నాయకులు అందుబాటులో ఉండి, జనం లో తిరగాలి, కలవాలి, సూచనలు చేయాలి, భరోసా ఇవ్వాలి - News
           
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1985 General Articles and views 1,686,149; 102 తత్వాలు (Tatvaalu) and views 208,388.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

జనములో కలసి తిరిగే విషయంలో మెచ్చుకోవాలి, చీరాల మాజీ ఎమ్మెల్యే మరియు ప్రస్తుత వై యెస్ ఆర్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్, ఆమంచి క్రిష్ణ మోహన్ గారిని. గతములో, విడిగా సొంతముగా ఏ పార్టీ అండ లేకుండా, పోటీ చేసి కూడా గెలిచారు, మీకు తెలిసిన విషయమే అది.

కొత్తపేటలో, ప్రవేట్ స్కూళ్ళకు పోటీగా, కొత్త ప్రభుత్వ స్కూల్ ను అన్ని హంగులతో అమర్చారు, రాష్ట్రమంతా కూడా మారు మ్రోగింది ఆనాడు. మార్కెట్ కూడా కొత్త గా నిర్మాణము జరిగింది. ఇంకా చాలా మార్పులు జరిగాయి తన హయాములో.

ఇటువంటి లాక్ డౌన్ పరిస్థితి లో కూడా, నాయకులు అందుబాటులో ఉండి, జనం లో తిరగాలి, కలవాలి, సూచనలు చేయాలి, భరోసా ఇవ్వాలి కదా.

నిన్న చీరాల పుర వీధుల్లో, జనం తో ఆమంచి గారు కలసి ముచ్చటించారు. కూరలు దినుసులు రేట్లు బయట బోర్డు పెట్టాలని, అలాగే కొనేవారు దూరంగా నిలుచేటట్టు మార్కింగ్ చేయాలని సూచనలు చేసారు. మందుల షాపు వారికి కూడా జాగ్రత్తలు చెప్పారు. ఎక్కడా రేట్లు పెంచరాదని, మానవత్వముతో ముందుకు పోవాలని చెప్పారు. మొన్న, నవాబ్ పేటలో కరొనా వచ్చిన, ప్రాంత మనుషులను కలిసారు.

అయితే ఇటువంటి కరోనా కష్ట సమయములో, తగిన కరోనా రక్షణ తో, అంటే మాస్క్ గ్లౌజు ఫుల్ డ్రెస్ మరియు మనిషికి మనిషి కి సామాజిక 3 అడుగులు దూరం తో నే, జనము మధ్యలో తిరగాలి, తాను పాటిస్తూ ఇతరులతో పాటింప చేయాలి, అదే మంచి నాయకత్వ లక్షణం.

మన ప్రస్తుత ఎం ఎల్ ఏ కరణం బలరామ క్రిష్ణ గారు, ప్రస్తుత ఎం ఎల్ సీ పోతుల సునీత గారు కూడా, జనం లో తిరిగి, కరోనా సమస్యలను విచారించి, ప్రజలకు భరోసా ఇస్తారని ఆశిద్దాము. ఇప్పుడు అందరూ అటవీ శాఖా మరియు విద్యుత్ శాఖా మాత్యులు బాలినేని శ్రీనివాసులు (వాసు) గారి నాయకత్వములో, జగన్ గారి వైపే కాబట్టి, జగన్ గారికి మరియు పార్టీకి, మరింత బలం పెంచినట్టే కదా.

మరి చంద్రన్న, పవన్ తరపున నాయకులు కూడా ఇలాగే కష్టపడి తిరిగితే, వారి నాయకత్వ పటిష్టతకు బాగుంటుంది.

మనము ఎంత కష్టపడినా, వాటి గురించి సోషల్ మీడియాలో పెట్టకపోతే, జనానికి చేరవు, ఇది నాయకులు అందరికీ తెలుసు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుని, ఎప్పుడూ జనానికి తెలియ చేస్తూ ఉండాలి.

ఏ పార్టీ వారైనా, ప్రతిష్ట మరియు ఓటు బాంకు పెంచుకోవాలి, వ్యక్తి గతం గాను మరియు పార్టీ పరంగా ను. తప్పు లేదు కదా, ముందు కష్టపడి తే, తర్వాత ప్రజలు ఆటోమేటిక్ గా, అండగా ఉంటారు. పదవి ఉందని అహంకారము ఉండకూడదు, ఎందుకంటే భవిష్యత్ తెలియదు. అలాగే లేదని దిగులు పడకూడదు, రేపు మనది కావాలి అన్న ఆశ ఉండాలి.

అందరికీ ఇదే మంచి సమయం, జనం లో బలం పెంచుకోవడానికి, అన్ని పేటల జనాన్ని పలకరించడానికి, సమస్యలు తీర్చడానికి. మొన్న కొత్తపేట కల్యాణ మండపము దగ్గర చెత్త సమస్య వస్తే, పంచాయితీ వారే వెంటనే శుభ్రము చేసారు. పోలీసు వారు కూడా, ప్రజల రక్షణ జాగ్రత్తలు పటిష్టముగా చూస్తున్నారు.

ఈ విపత్తు ముగిసిన వెంటనే, స్ధానిక ఎన్నికలు కూడా ఉన్నాయి, అన్ని పార్టీల వారు ఇప్పటినుండే సిద్దముగా ఉండాలి.

రేపు పదవులు లేకపోతే, మన విలువ ఎలా ఉంటుందో, అందరికీ తెలుసిన విషయమే. మొన్న రాసిన ఆర్టికల్ లో ఇదే అనుకున్నాము, గమనించండి మీ ఊర్లలో ఎవరు వచ్చి పుర వీధుల్లో జనం తో మమేకమౌతున్నారో ఈ కష్టం లో అని.

ఇది ఎవరినీ సమర్ధన కోసం కాదు, మనం ఎవరినీ దూషించరాదు, కేవలము ప్రజలకు జరిగే మంచినే అనుకుందాము. మనకు అందరూ కావాలి. అందరూ పోటీలు పడితే నే, జనం కు మేలు, అలాగే నాయకులకు కూడా మేలు. అందరం కోరేది, చీరాల కు మరియు ప్రజలకు జరిగే మేలు మాత్రమే కదా.

పార్టీలు ఓడినా, మారినా, పదవులు మారినా పోయినా, మంచి నాయకుల లేదా అధికారుల, వ్యక్తిగత ప్రతిష్ట విలువ తగ్గకూడదు.

ఇంట్లోనే ఉందాము, మన ఊరిని కాపాడుకుందాము.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1985 General Articles and views 1,686,149; 102 తత్వాలు (Tatvaalu) and views 208,388
Dt : 31-Mar-2020, Upd Dt : 31-Mar-2020, Category : News
Views : 1060 ( + More Social Media views ), Id : 461 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Corona , Covid 19 , Chirala , Amanchi Krishna mohan , karanam Balaram , Potula Sunita , Balineni Srinivasulu , Prakasam Dt

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content