ఇన్నేళ్లు మనిషి గా జీవితంలో ఏమి సాధించారు? కనీసం 35 దాటిన ప్రతివ్యక్తి, తనను తాను? - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1113 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 నిమిష చదువు సమయం.

2 నిమిషాల ఆత్మీయ వ్యక్తిత్వ వికాస మాటలు, మనల్ని మనం తెలుసుకోవడం, మన లోనకి చూడడం

ఏవండీ ఇన్నేళ్లు మనిషి గా జీవితంలో మీరు ఏమి సాధించారు, అంటే మీ జవాబు? కనీసం 35 దాటిన ప్రతివ్యక్తి, తనను తాను ప్రశ్నించుకోవాలి? ఎందుకంటే కాల మృత్యువు కనికరించదు, మన ఐశ్వర్యం హోదా చూసి, వెనక్కి తగ్గదు కదా. ఏ క్షణమో తెలీదు ఎవరికీ కదా?

* * *

దీనికి ఒక్కొక్కరూ ఒక్కో విధంగా జవాబు చెపుతారు. రాజస, తామస గుణాల జవాబు, వినండి ముందు. వీళ్ళ ఆలోచనలు భౌతిక ప్రపంచం చుట్టూ లేదా నిర్లక్ష్యం బద్దకం చుట్టూ ఉంటాయి మోహములో.

* మా నాన్న, మా తాత సంపాదించిన ఆస్తులు కోట్లు ఉన్నాయి, మేము వాటిని తింటూ దానాలు చేసి తగలేయడం లేదా ఇతరుల జీవితం తో ఆడుకోవడమే.

* పెళ్లి అయి 3 పిల్లలు, లక్షల ఆస్తి, పెద్ద ఉద్యోగం, అవినీతి సంపాదన, పిల్లలు ఫారిన్ కంపెనీలో ఉద్యోగం లక్షల జీతం తో, 3 ఇళ్ళు 3 కారులు, అనాధాశ్రమలో సీటు గారంటీ మా పిల్లల కు నేర్పిన సంస్కారము ప్రతిఫలముగా

* నాయకులు ఎమ్మెల్యే ఎంపీ గా ఎంతోమంది నెత్తిన టోపీ పెట్టి, కోట్ల వ్యాపారం తో, మా మొద్దు పిల్లల భవిష్యత్తు కు దోవ చూపాము

* మేము సంఘాలు పెట్టి, ప్రజల సేవ అని చెప్పి, బానిసలుగా మాకు భిక్ష వేసిన, గాడ్ ఫాదర్ సేవలో తరించి, కోట్లు వెనక వేసి, విపరీతమైన ప్రచారం పొందాం అంటారు. ప్రపంచం మొత్తం మేము తెలుసు అంటారు.

ఇవిగో ఇలాంటి జవాబు లు చెపుతారు, ప్రాపంచిక భౌతిక సుఖాల మోహం లో మునిగి, ఏమి చేస్తున్నామో తెలీకుండా.

వీటిలో ఎక్కటి అయినా, భగవంతుని కి, మోక్షానికి, జీవిత పరమార్ధం కి, అరిషడ్ వర్గాల ను, మాయను జయించడం ఉందా? కనీసం వారికైనా చివరి రోజుల్లో ఉపయోగ పడతాయా? శని రాహు కేతువుల సమస్యలనుంచి, జీవిత కష్టాలు ను దాటడం గురించి ఉందా? ఆరోగ్య రక్షణ ఉందా? కరోనా లాంటి వ్యాధులను జయించడం ఉందా? తమ తల్లి దండ్రులు లేదా నిజమైన ఇతరుల సేవ, కృతజ్ఞత ఉందా?

వీరికి అవి తెలియవు, తెలుసుకోరు, తెలిసినా పాటించరు. కానీ సాత్వికులు ఇవి మాత్రమే చెపుతారు. ప్రాపంచిక సుఖాలు హోదాలు విజయాల గురించి చెప్పరు, ఎందుకంటే అవి క్షణంలో కూలిపోవచ్చు, ఇంకొకరు లాగేయవచ్చు వెన్నుపోటు మోసముతో, లాటరీ వస్తే క్షణంలో సంపాదించవచ్చు. అవి మిధ్య, నిలకడలేనివి. కానీ ఈ కింది వి మనిషి గా సాధించలేమా, మోక్షం కు?

మరి మా జవాబుల ను చూడండి, ఇవి తెలికేనేమో దేవుని మార్గానికి మీరే చెప్పగలరు -

* అరిషడ్ వర్గాల ను, అలాగే మనసు ను, ఓ 50 శాతం జయించి, అదుపులోకి తెచ్చుకున్నాం అని అనుకుంటున్నాము. కాదంటే, మీ మానసిక స్ధితి ఈ విషయములో చెప్పి, ఆ తర్వాత మమ్మల్ని, ఉదాహరణ తో విమర్శ చేయవచ్చు.

* దేవుని దయతో, నేటి కి రూపాయ అప్పు లేదు, ఈ క్షణం కరోనా కబళించినా, ప్రపంచం మొత్తం లో, ఎవరూ మనల్ని వేలెత్తి చూపి, మాకు పైసా బాకీ ఉన్నారు మా ఉసురు పోసుకున్నారు, అనే దౌర్భాగ్యం లేదు. దేవుని ముందు తలవంచనవసరం లేదు సిగ్గుతో పాప భీతితో.

* చేసిన చేస్తున్న పాపాలకు, మాకు మేమే దండన శిక్షలు వేస్తుకుంటున్నాము కదూ? మిగతా చదివిన తెలుస్తోంది.

* ప్రభుత్వ ఉద్యోగం లక్షల తెల్ల ఆదాయం, ఓ ఈమైల్ తో వదిలేసాం, అమ్మ కు ఇబ్బంది కాకుండా. పదవి ధన వ్యామోహం ఉందా?

* ముదుసలి తల్లి క్షేమం ఆరోగ్యం రక్షణ ఆనందం, కనీసం 7 ఏళ్లుగా. కృతజ్ఞతలు, విశ్వసనీయత, బాధ్యత, మర్యాద, పెద్దల గౌరవం, గతం గుర్తు ఉందా? రుణం అణువంత అయినా, తీర్చే ప్రయత్నం చేశామా?

* ఒకటో తరగతి మనతో చదివిన వారు, 25 ఏళ్ల ముందు తెలిసిన వారు, అసలు మనం అంటే ఏమీ తెలియని వారు కూడా, ఈ రోజు ఈ మెసేజ్ లు అందుకుంటున్నారు అంటే, ఎవరినీ వదలకుండా, కుల మతాలు ప్రాంతం బీదా గొప్ప చిన్న పెద్ద హోదా అధికార కొత్త పాత, భేధం తేడాలు ఉందా? గతం మరిచామా?

* తినగలిగి ఉండి, మాంసం వదలి, 20 ఏళ్లుగా పైగా మిత శాఖాహారం. మంచాలు ఉండీ, 20 ఏళ్లుగా చాపనిద్ర. కొన్ని సార్లు ఉపవాసం. సౌకర్యాలు విలాసాలకు, దూరమా? శనీశ్వరుని దెబ్బ తగలక ముందే, తలవంచి గౌరవం గా సిద్ధంగా ఉన్నామా?

* పురాణాలను సాంప్రదాయం పెద్దల పై క్రుతజ్ఞతలు ఉటంకిస్తూ తెలుగు లో వ్యాసాలు కధనాలు 1000 కి పైగా. సనాతన హైందవ ధర్మ ప్రచారం, తెలుగు భాషా ప్రచారం తో కృతజ్ఞతలు ఉన్నాయా?

* బ్రహ్మచర్య నిష్ఠ, 77 వారాలు 108 ప్రదక్షిణలు, 7 ఏళ్లుగా శనివారం, శని శివ దేవాలయ దీపాలు, నవగ్రహ ప్రదక్షిణలు. యోగాసనాలు, ధ్యానం.

* చీరాల జిల్లా మరియు ఇతర అభివృద్ధి కై, కలెక్టర్ లకు, ఎమ్మెల్యేలు కు, ఎంపీలకు, మంత్రులు కు విన్నపాలు, మరలా మరలా విసిగించి గుర్తు చేయడం. అధికారులు నాయకులు కు, వారి వారసుల మంచి మార్పులు కై, విజ్ఞప్తులు, మరలా గుర్తు చేయడం. - కన్న భూమి పై మమకారం క్రుతజ్ఞత ఉందా?

* మందు, మత్తు, ధూమపానం, లాంటి సప్త వ్యసనాలకు దూరం

* తోటి వారి బాధలు కష్టాలు విని, కనీసం మాట సలహా సహాయం అయినా. మిత్రులు గురువు ల క్షేమం కోరడం

* ఇంకా . . .ఓ పెద్ద చాంతాడు లిస్ట్

ఇవన్నీ, మనసు అదుపులో లేకపోతే, సాధ్యమేనా? మరి, మీరు ఎంతవరకు అరిషడ్ వర్గాల ను మనసును జయించారో, బహిరంగంగా ధైర్యంగా చెప్పగలరా?

ఎందుకంటే మన బంధువులు స్నేహితులు ఒప్పుకోవాలి కదా, మన నడవడిక గుణం సంస్కారం తెలిసిన వారిగా?  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1113 General Articles, 47 Tatvaalu
Dt : 04-Apr-2021, Upd Dt : 04-Apr-2021, Category : General
Views : 73 ( + More Social Media views ), Id : 1072 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : achieved , life , human , years , person , 35 , parents , good character , arishadvarg
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content