గత మంచి పంచాయితీ ఈవో - పక్క స్థలము లో చెత్త తీయించి, దాని ఖర్చు భరాయిస్తాము అంటే, వద్దు? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,307; 104 తత్వాలు (Tatvaalu) and views 226,424.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*మా గత మంచి పంచాయితీ ఈవో - పక్క స్థలము లో చెత్త తీయించి, దాని ఖర్చు భరాయిస్తాము అంటే, వద్దు అన్నారు. చెత్త తీయించి, స్థల ఓనర్ దగ్గరే తీసుకున్నారు.*

మీకు తెలిసిన మంచి అధికారి ఉంటే, గొప్పగా రాసి పంపగలరు, పదిమందికి తెలియ చేద్దాము.

*Our past good Panchayat Executive Officer - They said no for cost share by us - we will clean and remove the garbage in that place and get cost from the land owner*

If you know a good officer, send a great write-up, let other people know.

*ఇది ఇప్పటి సంగతి* - మన ఇంటి దగ్గర రోడ్ వెడల్పు చేయిస్తూ లేదా కరెంట్ స్థంబాలు సరి చేయిస్తూ, కమ్మటి వేప మరియు కొబ్బరి చెట్టు కొట్టేసారు. ఆ వేపాకులు మన ఇంటి మీద పడుతున్నాయి, అని ఏళ్ళుగా పక్క వారికి చెప్పాము. వారికి ఇతరుల బాధలు, సర్వ సాధారణముగా వినపడవు. వారి వేప చెట్టు ముక్కలు కూడా, మన ఇంటి ముందే వేసారు, మనకు సేవ పుణ్యం రావాలి అని. కొత్త ఈవో గారికి చెప్పాము, ఇంకా జవాబు రాలేదు తీసారో లేదో.

తెలీక పంచాయితీ వారు వేసినా, బుద్ది సంస్కారం ఉన్న మనము చెప్పాలి కదా, ఈ చెట్టు మాదే, ఈ చెత్త మాదే, ఈ ముక్కలు మావే అని. అబ్బే మంచి మాట, నోరు దాటదు. అదేమంటే మేము చెప్పామా, బుద్ది లేక పంచాయితీ వారు వేస్తే, మాది తప్పా అంటారు.

వీరికి వచ్చే జన్మలో, తప్పక ప్రభుత్వ ఉద్యోగం రాసి పెట్టి ఉంది. ఎందుకంటే, ప్రమోషన్ - ఇళ్ళ స్థాయి నుంచి పంచాయితీ లేదా మున్సిపాలిటీ, ఇతరులను బాధపెట్టడం, గతం మరవడం ఎక్కడ నుంచి వచ్చాము అని, మన స్వార్ధం చూసుకోవడం లో పండి పోయారు.

ప్రభుత్వ ఉద్యోగం రానంత వరకు ఒక బాధ, ఫాన్ కింది నిద్ర లేదు అని, వచ్చిన తర్వాత ఇంకో బాధ, పాడు జనం నిద్ర లేపుతున్నారు, వీరికి జవాబు చెప్పాలా అని, ప్రజల సేవకులమని, ఉద్యోగ ప్రమాణం మరవడం, వారు కట్టే పన్నులతో, మన కుటుంబాలు నడుస్తున్నాయి అని మరచిపోతారు.

మనము, నాయకులు, ఓటర్లు అంతే కదా, ఓటు అమ్ముకోవడం కొనడం అంటే, తరతరాల వంశ సరదా, తప్పు అన్నా వినము. చూసి మరి మన బుద్ది కి సరిపోయేటట్లు - నక్క పులి పాము కే మన ఓటు, మనల్ని పతనం చెయ్యాలి అని. స్వస్వరూపాన్ని మరవడం అంటే ఇదే. అందుకే మన నినాదం, అధికారులు నాయకులు ది ఎప్పుడూ మొదటి తప్పు కాదు, కేవలం ఓటర్ల దే మొదటి తప్పు, పాపం అని.

సరే పంచాయితీ మంచి కోసం, చెట్లు పోతే పొయ్యాయి, మరి పంచాయితీ స్థలములో రోడ్డు పక్క, కబ్జా షాపులు ఎందుకు తీయించలేదు అని అడిగాము వారిని, పనిలో పని అయిపోతుంది కదా. అక్కడ సైకిళ్ళు బండ్లు ఆపి, రోడ్డు కు పక్క ఇళ్ళకు అడ్డముగా ఉంచరు, అలాగే పంచాయితీ ఆదాయం పోతుంది, నష్టం కదా అని.

పంచాయితీ వారి చేయి తడిపితే, వారు కళ్ళు మూసుకుని, ప్రభుత్వానికి ఆదాయం ఆపి తామే దిగ మింగుతూ, ఇలాంటి తప్పుడు పనులు ప్రోత్సహించడం మామూలే కదా అన్నారు. సరేలే, మనము విన్నవించడం కన్న చేయగలిగింది ఏముంది, తర్వాత పెద్దల దయ. ధర్మం ను కాపాడతారో, కాల రాస్తారో.

కానీ ఖర్మ కాలి, రేపు ఆ కరెంట్ వైరు తెగి, ఆ షాప్ మీద పడి, జనాలు పోయారు అనుకో, ఈ లంచం పాపం, ఆ జనాలు పోయిన పాపం, అసలు ఇక్కడ షాపు ఎందుకుంది, పంచాయితీ అనుమతి ఇచ్చిందా, ఇస్తే ఇంటి పన్ను తో పాటుగా, షాపు పన్ను కూడా జమ అయ్యిందా, వ్యాపార షాపు హాస్టల్ కరెంట్ బిల్లు ఎక్కువ రేటు తో కడుతున్నారా లేదా పంచాయితీ వారు కక్కుర్తి పడి, ఇంత మంది చావుకు కారణం అయ్యారా, అని వారినే నిలదీస్తారు.

గోటితో ధర్మముగా పోయేదానికి, గొడ్డలి దాకా తెచ్చుకోవడం అవసరమా? చట్టం చుట్టమైనా, పంచ భూతాలు వదలవు, మన పిల్లల మానసిక ఎదుగుదల పై ప్రభావం చూపిస్తుంది, ఆ లంచం ఆ తప్పుడు దోవ అందరికీ, అంటే ఇచ్చిన తీసుకున్న కూడా. మన ప్రతి తప్పుడు పని కి ఫలితము ఉంటుంది మిత్రమా అని ఇద్దరమూ నవ్వుకున్నాము.

రేపు మన కుటుంబ సభ్యులు కారు, స్కూటర్ తో పోతే, రేపు ఆసుపత్రిలో లక్షల బిల్లు వేస్తే, అవినీతి అధికారులకు పట్టిస్తే, పిల్లలు చదవకుండా/ ఉద్యోగం చేయకుండా/ భాగస్వామి మాట వినకుండా తప్పుడు దోవలో తిరిగితే? ఖర్మ విడువదు.

*సరే గతానికి వెళదాము* - మనము ఏ కధనం పంపినా, అది పై రాష్ట్ర/ జిల్లా స్థాయి నాయకులు/ అధికారులు నుంచి, కింద మున్సిపల్/ పంచాయితీ అధికారులు/ నాయకులు/ ప్రజలు దాకా వెళుతుంది. సంస్కార పుణ్యాత్ములు స్పందిస్తారు తప్పకుండా.

జిల్లా పంచాయితీ అధికారి, పుణ్యాత్ములు, మెమో పంపారు ఒకసారి, వారి పేరు తప్పు పడితే, ఇన్ని రోజులు ఎందుకు పట్టింది సరి చెయ్యడానికి అని, వెంటనే సరి చేసారు.

మన పక్కన 10 సెంట్ల స్థలం, మనకు తెలిసిన వారికి ఆనాడు, తక్కువ ధరలో, నాన్న ఇప్పించారు. మాకు వద్దు మామా అన్నారు, ఆయన, అంటే మనకూ మామనే. ఇరు వర్గాలు అయినా, అది బంధం స్నేహం బతుకు కోరడం అంటే - లేదు అల్లుడు నీ కూతుళ్ళకు కట్నము గా పనికి వస్తుంది లే తీసుకో అని ఇప్పించారు.

అలాగే జరిగింది, అల్లుళ్ళకు కట్నం కింద ఇచ్చారు. పల్లెటూరు నుంచి తెచ్చి, అన్ని సమకూర్చి, నా బిడ్డకు ఓ దోవ చూపిన దేవుడివి అని వాళ్ళ అమ్మ మన ఇంటి దగ్గర ఎన్నో సార్లు అన్నారు చిన్నప్పుడు. మరి ఎంత క్రుతజ్ఞత విశ్వసనీయ ఉండాలి, వారికి, మన మీద? ఎంత అండగా ఉండాలి మనకు? ఈ రోజు అదే స్తలం కోటి దగ్గర, ఆనాడు వేలు. కాని కలికాలపు బుద్దులు గతం మరుస్తాయి.

ముళ్ళ చెట్ట్లు పెరిగి, మన ఇంటి పైన పడుతూ, జనం వేసే చెత్తతో, పిచ్చి చెట్లతో గందర గోళం గా ఉంది. కరోనా ముందు సమయం. అటువైపు నడి చే జనాలకు రోగాలు వస్తాయి గాలి పీల్చినా. ముందు పెద్దల చేత చెప్పించాము, మామయ్యకు. వారు ఇంటికి వెళ్ళి చెప్పారు, ససేమిరా వినలేదు. ఏమైనా చేసుకోమను అని చెప్పారు. మేము ముళ్ళ చెట్టు, చెత్త తీయము అన్నారు, ప్రజల సంగతి దేవుడు ఎరుగు అన్నారు.

మామయ్య లోభి తనం తెలిసి, మన డబ్బులతో ముళ్ళ చెట్టు కొట్టించాము, అయినా మామయ్య కూలీలను వారిని తెచ్చిన వారిని అరిచారు, అభినందించక పోగా. చూడండి అహంకారము ఏ స్థాయిలో ఉందో, క్రుతజ్ఞత విశ్వసనీయత మరచి.

ఆ ప్రాంతము ఫోటో తీసి, ఎమ్మెల్యె ఎంపీ ఈనాడు సాక్షి కలెక్టరు ఎమ్మార్వో పంచాయితీ అధికారులు మంత్రులు, పై నుంచి కింద దాకా (రాష్ట్ర/ జిల్లా/ మున్సిపల్/ పంచాయితీ), పంపాము కధనముతో, ప్రజా క్షేమ పట్టించుకోరా అని. ఆనాడు చంద్రన్న కు, ఈనాడు జగనన్నకు మంచి చెయ్యాలి కదా.

వెంటనే, మా పాత పంచాయితీ ఈవో గారు, చెత్త తీసే జేసీబీ మిషన్ పంపించి, మొత్తము శుభ్రము చేయించారు. Apr, 2020.

దానికి ఎంత అయ్యిందో చెప్పండి, మా మామయ్యెలే, మేము ఇస్తాము అని చెప్పాము, లేదండీ వారి స్థలము వారి బాధ్యత, అని మన ధనం తీసుకోలేదు. సరే ఏదైనా మంచి కార్యక్రమం జరిగితే లేదా సిబ్బందికి కాఫీ టిఫ్ఫిన్ కు పంచేటట్లు అయితే చెప్పండి, అదే ధనము మేమూ పంచుకుంటాము అని చెప్పినా, సరేలే అని నవ్వారు.

అప్పటి నుంచి, మనము ఏ ప్రశ్న అడిగినా, వెంటనే జవాబు వస్తుంది. మొన్న కరోనా టీకాలు కూడా ఇంట్లో అద్దె వారు వేయించుకోవటం లేదు అంటే, పాపం మనుషులను పంపి వేయించుకోమని అడిగించారు, అంత మంచి వారు.

మరి కొత్త ఈవో గారు, మన అందరికీ మంచి చేస్తూ, స్పందిస్తూ ఉంటారు అని ఆశిద్దాము.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,307; 104 తత్వాలు (Tatvaalu) and views 226,424
Dt : 09-Aug-2023, Upd Dt : 09-Aug-2023, Category : General
Views : 258 ( + More Social Media views ), Id : 1871 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : past , good , panchayat , eo , cost , share , clean , remove , garbage , cost , land , owner
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content