మే 3 ప్రపంచ పత్రికా దినోత్సవం, మంచి జర్నలిజం, ప్రభుత్వాలు కు కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2105 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2140 General Articles and views 2,085,138; 104 తత్వాలు (Tatvaalu) and views 237,295.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం, మే 3 ను ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం, లేదా ప్రపంచ పత్రికా దినోత్సవంగా ప్రకటించింది.

ఇది పత్రికా స్వేచ్ఛ యొక్క, ప్రాముఖ్యతపై అవగాహన పెంచడానికి, మరియు పత్రికా హక్కును గౌరవించటానికి సమర్థించటానికి, ప్రభుత్వాలు కు తమ కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది. భావ ప్రకటనా స్వేచ్ఛకు, చేయూత నిస్తుంది.

ఒక మంచి జర్నలిజం, నిజమైన వాస్తవ వార్తలు రాస్తూ, మంచి వ్యక్తుల కష్టాన్ని ప్రజలకు తెలియచేస్తూ, సామాన్య ప్రజలకు అర్ధం కాని, రాజకీయ నాయకుల ఎత్తులు మోసాలు, అలాగే అధికారుల నిర్లక్ష్యం బాధ్యతా రాహిత్యమును ఎండగడుతూ, కనీసం 10 మంది ప్రజల కైనా, సొంత ఆలోచనా శక్తిని పెంచి, తమ తరాల బంగారు భవిష్యత్తును, వెలుగు వైపు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది.

దానికీ ప్రతి మంచి మనసు ఉన్న వ్యక్తులు, తోడు గా అండగా నిలిచి ఆదరించి, పదిమందికీ చేర్చాలి. మంచి వారు అందరూ కలసి పని చేస్తే, అవినీతిని అరికట్టవచ్చు. అవినీతి పరులలో ఉన్న ఐక్యత, మంచి వారి లో లేదు, అందుకే ధర్మం ఇలా గాడి తప్పు తుంది. మంచి వారి గొంతు నొక్కేస్తుంది, ఆర్ధిక స్తోమత లేక.

దానివలన నష్టపోయేది, ప్రజలే.

మా ప్రకాశం జిల్లా ప్రజలు, 20 ఏళ్ళు గా, వైద్యం కోసం గుంటూరు పోతూ, దారిలోనే ప్రాణాలు విడుస్తున్నారు.

మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు హైదరాబాద్ చెన్నై పోతున్నారే గాని, వారి ప్రాణ రక్షణ వైద్యం కోసం, మా ప్రజల అణగారిన బతుకులకు మాత్రం, మంచి నమ్మక వైద్యం అందించ లేకపోతున్నారు, జిల్లా ప్రభుత్వ మరియు ప్రవేటు ఆసుపత్రులలో.

నాయకులకు నమ్మకం లేని చోట, ప్రజలకు వైద్యం చేపిస్తున్నారు. 20 ఏళ్ళ అభివ్రుద్ది ఇదేనా? ఇది ప్రజలకు అర్ధము అయ్యేలా చెప్పేది ఎవరు? కేవలము ఒక మంచి విలేఖరి మాత్రమే.

స్థానికముగా ఉండని ఎమ్మెల్యే, ఎంపీ, ప్రతి పక్ష నాయకులు, తమకు వచ్చే లక్ష జీతానికి లేదా ఫించన్లకు, తాము గెలిచిన ప్రాంతము లో, ఉన్న రోజులకే ధనం తీసుకుని, మిగతా ధనం, పీయెం సీయెం సహాయ నిధికి ఇస్తే బాగుంటుంది.

అంటే, ఎంపీ ఎమ్మెల్యే స్థానికము గా 3 రోజులు అందుబాటులో ఉంటే, లక్ష జీతం 30 రోజులకు అయితే, 3 రోజుల జీతమే ఇవాలి, కలెక్టర్ ఎమ్మార్వో ఫేస్బుక్ లో, ప్రజలకు అది తెలియ చేయాలి.

అలాగే సోషల్ మీడీయాలో, తమ పనుల సమాచారం లేని, ప్రజా సంభంధ అధికారుల అంటే పంచాయితీ సెక్రెటరి ఎమ్మార్వో ఆరోగ్య విద్యా లాంటి అధికారుల జీతాలలో, 5 వేల రూపాయలు నెలకు తగ్గించి, వారి ట్రైనింగ్ కొరకు ఖర్చు చేసి, వారికి సోషల్ మీడియా జవాబు దారీ తనం అలవాటు చేయాలని హాజరు తో పాటుగా, రోజుకు 5 సోషల్ మీడియా పోస్ట్ లు ఉండేలా చూడాలని, ప్రజలు కోరుతున్నారు. వారి ప్రమోషన్ బదిలీకి కూడా, దానినే కొలమానం గా వాడాలి, పని చేసే అధికారులు అని తెలియడం కోసం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2140 General Articles and views 2,085,138; 104 తత్వాలు (Tatvaalu) and views 237,295
Dt : 03-May-2021, Upd Dt : 03-May-2021, Category : General
Views : 986 ( + More Social Media views ), Id : 1152 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : may , world press freedom day , press , journalism , remainder , duty , govt , leaders , officials , unesco
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content