Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. *మూగపోతున్న ముదుసలి గొంతు లు/ నోళ్ళు/ మనసులు - ఏవీ బయట తిప్పడం? నలుగురితో కలవడం, మాట్లాడడం? వాట్సాప్ ఫోన్?*
ఆధ్యాత్మిక భక్తి అని, దేవుని దగ్గర నటనగా ఉండే లేదా దేవుడు అంటే అసలు లెక్కే లేదు, అవసరం లేదు, అనే స్వతంత్ర కపట నటన జీవితాలలో, చివరలో ఎలా ఉంటుందో చూడండి. ఇది దేవుని రాతనా?
కాదే, మనము స్వయముగా, అరిషడ్వర్గాల బానిసత్వములో కన్ను మిన్ను కానక, అహంకారము తో రాసుకున్న, మన సొంత భవిష్యత్తు.
ఆధ్యాత్మిక భక్తులు కళ్ళు తెరవండీ. వాస్తవ ప్రపంచములో నడవండి. ద్రుతరాష్ట్ర గాంధారిలా, సొంత గొయ్యి తవ్వుకోమాకండి.
మన మనసు అరిషడ్వర్గాలను జయించి ఉంటే, బయట అలాంటి వారే, మనకు అండగా కనపడతారు, నిలుస్తారు. వారి చేతిలో మనము పోయినా, కనీసం ఉత్తమ గతులు వస్తాయి. ఇంట్లో నీచముగా కుళ్ళుతూ కన్నీళ్ళు దిగమింగుతూ, రోజూ చస్తూ బతికే బదులు గా, అవునా? పూలు అమ్మిన చోటే, కట్టెలు అమ్మే దౌర్భాగ్య స్థితి వద్దు.
60 ఏళ్ళు దాటి, నిస్సత్తువగా, పిల్లల పై ఆధారపడిన, క్రిష్ణవేణమ్మ/ జానకిరామయ్య నోరుపడిపోయింది, అందరూ మైండ్ పోయింది అనుకుంటున్నారు. సరిగ్గా మనుషులను గుర్తు పట్టడం లేదు. పిచ్చిగా, మూగగా, గమ్ముగా, వెర్రి వారిలా చూస్తూ ఉన్నారు, ఇంటికి ఎవరు వచ్చినా.
ఏమి మాట్లాడితే ఏమి అంటారో, అని భయం భయం గా చూస్తూ ఉంటారు. ఎప్పుడూ పక్కనే కాపలా, బయటవారు వస్తే. అదేమంటే, మైండ్ లేదు కదా, మిమ్మల్ని ఏమైనా అంటారేమో నని అని, మనము వెళ్ళిన దాకా అక్కడనే ఉంటారు.
బయటవారికి అర్ధం కాలేదు, మొన్నటి దాకా, అధికారం చలాయించి, అన్ని ఊళ్ళు తిరిగిన చదువు ఉన్న, 4 గురు తో కలసి తిరిగిన, ఈ మంచి పెద్దమనిషుల కి, ఈ దీనావస్థ ఏమిటీ తండ్రీ అని. ఆరోగ్యముగా నిండుగా ఉన్నారు, మరి మైండ్ నోరు, ఎందుకు పోయింది?
మన పెంపకమే, మన బండ రాయి కపట కఠిన భస్మాసురులే, ఆ పరిస్థికి కారణమని, ఆ తల్లి ఆ తండ్రి ఎందుకు చెప్పలేరు? చెప్పకపోతే నష్టం ఎవరికి? ఇంట్లో పాపాన్ని పెంచిన ఫలితము, వారే కదా అనుభవించాలి? కోడలి/ అల్లుడి కన్నీళ్ళ పాపం ఊరికే పోతుందా?
చచ్చిన తర్వాత అయినా, పాపమే గానే, పుణ్యం ఎటూ వారికి రాదు. ఎందుకంటే, తమంతట తాము కావాలని అన్ని తెలిసి, కసాయి వాని చేతిలో, ఆస్తి ధనము తల పెట్టారు కాబట్టి.
గోపి తన సోదరునితో తగవుపడి, తన అమ్మ నాన్నను తెచ్చి, ఇంట్లో పెట్టుకున్నారు. అందరూ ఆశ్చర్యపోయారు, ఏమిటీ ఇన్నేళ్ళు ముదుసలి అమ్మా నాన్న అంటే, పడనివాడు ఇప్పుడు హట్టాత్తుగా ప్రేమ నటిస్తున్నాడు అని.
స్వతహాగా తన భార్యకు ఇష్టం లేదు, వారు ఉండటం. ఒకరకముగా తనకు కూడా ముదుసలి వారు అంటే పడదు, అన్నిటికి ఏదో ఒకటి చెబుతుంటారు, చాదస్తం, నస అని, ఊళ్ళో తిరిగకుండా వీరికి కాపలా ఎక్కడ ఉంటాము, ఆసుపత్రి చుట్టు తిప్పుతూ అని ఇంకో తలనొప్పి గా భావిస్తారు.
అత్త మామలను కూడా ఇంటికి రానివ్వడు, ముదుసలి తనములో, మాది బాధ్యత కాదు అని. ధనానికి సౌకర్యాలకు అలవాటు పడిన ఆ భాగస్వామి కూడా, తన తల్లి దండ్రులు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నా, పట్టించుకోదు.
చిన్నప్పుడు మనము పిల్లలుగా యువకులుగా ఎన్ని వెధవ వేషాలు వేస్తే, ఆ తల్లి దండ్రులు తమను కాపాడారో, తమ రక్తాన్ని స్వేదముగా మార్చి, పిల్లలకు ఎంత సేవ చేసారో, చాలా మందికి ఎదిగాక పెళ్ళి అయ్యాక, గుర్తు ఉండదు.
ఇలాంటి వారికి ఆస్తులు అధికారం హోదా ఇచ్చి, పెళ్ళి తో ఇంకో జీవితములో నిప్పులు పోస్తారు, ఆ పెద్దలు ద్రుతరాష్ట్రుడు గాంధారిలా. చివరకు వారి నే బలి చేస్తారు. అంతే గాక, ఇరుగు పొరుగు, సహోద్యోగులతో కూడా, స్వార్ధం లేకుండా సరిగ్గా కలవలేరు. ఎందుకంటే, మా కేమిటి మీతో పలికితే, కలిస్తే అనే రకాలు వీరు.
అందుకే అన్నారు, విశ్వసనీయత క్రుతజ్ఞత జాలి దయ లేని, కన్న పిల్లలు కన్నా, ఇంత ముద్ద పెడితే, తోకాడించుకుంటూ వెంట తిరిగే కుక్క మేలు అని, ఎన్నో సినిమాలలో చూసాము. రేపు జీవిత భాగస్వామికి ఏదైనా అనారోగ్యం వస్తే, వారిని కూడా నిర్ధాక్షిణ్యముగా విడిచి పెట్టడానికి లేకపోతే ఇంట్లో మూలన కూర్చోపెడతానికి కూడా, ఈ నీచులు వెనకాడరు కదా, దేవా?
కానీ తమ దిగజారిన ఆర్ధిక పరిస్తితి అప్పులు తరుముతూ ఉంటే, అలాగే ఆస్తిలో ఎక్కువ భాగం, అలాగే ఫించన్ లో భాగం, వారిని తప్పని సరి పరిస్థితిలో ఇంట్లో పెట్టుకునేలా చేసాయి. ఆ మిగతా పిల్లలు కూడా, వీరు నీచులు అని తెలిసి కూడా, అందరు వదిలించుకోవడానికి, ధనము ఇచ్చి, ఈ కసాయి వాని చేతిలో పెట్టి, చేతులు దులుపుకున్నారు.
ఇక ఆరోజు నుంచి మొదలు వీరికి కష్టాలు. ఇంట్లో కుక్కను కట్టేసినట్లు గా, గదిలో పడి ఉండాలి. బయటకు తీసుకుని పోరు. టీవీ రేడియో లేదు, ఫోన్ ఇవ్వరు. మంచి గా పిల్లలతో, పెద్దలతో, ఇరుగు పొరుగు తో మాట్లాడుకునే అవకాసము ఇవ్వరు. చాడీలు చెపుతారు అని భయము.
మిగతా పిల్లలు చూడటానికి వచ్చినా, ఏదన్నా చెప్పబోతే తమ కష్టసుఖాలు, అందరూ విదిలించి కొడతారు, మా ఇంట్లో ఇంత కన్నా ఘోరముగా ఉంటుంది అని, నిరుత్సాహపరుస్తారు. వారి మనసులను ఇంకా చిదిమేస్తారు, గేళి చేస్తారు, రేపు తమ బతుకు అంతే అని తెలిసి కూడా, ఈ జనాలు మారరు.
పోనీ వారన్నా, ఆటొలో కారులో, సినిమాకో షికారుకో బజారుకో పార్టీకో పెళ్ళి కో చుట్టాల ఇంటికో తీసుకుపోతారా, అదీ లేదు. మీకెందుకు ముదుసలి వారు, నొప్పులు అంటూ ఒకటే ఏడుపు. ఇంట్లో కాపలా ఉండకా అనో లేదా అనారోగ్యమనో ఇంకా మానసికముగా కుంగ దీస్తూ ఇంట్లో బంధించారు.
1) చిన్నప్పుడు 5 ఏళ్ళు దాకా, నాన్న అమ్మ బయటకు వెళుతుంటే, ఏడుస్తూ పరుగులు తీసాము కదా? మరి 60 ఏళ్ళు దాటిన వారికి బయట తిరగాలని ఆశ ఉండదా?
2) చిన్నప్పుడు అందరు మనల్ని ఎత్తుకుని, ముద్దాడారే, అందరు పలకరించారే. మరి 60 దాటిన వారికి ఇతరులతో మాటలు మనసు పంచుకోవడం వద్దా?
3) చిన్నప్పుడు వేలు పట్టుకుని నడిపించి, సాక్సు బూట్లు వేసారే, మరి 60 దాటిన తర్వాత వద్దా?
4) చిన్నప్పుడు ఫోన్ తో లాప్టాప్ తో ఆడుకున్నాము, రాకపోయినా ఫోన్ మాట్లాడాము. మరి 60 తర్వాత తమ వయసు వారితో, తాము విడిగా మాట్లాడుకో కూడదదా?
5) 60 తర్వాత తమకు ఇష్టమైన రుచులు తినవద్దా? చోట్లు తిరగవద్దా? వెంటబెట్టి కొన్ని అయినా తీసుకుని వెళ్ళమా?
ఇంకా ఇలాంటివి ఎన్నో చెప్పుకుంటూ పోతే.
దయచేసి మీతో బయట తిప్పండి. ఒక సెల్ ఫోన్ వాట్సాప్ తో పెట్టి వారికి ఇష్టమైన వారితో చూస్తూ మాట్లాడినివ్వండి. ప్రతి దానికి పక్కన, కుక్క కాపలాగా ఉండవాకండి, ఇతరులతో ఇరుగుపొరుగుతో మాట్లాడేటప్పుడు. ముదుసలి తల్లి దండ్రులు ఇంట్లో మూలన విసిరేసిన వస్తులు కాదు, జీవం ఉన్న మనుషులుగా భావించండి.
ఇలా వారి మాటను మనసును నొక్కుతూ ఉంటే, అవమానిస్తూ, చీదరిస్తూ, బెదిరిస్తూ, ఎగతాళి చేస్తూ, మా ఎదాన పడ్డారు అని తిడుతూ ఉంటే, అంత తిండి విదిలిస్తూ ఉంటే, తమ బాధ ఎవరికీ చెప్పుకోలేక, లోన కుళ్ళి పోలేక, కన్నీరు దిగమింగుతూ, ఎవరిని ఏమీ అనలేక, చివరకు మైండ్ పోతుంది.
ఎంతో మంది ముదుసలి వారి తో, ఇంటి వారితో మాట్లాడాము. అందరికి ఇదే సమస్య, తాము బాధ పంచుకోవడానికి ఎవరు లేరు. మాలాంటి వారు ఉన్నా, దగ్గరకు వారి పిల్లలు రానీయరు. మరి ఇంకా వారి గొంతులు మనసులు మూసుకుని పోవా?
అనాధలుగా ఒంటరిగా ఇంట్లో ఉన్న, ముదుసలి వారిది ఇదే పరిస్థితి. వయసులో ఉన్నవారైనా ఇదే పరిస్థితి, మనసు నోరు మూగబోతే.
20 ఏళ్ళు వాళ్ళు ఇచ్చిన ప్రేమను, వారికి తిరిగి పంచండి లేదా నచ్చిన వారి దగ్గర, ఆనందముగా ఉండనివ్వండి.
ప్రేమ విలువ తెలియని సంస్కారం లేని, తోడ బుట్టిన వారి దగ్గర విడవకండి. ఆస్తి దక్కాక, అవసరాలు తీరాక, అడ్డు తొలగించుకోవడానికి, పెద్దలను ఏదో కారణముతో ఏదో ఒక దోవలో, ఈ లోకమునుంచే పంపించేస్తారు.
Make active old parents mouths minds - taking out? Meet talk with other people? WhatsApp phone?
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1797 General Articles and views 1,389,516; 94 తత్వాలు (Tatvaalu) and views 184,413 Dt : 19-Aug-2022, Upd Dt : 19-Aug-2022, Category : General
Views : 293
( + More Social Media views ), Id : 1499 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
active ,
old ,
parents ,
mouths ,
minds ,
taking ,
out ,
meet ,
talk ,
other ,
people ,
whatsapp ,
phone Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments