30 దాటినా క పుట్టినరోజు పండుగ లా? వాస్తవం గా సాధించిన ది ఏమిటి? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1766 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1801 General Articles and views 1,394,917; 94 తత్వాలు (Tatvaalu) and views 184,841.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

30 దాటినా క లేదా పెళ్ళి ముడి పడ్డాక లేదా జబ్బు న పడ్డాక, వీటిలో ఏది ముందు జరిగితే అది, ఇంకా పుట్టినరోజు పండుగ ల తో, అసలు వాస్తవం మరవకూడదు. సాధించిన ది ఏమీ లేదు, మన సొంత పంచ ఇంద్రియాల ను జయించనంత వరకు.

ప్రపంచాన్ని జయించినా కూడా, సొంత ఇంద్రియాలను జయించకపోతే, సాధించినది శూన్యం. పండుగ చేసుకునే ముందు, ఆలోచన చెయ్యి, వయసు పెరిగినందుకా? లేక ఆయువు తగ్గుతున్నందుకా?

మోసంతో లేదా మోహం తో లేదా అన్ని వదలి ఆత్రముతో, తర తరాలకు ఎంత సంపాదించినా, దానితో పాటే పాప కర్మను కూడా, తర్వాత తరాలకు అందిస్తున్నాము. మరువద్దు, వారు అదీ పంచుకోవాలి, తప్పించుకోలేరు. మనకు అది చివరకు అక్కరకు రాదు. అందుకే, ముందు మనల్ని మనమే జయించాలి.

డబ్బు లేని వాడికి లేదు అని ఏడుపు, ఉన్నవాడికి చాలదూ అని ఏడుపు, ఎక్కువైన వాడికి ఎవరు ఎప్పుడు కొట్టేస్తారో అని ఏడుపు.

బట్ట తల, బాన పొట్ట, అధిక బరువు, చత్వారం కళ్ళ జోడు, బీపీ, చక్కెర, కీళ్ళ నొప్పి ,వ్యామోహం, క్రోధం, దురాశ, అసూయ, అదుపు లేని నోరు నాలుక, కోతి మనసు, మతిమరుపు, ఇంటా బయట టెన్షన్, ఎవరూ మాట వినరు, తిన్నది అరగదు, నిద్ర పట్టదు, ఇవేనా మనము 30 ఏళ్ళుగా సాధించిన ది?

ఒంటరి వాడి నుంచి వంద మంది ఉన్న వారి దాకా, అందరిది ఒకటే ఏడుపు, ఉన్న ఇంట్లో ఉన్న మనుషులతో మనశ్శాంతి లేదు అని, అంతా భ్రాంతి లోనే బతుకుతున్నాము అని.

దేనికో త్వర త్వరగా దగ్గర అవుతున్నాము, అన్న గుండె లోతు ల్లోన బాధ భయం తో భీతి తో, నవ్వ లేక, ఏడ్వ లేక, తికమక అయోమయం.

ఇప్పుడు అయినా , మదిలో మనసుతో భగవన్నామ స్మరణ సాధన చేసి, మనశ్శాంతి పొందకపోతే, అంతా నిష్ప్రయోజనం.

వాస్తవం ఏమైనా ఉందేమో, ఆలోచన చెయ్యి మిత్రమా. గతం మార్చలేమూ, ఏమీ చేయలేము, రేపు మనది కాదు, ఇప్పుడే గత జ్ఞాపకాలతో, మార్పు చేసుకో. మిగిలిన జీవితాన్ని మార్చుకో. అరిషడ్వర్గాలను మరియు మన మనసును గెలిచే ప్రయత్నము చెయ్యి.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1801 General Articles and views 1,394,917; 94 తత్వాలు (Tatvaalu) and views 184,841
Dt : 02-May-2019, Upd Dt : 02-May-2019, Category : General
Views : 1239 ( + More Social Media views ), Id : 96 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : birth day party , after 30 , achievements
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content