పథకం మోదీ ది, సొమ్ము ప్రజలది, ప్రచారం ఆర్భాటం స్టిక్కర్ జగన్, బాబు లది - ఆంధ్రా బీజేపీ - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2095 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2130 General Articles and views 1,966,172; 104 తత్వాలు (Tatvaalu) and views 231,422.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* కేంద్రం 60 % శాతం నిధులు
* సొమ్ము అంతా, ప్రజలు కట్టిన టాక్సులు
* అప్పు, మరలా పన్నులు పెంచి
1 min read time.

జగనన్న విద్యా కానుక, మంచి పథకమే. అధిక సొమ్ము కేంద్రం ప్రభుత్వం ది, అధిక సోకు రాష్ట్ర ప్రభుత్వం ది.

రాష్ట్ర ప్రభుత్వం 40% శాతం ఇచ్చే నిధులకే, జగనన్న విద్య కానుక అని గొప్పగా బ్యాగులు మీద రాసుకుంది. కేంద్రం ప్రభుత్వం ఇస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ 60 % శాతం నిధులు కి, మోదీ గారి బొమ్మ కూడా పెట్టాలి కదా మరి? అంటున్నారు జనాలు మరియు బీజేపీ నాయకులు.

బీజేపీ కేంద్ర మంత్రులతో లేదా నాయకులతో కార్యక్రమాలు పెట్టి, జనాలకు ఈ పథకాల కు కేంద్రం ఎంత సహాయం చేస్తుందో, తెలపండి చేత కావడము లేదని, అందరి ఆలోచన. ఆంధ్రా రాష్ట్ర బీజేపీ ఎప్పుడూ విఫలం అని, అధ్యక్షులు నాయకులు కార్యాచరణ రూపొందించాలని పలువురి భావన.

రాష్ట్రానికి రావాల్సిన, ప్రజలు కట్టిన జీఎస్టీ బకాయిలు ఇవ్వరు, బీజేపీ వారికి అంత ఇదే ఉంటే, ఆంధ్రా ఇస్తున్న పధకాల్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వమనండి, అని ఇంకొందరి వాదన. మోడీ ప్రకటించే పథకాలకు డబ్బులు రాష్ట్రాల నుండి వస్తాయి, ఆ పథకాలకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల పేర్లు జత చేస్తారా, అని ఇంకోకరి మాట. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఫోటోలు వేసుకో కూడదు కదా?

సొమ్ము అంతా, ప్రజలు కట్టిన టాక్సులు. మరి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు గా, ఏ నాయకుని బొమ్మైనా ఎందుకు వేసుకోవాలి? తెచ్చే అప్పు వీరు సొంతముగా జేబులో నుంచి చెల్లించడము లేదు కదా? మరలా పన్నులు పెంచి, జనము చెవులు మూస్తున్నప్పుడు ముక్కు పిండుతున్నప్పుడు, చంద్రన్న లేదా జగనన్న లేదా ఇంకో అన్న, తమ ఫోటోలు తో ప్రచారం చేసుకోవడము ఏమిటి, కాస్త అయినా జ్ఞానం ఉండదా, అని టాక్స్లు కట్టే వారి ఆవేదన.

ఇవి నాయకుల చదువుకున్న అనుచరులకు కూడా ఎక్కడము లేదు, మా నాయకుడు అని ఆవేశపడుతున్నారు, ఇక పల్లె ప్రజలకు ఎలా ఎక్కుతాయి, దేవుడా? అని ఇంకొందరు.

ఏ పధకం అయినా, రాష్ట్ర ప్రభుత్వం 40% లేదా 60%, కేంద్రం 60 లేదా 40 శాతం వాటా గా ఎంతో కొంత నిధులు ఇస్తున్నప్పుడు, ఆ విషయం స్పష్టంగా, ప్రభుత్వ జీతాలు పింఛన్లు సౌకర్యాలు పొందుతున్న అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, పేపర్ మరియు సోషల్ మీడియా ప్రకటన ల లో, ఎందుకు చెప్పరు స్పష్టంగా , ఏ రాష్ట్రంలో అయినా, ఇన్నాళ్లు? ఐఏఎస్ అధికారుల బాధ్యత కాదా?

వీరు అంటే రాష్ట్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం లో భాగం కాదా? అందులో తప్పు, సిగ్గు ఏముంది? మన కేంద్ర మే కదా, వేరే దేశం చైనా అమెరికా పేరు కాదు కదా. ప్రపంచ బాంక్ అప్పు కూడా చెప్పాలి, వడ్డీతో.

బడికి గుడి కి చందాలు సహాయం ఇస్తే చేస్తే, అందరి పేర్లు రాస్తాము కదా? లేకపోతే చందా అప్పు దానం సహాయం వద్దు అనాలి కదా.

చంద్రన్న జగనన్న పవనన్న వీరన్న లు, ఇన్నాళ్లు గా ఎందుకు దీనిని ప్రచారం చేయడం లేదు, ప్రతి పధకానికి? తెలుసుకుందాం, మీరైనా చెప్పండి అసలు విషయం తెలిస్తే?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2130 General Articles and views 1,966,172; 104 తత్వాలు (Tatvaalu) and views 231,422
Dt : 09-Oct-2020, Upd Dt : 09-Oct-2020, Category : Politics
Views : 869 ( + More Social Media views ), Id : 744 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : modi , scheme , public , tax money , campaign , sticker , pics , jagan , babu , andhra , bjp
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content