Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. *ప్రేమాభిషేకం - ఆగదు ఏ నిముషము నీ కోసము, తారలు దిగివచ్చిన వేళ - అక్కినేని, దాసరి *
ఆగదు ఏ నిముషము, మన కోసము, ఆగితే, సాగదు, ఈ లోకము. మరణం తధ్యమనీ, ఏ జీవికి తప్పదనీ, తెలిసినా, ఈ మనిషి తపన ఆగదు.
ఎంత అర్ధం ఉంది ఈ పాటలో, మన భవిష్యత్ మొత్తాన్ని రంగరించి రాసారు. అందుకే అంటారు, తాగుబోతులు, పతనం చివరి దశలో ఉన్న వారు, గీత వేదాంతం చెపుతారు అనేది.
కానీ మన తాపత్రయం, అసలు పతనం కాకుండానే, వేదాంతం అర్ధం తెలుసుకుని, ప్రశాంతము గా మనశ్శాంతితో ఉందాము, అలాగే పోదాము అని. అద్దెకు వచ్చిన వారం ఏరోజైనా పోక తప్పదు కదా? ముందు వెనుకా, కాకపోతే, మన చెడు తిరుగుళ్ళు తిండి వలన, రోగాలతో మంచం పై పడి మాత్రం వద్దు.
అందుకే 2017 లో నే 16 మూలికల ఇంటి వైద్యం పంపాము. కొంతమంది ఇంటికి వచ్చి తీసుకున్నారు, ఇంకొంతమంది నవ్వు కున్నారు. మొన్ననే సగం ఖర్చు భరిస్తాము అని, బంధువులు స్నేహితులను పిలిచాము, గతము లోనూ పిలిచాము - వారికి ఇంటి ఆయుర్వేద వైద్యం, పౌష్టికాహారం, మానసిక బలం, మానవత్వం ఆధ్యాత్మికం అన్ని నేర్పి పంపుతాము.
నిన్ననే క్రిష్ణం రాజు గారి శివైక్యం విన్నాము, కోవిడ్ తర్వాత పరిస్తితుల వలన అని స్పష్టము గా చెప్పారు.
ఆత్మ శుద్ది సాధన లేకుండా, మనము బాధతో మోహముతో అవమానము కష్టాలు తో పోతే, మరలా ఇదే కుక్క బతుకు బాధలు తగవులు తన్నులు బంధాలు పీలికలు పొలికేకలు. ఎన్ని జన్మలైనా తప్పదు, ఆత్మ శుద్ది రాకపోతే.
అందుకే ప్రతి జన్మలో మనము ఒక మెట్టు అయినా కనీసం ఎక్కాలి, అంటే 35 మార్కులతో అన్నా పాస్ కావాలి. లేదంటే, కుక్క తోక వంకర, మన పునర్జన్మ భయంకర.
హృదయుం అద్దమనీ, పగిలితే అతకదనీ, తెలిసినా మృత్యువూ రాక ఆగదు - ఎంత మంది దీనిని అర్ధం చేసుకుని, ప్రశాంతము గా బతుకుతున్నాము, ప్రాపంచిక మాయలో పడకుండా?
జీవితమొక పయనమనీ, గమ్యం తెలియదనీ, తెలిసినా, ఈ మనిషి పయనమాగదు. మరణం తధ్యమనీ,ఏ జీవికి తప్పదనీ, తెలిసినా, ఈ మనిషి తపన ఆగదు. ఆగుతుందా, మన తపన, ఈ సంపద, ఈ ఇళ్ళు, ఈ పదవి, ఈ అధికారం, ఈ పతనం, అన్ని మనకే కావాలి, కానీ చివరలో ఒట్టి చేతులే, మనదంతా పరుల పాలు.
తారలు దిగివచ్చిన వేళ మల్లెలు నడిచొచ్చిన వేళ చందమామతో ఒక మాట చెప్పాలి, మంచి సాహిత్యం ఉన్న పాటకు ఉదాహరణ ఇది. మీరు పాడుతూ, ఇతరులను పాడిస్తూ, వారి ఆరోగ్యమును పెంచుతారు కదూ, ఉచిత మనశ్శాంతి ఇస్తారు కదూ.
1) తారలు దిగివచ్చిన వేళ.., .మల్లెలు నడిచొచ్చిన వేళ...
చందమామతో. ఒక మాట చెప్పాలి.. ఒక పాట పాడాలి 2 ||తారలు||
ఊరంతా ఆకాశానా.., గోరంత దివ్వెగా
పిడికెడంత గుండెలోనా.., కొండంత వెలుగుగా
కనిపించే రంగులన్ని, సింధూరపు చీరెగా
కనిపించని సిగ్గులన్ని, ముసుగేసిన మబ్బుగా - 2 లైన్లు 2 సార్లు
నిలిచిపొమ్మనీ.. మబ్బుగా..., కురిసిపొమ్మనీ.. వానగా...
విరిసిపొమ్మనీ.. వెన్నెలగా.., మిగిలిపొమ్మనీ.. నా. గుండెగా..
మిగిలిపొమ్మనీ... నా గుండెగా..
చందమామతో ఒక మాట చెప్పాలి.. ఒక పాట పాడాలి...2
నీలిరంగు చీకటిలో.., నీలాల తారగా..
చూడనంత శూన్యములో..., దొరకనంత ఆశగా..
వేటాడే చూపులన్ని, లోలోని ప్రేమగా.
వెంటాడే వలపులన్ని, కాబోయే పెళ్లిగా. - 2 లైన్లు 2 సార్లు
చెప్పిపొమ్మనీ.. మాటగా..., చేసిపొమ్మనీ.. బాసగా...
చూపిపొమ్మనీ.. బాటగా..., ఇచ్చిపొమ్మనీ.. ముద్దుగా...
ఇచ్చిపొమ్మనీ... ముద్దుగా
చందమామతో ఒక మాట చెప్పాలి.. ఒక పాట పాడాలి...2
సాహిత్యం: దాసరి నారాయణరావు, గానం: యస్.పి.బాలు
2) ఆగదు ఆగదు... ఆగదు
ఆగదు ఏ నిముషము, నీ కోసము..
ఆగితే, సాగదు, ఈ లోకము - 2 లైన్లు 2 సార్లు
ముుందుకు సాగదు, ఈ లోకము
ఆగదు.. ఆగదు... ఆగితే.., సాగదు..
జాబిలి చల్లననీ...,వెన్నెల దీపమనీ..
తెలిసినా, గ్రహణమూ, రాక ఆగదు
పువ్వులు లలితమని...తాకితే రాలునని..
తెలిసినా, పెనుగాలి రాక ఆగదు
హృదయుం అద్దమనీ...పగిలితే అతకదనీ
తెలిసినా..., మృత్యువూ రాక ఆగదు
మృత్యువూ... రాక ఆగదు
ఆగదు ఏ నిముషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము..., ముుందుకు సాగదు ఈ లోకము
జీవితమొక పయనమనీ...గమ్యం తెలియదనీ..
తెలిసినా, ఈ మనిషి పయనమాగదు..
జననం ధర్మమని...మరణం కర్మమనీ..
తెలిసినా, జనన మరణ చక్రమాగదు..
మరణం తధ్యమనీ...,ఏ జీవికి తప్పదనీ..
తెలిసినా...ఈ మనిషి తపన ఆగదు.. ఆయాసం హహ
ఈ బ్రతుకు తపన ఆగదు
ఆగదు ఏ నిముషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము..., ముుందుకు సాగదు ఈ లోకము, దగ్గు దగ్గు, ఆగదు ఆగదు... ఆగితే సాగదు
మనసు మనసు కలయికలో
ఉదయిుంచక ఆగదు.,అనురాగం..
అనురాగపు అర్పణలో...
చెలియిుంచక మానదు, త్యాగం...
ప్రేమ చెరిగినా.., మనసు చెదిరినా...
ఆగదు త్యాగాభిషేకం...
గెలుపు ఓడినా.., ఓటమి గెలిచినా...
ఆగదు ప్రేమాభిషేకం, దగ్గు ఆగదు ప్రేమాభిషేకం....దగ్గు దగ్గు దగ్గు
Movie: Premabhishekam, Music : Chakravarthy,
Directed : Dasari Narayana Rao.
చిత్రం: ప్రేమాభిషేకం (1981), సంగీతం: కె. చక్రవర్తి
Akkineni A.N.R, Jayasudha, Sridevi, Murali Mohan, Mohan Babu
Premabhishekam Agadu Agadu ea nimishamu ni kosamu taralu digivachchina vela anr dasari
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1764 General Articles and views 1,281,160; 90 తత్వాలు (Tatvaalu) and views 175,745 Dt : 13-Sep-2022, Upd Dt : 13-Sep-2022, Category : Songs
Views : 366
( + More Social Media views ), Id : 1516 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
premabhishekam ,
agadu ,
nimishamu ,
taralu ,
digivachchina ,
anr ,
dasari ,
jayasudha ,
sridevi Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments