త్రికరణ శుద్ధిగా, నోటి మాటలు చేతలు ఆలోచనలు, ఒకే విధంగా స్ధిరంగా ఉండాలి అంటే - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,881,674; 104 తత్వాలు (Tatvaalu) and views 226,307.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఏవండీ త్రికరణ శుద్ధిగా, నోటి మాటలు చేతలు ఆలోచనలు, ఒకే విధంగా స్ధిరంగా ఉండాలి అంటే, నాలాంటి వారికి అర్థం అవుతుంది. కానీ అందరికీ అర్థం కాదు, సామాన్య భాషలో ఉదాహరణ లు చెప్పగలరు.

జవాబు, చాలా మంది కి ఇవన్నీ తెలిసినా, ఆచరణలో మాత్రం చేయరు. నేను చేసింది తప్పు కాదు, ఎదుటి వాడు ఎందుకు ఎత్తి చూపాలి, వాడిదే తప్పు అంటారు. నీ శ్రేయోభిలాషులకు తప్ప, ఇతరులకు నువ్వు ఏమైతే నష్టం ఏమిటి అని ఎప్పుడూ ఆలోచన చెయ్యరు.

మొదటి మనం చేస్తున్న దైవ పూజ నిష్ప్రయోజనం అవుతుంది, మానసికంగా మనం అప్పుడే జీవచ్ఛవంలా బతుకుతున్నట్లు, అంతే గాక వాటి ఫలితాలు జీవితం చివరకు వెంటపడి, మనశ్శాంతి దూరం చేసి, కన్నీళ్లు తో బ్రతుకు అంతం అవుతుంది.

ఇది అందరికీ తెలుసు, రోజూ చూస్తున్నాం, కానీ పంది బురద గుంటను దాని సువాసనను వదులుతుందా?

దైవ పూజ చేస్తున్నాం అంటే, నీతి నియమాలు ఉండాలి మనసులో, పనులు, మాటలలో. ఇది ఇంకొకరి కోసం కాదు, మన మనసు బలహీనత కాకుండా, ఉండటం కోసము మాత్రమే.

మనలో నిబద్ధత ఉంటే దేవుడు ని కూడా నిలదీయవచ్చు ఇలా - కాస్త ఆగవయ్యా స్వామి, మా అమ్మ అయ్య రూపం లో, నా ఎదురుగా నే స్థిరముగా ఎప్పుడూ ఉన్నావు కదా, మరి వీరి సేవ తర్వాత నే మీ సేవ, లేదంటే నాకు చిత్తశుద్ధి లేనట్లే కదా. ఆ అమ్మా, మీరు పెట్టే పరీక్షలు కు నేను లొంగను, నీతి నియమాలు బాధ్యత తప్పను అనవచ్చును. దేవుడు కూడా సంతోష పడతారు, ఆగి నిలుస్తారు. పాండురంగ మహాత్మ్యం లో చూస్తాం.

ఈ కింది ఉదాహరణ లో ఏ ఒకటి మనకు కలిసినా, చిత్తశుద్ధి లేనట్లే, దేవుని అవమానిస్తూ, పదుగురు కోసం చేసే, నిష్ప్రయోజక కపటం పూజనే. ఈ కింది పనులు చేస్తున్నప్పుడు బాగుంటుంది, ఎవరికీ తెలియదు ఏమీ కాదు అనుకుంటాం, కానీ పంచభూతాలు సాక్ష్యం రాసుకుని, ఫలితాలు సిద్ధం చేస్తాయి, వాటి నుంచి తప్పించుకోలేము. తప్పించుకున్న వారు ఉంటే, చెప్పగలరు.

1. 2 నాల్కలు, 2 మాటలు, మాట మీద నిలబడకపోవడం, అబద్ధాలు, చాటు వ్యవహారం, గోప్యత, అనవసర మౌనం, నిర్లక్ష్యం, స్వార్ధం

2. ముదుసలి తల్లి దండ్రులు ను సమాన సౌకర్యాలు ఇచ్చి దగ్గర ఉంచుకోకపోవడం.

పిల్లల కు సంస్కారం మానసిక బలం తెలివి జీవిత బాట నేర్పే రామాయణం భారతం భాగవతం నేర్పకపోవడం.

మాతృభాష రాయలేక పోవడం, నోటితో పూజ చేయలేకపోవడం రోజూ కనీసం అరగంట

3. ఇతరుల కు ఇబ్బంది కలిగించడం, ఇంటి ఎదురుగా బండ్లు పెట్టడం, చెత్త బోయడం, అనుమతి లేకుండా వాడుకోవడం, ఇతరుల వి ఆక్రమించడం, ప్రభుత్వ స్ధలం కబ్జా షాపు లు

4. తప్పుడు వారితో తిరగడం, వారి వద్ద వడ్డీ లు తెచ్చుకోవడం తో బతకడం. అధిక వడ్డీలు. అలవికాని అప్పు తో పప్పు కూడు

5. తప్పులు చేయడం, అదే కరెక్ట్ అని వితండవాదం గొడవలు కేసులకు వెళ్ళటం, ఇతరుల కు చెప్పేటప్పుడు సమానత్వం పాటించక పోవడం. అంటే కోడలు అల్లుడు చేసిన తప్పు, కూతురు కొడుకు చెల్లెలు చేసిన తప్పు కాదనడం ఒకే పని ని. స్థిరత్వం లేకుండా చంచలం గా ఉండటము.

6. సమస్యలు తప్పించుకోవడం కు మత్తు తీసుకోవడం, లేదా గుడులు ఆశ్రమాలు అనవసరం గా తిరగడం. మనసు స్ధిరం లేనిదే అనవసరము గా వెళ్ళి, పవిత్రమైన ప్రదేశాన్ని అపవిత్రం చేయడం

7. ఓటు అమ్ముకోవడం లేదా అసలు వేయకపోవడం లేదా కుల వర్గ అవకాశ అవసర కుటుంబ బానిసత్వం కు లొంగడం

8. ఉదయం 5 కి లెగవకపోవడం, ఆరోగ్య జాగ్రత్తలు లేకపోవడం, అరిషడ్వర్గాలు కు అలాగే సప్త వ్యసనాలు కు బానిసలు అవడం

9. బంధువులు స్నేహితులు తో, కనీసం వారం వారం మాట్లాడుతూ, తన కష్టాలు నష్టాలు అభివృద్ధి సాధన చెప్పకపోవడం

ఇలా ఎన్నో మన లోని అవలక్షణాలు ను రాయవచ్చు ను. ఇలాంటి తప్పులు చేస్తూ కూడా, దేవుడు ధ్యానం దేవాలయాలు అంటూ, తమకు తామే ఆత్మద్రోహం చేసుకుంటే, వారి పిల్లలు వారిని, జీవితం చివరలో వదిలేయడం కు, అలాగే నికృష్ట చావు కు దోవ సిద్ధం సుమా.

trikarana suddi, mouth words works thoughts, to be consistent in same way examples  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,881,674; 104 తత్వాలు (Tatvaalu) and views 226,307
Dt : 23-Apr-2022, Upd Dt : 23-Apr-2022, Category : General
Views : 617 ( + More Social Media views ), Id : 1368 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : trikarana , suddi , trinity , mouth , words , works , thoughts , consistent , examples
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content