పాటతో పరమార్ధం- మనసు ఒక మందారం- ప్రేమ తరంగాలు- కృష్ణం రాజు, జయసుధ, చిరంజీవి, సుజాత - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2094 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2129 General Articles and views 1,924,193; 104 తత్వాలు (Tatvaalu) and views 229,774.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Manasu Oka Mandaram - Prema Tarangalu - Krishnam Raju, Savitri, Jayasudha, Chiranjeevi, Sujatha

మనసు ఒక మందారం, చెలిమి తన మకరందం అని అందరకూ తెలుసు. కానీ ఇక్కడ కోటి రూపాయల ప్రశ్న, చెలిమి ఎవరితో? 80 శాతం మంది అవసర అవకాశాలతో ఎవరో ఒకరి పేరు చెపుతారు, ఎందుకంటే వారు అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వములో ఉంటారు కాబట్టి. ఆ చెలిమి ఏదో ఒకనాటికి తెగక మానదు, ఎందుకంటే అక్కడ గుణం లేదు, మోహం అవసరం మాత్రమే ఉంది.

కానీ ఎవరితో చెలిమి చేయాలి, మిగతా 20 శాతం మంది చెపుతారు - దేవునితో అంటే మన ఆత్మతో, తనను తాను తెలుసుకుంటూ, అందరికీ తెలుపు కుంటూ, సమాజ సేవ చేస్తూ. అప్పుడు ఆ మధురిమకు పులకించే, బ్రతుకు ఒక మధుమాసం. చూసాము కదా, ఎందరో మహానుభావులను, దైవాన్ని ఆత్మను నమ్మిన వారు, నీతి నియమాలతో ఉంటారు.

అప్పు జోలికి పోరు, ప్రాణా పాయములో అప్పుకోసం వెళ్ళినా, చాలా తక్కువ అంటే తమకు ఉన్న దానిలో, 10 శాతం కూడా దాటరు. ఇంకొకరి ధనాన్ని ఆశించరు, ఎందుకంటే వారి ఆస్తి ధనముతో పాటు గా, వారి పాపాలు కూడా మనకు వస్తాయి, త్వరలోనే పతనము అవుతాము.

మరి అలాంటి ఇంకో మంచి ఆత్మతో స్నేహము చెయ్యవచ్చు ఎందుకంటే, ఇద్దరి లక్ష్యం ఒకటే, ఆత్మ జ్ఞానం. మరి ఆ మిత్రుని కొరకు, ఏఅ పాట పాడి, అతని మనసు కదిలిద్దామా, దేవునితో మరింత గట్టి బంధం కోసం? ఆ పాటనే నీ కోసమే, నే పాడినా, వినిపించునా నేస్తమా? వికసింతువా, వసంతమా అంటూ ఆనందము తెలియచెద్దాము.

ఈ చీకటి ఆలోచనలు అంతరాత్మ, ఈ నా పిచ్చి ప్రాపంచిక బ్రమల లోకము, నీ వంటి మంచి మనసు రాకతో దైవం వైపు మారాలిరా, మన జీవిత కథ మారాలిరా అంటూ మన మిత్రులు మనల్ని అభినందించాలి.

మనము తప్పు చేస్తున్నా, స్పష్టముగా చెప్పే, మన అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లేని అలాగే సజీవ గురువు సేవ చేసే మిత్రులను అభినందించాలి. మరి తప్పో ఒప్పో వారికి ఎలా తెలుస్తుంది, మనము చెపితేనే గదా?

మీకు 9 ఏళ్ళ ముందు చెప్పాను గుర్తు ఉందా, అమ్మ విషయములో నేను ఏ చిన్న తప్పు చేసినా, సరిగ్గా చూడకపోయినా, సరి చేసే సర్ధి చెప్పే ఎత్తి చూపే హక్కు మీ అందరికీ ఉంది. మన రాతలో, మన వాక్కులో, మన సాధనలో, మన చిత్రములు కధనములలో తప్పు ఉంటే సరి చేసే హక్కు మీ అందరికీ ఉంది.

మరి మీరు అలాగే రోజు, మీ ముదుసలి తల్లి దండ్రులు అత్త మామలకు ఇస్తున్న నిత్య సేవ, మీరు చేసే పనులు ధైర్యముగా అందరికీ చెపుతూ, స్టేటస్ లో పెట్టగలరా? అది ఆత్మ విమర్శ సుమా.

మనసు ఒక మందారం.., చెలిమి తన మకరందం.
ఆ. మధురిమకు పులకించే.., బ్రతుకు ఒక మధుమాసం. ||మనసు||

ఈ.. తోటలో.., ఏ.. తేటిదో..
తొలిపాటగా.. వినిపించెను, ఎద కదిలించెను.. 2
ఆ పాటనే.., నీ కోసమే..., నే పాడినా.. వినిపించునా.. నేస్తమా..?
వికసింతువా., వసంతమా.. ||మనసు||

ఈ.. చీకటి.., నా.. లోకము..
నీ రాకతో మారాలిరా .. కథ మారాలిరా - 2
ఆ మార్పులో.. నా తూర్పువై.., ఈ మాపు నే.., వెలిగింతువా.. నేస్తమా..?
వికసింతువా.., వసంతమా. ||మనసు||

ఆహా..హా.. ఆ... ఆ...ఉమ్మ్..ఉమ్మ్

1980 సావిత్రి  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2129 General Articles and views 1,924,193; 104 తత్వాలు (Tatvaalu) and views 229,774
Dt : 27-Jul-2023, Upd Dt : 27-Jul-2023, Category : Songs
Views : 301 ( + More Social Media views ), Id : 1856 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Manasu , Oka , Mandaram , Prema , Tarangalu , Krishnam , Raju , Savitri , Jayasudha , Chiranjeevi , Sujatha
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content