మా నాన్న కు 2 సంచులు, నాతో ఇంకో 2 సంచులు తీసుకుని వెళ్లి, వచ్చే జన్మలో వాడుకుంటాం - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2139 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2174 General Articles and views 2,219,914; 104 తత్వాలు (Tatvaalu) and views 245,328.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
దాంకుంటున్నారు ఇంట్లో, కొట్లో, వాట్సప్ లో

బిడ్డ కు నేర్పిన కుసంస్కారమే, కళ్ళు తెరిపిస్తుంది

మా పెద్దల కే లేదు కదా, ఇంక మాకెలా ఉంటుంది

అదీ ఎనక్కి పోయింది, ఐరన్ లెగ్ వలన

మాకు వడ్డీ లకు ఇచ్చిన, జనం నోట్లో మట్టే
1 min read time.

స్వార్థ పూరితమైన, నీతి నియమాలు జాలి దయ కృతజ్ఞతలు లేని, వడ్డీ రావణ కుటుంబం, ఇంటి మరియు ఆఫీసు నంబర్ వాట్సాప్ ఆపుకుందని, నీకు తెలుసు కదా రాము అని సోము చెపుతున్నాడు తన బాధ ఈ కింది విధముగా.

దొంగలు లాగ, జనాలతో పాటుగా, బంధువులు, సొంత అన్నదమ్ముల బిడ్డలు మరియు ముదుసలి తల్లి ధనం తో కాలం జరుపుతూ, బతుకుతూ, మెతుకులు తింటూ కూడా, దాంకుంటున్నారు ఇంట్లో, కొట్లో, వాట్సప్ లో. ఈ జూన్, జులై లో ఇస్తాము అని చెప్పారు, కానీ తప్పుడు రకాలుగా మాయమై పోయారు.

కానీ దేవుని రాత నుంచి తప్పుకోగలరా? సంస్కారం ఉన్న వారు, ధనం వడ్డీ తో ఇచ్చిన తర్వాత, దాంకుంటే ఆపుకుంటే, ఇబ్బంది లేదు కదా. వాళ్ళ తల్లి దండ్రుల పరువు తీసారు. బిడ్డలు ను, జనం డబ్బు తో, కేబుల్ ఎలక్షన్ లో ఉంచుతూ, బతకడం నేర్పిస్తున్నారు. దేవుని తో పాటు, బిడ్డలు కు నేర్పిన కుసంస్కారమే, వాళ్ళ కళ్ళు భవిష్యత్ లో తెరిపిస్తుంది. మేఘనాధుడితో కొన్ని మాటలు ఇలా ఉంటాయి.

* తమ్ముడూ, బాబాయి లు, అక్కలు , ముదుసలి వాళ్ళు, బంధువులు, ఊళ్ళో జనం, ఇంతమంది ధనం తో బతుకుతూ, కడుపు నింపుకొని, ఆస్తులు పెంచుతూ, వాళ్ళ అందరి ఉసురు పోసుకోవడం 2016 నుంచి జరుగుతుంది. ఈతరం నీకైనా, కనీసం సిగ్గు లజ్జ అవమానంగా, లేదా? దయ జాలి ఉండదా?

మీరు వెనక్కి ఇచ్చే లోపు ఆ జనం పోయినా, పెళ్లి చదువు ఇతర అవసరాలు ఆగినా, ఆ పాపం మీది మీ కుటుంబముది కాదా?

** ఇంతకీ తమ్ముడు అంటున్నావు, నువ్వు మాకు కోట్లు ధనం ఉన్న చుట్టానివా? మాలాగ ఊళ్ళో వాళ్ళ, ధనం ఎగ్గొట్టావా? నల్ల ధనం పోగేశావా? ఇవి అన్ని చేయనిదే, మేము చుట్టాలుగా భావించము, గౌరవించం. ఊళ్ళో ఉన్న చుట్టాలనే, మేము పట్టించుకోము కదా.

మేము ఎవరి దగ్గర కైనా వెళ్ళాము కలిసాము తిరిగాము అంటే, వాళ్ళు మాలాగ, నీతి నిజాయితీ లేని అవకాశ వాద గోడ మీద పిల్లు ల, దగ్గరకే వెళతాము, మాట్లాడతాము, కలుస్తాము. అందుకే మీ వాట్సప్ తీసేసాము. ఎగ్గొట్టిన డబ్బు, ఏళ్లుగా అడిగితే విసిగిస్తే, మాకు నచ్చదు. ఇంకా కొత్త వాళ్ళ ను మోసం చేయడానికి, సమయం చాలదు కదా మాకు.

ఇంక సిగ్గు లజ్జ అంటావా, మా పెద్దల కే లేదు కదా. ఇంక మాకెలా ఉంటుంది. నాయనమ్మ తోనే అన్ని వదిలేశాం. జాలి దయ, ఉండవు గాక ఉండవు. అవి ఉంటే, ఇన్ని అపార్ట్మెంట్ లు ఆస్తులు ఎలా పెరుగుతాయి?

* మరి జాలి దయ కనికరం లేకపోతే, మీ అమ్మ నాన్న భవిష్యత్తు రోగ ముదుసలి ఆసుపత్రి ఖర్చు లు, చివరి రోజుల్లో చూడటం?

** ముందు జాగ్రత్తగా, ఇప్పటికే వేరు గా బయట ఉంటున్నాము. మా పిల్లల నే, వాళ్ళ దగ్గర వదిలాం, పెంచే ఓపిక లేక. ఇంక మేం ఊళ్ళో వాళ్ళ నుంచి దోచిన సొమ్ము, తల్లి దండ్రుల రోగాల మీద ఖర్చు పెట్టం, ఒకవేళ పెట్టినా అది ఊళ్ళొ వాళ్ళ సొమ్ము. అలాగే చివర రోజులు మా దగ్గర ఉంటామని, ఎటూ అడగరు, మేమూ ఉంచము కూడా. కనికరం జాలి దయ ఎవరికీ, ఎవరి మీదా లేదు కదా.

* మరి జూన్ జులై లో, ఎలా ఇస్తాం అని అలవోకగా అబద్ధాలు చెప్పారు?

** జనం సొమ్ము తో, ఎలచ్చన్ లో గెలిచిన, మరలా కార్పోరేషన్ లో, ఊళ్ళో వాళ్ళ ధనం అప్పనముగా కొట్టేసి, అంతో ఇంతో ఇద్దాం, చేతులు దులుపుకుందాం అనుకున్నాము. కానీ అదీ ఎనక్కి పోయింది, మా ఐరన్ లెగ్ వలన.

వెర్రి జనం, 2016 నుంచి, మా హరి కధలు వింటూ ఉన్నారు, కాబట్టే చెప్పాము. ఇప్పుడు తొందరెందుకు? మేము ఇప్పుడు కూడా, కొట్లో కొత్త చీటీ లు , వడ్డీ లు నడుపుతున్న, ఏమి పీకారు? మాకేమీ ఇబ్బంది లేదు, జనం ఎట్లా పోయినా, మేము బాధ పడం. మాకు అలవాటే, జనము ఏడుపుల కన్నీళ్ళమీద మిద్దెలు కట్టడం.

* నీకు కనీసం వడ్డీ ల దగ్గర నే మాట్లాడటం రాదు కదా, అమర్యాదగా బూతులు తిడతావు, జనం లేటు చేసిన. అసలు కొట్లో ఉండవు కదా. మరి గెలిస్తే పెజా సేవ, ఎలా చేస్తావు?

** నా బొంద , నేనడిగానా ఆ ఎలచ్చన్ సీటు? కేబుల్ దగ్గర కూడా, నేను కూర్చుని సరిగ్గా మేనేజ్ చేయడం రాకపోతే, మా అమ్మా అబ్బా ఆఫీసు లో కూర్చుని, వాళ్ళ చావు వాళ్ళు చస్తా, ధనం మీద దురాశ పేరాశతో, ఏదోలా నడుపుతూ ఉన్నారు.

పెద్ద మొత్తంలో, అప్పనంగా ఊరకే కొట్టేయాలి అంటే, ఎలచ్చన్ మంచిది తేలిక మార్గము అని, మా నాన్న అభిప్రాయం. ధనం లేదని చెప్పి, ఎలా ఎలచ్చన్ కు వెళ్ళారు అని జనం అడగరు, అడిగినా ఊసినా, ఎదో ఒకటి అబద్దము చెప్పి తుడుచుకుని, ధైర్యంగా ముందుకు వెళతాము. కేసులు కూడా ఉండవు, అధికారం ఉంటుంది కదా మా చేతిలో.

ఎలచ్చన్ కు మాత్రమే పేరుకు ముందు నేను, వెనక దొంగ పనులు నడిపేది అంతా జనకుడే. ఇంక, మాకు వడ్డీ లకు ఇచ్చిన, జనం నోట్లో మట్టే.

* మరి నీ బుద్ధి కూడా ఇంత వక్రంగా ఉంటే, మరి నీ పిల్లల పెంపకం, సంస్కారం?

** ధనం ముఖ్యం మాకు, సంస్కారం అనవసరం. నువ్వు సంస్కారం అనుకొని, తల్లి కి ఖర్చు పెట్టి నష్ట పోతున్నావు, మూర్ఖత్వం తో. మేము అలా చేయము ప్రాణాలు పోయిన కూడా, మాకు ధనం ముఖ్యం.

పైకి పోతూ కూడా మాతో ధనము తీసుకుని వెళ్ళాలి అని, మా నాన్న కు 2 సంచులు, నాతో పాటుగా ఇంకో 2 సంచులు తీసుకుని వెళ్లి, వచ్చే జన్మలో వాడుకుంటాం. ఇనుప బుల్లెట్ ఫ్రూఫ్ సంచులు 4 చేయించి పెట్టాం, పైన ధనం తుప్పు పట్టకుండా.

నా టైం వేస్ట్ చేయవద్దు, ఇంకొకరి నెత్తిన చెయ్యి పెట్టాలి కదా. అందుకే మా పేరెంట్స్ నీతో కూడా పలకరు, వారి మనసు మారుస్తావని. జనానికీ దొరకరు, ఉంటా మరి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2174 General Articles and views 2,219,914; 104 తత్వాలు (Tatvaalu) and views 245,328
Dt : 07-Jul-2020, Upd Dt : 07-Jul-2020, Category : General
Views : 953 ( + More Social Media views ), Id : 592 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : public money , capital interest , uncle , dad 2 bags , more bags for me , next-life
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content