చంద్రన్న తోఫా జగనన్న గోరుముద్ద లా వాక్సిన్ పంపిణీ ప్రచారం కు సొంత పేరు బొమ్మ పెట్టుకోని మోదీ - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2110 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2145 General Articles and views 2,125,901; 104 తత్వాలు (Tatvaalu) and views 239,324.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

కరోనా వాక్సిన్ గురించి, ఎన్నికలు ఆపమని ఒకరు, కాదు జరపాలని ఒకరు కోర్టు కెక్కడం చూసాం. జగనన్న నడక మరియు ఇతర పంచుడు కార్యక్రమంలో, ఎన్ని వందల మంది పాల్గొన్నా, కరోనా రాదు మనకు.

పంచాయతీ పన్నులు కట్టే విధానం, ఆన్లైన్ లో పెట్టండి బాబూ అంటే, 2 ఏళ్లుగా దిక్కు లేదు, ప్రతి పక్షం కూడా అడగదు జన సంక్షేమం పట్టదు కాబట్టి. అంటే కరోనా భయం లేదు. కానీ ఎన్నికల కు మాత్రం వద్దు, ఆయన ఉన్నంతకాలం.

పోనీ ఆయన కరెక్టే నా అంటే, గతంలో లేని తొందరెందుకు ఇప్పుడు అంటే, ఆయనా వినరు. కేంద్ర నిధులు రావు అంటారు ఆయన మాట విని, ఈయన పరుగులు అని వీరు అంటారు.

సరే మన ముఖ్యాంశం వాక్సిన్ పంపిణీ ప్రచారం గురించి ఇప్పుడు. ఈ క్రింది హైందవ శ్లోకం వినే ఉంటారు.

సర్వేజనాః సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయ!..
సర్వే భద్రాణి పశ్యంతు, మాకశ్చిత్‌ దుఃఖ మాప్నియా!!
లోకః సమస్తా సుఖినో భవంతు...

అంటే సర్వజనులు (అన్ని వర్ణాలు వర్గాలు కులాలు) ఎలాంటి రోగాలు బాధలు లేకుండా, సుఖశాంతులతో జీవించాలని, సనాతన హైందవ ధర్మం అభిలాషిస్తుంది. 

సర్వే సంతు నిరామయ, అంటే అందరూ రోగాలు లేకుండా, ఆరోగ్యం గా ఉండాలి అని అర్థం వస్తుంది. ఇది ఇప్పుడు ఎందుకు అంటారా?

మన భారత దేశంలో, కోవిడ్ వాక్సిన్ పంచే పాకెట్లు పైన, వాడుతున్న స్లోగన్ ఇది. ఈ మంచి సాంప్రదాయ సందేశాన్ని ఉపయోగించి మాత్రమే, వాక్సిన్ ల ను పంపిణీ చేస్తున్నారు అంట.

అదేమిటండీ మోదీ గారికి తెలీదా, మన తెలుగు రాష్ట్ర ఉత్తమ సంస్కృతి - మన తెలుగు నాయకులు, తమ సొంత ఇంటి ధనం తో నడిపే పధకాలు మాదిరిగా, చంద్రన్న తోఫా లేదా వైయస్సార్ జగనన్న గోరు ముద్ద, అని బొమ్మ లతో గర్వంగా పెట్టుకుంటారు.

మరి మోదీ గారు కూడా, మోదీ/ వాజపేయి/ అద్వానీ వాక్సిన్ అని పెట్టుకోవాలి కదా? కానీ సొంత బొమ్మ లతో పెట్టుకోరు ఎందుకు? ఎందుకంటే, అది ప్రజల పన్నులు సొమ్ము, దానికి తమ సొంత పేరు బొమ్మ పెట్టుకోవడానికి, ఆత్మాభిమానం ఆత్మశుద్ధి గల, భారతీయులు ఒప్పకోరు.

అంటే మరి మనం చేస్తున్న ది కరెక్టేనా? మరి మన వాళ్ళు ఇక్కడ పేరు మార్చి, స్ధానిక స్టిక్కర్ వేస్తారు ఏమో, సొంత బొమ్మ లతో చంద్రన్న వాక్సిన్ లేదా వైఎస్సార్ జగనన్న వాక్సిన్ టీకా అని. అవ్వ, వేసినా, మనము తప్పు బట్టము, ఇంకా అలాగె మీ పేర్లు పెట్టుకోండి అని ప్రోత్సాహం చేస్తాము.

ఇప్పుడు అయినా, చంద్రన్న, మరలా అధికారం లోకి వస్తే, గతంలో చేసిన, తప్పు మరలా చేయం, మా కుటుంబం పేర్లు బొమ్మ లతో పెట్టుకుని అని గట్టిగా చెప్పాలి. నిన్న భోగి మంటల దగ్గర పశ్చాత్తాప పడ్డారు కదా, దేనికోసమో?

బీజేపీ జనసేన ఎటూ అలాంటి నీచమైన పనులు చేయరు, అందుకే వారిని గెలిపించం మనం. మన బుద్ధి కి, వారు సరిపోరు కదా.

ఎవరైనా జగనన్న కు ఈ విషయం చెప్పి, మోదీ గారిని ఫాలో అవుదాం ఆత్మ శుద్ధి తో, అని నచ్చ చెప్పాలి.

పంచుడు కార్యక్రమంలో, గత మరియు ఇప్పుడు ఎమ్మెల్యేల ఫోటోలు చూస్తున్నారా? చూడకపోతే మీ ఎమ్మెల్యే ఫేస్బుక్ లో చూడండి. తమ సొంత సొమ్ము దానం ఇస్తున్న విధంగా, ఆ పోజులు గొప్పలు.

మన వాట్సప్ స్టేటస్ లో, కోవిడ్ వాక్సిన్ పంపిణీ ఫోటో చూడండి. ఫోటో పంపితే ఎక్కువ మెమరీ కదా. అలాంటి వి చాలా మిస్ అవుతున్నారు, మన వాట్సప్ స్టేటస్ చూడకపోతే సుమా.

వాట్సప్ ప్రైవసీ అంటూ కంగారు పడుతూ ఉంటే మనం ఇప్పుడు, గతంలో అన్ని వివరాలు పోస్ట్ కార్డుల పై రాసేవాళ్ళం కదూ, ఫోటో వాట్సప్ స్టేటస్ లో.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2145 General Articles and views 2,125,901; 104 తత్వాలు (Tatvaalu) and views 239,324
Dt : 14-Jan-2021, Upd Dt : 14-Jan-2021, Category : Politics
Views : 1035 ( + More Social Media views ), Id : 923 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : chandranna tofa , jagannanna goru mudda , modi , no own name picture , vaccine , public tax money , govt schemes
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content