తిరుపతి తిరుమల శ్రీవారు వెంకన్న పాటలు - నీవుండేదా కొండపై, నమో వెంకటేశా, శేషశైలావాస - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1632 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1667 General Articles, 64 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

మన చిన్నప్పుడు ఈ పాటలు ఏ గుడి దగ్గరైనా, తప్పకుండా మారు మ్రోగుతూ ఉంటాయి. మరి మీరు కూడా, ఒక్క సారి, ప్రయత్నము చేసారు కదూ?

గొంతు మధురం అవసరము లేదు, పాట ప్రయత్నము అంటే, ఆ దేవ దేవుడిని అన్ని సార్లు తలచుకున్నట్లే. ఇది అరిషడ్వర్గాలలో భాగమే, ఎందుకంటే, మిగతావారికి, నోరు తెరచి దైవ స్థుతి చెయ్యాలంటేనే మనసు ఒప్పదు, ఇంకో 10 జన్మల దాకా. నోరు ఉన్నది తినడానికి, ఇతరులను ఇంట్లో వారిని తిట్టడానికి మాత్రమే అనుకుంటారు.

ఆపాటలలో అర్ధ మాధుర్యాన్ని చూడండి, ఈ పేదరాలి కనే భాగ్యమీవా అని ఎంత వినయముగా వెంకన్న ను అడుగుతుందో. అలాగే ముక్తి కోరి వచ్చే భక్తుల బ్రోవుమయా మరియు పట్టు పానుపుపైన పవళించర స్వామి అంటూ ఘంటసాల గారి తియ్యటి గాత్రం.

వీడియో పాటలు లింక్ లో ఉన్నాయి చూడగలరు.

1). నీవుండేదా కొండపై నా స్వామి
నేనుండేదీ నేలపై
ఏ లీల సేవింతునో... ఏ పూల పూజింతునో

శ్రీ పారిజాత సుమాలెన్నో పూచె, ఈ పేదరాలి మనస్సెంతో వేచె 2
నీ పాద సేవా మహాభాగ్యమీవా
నా పైని దయజూపవా... నా స్వామి ||నీవుండేదా||

దూరాననైన కనే భాగ్యమీవా, నీ రూపు నాలో సదా నిల్వనీవా
ఏడుకొండలపైనా నిండైనా స్వామి
నా పైని దయజూపవా.. నా స్వామి ||నీవుండేదా||

చిత్రం : భాగ్యరేఖ (1957), రచన : దేవులపల్లి కృష్ణశాస్ర్తి, సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు, గానం : పి.సుశీల

2) నమో వెంకటేశా... నమో తిరుమలేశా...
నమస్తే నమస్తే నమః... ఆ...
నమో వెంకటేశా... నమో తిరుమలేశా... 2
మహానందమాయే ఓ మహాదేవదేవ 2 ||నమో వెంకటేశా||

ముడుపులు నీకొసగి మా మొక్కులు తీర్చుమయా 2
ముక్తికోరి వచ్చే, నీ భక్తుల బ్రోవుమయా
భక్తుల బ్రోవుమయా.. ||నమో వెంకటేశా||

నరక తుల్యమౌ ఈ భువి స్వర్గము చేయవయా 2
మనుజులు నిను చేరే, పరమార్థము తెలుపవయా
పరమార్థము తెలుపవయా... ||నమో వెంకటేశా||

3) శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా.. 2

శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకూ.. అలమేలుమంగకు అలుక రానీయకూ 2
ముద్దుసతులీద్దరిని ఇరువైపులాజేర్చి.. ముద్దుసతులీద్దరిని ఇరువైపులాజేర్చి..
మురిపించి లాలించి..మూచ్చటల తేల్చి.. శేషశైలావాస శ్రీవెంకటేశా..

పట్టు పానుపుపైన పవళించర స్వామి..
పట్టు పానుపుపైన పవళించర స్వామి.. భక్తులందరు నిన్ను ప్రస్తుతించి పాడ..
చిరునగవులొలుకుచూ.. నిదురించు నీ మోము..2
కరువుదీర కాంచి తరియించుమూ మేము.

శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా..2

Tirupati Tirumala Srivaru Venkanna Songs - In the sweet voice of Ghansala
nivundeda kondapai, namo venkatesa, seshasailavasa sri venkatesa  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1667 General Articles, 64 Tatvaalu
Dt : 20-Apr-2022, Upd Dt : 20-Apr-2022, Category : Songs
Views : 268 ( + More Social Media views ), Id : 1359 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : tirupati , tirumala , srivaru , venkanna , songs , ghantasala , bhagyarekha , nivundeda , kondapai , namo , venkatesa , seshasailavasa
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content