సినిమా పరిశ్రమ దోపిడీ అడ్డుకునే మొనగాడు జగనన్న మాత్రమే నా? మరి ఇన్నాళ్ల అనుభవ చంద్రన్న? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1491 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1526 General Articles, 51 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

రోజూ వాట్సాప్ స్టేటస్ మరువద్దు. మీ అరిషడ్వర్గాల వారం వారం సాధన, మాలాంటి శిష్యులకు చెప్పడం మరువద్దు. తెలుగు లో సోషల్ మీడియాలో 4 మాటలు రాద్దాం. ముదుసలి తల్లి దండ్రులను మన పిల్లల లాగా దగ్గర పెట్టుకుని సౌకర్యాలు ఇద్దాం

రంగుల ప్రపంచం, ఈ సినిమా ప్రపంచము. ఎందరో ఎదుగుతారు, ఇంకెందరో బజారున పడతారు. వారు వ్యాపార పెద్దలు, లాభం నష్టం వారికి తెలుసు.

కానీ సామాన్య జనము, చెమటోడ్చి కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని, మోహం వ్యామోహం లో పడి తమకు లేని సౌకర్యాల విలాసాల బతుకును అందాలను ఆనందాలను సంతోషాలను సినిమాలో చూసుకుంటూ, భ్రమ అని తెలిసి కూడా, తమ అభిమాన హీరోల కోసం బ్లాక్ టిక్కెట్లు, ఎక్కువ ధర టిక్కెట్లు, పాలాభిషేకాలు, ఈలలు గోలలు కొట్లాటలు, కటౌట్లు తో, వ్రుధా చేసుకుంటున్నారు.

నేడు ఆంధ్రా లో సినిమా టిక్కెట్ల పై అనవసర రచ్చ హెచ్చుగా జరుగుతుంది, చిత్ర విచిత్ర వాదనలు జరుగుతున్నాయి. ఎవరికి తోచింది వారు, ఏ వ్యాపారం వారు వారికి తగ్గట్లు, ఏ హీరో అభిమాని ఆ హీరో కి తగ్గట్లు, ఏ పార్టీ వారు ఆ పార్టీకి తగ్గట్లు మాట్లాడుతున్నారు.

స్వార్ధం అవకాశం అవసరం లేకుండా, సామాన్య ప్రజల కోసం మాట్లాడే వారు ఉన్నారా, మనలో? అన్ని పరిశ్రమలలో దోపిడీ ఉంది నిజమే, మరి ఒక్కటైనా ధైర్యముగా, కొంతైనా ఆపే మొనగాడు ఎవరు, గత 10 ఏళ్ళు గా?

శివరాత్రి దైవదర్శనం లాగా కొత్త సినిమాలకు, మొదటి నెలలోనే పరుగులు తీసే, మోహ భ్రాంతి పిచ్చితనం పోదా మనకు? ఇదేనా మన అరిషడ్ వర్గాలను జయించిన స్థితి?

కధను బట్టి, పది మంది చిన్న హీరోల, సినిమా చూడమా? ముగ్గురు పెద్ద హీరోలు హీరోయిన్ల, కోట్ల ఖర్చు లాభాలు మనకు అవసరమా?

విదేశాల్లో కొత్త హాలివుడ్ సినిమాకు ఒకటే రేటు, మనలాగా విచ్చల విడి దొంగ వ్యాపారం లేదు కదా?

కానీ విదేశాల్లో కూడా, తెలుగు సినిమాకు 10 డాలర్లు ఉండే దానికి 20-30 డాలర్లకు అమ్ముతున్నారు. అక్కడ కూడా ఎవరైనా కేసు వేసి, మన దోపిడీ ఆపిన దాకా, మన వాళ్ళు రెచ్చి పోతూనే ఉంటారు, వెంటనే ఎక్కువ లాభాల కోసం, ప్రజల బలహీనత తో బతకాలని.

రేట్ల తగ్గింపు గొడవ, బాలయ్య అఖండ సినిమా విజయాన్ని, ఆపలేదు కదా? శంకరాభరణం సినిమా ఖర్చు ఎంత, ఎంత పెద్ద స్టార్లు ఉన్నారు అందులో? ఎన్ని లాభాలు గడించింది, ఆ సినిమా విజయవంతముగా? కధలో పట్టు ఉంటే, ఇంత ఖర్చు హంగామా ఆర్భాటాలు అవసరమా?

ద్రుశ్యం వెంకటేష్ సినిమా, మళయాలం నుంచి అరువు తెచ్చి, ఎంత తేలికగా తీసారు, విజయవంతం కాలేదా? ఆ నేర్పరి తనము, నేరుగా మన తెలుగు సినిమాకు లేదా?

ఇక్కడ థియేటర్ టిక్కెట్లు ఒకటే కాదు, దాని ముసుగులో లొసుగులు చాలా ఉన్నాయి, మనము 2019 లో ఒక ఆర్టికల్ రాసాము, దయచేసి చదవగలరు. link.

దాని ఫలితాలు ఇప్పుడు చూస్తున్నాము, ఇంకా చూస్తాము. పోనీ ఇప్పుడు అయినా మీరు చెప్పండి, ఇవి ఎవరికి లాభాలో?

1. 5 లేదా 6 ఆటలతో, బెనెఫిట్ షో లు ఎవరి సంక్షేమం కోసం?

2. ఎక్కువ ధరల టిక్కెట్లు లేదా బ్లాక్ టిక్కెట్ల లేదా ఎగష్టా కుర్చీల లేదా సరిగ్గా క్రౌడ్ లెక్కలు లేని లాభం ఎవరికి?

3. తినుబండారాలు టీలు నీళ్ళు కూల్డ్రింక్ అధిక ధరల వలన లాభం ఎవరికి?

4. 100 కోట్లు పైన లాభం వచ్చిన బాహుబలి లాంటి సినిమా ఆదాయం తో ఎవరికి లాభం?

5. ఆంధ్రా లో సినిమా పరిశ్రమ అభివ్రుద్ది ఉందా?

6. లైసెన్సు రెన్యూయల్ చెయ్యకుండా, ఎటువంటి నిబంధనలు పాటించకుండా, హాలులు నడవటం మంచిదా?

సరైన లెక్క ల టాక్సులతో, ప్రభుత్వానికా? సినిమా వ్యాపారికా? హీరో హీరోయిన్లకా? చిన్న సినిమాకా? ప్రజలకా? పొనీ సినీ పరిశ్రమను నమ్ముకున్న మాములు కార్మికులకా (హీరో హీరొయిన్లు నిర్మాత దర్శకుడు కాకుండా)? పోనీ ఖర్చుపెట్టి చూసే, పిచ్చి అభిమానులకా? పేదలకా, దివ్యాంగులకా, వరద బాధితులకా, కాన్సర్ కరోనా రోగాలకా, విద్యార్ధుల చదువుకా? ఎవరి కి లాభం ఆ 100 కోట్ల ఆదాయం వలన?

కేవలం హీరో, హీరోయిన్, డిస్ట్రిబ్యూటర్, సినిమా థియేటర్లను గుత్త గా చేతిలో పెట్టుకున్న వారికి, నిర్మాత, దర్శకుడు - అంటే బహుకొద్ది మంది ప్రవేట్ వ్యక్తులకే. వీరు నిజాలు చెప్పి, బాధపడి స్టేటుమెంట్లు ఇచ్చుకుంటే పర్లేదు.

సినిమా కు పెట్టుబడులు ఎక్కడ వో, ఎంత నల్ల ధనమో, ఎవరికీ తెలీదు. వచ్చిన ఆదాయంలో ఎంత టాక్స్ లు కడుతున్నారు కూడా ఎవరికీ తెలీదు.

ఆన్లైన్ సినిమా వచ్చిన తర్వాత, ధియేటర్ ల దోపిడీ కాస్త తగ్గింది. కానీ పూర్తిగా బుద్ధి రాలేదు.

హీరో నాని లేదా ఇతర హీరోలు చెప్పవచ్చు - గతము లో ఒక సినిమాకు లక్ష తీసుకున్నా, ఇప్పుడు కోటి తీసుకుంటున్నా, కాబట్టి, సినిమా రేట్లు తగ్గిస్తే, నాకు మరలా 50 లక్షలే ఇస్తారు అని, తప్పు లేదు. తన ఆదాయం పోతుంది కాబట్టి, నిజాయితీగా ఇలా తన బాధ చెప్ప వచ్చు. కానీ అది చెప్పరు. అర్ధం లేని మాటలు ఏవో చెపుతారు, రేట్లు తగ్గించి అభిమాన జనాలను అవమానించారు అని.

పోనీ 100 కోట్ల పెద్ద సినిమా ఆదాయముతో, ఇన్ని ప్రజా సంక్షేమ పధకాలు చేసాము అని చెప్పవచ్చు, కానీ అది చెప్పరు, ఎందుకంటే చేయరు కాబట్టి.

ప్రభుత్వం చెప్పింది, సినిమా హాళ్ళ వారికి ఇబ్బందులు ఉంటే, అధికారులకు విన్నవించుకోండి, వీలును బట్టి రేట్లు పెంచుతామని, కానీ సదుపాయాలు సరిగ్గా ఉండాలి, స్టాల్ లో అమ్మే రేట్లు అందుబాటులో ఉండాలి అంటే మాత్రము, యాజమాన్యానికి నచ్చదు.

మంచిని ఎవరూ స్వాగతించడం లేదు. ఎందుకంటే, మనకు వితండ వాదం కావాలి, ఎదుటి వాడు చేసింది తప్పు అని చెప్పాలి, అంతే గాని శభాష్ అనము, మనకు చేతకానిది ఇంకొకరు చేసారు అని ఈర్షతో.

ప్రజల సొమ్ముతో అధికారం ఎక్కి, పధకాలకు తమ కుటుంబ పేర్లు పెట్టుకున్నా కూడా, తానా తందానా అని ఆత్మాభిమానం లేని, మనుషులు ఓటర్లు అభిమానులు, మంచిని మంచి అంటారా?

మేము మా పిల్లలు ఇద్దరూ, జగనన్న చంద్రన్న లది తప్పు ఈ విషయములో, మారమని మార్చమని చెప్పాము, ఎప్పుడూ సమర్ధన చేయలేదు. మా 4 గురు పిల్లలు బీజేపీ, తెదేపా, వైకాపా, జనసేన మాకు ఒకటే.

నిన్న ఒకరు అడుగుతున్నారు, కూరగాయలు పాలు మందు సిమెంట్ రేట్లు ఎక్కువగా ఉంటే అవి తగ్గించకుండా, సినిమా టిక్కెట్లు మాత్రమే ఎందుకు తగ్గించాలి? ఇది ముఖ్యమా అని? తెలిసి మాట్లాడుతున్నారో తెలీక మాట్లాడుతున్నారో తెలీదు.

మరి మిగతావి కూడా తగ్గించమని, చంద్రన్న ప్రభుత్వము లో ఎందుకు అడగలేదు, సినిమా టిక్కెట్ల తో పాటుగా?

అది చంద్రన్న కు చేతకానప్పుడు, 40 ఏళ్ళ అనుభవజ్ఞుడికి ఏ ఒక్కటి తగ్గించడం చేతకానప్పుడు, కనీసం ఒకటి అయినా తగ్గించిన, జగనన్న మంచివాడు కాదా, చంద్రన్న కన్నా అని నిన్న ఒకరు అడిగితే, మన దగ్గర జవాబు లేదు.

ఇప్పుడు జగనన్న ను చూసి, చంద్రన్న/ పవనన్న/ వీరన్న కూడా రేపు, సామాన్య ప్రజలకోసం మిగతావి తగ్గిస్తారేమో?

లేదా, సినిమా వారిని చూసి భయపడి, దాసోహం అని 6 ఆటలు తో సినిమా వ్యాపారుల బెనిఫిట్ షోలు కు ఎక్కువ రేట్లు మరియు బ్లాక్ లో టిక్కెట్లు అమ్మిస్తూ, థియేటర్ లలో మంచి నీరు, శుభ్రమైన మరుగు దొడ్లు లేకుండా నడిపిస్తారో, చూద్దాము అని ఇంకోకరు అంటున్నారు.

మందు కి 5, కూర కు 5, సిమెంట్ కు 5, సినిమాకు 5 సామాన్య జనానికి అవుతుంది ఖర్చు అని ఉదాహరణకు మాత్రమే అనుకుందాము, మరలా అన్ని ఒకే రేట్లా అనవద్దు. అంటే మొత్తము 20 రూపాయల ఖర్చు.

అందులో సినిమాకు 3 రూపాయలు తగ్గి, 17 మాత్రమే ఖర్చు అయితే, మిగతావి తగ్గవు కాబట్టి మేము ఆనందముగా 20 కడతాము, అని సామాన్యుడు అడుగుతాడా? ధనమున్న జనాలు అభిమానులు వ్యాపారులు అడుగుతారా?

మొత్తము 20 రూపాయలు కట్టించిన చంద్రన్న గొప్పవాడా? మొత్తము 17 రూపాయలు కట్టిస్తున్న, జగనన్న గొప్పవాడా?

కానీ చిన్న సినిమా, మరి సగము సినిమా పరిశ్రమ వారు, జగనన్న పనిని భేష్ అన్నారు, ఆన్లైన్ టిక్కెట్లకు ఓకే అన్నారు. కోర్టు కూడా జీవొ కొట్టేసి, అధికారులకే అధికారం అప్పగించింది.

రేపు మరలా జగనన్న మడమ తిప్పి మాట తప్పి, మందు రేట్లు పెంచి తగ్గించినట్లు, సినిమా వారి మాయలో పడి, మరలా సినిమా రేట్లు పెంచి, బెనిఫిట్ షోలు పెట్టి, మీ ఇష్టం వచ్చిన విధముగా దోచుకోమని, చంద్రన్న లాగే అవకాశం ఇవ్వచ్చును.

కానీ ఇప్పటికైతే, సినిమా వారిని నిలదీసి, సామాన్య ప్రజలకు కొంతైనా మంచి చేయబోయిన మొనగాడు, కేవలం జగనన్న మాత్రమే.

మనము సినిమాలకు మందుకు తిరుగుళ్ళకు వినోదానికి (అంటే అరిషడ్వర్గాలకు) బానిసలము అయినంత వరకు, మన పిల్లలు కూడా చెడిపోతూ, నాయకులకు వ్యాపారులకు కూడా లాభాలు అందిస్తూ, పావులుగా మారతాము ఉపయోగపడతాము మన జీవితాలను వ్యర్ధం చేసుకుంటూ.
 
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1526 General Articles, 51 Tatvaalu
Dt : 24-Dec-2021, Upd Dt : 24-Dec-2021, Category : General
Views : 291 ( + More Social Media views ), Id : 1282 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : jagan , cm , exploitation , film , movie , industry , theater , pawan , chandranna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content