వీరబ్రహ్మేంద్ర స్వామి - ఏమండీ పండితులారా, మతం నీతి, పంచముడని - సమతావాది, బడుగుల పెన్నిధి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2150 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2185 General Articles and views 2,341,507; 104 తత్వాలు (Tatvaalu) and views 253,864.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

వీరబ్రహ్మేంద్ర స్వామి గారు సమతావాది, అభ్యుదయవాది, బడుగు బలహీన వర్గాల పెన్నిధి అని మనలో ఎందరికి తెలుసు? తెలిస్తే, అంబేద్కర్ గారి లాగా, మనము బ్రహ్మం గారిని మరచిపోతామా? ఇతర భాషల గురువుల జోలికి పోతామా? వాస్తవం వదలి, మాయలో పడితే, మన ఇంటి పునాదీ, విలువలు విశ్వసనీయత, నేల రాలిపోతుంది.

చూడండి మన తెలుగు గురువుల (వేమన, బ్రహ్మం, రాఘవేంద్ర) గొప్పతనం ఒప్పుకోవాలంటే, మన తెలుగు వారికే, ఎంత చిన్నతనముగా ఉందో, లైక్ షేర్ శభాష్ అనాలి అంటే. వామ్మో మమ్మల్ని పరాయి భాష బాబాయి భక్తులు, కాదంటారేమో అని భయం? కాబట్టి ఎవరైనా, మనల్ని బోల్తా కొట్టించగలరు అబద్దాలు తో, పతనం చేయగలరు. గురువులంతా ఒకటే అనే మోహవశులు, తెలుగు గురువు గొప్పను, ఎందుకు మెచ్చరు? ఎందుకు ఫోటో ప్రతి ఇంట్లో ఉండదు? ఎందుకంటే మన మాటలు, చేతలు కలవవు.

దాని వలన నష్టం తెలుగు గురువులకు కాదు, నేల విడిచి సాము చేస్తున్న అంటే అరిషడ్వర్గాల బానిసలమైన, అంటే బ్రమలలో వాస్తవాన్ని, మన తండ్రి తాతలను, మనకు మనలనే, మరచిన నిజానికి ఫలితం? మన పరిస్థితి, మన పిల్లల చేతిలో, ఇంతకన్నా దారుణముగా ఉంది, ఉంటుంది అని మనము గుర్తించాలి సుమా.

అప్పుడు ఆంగ్లేయుల మరియు మహమ్మదీయుల పాలనకు, తిరిగి పునాది పడుతుంది. ఆనాడు వారు మన కోటలో పాగా వేసారు అంటే, మన నెత్తిన ఎక్కి అన్ని రోజులు పాలించారంటే, అది వారి సామర్ద్యం కాదు, మనలోని ఇలాంటి గట్టి పునాది లేని, అవసర అవకాశ వాదుల, ద్రోహము మాత్రమే సుమా.

హైందవానికి లేదా భారత దేశానికి మొదటి శత్రులు, ఇతర దేశాలు లేదా పునాది/ సనాతన బలం లేని ఇతర మతాలు కానే కాదు. కేవలం మన బలహీన మనసు గల, ఇంటి దొంగలే, అంతర్గత శత్రువులు (అరిషడ్వర్గాల బానిసలు) మాత్రమే. అందుకే వీరు ఏదీ నిబద్దతతో చేయరు, తమ తల్లి దండ్రులనే ఇంట్లో పెట్టుకుని చూడరు. రుజువులు లేకుండా దేనినైనా నమ్మేస్తారు, పోనీ దానినైనా నీతి నియమాలతో చేస్తారా? అదీ లేదు, అన్ని కప్పదాటులే.

ప్రతి మతము లోనూ, కుళ్ళు ఆధిపత్యం ఉంది, ఈ నాటికి కూడా, వారిలో ఎన్నో తెగలు వర్గాలు, ఒకరి మందిరాలకు/ ప్రార్ధనాస్థలం/ దేవాలయాలకు ఒకరు వెళ్ళరు. ఇంకో మతములో అయితే, ఒక వర్గం ఇంకో వర్గాన్ని అసలు బతకనీయదు. ఇంకో మతములో రంగును బట్టి హీనముగా చూస్తారు, అందరూ ఒకే మతమైనా కూడా. చూసారా ఈ వారం వార్త. ఆస్ట్రేలియాలో, మత మార్పిడి మతము శాతము తగ్గిపోతుంది అంటా, 1 మిలియన్ తగ్గారు అంట వారి మతములో. వారిలో చాలామంది, మాకు మత రహితముగా ఉండటమే మంచిది అని చెప్పుకొచ్చారు అంటా.

సరే పాత రోజులలో, శూద్రులను వేదం చదవకుండా ఆపారని, వారిని ఖండిస్తూ, బ్రహ్మం గారు ఎన్నో మార్పులు తెచ్చారు. గుణం బట్టి మాత్రమే వర్ణం అని, ఖచ్చితముగా గీత ప్రమాణాన్ని చూపారు. పుట్టుకతో అందరూ, శూద్రులే. వారి గుణ కర్మలను బట్టి బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్రులు అని పెట్టరు.

ఇప్పుడు చూడండి, పుట్టుకతో అందరమూ మనుషులమే/ ఓటర్లమే. కానీ ఓటు వేసి, పరిపాలన సౌలభ్యం కోసం, మనలో ఒకరిని ఎమ్మెల్యే గా చేసాము, ఇంకొకరిని ఎంపీగా చేసాము. ఇంకొకరిని సీయెం, పీయెం అన్నాము. మరి ఈ వర్గాలు ఎందుకు? ఎక్కువ తక్కువ లెందుకు? వారికి హోదా పదవి సౌకర్యాలు ఎందుకు? మంచి పాలన కోసము, అవునా? మరి ఇవి కూడా తప్పేకదా, ఆనాటి వర్ణాలు తప్పు అయితే?

అప్పుడు లాగే ఇప్పుడు కూడా, తప్పుడు మనుషులు ఉండి, అధికారం ఐశ్వర్యం తలలోకి ఎక్కి, క్రుతజ్ఞత విశ్వసనీయత మరచి, మా పిల్లడే మా బంధువే మా వర్గమే, మరలా ఎమ్మెల్యే ఎంపీ సీయెం పీయెం కావాలి, ఇతరులు దీనికి అనర్హులు అన్నప్పుడు, మరలా అవే తలనొప్పులు వస్తాయి.

ఇప్పుడు వస్తున్నాయి కూడా కదా? ప్రతి ఊరిలో ఒకసారి ఎక్కితే, నాయకులు అనుచరులు, ఇక కుర్చీ దిగము అంటున్నారు, దానికి కారణం? మనము బానిసత్వం వదలకపోవడమే, మన పిల్లలకు కొత్తవారికి అవకాశం ఇవ్వాలని అనుకోకపోవడమే. బంగారపు ఓటు హక్కును కాలరాచి, మరల రాచరిక వ్యవస్థలను తెస్తున్నాము. పాము పులి లాంటి వారిని 20 ఏళ్ళుగా ఎన్నుకున్నాము. ఆవులను నాయకులు గా రానీయము.

ఆఖరికి బడుగు బలహీన వర్గాలలో కూడా, ఒకసారి పదవి ఐశ్వర్యం వచ్చాక, వారు కూడా, తమ తోటి వారిని తక్కువ చేసి చూస్తున్నారు. ఈ వ్యవస్థ తీరు ఈనాటికీ మారలేదు.

ఇందులో ప్రశ్నించింది కేవలము పండితులనే కాదు, నేటి నాయకులను, తప్పుడు మనుషులు అందరినీ కూడా సుమా.

తనని అవమానిస్తున్నరు అని బాధపడుతున్న ఎందరో వ్యక్తుల్ని, బ్రహ్మం గారు, చేరదీసి, ఊరడించి, వాస్తవాన్ని ఎంత బాగా చెప్పారో. గాలి, నీరు, భూమి, అగ్ని మిమ్మల్ని తాక వద్దు అన్నాయా? అని అందరి కళ్ళు తెరిపించారు.

మరి ఇలాంటి అభ్యుదయ తెలుగు వ్యక్తులను గురువులను, వేమన బ్రహ్మం రాఘవేంద్ర, మనము మరిచి పోతున్నాము అంటే, ఏమీ చేయని పరాయి గురువుల వెంట పడుతున్నాము అంటే, మనది ఎంత బలహీన బ్రమల విలువలేని మనసు?

దానికి ఫలితం, మన ఇంట్లో మనశ్శాంతి ఏ రోజూ ఉండదూ, ఎన్ని కోట్లు విల్లాలు ఉన్నా ఎంత మంది బలం ఉన్నా, ఎందుకంటే, ఎటువైపునించి అయినా ఎదురుపోటు వెన్నుపోటు తప్పదు నేడు. ఆస్వాదించండి ఆ మధుర గీతాలను.

1. ఏమండీ పండితులారా…2 ఏమంటారు మీరేమంటారు….?
మన జాతికి జరిగిన ద్రోహానికి మీరేమని బదులిస్తారు….? 2 ||ఏమండీ పండితులారా||

మేమే మేమే మేమే, మఠాధిపతులమన్న, ఆ అహం మీకు లేకుంటేను
శ్రద్ధగా మీరు వింటేను, ఉన్నది ఉన్నట్టు చెబుతాను
మీ ఉడత ఊపులకు భయపడను ||ఏమండీ పండితులారా||

గుణమును బట్టే వర్ణమన్న, ఆ గీతా భాష్యము వినలేదా, ఆ సత్యం మీ చెవి పడలేదా
సర్వమతమ్ముల సారమిదేనను, సంగతి మీ దాక రాలేదా ||ఏమండీ పండితులారా||

కులాల మతాల భేదం పెట్టి, సంఘాన్నే చీల్చేశారు, సమానత్వాన్ని చంపారు
అంటరానితనంటూ మనిషికి, ఎన్నో ఆంక్షలు పెట్టారు ||ఏమండీ పండితులారా||

శూద్రుడు వేదం వింటే.. శూద్రుడు వేదం వింటే
చెవిలో సీసం కరిగించి పోయాలా, చదివితే నాలుక కొయ్యాలా
వేదశాస్త్రమ్ములు మీసొమ్మనుకుని, విద్యకు ద్రోహం చేస్తారా ||ఏమండీ పండితులారా||

జనం దగ్గరకు పోయి, శిష్యులకు జ్ఞానబోధ చేస్తున్నారా.., ఓదారుస్తు ఉన్నారా..
దూరం, దూరం, దూరం దూరం అంటూ పెద్దలు మడి కట్టుక కూర్చుంటారా ||ఏమండీ పండితులారా||

హిందూ మతాన్ని, గురువులు మీరే, భ్రష్ఠు పట్టిస్తున్నారు, ఐక్యత చెడగొడుతున్నారు
గతిలేక, మనవాళ్ళు, పరాయి మతాల కెగబడుతుంటే, పళ్లికిలిస్తూ చూస్తున్నారు ||ఏమండీ పండితులారా||

కృతయుగాన ఉడికిన, మీ పప్పులు కలియుగాన, ఇక ఉడకవులే, జ్యాతహంకారములు సాగవులే
పశ్చాతాపంతో మారకున్న, పశ్చాతాపంతో మారకున్న, మీ బ్రతుకు బయట పడిపోవునులే
||ఏమండీ పండితులారా||

2. మతం. నీతి రా., కులం. మాదిగ రా. 3
నే మనిషిని కాదంటారా., నన్నంటరాని ఓన్నంటారా. ||మతం నీతిరా||

సెప్పేది శ్రీరంగ నీతులు, దూరేదీ.. దొమ్మర గుడిసెలు
మీ బ్రతుకు యే..హహ, మీ బ్రతుకు నాకెరిక లేదంటారా ||మతం నీతిరా||

తొలుగు తొలుగుమని, యెలియేస్తుంటరు
ముట్టితే మైలబడతమంటరు, అవును ఔను..
ఊపిరిపోయాక యే..హహ ఊపిరిపోయాక
ఒలుక్కుల్లోన, మట్టిచేయ మాపాల పడతరు ||మతం నీతిరా||

నీతులు లెస్సగ చెబుతు ఉంటరు ఆ..హహ
నెత్తిన చేతులు, పెడత ఉంటరు, నాయాల్ది
పొట్ట జానడు, ఆశ బారెడు, డబ్బుకోసమై గడ్జి తింటరు ||మతం నీతిరా||

నీ ఇల్లేమీ.. నీది కాదురో, నీ వా..ళ్ళెవరు నీకు కారురో
ఉండే.వరకు తింటరే గాని వ్యాక్..,
పోయెటప్పుడు యెంటరారురో, ఆ..హహహహ ||మతం నీతిరా||

శాస్త్రలన్నీ సదిగిన ఓళ్ళు, పురాణాలు తిరగేసిన ఓళ్ళు
ఎక్కడో… దేవుడు ఉండాడంటరు, అదెక్కడంటే నోరెళ్ళబెడతరు ||మతం నీతిరా||

ఉండాడన్న ఆ దేవుడే ఉంటే..
కుల మతాలని కుళ్ళు ఎందుకూ.. ఎందుకు
బిడ్డల మధ్యన తంతులు పెట్టి 2, గుళ్ళో.. కుక్కోని కుళకడమెందుకు ||మతం నీతిరా||

అంటరాని ఓళ్ళంటారా, మమ్మంటరాని ఓళ్ళంటారా…
మతం నీతిరా కులం మాదిగరా 2

3. పంచముడని నిను, కించపరచిరని బాధ పడకురా.., కక్కా..
తిట్టినా నో.రే, నిన్ను పొగడుతున్నపుడు, వదిలేనురా వాళ్ళ తిక్కా
వదిలేనురా వాళ్ళ తిక్కా…. ||పంచముడని||

ఆదిలోన కులమతా.లు లేవు, వాడు వీడను తేడాల్లేవు
దేహానికే ఈ బేధాలన్ని, అంటరానితనం ఆత్మకు లే..దు. ||పంచముడని||

జగతిన వెలిగే సూర్య చంద్రులు, నీ గూడానవెలగనంటారా…?
భవనాల మండే అగ్నిదేవుడు, నీ గుడిసెలో మండనంటాడా…?
చల్లగా వీచే వాయు దేవుడు, మిమ్మంట కుండ పోతున్నడా …?
ఆ దేవుళ్ళకే లేని అంటూ.., ఈ మనుషులకేలరా.., కక్కా…!||పంచముడని||

జీవనాధారమైన నీరు, మిమ్ము తాగవద్దు పొమ్మంటోందా..?
అందరికందని, ఆకాశం, అది మీకే అందకపోతోందా …?
సస్యస్యామలమైన నేల, నువ్వు దున్నితె పండకపోతోందా…?
పంచభూతాలకే లేని, పక్షపాతము, మనలో ఎందుకు కక్కా…! ||పంచముడని||

అందరు మీకే.., దాసోహం అను, కాలం దగ్గర లో ఉంది
అగ్రగాములై, రాజ్యాలేలే, అదృష్టమ్ము పడుతుంది
తప్పదు రా, నా మాట.. నే చూపింది సూటి బాట…

మిగతా మాటలు పూర్తి వీడియో పాటలు సినిమా లింక్ లోపల సుమా. మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, వాక్సుద్ది కి.

veerabrahmendra swamy emandi panditulara matam niti ra panchamudani ninu samtavadi badugula pennidi  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,341,507; 104 తత్వాలు (Tatvaalu) and views 253,864
Dt : 14-Jul-2022, Upd Dt : 14-Jul-2022, Category : Songs
Views : 803 ( + More Social Media views ), Id : 1463 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : madvirat , brahmendra , brahmam , swamy , charitra , movie , ntr , emandi , panditulara , matam , niti , panchamudani , samtavadi , badugula , pennidi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content