నోటి మాటతో, మంచి వారిని కలిపితే, ఇంకో ఇంటికి మీ చేతుల మీదగా బువ్వ, ప్రతి 6 నెలలకు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2023 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2058 General Articles and views 1,785,621; 104 తత్వాలు (Tatvaalu) and views 217,045.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*నోటి మాటతో, మంచి వారిని కలిపితే, పని చేయిస్తే చాలు, ఇంకో ఇంటికి మీ చేతుల మీదగా బువ్వ, ప్రతి 6 నెలలకు*

Word of mouth, if you get good people work, you can feed another family on your hands, every 6 months

*ధన్యవాదాలు అబ్బాయి, మనము నీతి నియమము నిబద్దత సంస్కార సజీవ గురువు సేవ గల అన్నము తింటూ ఇతరులకు కూడా అన్నము పెడదాము అన్న ఆలోచన మనసున్న మంచి వారికే వస్తుంది.*

- ఇది రాస్తుంది ఎవరికి క్రుతజ్ఞతలు తో తెలుసా - మనసున్న ఓ చిరు ఉద్యోగ మిత్రునికి, తనంతట తాను ఫోన్ చేసి చెప్పారు, ఏవండీ నేను పని సహాయకులను తీసుకొచ్చి, బయట నుంచి అన్ని చూపించి వివరిస్తాను, ఎస్టిమేషన్/ అంచనా తీసుకుంటాను అని.

అందుకే అంటారు పెద్దతనము సంస్కారం అన్నది, వయసుతో పదవితో వర్గంతో ధనముతో రాదు, మానవత్వం సత్ బుద్ది తో వస్తుంది అని. మానవ సేవ మాధవ సేవ తో వస్తుంది.

లోకం తీరు లో కధనాలు, మన అందరి ఇళ్ళలోనివే, మన అందరి మనసులోనివే, కాదాంటారా?

ఎందుకంటే అప్పులతో, కబ్జాలతో, మోసాలతో, 2 నాల్కలు కపట నటన ల తో, నక్క పాము పులికి ఓటు వేసే, వాటితో పప్పు కూడు తినే వారి దగ్గర, రూపాయి లేదా కనీసం బియ్యం/ బెల్లం/ చక్కెర పలుకు కూడా తీసుకోకూడదు, అది మన పిల్లల సంస్కారం ను ఎదుగుదలను పతనం చేస్తుంది. ఎవరి రాత వారు రాసుకోవడం అంటే ఇదే. వీరు రామేశ్వరం, కాశీ, తిరుపతి వెళితే లేదా ఇంకే పని చేసినా చిత్తశుద్ది లేకుండా, పుణ్యం రాకపోగా, దుర్బుద్దికి పాపం వస్తుంది. వీరు నరసేవ నారాయణ సేవ అంటే ఒప్పుకోరు, చేతలలో. కావాలంటే ధనం విసురుదాం, సంస్కారం మాత్రం నేర్చుకోము అంటారు.

రేపు వారి పిల్లలు భాగస్వామి కూడా వారిని, చీదరించుకుని, ఒంటరిగా దూరంగా ఇంట్లో లేదా బంధువులు స్నేహితులతో ధనం విదిలించి లేదా అనాధాశ్రమములో వదిలేస్తారు. తమతో మాత్రం, ఆ కన్న పాపాత్ములను పెట్టుకోరు, దేవతలుగా. కాలు చెయ్యి కదలక మంచం మీద లేదా ఇంట్లోకే పరిమితమైన లేదా సొంత వారి వెన్నుపోటు రోజున, వీరికి తమ అప్పులు ఆస్తులు పదవులు, చివరికి ఏ దుర్గతి దుస్తితి పట్టించాయో తెలుస్తుంది - కానీ వారి మొర ఎవరూ వినరూ ఆనాడు.

మరుజన్మలో ఈనాటి వైభోగం, ఇక ఏనాటికీ ఉండదు, మనకు అర్హత లేదు, కుక్కను కనకపు సిమ్హాసనం మీద అనవసరముగా పెట్టారు దేవుడా, అని మనము నిరుపిస్తున్నాము కదా, పంచభూతాలు నమోదు చేసుకుంటున్నాయి కదా.

మనకు పెద్దలు ఉదాహరణతో చూపించారు - రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, మన ఇళ్ళ చుట్టూ ఉన్న నిర్భాగ్య ముదుసలి తల్లి దండ్రులు అత్త మామలు అందరూ.

గుర్తు ఉందా, మొన్న వచ్చినప్పుడు అవసరము లేకపోయినా, ఎంత ఖర్చు అయినా వెనకాడకుండా, 4 గురికి మనమూ అన్నం పెట్టాలని, కావాలని కల్పించుకుని, మిత్రులతో పనుల ఆలోచన చెప్పి, ఆ వచ్చిన పని సహాయకులతో, ఓనర్ లాగా దూరంగా కూర్చొని మధ్యలో రాకుండా, వారిలో కలసి పోయి మాటలు చెపుతూ నవ్విస్తూ, మంచి నీరు టీ లు అందిస్తూ, ఇక్కడ దొరకని వివిధ రకాల తినుబండారాలు వారికి పంచి పెడుతూ, పైన స్లాబు వేయించి, అలాగే ఇంటికి రంగులు వేయించి, పదిమందికి 4 రూపాయలు ఇచ్చే భాగ్యం దేవుడు ఇచ్చారు.

ఏవండీ ఇంట్లో ఏమిటి శుభ కార్యం పెళ్ళా అని అందరూ అడిగారు - అవును లోక కల్యాణం, వేంకటేశ్వర/ శ్రీనివాస కల్యాణం ఈ సహాయకుల ఇళ్ళలో అని చెప్పాము.

తెలిసిన వారికి అందరికీ చెప్పా, ఆనాటి నుంచి, మీరు సొంత ధనం ఇవ్వక్కరలేదు, కష్టపడి చెమటతో ఏమీ చేయవద్దు, కేవలం రాజా లాగ కూర్చుని, మంచం పై పడుకుని, నోటి మాటతో మంచి వారిని కలిపితే చాలు, పని చేయిస్తే చాలు అని, ప్రతి 6 నెలలకు ఇంకో ఇంటికి మీ చేతుల మీదగా బువ్వ ఇప్పించండి అని.

ధనం ఇస్తే సహాయకులు, చాల మంది దొరుకుతారు, వారు కాదు మనకు కావల్సింది - వీరితో పనిలో నమ్మకము ఉండదు. మనకు తెలిసి నీతి పద్దతిగా ఉండి, పని దొరక్క తపన పడే, బడుగు జీవులు కు మనము అండగా ఉండాలి - వీరు నమ్మకం గలవారు.

అన్ని బాగున్న ప్రతి ఒక్కరు ఆలోచన చెయ్యాలి, రేపు మన ముదుసలి తనములో, ఇలాగే మన ఇళ్ళు మన ఒళ్ళు ఉంటుంది, మన పిల్లలకు ఇంకొకరి సహాయం అవసరం అవుతుంది, నిస్సహాయ పరిస్తితిలో, అని వారికి తెలుసు. ముదుసలి అమ్మ ఆరోగ్యం తో మనం ఎప్పుడు కదులుతామో మనకే తెలీదు. చూద్దాం, ఇప్పుడైనా, మిగతావారు కదులుతారేమో.

కేవలం బయట శుభ్రం చేయడానికి, అసలు మా వాళ్ళు రావాల్సిన పని లేదు. ఇదిగో 100 (ఉదాహరణకు) అడిగారు రేపు చేయిస్తున్నా అంటే, వెంటనే పేటీయెం లేదా బాంక్ అకౌంట్ లో మనమే వేస్తాము. లోన వాటికి మనవారు వస్తారు, వీలును బట్టి, కాస్త వెనకా ముందు. మనకు ముందు చెప్పకుండా, అనుమతి తీసుకోకుండా, ఏ పనీ చేయకూడదు, అసలు అక్కడకు వెళ్ళకూడదు, అది ధర్మ విరుద్దం. మనం ధర్మం తప్పితే, మన పిల్లలు మన స్నేహితులు బంధువులు అందరూ ధర్మం తప్పుతారు.

బయట తెలిసిన వారిలో, మొదటగా మనుషులను తెచ్చి చూపిస్తాను, అన్న గొప్ప మనసు నీదే. ఆస్తులు అధికారం పలుకుబడి ధనం అప్పు కపటం నాటకం 2 నాల్కలు దేవుడు మెచ్చరు, కేవలం మానవత్వం మంచికి సహాయం మాత్రమే దేవుడు గుర్తు పెట్టుకుంటారు.

ఒకరు అడిగితే చేసేది సహాయం, అడకుండానే ముందుకు మనంతట మనం ముందుకు వచ్చి చేసేది, దైవ మరియు గురువు సేవ. అది మన సంస్కార కుటుంబం, అలాగే పిల్లల ఎదుగుదలపై తప్పక ప్రభావం చూపిస్తుంది.

ముదుసలి కన్న తల్లి సజీవ గురువు సేవ కు, అండగా ఉండాలి అన్న ఆలోచన వచ్చింది అంటే, రేపు మీ పిల్లలు కూడా, మిమ్మల్ని ముదుసలి వయస్సులో దేవతలు గా కొలుస్తారు. మంచి మాట, మనసు, కూడా, దైవ పూజ సేవనే.

ఆ దుంగలు కూడా మీరే తీసుకుని వెళ్ళి వాడుకునే వారు వాడుకోవచ్చు, అక్కడ ఇంకా ఉంటే - లేదా రేపు కొట్టబోయే కొమ్మలు, పచ్చ ఎండు గడ్డి మీకు పనికి వస్తే అది తీసుకోవచ్చు. మనసుతో నమ్మకము పెంచుకునే విధానం ఇది, అది ఉత్తరోత్తర ఇంకో విధముగా మనకు తప్పక ఉపయోగపడుతుంది.

రేపు వారికి చూపించి, వివరాలు చెప్పి, రేటు అడగండి. మొదటి పని

1. బయట, లోపల, పార తిరగేసి, చెట్లు పిచ్చి మొక్కలు చెత్త, తీయాలి చిమ్మాలి, బయట ఇంటి రోడ్డు మూలన, పంచాయితీ వారు తీసుకునే విధముగా వేయాలి.

ఇతరుల స్థలములో చెత్త వేయవద్దు. వారి శాపాలు పాపాలు మనకు వద్దు. మన సందులో చూడండి, ఎంత చెత్తో పక్కన వారి అజాగ్రత్త నిర్లక్ష్యం లెక్కలేనితనం సంస్కార పెంపకం వలన, వారు, వారి తర్వాత తరాలు అనుభవిస్తారు ఆ బాధ.

2. నీడ నిచ్చే, పండ్లు పంచే, పెద్ద చెట్లు అంటే జామ/ వేప లేదా ఇతర మొక్కల కు, పక్కకు పోయే కొమ్మలు మాత్రమే, అవసరం అయిన వరకే తీయాలి. అనవసరంగా చెట్టు ను, కొమ్మలు ను నరకకూడదు, అది కూడా జీవ హింసే, పాపమే.

3. ఇంటి చుట్టూ, అలాగే పైన కూడా తిరిగి, ఎక్కడ అయినా గోడలు బండలు మిద్దె పైన, గడ్డి పిచ్చి మొక్కలు ఉంటే, మరలా పెరగకుండా వేళ్ళతో సహా తీయాలి.

4. పంచాయితీ వారితో ఆ మొదలు వరకే ఖండించబడి ఉన్న కొబ్బరి చెట్టును మొత్తము పెకిలించి తీసుకోవచ్చు, మరలా పిలకలు రాకుండా.

ఇది ఈ రోజు కే కాదు,

1. ప్రతి 6 నెలలు లేదా సంవత్సరం కు, మరలా పని ఉంటుంది. వారికి మీరు మాట సహాయంతో మీ మీద నమ్మకముతో, వరుస ఆదాయం చూపిన దేవుడు అవుతారు, ఆ మనసున్న పనివారికి.

2. వారు చేసిన ఈ పని నచ్చితే, మిగతా పనులు, అంటే ఇల్లు చిమ్మడం, బూజు దులపడం, కడగడం కూడా ఉంటుంది - పైన, కింద, చిన్న ఇల్లు కూడా - తర్వాత.

3. ఇక నుంచి ఆస్థాన నమ్మక పని సహాయకులు వారు అవుతారని చెప్పగలరు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2058 General Articles and views 1,785,621; 104 తత్వాలు (Tatvaalu) and views 217,045
Dt : 08-Aug-2023, Upd Dt : 08-Aug-2023, Category : General
Views : 193 ( + More Social Media views ), Id : 1867 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : word , mouth , good , people , work , feed , family , hands , every , 6 , months
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content