రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ - నా పేరు బికారి, తోటకు తోబుట్టువును, కూటికి నే పేదను, గుణములలో పెద్దను - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,874,349; 104 తత్వాలు (Tatvaalu) and views 225,677.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

చిన్నప్పటి నుంచి ఈ పాట వింటున్నా. అది మన పాటే, మన జీవితమే అని అప్పుడు మరియు ఇప్పుడు కూడా అనిపిస్తుంది, అదే మరి గీత లో చెప్పిన సమతా భావన, స్థిత ప్రజ్ఞత, సమానత్వం. పాట రాసిన మహానుభావుడు పుణ్యాత్ముడు ధన్యాత్ముడు. గాయకులు పాట చాలా మధురము గా పాడతారు, మీతో కలిపి.

కానీ, పాటకు విశ్లేషణ రాయమంటే, మాత్రము వేళ్ళు కదలవు, అదే ఆచరణలో చేయమంటే, అబ్బో ఊరుకో మన వలన కాదు అంటారు. ఇంకా, ఆచరణ చేసే వారిని కూడా, 4 మాటలు అని అవమానించి, ఆపేపిస్తాము, కనీసం అడ్డు ప్రయత్నం చేస్తాము. నేను చెయ్య, నువ్వు చెయ్యోద్దు, నాకు చెప్పొద్దు అంటాము పెంపక సంస్కారం తో.

కానీ ఈ మాత్రం పిచ్చి గొంతు వస్తుంది, పిచ్చి మాటలు రాయడానికి వస్తున్నాయి అంటే, ప్రోత్సహించిన దేవుడి తో పాటుగా గురువులైన మీకు రుణపడి ఉన్నాము.

ఏమి మారింది మన స్థితి, అన్ని ఉన్నా కూడా, ఆనాడు చాప మీదనే నిద్ర, శాఖాహారమే, పచ్చడి కూడే, కాసు బంగారం లేని శరీరం, గార్ధబ బండ గొంతుతో దేవునికి రోజూ తలనొప్పి పుట్టించడమే, ఈనాడు దాదాపు గా అంతే. నా చుట్టూ పరిస్థితులు స్నేహితులు బంధువులు ఉద్యోగాలు ప్రదేశాలు గౌరవాలు హోదాలు మారి ఉండవచ్చు, ధనము పెరిగి లేదా తరిగి ఉండవచ్చు.

కానీ అలవాట్లు ఏవీ ఇంచె కూడా మారలేదు, ఎందుకంటే నేను బికారిని, నా మజిలీ కొన్నాళ్ళే ఈ భూమిపై, తర్వాత బదిలీ, మరి ఎందుకు భౌతిక ప్రపంచముతో బిజిలీ అన్న స్రుహ వీడలేదు కాబట్టి.

ఈ పాట లో ఎంత అర్ధము ఉందంటే, కత్తి కి 2 వైపులా పదను లాగా. పైకి చూస్తే ఎవరో ఒక వ్యక్తి తన స్థితి గురించి కదా అనుకుంటాము. కాదు ఆధ్యాత్మికము కూడా ఉంది. అసలు బికారి కానిది ఎవరు? అందరు గర్భము నుంచి వస్తూ ఒంటరి వారే కదా? పుట్టిన తర్వాత కొన్ని బంధాలు అమ్మ అయ్య అన్న చెల్లి.

తర్వాత పెళ్ళి, రోజూ ఏదో ఒక కొత్త లొల్లి అందరితో, మరలా ఒంటరి. తర్వాత ఎవరో ఒకరు పోయి మరలా బికారి. ఆ తర్వాత పిల్లలు దూరంగా విడచి, మరలా బికారి. అంటే, ఒకే వ్యక్తి, ఎన్నో సార్లు జీవితము లో ఒంటరి వాడు అవుతున్నాడు కదా? కాబట్టి, ఇది మనందరికి చెందినది సుమా - పెళ్ళి అయినా కాకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా.

ప్రపంచమే నాదైనప్పుడు, మనశ్శాంతికి తోటకు నేనే సోదరుడిని, దాహార్తి తీర్చుకోవడానికి సెలయేటికి బిడ్డను. ఎంత మంది ఎన్ని తిట్టినా ఈసడించినా, నిస్వార్ధముగా కఠినముగా కొన్ని సార్లు ఎగతాళి చేస్తూ అయినా వాస్తము తెలియపరచి మంచి చెపడము లో, ఇతరుల క్షేమం కోరడము లో, విసుగు అలసట రాదు, బాద్యత ఆనందము పోదు, అదే దైవానికి ఇచ్చే ప్రసాద మహదానందము.

అర్ధరాత్రి నిద్రలో కూడా మేలుకుని, ఆ దేవుడ్ని తప్పక కలుస్తాను ఈ జన్మలోనే అని కలలు గని, మేఘాల మేడిపై, మెరుపు తీగలాంటి నా ప్రేయసి (మోక్షాన్ని) ఊహించుకుని, ఇంద్రధనస్సు పల్లకి ఎక్కి ఆ పరమాత్మను కలుసుకోవాలని, భూమిపై శరీరాన్ని విడిచాక, ఆకాశవీధిలో, ఓంటరిగా, ఆర్తిగా కన్నీళ్ళు తో, పరుగులు తీస్తూ పయనించే, దైవ దర్శన యాత్ర బాటసారి.

ఆధ్యాత్మిక కూటికి నే పేదను, కానీ దానిని అందుకునే గుణములలో పెద్దను అని ఇతరులు అంటారు.

ఏదైనా చెయ్యాలి అంటే, దైవ సంకల్పము వస్తే, ఇతరులు కష్టము అన్నవి, దైవ శక్తి తో చూపడమే దైవమిచ్చిన బలం (132 వారాలు 108 ప్రదక్షిణలు, 20 ఏళ్ళు చాప నిద్ర శాఖాహారం, మరలా తెచ్చుకోవడం కష్టం అయిన ప్రభుత్వ ఉద్యోగం నవ్వుతూ రాజీనామా ఇంకోటి చూసుకోకుండానే, 8 ఏళ్ళు ప్రపంచ అత్యుత్తమ వైద్యం చేయి పట్టుకోకుండా నడవలేని 76 ఏళ్ళ అమ్మకు, అలాగే కన్నబిడ్డగా సాకడం ఎంత నష్టము జరిగినా తగ్గకుండా).

ఏదో ఒకరోజుకు ఆధ్యాత్మిక నవాబు ను అవుతానేమో, అప్పటి వరకు, ఇలాగే నిరంతర సంచారిని మిత్రమా.

ఈ రోజు వార్త చదివాను - అంత డబ్బులు ఉండి హోదా ఉండి అధికారం ఉండి, దేశ ప్రధాన పార్టీ అధినేత తన వైద్యం కోసం 2 కోట్ల ఖర్చు కు అవినీతి తో అమెరికా లో వైద్యం?

ఇప్పుడు చెప్పగలరు, మన అమ్మ ఎంత అదృష్టవంతురాలో ఇన్నేళ్ల వైద్యం కు నీతి మార్గంలో?

మరి మన అమ్మ కు 8 ఏళ్లుగా రాజవైద్యం కదా, నీతి తో. దేవుడు గొప్ప వాడు, నీతి కి ధర్మానికి, న్యాయం ఉంది, జరిగింది జరుగుతుంది.

నా పేరు బికారి ...నా దారి ఎడారి....
మనసైన చోట మజిలి.. కాదన్నచాలు బదిలీ...

తోటకు తోబుట్టువును... ఏటికి నే బిడ్డను 2
పాట నాకు సైదోడు.. పక్షి నాకు తోడు
విసుగు రాదు.. ఖుషి పోదు.. వేసట లే నే లేదు 2
అసలు నా మరో పేరు ఆనంద విహారి
నా దారి ఎడారి నా పేరు బికారి 2

మేలుకొని ..కలలుగని..మేఘాల మేడపై
మెరుపు తీగలాంటి నా ప్రేయసి నూహించుకొని
ఇంద్రధనస్సు పల్లకి ఎక్కి కలుసుకోవాలనీ
ఆఅ ఆఆ ఆ ఆఆ ఆఅ ఆఆ.....ఆ
ఇంద్రధనస్సు పల్లకి ఎక్కి కలుసుకోవాలనీ
ఆకాశవీధిలో పయనించు బాటసారి....
నా దారి ఎడారి నా పేరు బికారి 2

కూటికి నే పేదను... గుణములలో పెద్దను 2
సంకల్పము నాకు ధనము సాహసమే నా బలం
ఏనాటికో ఈ గరీబు... కాకపోడు నవాబు 2
అంతవరకు నేనొక నిరంతర సంచారి
నా దారి ఎడారి నా పేరు బికారి 2

దేవులపల్లి కృష్ణ శాస్త్రి సాహిత్యం, బాలు గాత్రం

Sri Rajeswari Vilas Coffee Club Movie | Na Peru Bikari Video Song | Krishna, Jayaprada

Sri Rajeshwari Vilas Coffee Club - My name Bikari. Sibling to garden. poor for food, big in qualities  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,874,349; 104 తత్వాలు (Tatvaalu) and views 225,677
Dt : 24-Apr-2022, Upd Dt : 24-Apr-2022, Category : Songs
Views : 741 ( + More Social Media views ), Id : 1367 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : rajeshwari , vilas , coffee , club , bikari , garden , poor , qualities , krishna , jayaprada
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content