Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
ప్రతి రోజూ, రీడ్ రిసీప్ట్ తో దొరలాగా వాట్సాప్ స్టేటస్ చూడటం మరువద్దు, 24 గంటలలో మారిపోతుంది. అవి అన్ని పంపడము కుదరదు. లోకం తీరు గమనించాలి. మన జీవితాలు మన పిల్లల జీవితాలు ఎలా పతనము అవుతున్నాయో గమనించాలి. చేతులు కాలకముందే జాగ్రత్తలు పడాలి. ఈ కధ లాంటి వాస్తవం, అలాంటి వారికే.
మీ కష్ట సుఖాలు, లాభ నష్టాలు కూడా, మీ దగ్గర లో నమ్మిన వారికి, తప్పక చెప్పి సలహా తీసుకోండి, ఆ మాట మీద నిలబడండి, ఒకవేళ మీకు మానసిక నియంత్రణ లేకపోతే, అరిషడ్వర్గాల బానిసత్వం వీడలేకపోతే, గ్రహాల మార్పుతో నిలకడ లేని బుద్ది మార్పు ఉంటే.
ఆత్మ, జీవాత్మల బంధాన్ని అనుబంధాన్ని మరచిన మానవుడు ఎంత దిగజారుతాడో, ఎంత మూర్ఖపు పనులు చేస్తాడో, ఈ ఊహా చిత్రములో చూడండి. కోరికలతో ఆశలతో కళ్ళు మూసుకుని పోయి, మంచి దారులు వదిలి, పతన దారుల కోసం అర్రులు చాచే వారికి, ఈ చిత్రం ఓ కనువిప్పు.
దీ శాస్వతం కాదు, మాయలో చిక్కుకోవద్దు, కపట బతుకు వద్దు అని ఎంత మంది తెలుగు గురువులు ఎన్ని ఏళ్ళు గా చెప్పినా, అవన్ని ఉత్తుత్తి మాటలే అనుకుని, ప్రాపంచిక సుఖాలకై పరుగులు తీసి, వయస్సు పై బడ్డాక, అంతులేని రోగాలతో, ఇంట్లో వారి బాధలతో, సతమతమవుతూ ఏడుస్తూ ఈ జీవితము చాలించి, మరలా వీటి ఫలితాలు అందుకోవడానికి, దైవ సాధన కోసము, ఇంకొన్ని 100 ల జన్మలు.
గత జన్మల పాపాలు ఓ వైపు పీడిస్తూ ఉంటే, ఫలితాలు ఇస్తూ ఉంటే, మోహములో ఈ జన్మలో మరలా 100 తప్పుల పాపలతో జీవితము నరకము చేసుకుంటూ, రాత్రి పగలు మైమరచి, ప్రాపంచిక మైకములో ఉండే, నిత్య పరుగుల ధనాశ పరులకు మనశ్శాంతి ఉండదు.
దేవుడు మరియు దేవుని లాంటి మంచి మనుషులు పక్కనే ఉండి, నీకు మంచి దోవ చూపుతాము, నీతి నియమాలతో ఉంటే, అని చెపితే, అసలు అటు వైపు మొహము తిప్పకుండా నిర్లక్ష్యముగా, తన స్వార్ధ సుఖలాలసతో పతనమవుతున్న, ఆ వ్యక్తిని చూడండి. అతనే మనము కదా?
ఈ ఒకే ఒక్క చిత్రంలో మొత్తం జీవిత సత్యాన్ని, ఎంత చక్కగా వివరించారో చూడండి.
* ఏనుగు గత జన్మకి సంకేతం. బలముగా పట్టి పీడిస్తూ, మన జీవితాన్ని కూలదోస్తూ, గత ఫలితాలను తప్పక ఇస్తుంది. అవి ఎటూ తప్పించుకోలేము, మరలా కొత్త గా ఎందుకు పాపాలు?
* కింద ఉన్న పాములు తరువాతి జన్మలకి సంకేతం. భయంకరమైన కష్టాలు కాచుకుని ఉన్నాయి. ఒక సారి పాములు అనే అరిషడ్వర్గాలకు చిక్కాక, ఇక మరలా వెనక్కి చూసుకోవడం ఉండదు సుమా.
* చెట్టు కి ఉన్న కొమ్మ ఈ జన్మకి సంకేతం. ఎంత జాగ్రత్త గా ఉండాలో చూడండి. చెయ్యి జారితే, మోహములో పడితే, పతనమై, మరు జన్మ కష్టాలు మొదలు పెట్టడానికి, పాములు కాచుకుని కూర్చున్నాయి.
* కొమ్మకి ఉన్న తెలుపు నలుపు ఎలుకలు, రోజుకి అంటే పగలు రాత్రి కి సంకేతం. పాపాలు పుణ్యాలు చేయడానికి తగిన కాలం/ సమయం. మరి దేని మనము ఉపయోగించుకుంటున్నాము? మత్తులో చిత్తుకా? దైవ సాధనకా?
* పైన ఉన్న తేనెపట్టు తాత్కాలిక సంతోషం - మన చుట్టూ ఉన్న బ్రమలు, సంతోషాలు, సుఖాలు, పరుగులు తీసే కోరికలు, ప్రతి క్షణం మనల్ని పరమాత్మ నుంచి విడతీసే పాశాలు బంధాలు.
* కొమ్మ పట్టుకుని ఎంత సేపు వేలాడగలం? అంటే, మన జన్మ బుడగ పేలడం, గాలి తిత్తి చల్లారడం, క్షణం, అంతేనా? దానికి ఇన్ని మోసాలు, కుట్రలు అవసరమా?
ఏనుగు అనే గత జన్మల పాప పుణ్యాలు, కొమ్మ అనే ఈ జన్మని కదుపుతూ ఉంటే, మరొక వైపు పగలు రాత్రి రూపంలో కాలం, ఈ జన్మని పడతోస్తూ ఉన్నా కూడా, మనిషి తాత్కాలిక మైన తేనె తాగుతూ, ప్రమాదకరమైన తరువాతి జన్మలలోకి, వెళ్ళడానికే సిద్ద పడుతున్నాడు.
కానీ, తన పక్కనే ఉండి, కాపాడడానికి, తరింపచేయడానికి, చేయి చాచిన మంచి, పరమాత్మ చేతిని, అందుకోలేక పోతున్నాడు. అదే మోహం, ప్రాపంచిక వ్యామోహం.
The truth of life in one picture - the slavery of worldly lust Arishadvargas
एक तस्वीर में जीवन की सच्चाई - सांसारिक वासना की गुलामी अरिश्दवर्गास
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2215 General Articles and views 2,478,164; 104 తత్వాలు (Tatvaalu) and views 266,138
Dt : 23-Aug-2022, Upd Dt : 23-Aug-2022, Category : General
Views : 1054
( + More Social Media views ), Id : 1505
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
truth ,
life ,
picture ,
slavery ,
worldly ,
lust ,
arishadvargas
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments