3 రాజధానుల ముచ్చట కొత్త జిల్లాలలో, వీరన్న బాసట రాయలసీమలో - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1731 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1766 General Articles and views 1,290,422; 90 తత్వాలు (Tatvaalu) and views 176,252.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఆంధ్రా శాసనమండలిలో, డిసెంబర్ 4 2020 శుక్రవారం, ఏపీ రాజధాని అమరావతిపై చర్చ జరిగింది. మంత్రి అనిల్ మాట్లాడుతూ అమరావతిని మార్చడం లేదని, అమరావతితో పాటుగా ఇంకో 2 రాజధానులు చేర్చామని, పాత మాటలే మరలా వివరించారు. అమరావతి లెజిస్లేటివ్‌, ఇంకొకటి ఎగ్జిక్యూటివ్, మరొకటి జ్యూడీషియల్‌గా పయనం, అన్న విషయం మనకు తెలిసిందే.

కొత్త జిల్లా ప్రక్రియలో మాత్రం, అదే వికేంద్రీకరణ సూత్రం పాటిస్తారు అని, ఎక్కడ కూడా ప్రకటనలలో బహిరంగంగా చెప్పడం లేదు. అంటే కేవలం, కావాలని ఏదో ఉద్దేశ్యం తో, ఇదంతా చేస్తున్నారు అని ప్రజలకు అభిప్రాయం అనుమానం రాదా? చంద్రన్న తప్పు చేస్తే, కోర్టు లో నిరూపించి, ఇతర అభివృద్ధి చెందని ప్రాంతంలో, రాజధాని ని అభివృద్ధి చేసి, ప్రజల మన్ననలు పొందాలని, అభిమానులు ఆవేదన. చంద్రన్న కట్టిన కట్టుబడి, కొత్త నగర శక్తి, మనకు లేదా?

మంత్రి గారు, మాట తప్పని మడమ తిప్పని, మన జగనన్న సలహాదారుల కు మరియు మనకు భయం ఏమిటి? ఉన్న విషయం నేరుగా ఒప్పుకోవచ్చు కదా. అమరావతి కి అసెంబ్లీ ఉన్నప్పుడు మాత్రమే సంవత్సరం కు, పర్యటనకు 3 సార్లు వచ్చి వెళతాము. మిగతా అంతా, అభివృద్ధి చెందిన వైజాగ్ ను ఇంకా అభివృద్ధి చేస్తూ, సంవత్సరం మొత్తం వైజాగ్ బీచ్ ఒడ్డున అక్కడ నే ఉంటామని, ధైర్యంగా చెప్పవచ్చు కదా.

పెద్ద ఇంటికి సంవత్సరం కు 3 పర్యాయాలు అతిథిగా వచ్చి, చిన్న ఇంట్లో సంవత్సరం అంతా కాపురం ఉంటే, పెద్ద ఇల్లు ఇల్లాలిని వదిలినట్టు ఏనా? గౌరవం తక్కువ చేసినట్టా అని, మీరు వివేకం తో ప్రశ్నించడం, మన పార్టీ వారు ఈలలు వేసి సమర్ధించడం, ఇతరులు అవ్వ ఎంత బరితెగింపో అనుకోవడం, ఎందుకు? అని వైసీపీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

ఈ బుధవారం రోజు వీరన్న చూడండి ఏమన్నారో, అనంతపురం నుంచి. రాష్ట్ర రాజధాని అమరావతే. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాల్సిందే. ఈ రెండింటిపై మా పార్టీ నిర్ణయం ఇదే - అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు.

జగన్ చంద్రబాబు పోలవరానికి ఇచ్చిన ప్రాధాన్యత, తెలుగు గంగ లాంటి, ఇతర ప్రాజెక్టులకు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు.

2024లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తే, రాయలసీమ ప్రాజెక్టులకు, పోలవరం లాగే నిధులు కేటాయిస్తామన్నారు.

రాయలసీమ నికర జలాల కోసం ఈ ప్రభుత్వంతో, బీజేపీ అలుపెరుగని పోరాటం చేస్తుందన్నారు. 

టీడీపీ, వైసీపీలు కమీషన్‌ పార్టీలని ఆరోపించారు. అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని, ముఖ్యమంత్రి జగన్‌ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.    
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1766 General Articles and views 1,290,422; 90 తత్వాలు (Tatvaalu) and views 176,252
Dt : 10-Dec-2020, Upd Dt : 10-Dec-2020, Category : Politics
Views : 566 ( + More Social Media views ), Id : 848 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : 3 capitals , development , amaravati , new districts , somu , support , rayalaseema , anantapuram , minister anil
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content