ధనము అభిజాత్యము, తప్పులు కోల్పోవడం ఒప్పుకోరు. ఆశ్రమాలకు చేరుస్తున్నారు, మనసు లేని బండలు గా - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,880,426; 104 తత్వాలు (Tatvaalu) and views 226,161.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

అమ్మకు 2014 లో 400 సుగర్ తో ఇంక చివరనే అని చెపితే, ఒక మనిషి తోడు ఉంటే, ఇప్పుడు ముగ్గులు గుడి కరోనా, అన్ని ధైర్యముగా ఎదుర్కొంటున్నది 75 ఏళ్ళ అమ్మ, అని అందరికీ తెలుసు.

అయితే, మనము పిల్లలుగా కొన్ని త్యాగాలు చేయాలి తప్పదు, రుణం తీర్చుకోవాలి అన్న సదుద్దేశము ఉంటే.

చూడండి లోపల వీడియో, ఒక వ్రుద్దాశ్రమంలోది. ఆ విలేఖరి కూడా, మన లాగే గుచ్చి గుచ్చి అడిగి, వారి మనసులోని బాధను, గతములో చేసిన తప్పులకు, పశ్చాత్తాపమును బయటకు తేవాలని ప్రయత్నము చేసారు.

తూలిపడే స్టేజీ లో, ధనము సంపద, అక్కరకు రావు, ఆదరించే చెయ్యి మాత్రమే కావాలి, తిట్టి కసురుకోకుండా అని వారికి అర్ధము కావడము లేదు.

మేము ఇలా పెంచాము దయలేకుండా బాధ్యత లేకుండా, కేవలం ధనమును ప్రేమించి, మాకు అవే ఫలితాలు వస్తున్నాయి. మా తల్లి దండ్రులను ఇలాగే గాలికి వదిలాము అన్న బాధ వారి లో లేదు.

అంతా బాగుంది ఇక్కడ అని మనసు చంపుకుని అబద్దాలు చెపుతున్నారు, ఇప్పుడు అయినా నిజాలు చెప్పి, తర్వాత తరాలను బాగుచేయాలి.

విలేఖరి అడుగుతుంది, అక్కడ వసతులు దాని వలన మీ ఆనందం మీ ధైర్యం గురించి కాదు, మీ కుటుంబములోని మీ యొక్క, మరి మీ పిల్లల మంచి చెడు మానవత్వం పెంపకం క్రుతజ్ఞతలు దయ జాలి విశ్వసనీయత గురించి. ఆ పదాలకు అర్ధం తెలుసా అని అడుగుతున్నారు. ఎందుకంటే, భవిష్యత్ లో ఈ ఆశ్రమాలు ఉండకుండా, అందరూ తమ తల్లి దండ్రూలను దగ్గర పెట్టుకోవాలి అని.

మాత్రు పిత్రు దేవోభవ అన్న దానికి, గణేష్ శివ పార్వతి ల చుట్టు తిరిగిన దాని, అర్ధము అడుగుతున్నారు. సొంత కన్న వారికే సహాయము చేయని, కఠిన పాషాణ బండ హ్రుదయాలు, సమాజానికి, జీవిత భాగస్వామికి, పిల్లలకు, స్నేహితులకు న్యాయం సహాయము చేస్తారా? ఏరు దాటాక తెప్ప తగల వేయరా?

ఇంటి బయట వేసినాక, ఇంకా పిల్లలు తిడతారు అన్న భయము ఎందుకు, ఇంకా అంత కన్నా అవమానము ఏమి చేయగలరు తమ కుసంస్కారముతో.

చూసేవారికి కొంచేము ఇబ్బంది గా ఉంటుంది ఆయన అడిగే ప్రశ్నలు, గుండె లోతుల్లో నుంచి నిజమైన బాధను వారు పోగొట్టుకుంటున్న జీవితాన్ని మనవళ్ళు కొడుకులతో, వారితో నే చెప్పించాలని, అలాగే తాము చేసిన తప్పులు కూడా, వారిచే చెప్పించాలని ఆయన చాల ప్రయత్నము చేశారు.

కానీ ధనము అభిజాత్యము ఉన్నవారు, తొందరగా తమ తప్పులు ఒప్పుకోరు, తాము ఏమి కోల్పోతున్నామో ఒప్పుకోరు. ఇంకా పిల్లలను వెనకేసుకు వచ్చి, వారి పిల్లలను కూడా ఇదే ఆశ్రమాలకు చేరుస్తున్నారు, మనసు లేని బండలు గా పెంచాము పెరిగాము అని ఒప్పుకోవడము లేదు, కొందరు 10 ఏళ్ళు ఆశ్రమములో ఉన్నా కూడా.

ఒకాయన, మా పిల్లలు ఇంకా అమెరికా తీసుకుపోతారు అని గర్వముగా చెపుతున్నారు. ఇప్పుడు నిర్దయగా ఆశ్రమములో పడేసిన వారు, అప్పుడు ఆశ్రమములో పడేయరా అంటే, సౌకర్యాలు ఎక్కువ ఉంటాయి అంటున్నారే గానీ, మనసులు బంధాలు ప్రేమలు పోతున్నాయని కించిత్తు బాధ లేదు. ఇంకా సంపాదించుకోనీ యండి, మనకేమి హాయిగా ఇక్కడ ఉందాము అంటున్నారు.

ఏమ్మా, చుట్టాలు బంధువులు వస్తున్నారు అని, మిమ్మల్ని అడ్డము అని తలచి, కొడుకు కోడలు ఇక్కడ పెడితే, చిన్నప్పుడు ఎన్ని కష్టాలలో ఉన్నా మీరు సాకిన సంగతి వారు మరచారు కదా అంటే, ఏమీ చెప్పకుండా మిగతా వారికి కనువిప్పు చేయకుండా, గమ్ముగా ఉంటున్నారు. మరలా ఈ వీడియో చూసి, పిల్లలు అరుస్తారు అని ఏమో.

చని పోయే ముందు, ఇంటికి తీసుకుని వెళుతారు, అని కొందరు పిచ్చిగా ఎదురు చూస్తున్నారు.

కానీ ఒకాయన మాత్రము, వాస్తవము ఒప్పుకున్నారు, కన్నీరు కారుస్తూ. మేము ఇంత మంది పిల్లలము ఉండి, మా నాన్న ను ఆశ్రమములో ఆనాడు వేసాము. మా నాన్న అడిగారు, ఎన్నోసార్లు ఎప్పుడు ఇంటికి తీసుకుని వెళతారు అని. కానీ మేము తేలేదు, మా ఇంట్లో గొడవలు స్వార్ధము చూసుకుని. ఈ రోజు, దానికి శిక్ష గా నేను కూడా ఇక్కడకు వచ్చాను, నా పిల్లలూ అదే పని చేస్తున్నారు. తప్పకుండా, నాకు ఇదే తగిన ప్రాయశ్చితము అని ఏడుస్తూ తన తప్పు ఒప్పుకున్నారు. 28 వ నిముషము దగ్గర ఆయన మాటలు తప్పక చూడండి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,880,426; 104 తత్వాలు (Tatvaalu) and views 226,161
Dt : 17-Jan-2021, Upd Dt : 17-Jan-2021, Category : General
Views : 870 ( + More Social Media views ), Id : 930 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : money , admit , losing , mistakes , love , sending , parents , old age , ashrams , mindless rocks , selfish
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content