరణ శుద్ది లేని శివపూజ లేలరా అంటే ఇదే. అందుకే చేదు దోసకాయ లేదా కాకరకాయ ను ఎన్ని క్షేత్రాలు తిప్పిన, పుణ్య జలాల లో ముంచినా, పూజించినా, చేదు పోదు.

మన చెడు గుణం, సాధన లేకుండా పోదు. బడిలో గుడిలో చదువు సంస్కారం చెప్పిన నేర్పినా కూడా, ఇంట్లో సాధన చేయాలి మనసు తో. మనము నేర్చుకోనంత మాత్రాన, బడి, గుడి, సంస్కార తల్లి దండ్రుల విలువ పోదు. కాని వారి పాత్ర ఎంతవరకు, దోవ చూపడం వరకే, కదా? సాధన మన వ్యక్తిగతం. అంటే నేడు 80 మంది చేస్తున్న, కపట నటన పూజలు యాత్ర లు ఫలించవు.

అంటే ఇంకా తేలికగా చేదు దోస, కాకర పూజ గురించి చెప్పాలంటే,

పూజ యాగం యాత్ర చేసే ఓటరు, 2 నాల్కల ధోరణితో కపట నాటకాలతో, మంచిని విడిచి, ఆవును ఓడిస్తూ, నక్క పులి పాము కు ఓటు వేస్తూ, ముదుసలి తల్లి తండ్రుల అత్త మామల సేవ విడిచి, పిల్లల సంస్కార పెంపకం వదిలి, కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యము లకు బానిసత్వం కొనసాగుతున్న, త్రికరణ శుద్ధి లేనట్లే కదా. పూజా ఫలం శూన్యం.

ఎన్ని సార్లు తిరుపతి వెళ్లి వచ్చినా, అత్త కోడలు, భార్య భర్త, పెద్దలు పిల్లల, ద్రోహాలు తిట్లు మోసాలు ఆగడాలు ఆగుతాయా? అప్పుడు తప్పు ఎవరిది, దేవునిదా, లేక మానసిక బలహీన మనిషిదా?

తను లక్షణాలు ను మార్చుకోలేని, మానసిక బలహీనులు, 80 శాతం, కాబట్టి కలియుగ పాపం, 80 శాతం పైన, ప్రళయాలు ఉత్పాతాలు అంతే.

చెడు గుణం మార్చుకోవాలి, పశ్చాత్తాపం పడాలి అని చెప్పూ, ఆ సాత్విక లక్షణాలు ఉంటే, పూజ అవసరం లేదు. పూజ అంటే మంత్రాలు, గుడి, ఆ అరగంట లేదా గంట సమయం నటన కపటం, కాదు. ధన సంబంధములేని, మన గుణ కర్మ, లక్షణాలు, సౌకర్యాలు భోగాలు త్యజించడం, నిస్వార్ధ సేవ ‌రోజూ పనులలో కనపడాలి. అదే తపస్సు అంటే పూజ కన్నా గొప్ప.

అంటే ఉదాహరణకు ముదుసలి కన్నతల్లి తండ్రి సేవ (ఫించను లేదా ధనం లేదా ఆస్తి ఇస్తేనే చూస్తాను చేస్తాను అనేవి సేవ కిందకు రావు), కర్ర బదులుగా మన చేయి తో పట్టుకొని నడిపించడం బూట్లు సాక్స్ వేసి, వారిని అన్ని చోట్లకు తిప్పడం మనతో, సొంత ఇంటి ఆయుర్వేదం ఇవ్వడం, జన గుణ మార్పు కు కధనాలు రాయడం అంటే రాత నైవేద్యం మరియు పాటలు పద్యాలు శ్లోకాలు గా గాత్ర నైవేద్యం, పదిమంది కష్టాలు విని ఓదార్చడం, పాము నక్క పులి కి ఓటు లేకుండా, తన ఆలోచనలు పనులు కూడా ఏ చెడు పనిలో గోరు వెంట్రుక అంత పాత్ర కూడా లేకపోవడం అలాగే సమర్ధన చెయ్యకపోవడం, తన మరియు కూతురు కొడుకు పెళ్లి గుణం చూసి చేసుకోవడం, ఇది నిజమైన పూజలు, చేతలలో.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2058 General Articles and views 1,786,397; 104 తత్వాలు (Tatvaalu) and views 217,095
Dt : 31-Jul-2023, Upd Dt : 31-Jul-2023, Category : General
Views : 232 ( + More Social Media views ), Id : 1862 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : learn , value , school , temple , sanskara , parents , lost , Chedu , bitter Dosa , Kakara , Puja
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content