మనుషులు/ హిందువులు 4 రకాలు - 4 types of people/ Hindus - మనం ఎవరం? Who are we? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,886; 104 తత్వాలు (Tatvaalu) and views 226,447.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

4 types of people/ Hindus - Conquer Arishadvarg Ashtavyasan, Health, Living Guru Seva, Peace, Spiritual, Moksha, Vaksuddi

మానసిక నియంత్రణ, మానవత్వం, నిస్వార్ధం, విశ్వసనీయత, క్రుతజ్ఞత, వాక్సుద్ది, సజీవ గురువు సేవ, మాత్రు భాష లో రాత మాట పాట పద్యం, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వ నియంత్రణ తో, సనాతన ధర్మ ఆచరణ చేసే వారు మాత్రమే, వారిని, వారి కుటుంబాన్ని, సమాజాన్ని, ధార్మిక పద్దతిలో మనశ్శాంతి తో, ఉండేటట్లు చేయగలరు. సమాజం అంటే అందరూ ఆ భగవంతుని సంతానమే అన్న స్రుహ ఉంటే, ఈ మోసాలు, ద్రోహాలు ఉండవు కదా. సమాజం మనశ్శాంతి గా లేకపోతే, మనము ఒక్కరమే మనశ్శాంతి గా ఎక్కువ కాలం ఉండలేము, మరువద్దు. మనము ఎవరికి వారం, గొప్పగా, ఇందులో ఏ తరగతికి చెందిన వారము అని తెలుసుకుందాం, మిత్రులతో గర్వముగా చెప్పుకుందాం. ఈ కధనం సేకరణ, సవరణ.

1. నామమాత్ర మనిషి/హిందువు, అంటే పేరుకే A nominal Person/Hindu, i.e. for name sake only

మానవత్వం/ హిందూ ధర్మం గురించి, పైన చెప్పిన వాటి గురించి, పెద్దగా ధ్యాస ఉండదు. కేవలం తమ ఆనందం/ స్వార్ధం. ఇతరుల సంగతి మనకు అనవసరం. పని ఉంటేనే పది మంది, పని లేకపోతే మా బతుకు మాదే. వీరి వలన, వీరికి, వీరి కుటుంబానికి, వీరి తల్లి దండ్రులకు, సమాజానికి పెద్ద ఉపయోగం లేదు.

2. మనిషి/ హిందూ వ్యతిరేక మనిషి/ హిందువు Person/Hindu Anti-Person/Hindu

మనిషి/హిందువు పేరు పెట్టుకుని, ఆత్మ ద్రోహముతో, మనిషి/ హిందూ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ ఉండేవారు. అబ్బే అవన్నీ దండగ అంటారు, పైనవి ఏవీ వీరికి ఉండవు, తెలీదు. హిందూ ధర్మం/ దేశము లో తప్పితే, ఇంక ఎక్కడా వీరికి ఏ రకమైన వైపరీత్యాలు కనబడవు. ౠజువులు చూపమని, ఇక్కడ మాత్రమే అడుగుతారు. కానీ ఇతర మతాలలో/ దేశాలలో ౠజువులు వెతకాలంటే, వెన్నులో చలి వస్తుంది, అబ్బే దూర మతాలవి/ దేశాలవి అన్ని బాగుంటాయి మాకు లేదా మౌనం, అంటారు. వీరెతో వీరికి, వీరి కుటుంబానికి, సమాజానికి నష్టమే. ఎందుకంటే, తమను తాము ఎటూ తెలుసుకో పోగా, కేవలం వ్యతిరేక భావాలతో పతనం అవుతారు.

వీరి వలన, వీరికి, వీరి కుటుంబానికి, వీరి తల్లి దండ్రులకు, సమాజానికి పెద్ద ఉపయోగం లేదు.

3. ధార్మిక మనిషి/ హిందువు A Devout Hindu/ Person

వీరు ప్రతీరోజు పూజలు, శ్రావణ, కార్తీక మాసంలో రుద్రాభిషేకాలు, సహస్ర లింగార్చనలు,
అప్పుడప్పుడు లక్ష పత్రి వ్రతాలు, వరలక్ష్మీ వ్రతాలు చేయడం, ప్రతి రోజూ లేకపోతే కనీసం వారంలో ఒక్కసారి గుడికి వెళ్ళడం, బొట్టు పెట్టుకోవడం, పండగ రోజు అభ్యంగన స్నానం చేయడం లాంటివి చేస్తారు. అవి ఎందుకు చేస్తున్నామో, దానివలన, తన మనసు, తన కుటుంబం ఏమి మారిందో, ఆ దేవుళ్ళ నుంచి ఎన్ని మంచి గుణాలు అలవాటు చేసుకున్నారో కూడా వీరికి చాలా మందికి తెలీదు.

కాని తన కుటుంబం తప్ప, మిగిలిన హిందూ సమాజం ఎలా ఉంది, అన్న విషయం వీరికి అక్కరలేదు. తన కడుపు చల్లగా ఉంటే చాలు అనే ధోరణిలో ఉంటారు. ఇలా చేయాలి, ఇది మంచి పద్దతి అని కూడా ప్రక్కవారికి చెప్పరు. కనీసం ఇతరులకు కీడు చేయకుండా ఉంటే చాలు కదా. కానీ తమ లో ఉన్నది, ఇతరులలో ఉన్నది ఆత్మ పరమాత్మ అని తెలిసేది ఎన్ని జన్మలకి? మోక్షం ఎప్పుడు? పైన చెప్పిన లక్షణాలలో కొన్ని వీరికి ఉండవచ్చు. కానీ ఆచరణ ముఖ్యం.

వీరి వలన, వీరికి, వీరి కుటుంబానికి, వీరి తల్లి దండ్రులకు, సమాజానికి కొంత ఉపయోగం ఉండవచ్చు.

4. మానసిక, సామాజిక, చైతన్య, ఆచరణ హిందువు/ మనిషి Manasik, Social, Conscious, Practical Hindu/ Person

హిందూ మరియు సమ సమాజ మానసిక రోగ వ్యసన మోహ నియంత్రణ రక్షణ కోసం, అలాగే ఇతరుల యందు భూత దయ కలిగి, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కోసం, నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. పూజలు పునస్కారాల తో మానసిక నియంత్రణ కలిగి, సనాతన హైందవ జాతిని, నిత్యం జాగృతం చేస్తుంటారు. ప్రాపంచిక వ్యామోహాల కష్టాల నుంచి, జనులను బయటకు తెచ్చి, అందరినీ ఐక్యతగా ఉంచడం, చాలా అవసరం, అన్న ఆలోచనలో నిత్యం ఉంటారు. సమాజం పచ్చగా ఉంటేనే, మనము పచ్చగా ఉంటాము అని, పంచభూతాల సాక్షిగా వీరి ఆచరణ ఉంటుంది.

నిస్వార్ధముగా, అన్ని జీవుల రక్షణ మన తక్షణ కర్తవ్యం అన్నట్టుగ, వీరి నిత్య జీవితం ఉంటుంది. దాని కోసం ఎన్ని కష్ట నష్టాలైనా అవమానాలైనా భరిస్తారు. సమాజంలో, అతి తక్కువ ఉన్నది, వీరే. వీరి సంఖ్య పెరగాలి. వీరి సంఖ్య పెరుగుతూ వస్తోంది. వీరి సంఖ్య దేశం మొత్తంలో 3% కన్నా తక్కువ ఉంటేనే, దేశంలో పరిస్ధితులలో మార్పు స్పష్టంగా కనబడుతోంది. ఇలాంటోళ్లు ధర్మానికి తప్ప ఇంకెవరికి తల వంచరు, ఎవ్వరికీ భయపడరు.

వీరి వలన, వీరికి, వీరి కుటుంబానికి, వీరి తల్లి దండ్రులకు, సమాజానికి చాల ఉపయోగం ఉంటుంది.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,886; 104 తత్వాలు (Tatvaalu) and views 226,447
Dt : 22-Jun-2023, Upd Dt : 22-Jun-2023, Category : General
Views : 389 ( + More Social Media views ), Id : 1810 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : 4 , types , people , Hindus , Conquer , Arishadvarg , Ashtavyasan , Health , GuruSeva , Peace , Spiritual , Moksha , Vaksuddi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content