3 రాజధానుల సలహా - ప్రతిపక్షాల నోరు ఎత్తకుండా, జగనన్న తెలివిగా, మొదటి సారి - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2107 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2142 General Articles and views 2,105,409; 104 తత్వాలు (Tatvaalu) and views 238,171.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఏవండీ మీరైతే 3 రాజధానుల విషయంలో సలహా - ప్రతిపక్షాల నోరు ఎత్తకుండా, ఎలా చెప్పి ఉంటే బాగుంటుంది జగనన్న తెలివిగా, మొదటి సారి బయట పెట్టినప్పుడు.

జవాబు. గతంలో లో నే అనుకున్నాం పచ్చని 3 పంటలు కాంక్రీటు చేసిన పాపం వదలదు చంద్రన్న ను అని. ఒక రకంగా, విజయవాడ ను రాజధాని గా ప్రకటించినట్లే, కేంద్ర కమిటీ నిర్ణయం గాలికి వదిలి. కానీ తెలివిగా అమరావతి, గంట దూరంలో పు ఎంచుకున్నారు, భవిష్యత్తు లో అన్ని కలసి పోతాయి అని. ఇన్సైడ్ ట్రేడింగ్, భూ పంపక లుకలుకలు మనకు వద్దు, రాజకీయ నాయకులు చూసుకుంటారు. కానీ కోట్లు ఖర్చు పెట్టి, కట్టడాలు కట్టారు.

ఆనాడు, వైకాపా వాళ్ళు దొనకొండ బెటర్ అని గోల గోల చేశారు. అది తెదేపా లెక్క చేయలేదు. మరి తర్వాత 3 రాజధానులు, విషయంలో దొనకొండ వదిలేసారు. అంటే, తమ నిర్ణయమే తమకు నచ్చలేదు. ముందు నాకు 9 రుపాయలు ఇస్తామని, ఎలెక్షన్ తర్వాత, ముగ్గురు అన్నదమ్ములు ఒక్కొక్కరు 3 తీసుకోమంటే, దురుద్దేశ్యం అర్ధమైంది కదా. మాట మీద లేరు రాజధాని విషయములో.

పోనీ కర్నూలు, అమరావతి, వైజాగ్ అన్నారు కదా. ఆల్రెడీ అభివృద్ధి చెందిన వైజాగ్ ని, మన వాళ్ళు మరలా అభివృద్ధి చేయడం ఏమిటో, ఆ దేవుని కే తెలియాలి. ఇక్కడ చంద్రన్న పాటి తెలివి కూడా వాడలేదు. వైజాగ్ బదులుగా, గంట దూరంలో ఉన్న అన్నవరం, తుని, అనకాపల్లి లేదా విజయనగరం పేరు వాడితే బాగుండేది నిజాయితీగా. ఎటూ వైజాగ్ స్ధలం రేట్లు కూడా పెరుగుతాయి. నైతిక విజయం ఉండేది, వినడానికి బాగుండేది. వైజాగ్ పేరు తో, మనం కూడా అదే తప్పులు చేస్తున్నాం మన వాళ్ళ లబ్ధి కోసం, ఏదో తేడా కొడుతోంది.

ఈ కోర్టు కేసులు తేలేది ఎప్పుడో, అమరావతి ప్రశాంతంగా ఉండేది ఎప్పుడో. ఆ 3 రాజధానుల జనం కల తీరేది ఎప్పుడో, ఆంధ్రా లో మరలా నిజమైన కట్టుబడి జరిగేది ఎప్పుడో, రామా. మనవాళ్లు వెళ్లి, ఢిల్లీలో ప్రతిపక్షం మీద, గత పనులు మీద సీబీఐ కోసం నినాదాలు, ఓ విచిత్రం. మరి ప్రత్యేక హోదా, నినాదాలు, చివరలో చేస్తారేమో?

మరి ఈ మొత్తం సీను లో, ముఖ్యులు, తెలివైన వారు ప్రజలు, వారిని అభినందించాలి. పోయిన సారి వాళ్ళు తిన్నారు, ఇప్పుడు వీళ్ళు తింటారు, మూడో వాళ్ళ ను రానీయం, కొత్త మార్పులు వద్దు, మోడీ గారి లాగా.

మేం మాత్రం బిగ్ బాస్ షో చూసుకుంటా, ఎంజాయ్ చేస్తాం. ఎన్నికలు వస్తే, చేతిలో అంత, మరలా 5 ఏళ్ళు, మేము మీ జోలికి రాము, పన్నులు పెంచినా ఓకే.

చదువు కు వైద్యం కు, మా ఆస్తులు అమ్మి కట్టుకుంటాం అంటారు. అందుకే మనకు అభివృద్ధి ముఖ్యం కాదు, అంటే ఒప్పుకుంటామా? తప్పులు ఒప్పుకుంటే, మన రాష్ట్రం ఇలాగ ఉంటుందా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2142 General Articles and views 2,105,409; 104 తత్వాలు (Tatvaalu) and views 238,171
Dt : 20-Sep-2020, Upd Dt : 20-Sep-2020, Category : Politics
Views : 916 ( + More Social Media views ), Id : 710 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : 3 capital advice , opposition , jagan , wisely , first time
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content