మత దేశాల అనవసర రగడ? అక్కడ స్వేచ్చ హక్కులు? అసలు సమస్య హిందువు ల లో నిర్లక్ష్యం అనైక్యత తో? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1729 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1764 General Articles and views 1,281,079; 90 తత్వాలు (Tatvaalu) and views 175,742.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*మత దేశాల అనవసర రగడ? అక్కడ స్వేచ్చ హక్కులు? అసలు సమస్య హిందువు ల లో స్వార్ధ నిర్లక్ష్యం అనైక్యత తో?*

*వాస్తవం అంగీకరించలేక, ఇప్పుడు జరుగుతున్న, ఇతర మత దేశాల అనవసర రగడ చూసారా? తప్పు మనవైపు ఉందా? అక్కడ స్వేచ్చ హక్కులు? అసలు సమస్య మన హిందువు ల లో స్వార్ధ నిస్తేజ/ నిర్లక్ష్యం అనైక్యత తో ఉండే, వారితోనే కదా?*

జవాబు - 1) మన వారి తప్పు ఏమీ లేదు. వారి గ్రంధము లో చెప్పబడిన విషయాన్ని మాత్రమే చెప్పారు. అందులో ఉన్న వాస్తవాన్ని, బయటకు అలా ఉదాహరణ గా చెప్పడం, వారికి నచ్చలేదు. అందులో తప్పు ఏమిటో అసలు బయటకు చెప్పరు. మమ్మల్ని అవమానించారు అంటారు, అంతే.

ఇక ఆ దేశాలలో అసలు ప్రజాస్వామ్యం అనేది లేదు, స్వేచ్చ లేదు, మానవ మరియు మహిళా హక్కులు లేవు అనేది అందరికీ తెలుసు. నెదర్లాండ్స్ డచ్ లా మేకర్ కూడా ఇది స్పష్టం గా చెప్పారు, భయపడకండి, అదంతా అక్షర సత్యమేనని.

కానీ మన హిందువులు ఎప్పటిలా, నోరు వెళ్ళబెట్టుకుని చేష్టలు ఉడిగి చూస్తున్నారు, ఇది మన ఇంటి విషయం కాదులే అని, నిద్రతో జోగుతూ స్వార్ధం లో మునిగి తేలుతూ. ఇక, మన వారు, తప్పని సరై, మన వారిని బయటకు పంపారు, ఇది క్లుప్తముగా.

తప్పో ఒప్పో వారి బలం వారి ఐక్యత, కానీ మన బలహీనత మన అనైక్యత, పిరికితనం, బద్దకం, నిర్లక్ష్యం.

ఇంతకు మించి, మనకు ఎక్కువ వద్దు, మన హైందవులను నిద్ర లేపడానికే, మనకు సమయం లేదు మిత్రమా, ఇంక ఇతరుల గురించి మనకెందుకు.

2) పిట్టకధ ఒకటి చెప్పుకుందాము. ఉత్తర మంచు ధ్రువం దగ్గర ఉన్న, ఒక ఉత్తమ సాంప్రదాయ వర్గం కి విచిత్ర సాంప్రదాయాలు ఉన్నాయి. వారికి వారే తమ పనులను మెచ్చుకుంటారు, ఆచరిస్తారు.

చిన్నప్పటి నుంచి, తమ సాంప్రదాయ కట్టుబాట్లు బోధిస్తారు, నూరిపోస్తారు, వారిలో మరలా 100 వర్గాలు, ఒకరి నొకరు గౌరవించరు, ఎన్ని కష్టాలు వచ్చినా దగ్గరకు రానీయరు. అవసరాన్ని అవకాశాన్ని బట్టి నమ్మించడములో నమ్మకద్రోహములో కూడా దిట్ట. మహిళా హక్కులు శూన్యం.

సాత్విక ధర్మ లోకం హర్షించకపోయినా, ఎదురు చెప్పినా, ఏమైనా చెయ్యడానికి అంత మొందించడానికి కూడా వెనుకాడరు, వారి ఉత్తమ శాంతి మార్గము లో.

వారు ఇతరుల ప్రాణానికి ఇచ్చే విలువ గౌరవం అది. కానీ గొప్పతనము ఏమిటి అంటే, నిబద్దత గా పద్దతులు తూచ తప్పకుండా పాటిస్తారు, ఒకే మాట పై ఉంటారు, ఎన్ని వర్గాలు ఎన్ని గొడవలు వారి లోపల ఉన్నా. ఆ గుణం మన హైందవుల దగ్గర, స్వార్ధం తో బద్దకం తో నశించింది.

ఉదాహరణకు వారి ఉత్తమ దైవ గ్రంధము లో, వయస్సులో చాలా పెద్దవారైన (50 పైన) దయ గల వారి సాత్విక గురువు, 7 ఏళ్ళ పిల్లను పెళ్ళి చేసుకుని, 10 ఏళ్ళ వయసులో కాపురం చేసెను అని రాసి ఉంది అనుకుందాం. వారికి అది తప్పు అనిపించదు, వారు కరక్టే అని నమ్ముతున్నారు, పై వాని లీల అంటారు. అది వారి ఇష్టం. మనకు అనవసరం.

ఇప్పుడు వారు, ఇతర వర్గం లోని వారి తప్పులు ఎత్తి చూపుతూ అనవసరంగా మాట్లాడుతూ ఉంటే, ఇతర వర్గం ఆ గ్రంధ రాత సాక్ష్యం ఉదాహరణ చూపుతూ ఇక చాలు మీ నేతి బీరకాయ నీతి మాటలు అంటే, వారు మూర్ఖత్వం తో అవమానము గా భావించి, ఇతర వర్గాన్ని, మీరు మా గురువుని విమర్శించారు అంటూ, ధర్నాలు చేసారు అనుకోండి.

ఏమైనా అర్ధం ఉందా? ఇంతకీ వారి గురువు పై గ్రంధం మాటల మీద గౌరవం ఉంటే, అవును మీరు అన్నది కరెక్టేను, మాలో అంతే అని పొగడాలి కదా వారు లేదా మౌనంగా ఉండాలి కదా? అంటే, ధర్నాలు చేసి, కోపము తో, వారి గురువును/ గ్రంధాన్ని/ దైవ మాటలను వారే తప్పుపడితే ఎలా? ఇతరులు పొగడద్దు అంటే ఎలా? పోనీ మీరు ఇతరులను అనకుండా ఉండాలి కదా?

3) ఇక మన దగ్గరకు వద్దాము, ఈ కధ పొగడ్త లో తప్పు లేదు అని, మన వర్గం వారు కూడా నోరు ఎత్తరు, అయ్యో ఇది అన్యాయం అని కూడా నోరు పెగలదు, వేళ్ళు కదలవు. అసలు మనకెందుకులే, మన సంపాదన మన స్వార్ధం అనుకుంటే మత్తులో, ఆంగ్లేయుల పాలన లాంటి బానిసత్వ చరిత్ర మరలా తిరిగి వస్తుంది, అప్పుడు పెడ బొబ్బలు పెడదాము మనము లేదా మన వారసులు, అని నిమ్మళముగా ఉంటారు, తమ కొమ్మను తాము నరుక్కుంటూ.

మనకు తలనొప్పి, వాదనల ముప్పు ఎప్పుడూ, మన లోని వారితో నే. విదేశీయులు/ ఆంగ్లేయులు రావడానికి దోవ చూపింది సహకరించింది, మనలో వెన్నుపోటు దురాశా పరులే కాదా?

మనలో, రామాయణ భారత భాగవతాలు భగవద్గీత ను చదవరు, పిల్లలకు చెప్పరు. ఒక్క పద్యం, శ్లోకం, పాట నోటికి రాని వారు, ప్రతి ఇంట్లో కనీసం ఒకరు ఉన్నారు. బ్రహ్మ ముహూర్తము లో ఉదయం 5 కి లెగవరు.

ఇంట్లో రోజు కనీసం 30 నిమిషాలు పూజ/ ధ్యానం చేయరు. రోజు అంతా పెట్టాల్సిన బొట్టును, కనీసం గుడికి వెళుతూ కూడా బొట్టు పెట్టుకోరు. గుడిలో ఉచితం గా ఇచ్చినా, బొట్టు పెట్టుకోరు.

తలనీలాలు సమర్పించి గుండు చేయించుకోరు. ఒకవేళ చేయించుకున్నా టోపీ/ గుడ్డ తో మూసేస్తారు, సిగ్గుతో.

ఆఖరకు వాట్సాప్లో ప్రొఫైల్ ఫోటో గా ప్రక్రుతి బొమ్మ కూడా బొట్టు గా పెట్టరు, అందవిహీనం గా ఉంచుతారు. రీడ్ రిసీప్ట్ లు ఆపి, చాటు గా నక్కి నక్కి నక్కలా చూస్తారు.

ఉదాహరణకు, మనము ఒక గుడిలో ఉండి ఇలా చెప్పాము అనుకోండి - మనము బొట్టు పెట్టుకుని గుడి కి రాకపోతే, మన పెద్దలు/ పేరెంట్స్ మనకు సంస్కారం నేర్పలేదని అందరికీ తెలుపుతూ, మనము పేరెంట్స్ ను అవమానించినట్లే. దయచేసి బొట్టు పెట్టుకుని భక్తులుగా భక్తిపారవశ్యం తో రండి. బొట్టు లేకుండా పార్కులకు వెళ్ళే సందర్శకులు గా అవమానిస్తూ వస్తే, మనకే నష్టం.

జాగ్రత్త గా చదవండి, పై లైన్లలో ఎక్కడైనా అమర్యాద, తప్పు పదాలు ఉన్నాయా? లేవు.

మొత్తము పదిమంది లో, బొట్టులేని 5 గురు లో, ఒకరు వెంటనే లెగిచి, మా తల్లి దండ్రులను అవమానించారు. మమ్మల్ని గుడికి రావద్దన్నారు అని గట్టిగా అడుగుతారు. ఎందుకంటే, అతనికి పద్దతులు పాటించడం ఇష్టం లేదు. ఆ మాటలు అతనికి సూటిగా తగిలాయి, తన లోపాలను మొత్తము ఎత్తి చూపాయి. తప్పు సరి చేసుకోక పోగా, భుజాలు తడుముకుంటున్నాడు, కేవలం దేవుని మీద గౌరవం/ మర్యాద తో రాడు కాబట్టి.

అతనితో మిగతా బొట్టులేని 4 గురు కూడా, నిజం, మమ్మల్ని మా తల్లి దండ్రులను అవమానించారు అంటారు, అసలు విషయాన్ని పక్కదోవ పట్టిస్తూ - గుడి కి, బొట్టుతో రావడం మంచిది అని ఒప్పుకోరు, వెంకన్నకు నామాలు, శివయ్యకు నామాలు చూసి కూడా.

సరే, వీరితో కాదు అసలు బాధ. మిగత బొట్టు తో వచ్చిన 5 గురు కూడా నోరు ఎత్తి మాట్లాడరు. ధర్మాన్ని కాపాడుదాం సంస్కారం నేర్పుదాం అనుకోరు. తప్పు ఏముంది వారి మాటల్లో, మీకు ఇష్టం లేకపోతే, పెట్టుకుని రాకండి, గమ్ము గా ఉండాలి, ఎందుకు వాదన అని అనరు. మనకెందుకులే, అని గమ్ము గా ఉంటారు. ఇది మన పరిస్థితి.

ధర్మాన్ని కాపాడండి, అది మనల్ని కాపాడుతుంది అని నోటితో చెపుతారు గానీ, చేతలలో ఉండదు. మనము మారకపోతే, పతనమే, బానిసత్వ పాలనే మన భవిష్యత్తు.

Unnecessary talks of religious nations no freedom rights leave selfish negligence unite Hindus  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1764 General Articles and views 1,281,079; 90 తత్వాలు (Tatvaalu) and views 175,742
Dt : 08-Jun-2022, Upd Dt : 08-Jun-2022, Category : General
Views : 457 ( + More Social Media views ), Id : 1418 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : religious , nations , freedom , rights , selfish , negligence , unite , hindus
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content