పాటతో పరమార్ధం- ఆకాశాన సూర్యుడుండడు - సుందరకాండ - వెంకటేష్, మీనా, అపర్ణ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2152 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2187 General Articles and views 2,392,471; 104 తత్వాలు (Tatvaalu) and views 258,589.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Aakasana Suryudundadu - Sundarakanda - Venkatesh, Meena, Aparna - Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు

మన గాత్ర నైవేద్య సేవ Our Gatra Naivedya Seva - మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva

నీటి మీద బుడగ బతుకు, 9 రంధ్రాలు ఉన్న ఈ మానవ జీవితము, అని అందరికీ తెలుసు. మరి తెలిసి కూడా, ఎందుకు ఈ పంచ ఇంద్రియాలను సుఖపెట్టాలి అని, ప్రాపంచిక బ్రమలు లో మునిగిన మానవుడు, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వంలో మునిగి పతైనమైపోతున్నాడు.

పట్టపగలు ధగ ధగ లాడే, ఆకాశాన సూర్యుడు, సంధ్య వేళకు ఉండరు. రాత్రి పూట వెన్నెలలు ఇచ్చే ఆ చందమామకి, తెల్లవారితే రూపముండదు. అంటే మనందరి, ఈ మజిలీ మూడు నాళ్ళే. మరి ఈ జీవయాత్రలో, ఒక పూటలొనె రాలు పూవులెన్నో, గమనించారా ఎప్పుడైనా?

ఆసుపత్రిలో రోగులను, స్మశానములో మండుతున్న చితులను, అనాధాశ్రమాలలో ఎండుతున్న కట్టెలను, చూసారా? మొన్న కోడలు/ అల్లుడు, తమ సొంత అత్త/మామలను హింసించేది చూసారు కదా, వారు తేలికగా బయటపడతారు, ధన అండతో. నేడో రేపో మనము అక్కడికే, మీరు అవునన్నా కాదన్నా, కాలచక్రాన్ని ఎవరమూ ఆపలేము. అందుకే నేడే నిద్రలెగవాలి, సాధన చెయ్యాలి, మనసును నియంత్రించాలి.

మన ఎద లోతుల్లో ఒక ముల్లున్నా, పూర్వ జన్మ కర్మ ఫలాల ఫలితాలుగా ఎన్ని బాధలున్నా, నీతి నియమాలతో నిజాయితీలో, వికసించాలె, ఇక రోజాలా. చెడ్డ గుణాలతో, మనసు శరీరం పాడుచేసుకుని, కన్నీటి మీద నావ సాగనేల?

రోజూ మనము చుట్టూ చూస్తునాము, కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన, కొత్త పూల మధుమాసంలో, తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు, రోజే చాలులే? అవును కదా, అంటే మంచి మనిషిగా, ఆదిశంకరులు గా కొద్ది కాలమే బ్రతికినా, ఆ జన్మకు సార్ధకమైన ఉత్తమ సాత్విక పనులు చెయ్యాలి.

నిత్యం ఏదో ఒక బాధతో, చింత పడే చిలిపి చిలకా, చిత్రములే మనందరి బ్రతుకు నడకా? పుట్టే ప్రతి మనిషి, కను మూసే తీరు కూడా చిత్రముగా ఉంటుంది. కానీ కర్మ ఫలితాలు తప్పక అనుభవించాలి. అది, మన పెద్దలు నిరూపించారు.

నమ్మరు కదూ ఉదాహరణ లేకుండా, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వలన లాభనష్టాలు, మన పెద్దలు ఎప్పుడో ప్రత్యక్షంగా నిరూపించారు. పురాణాలు లో కాదు సుమీ, ఈ 50 ఏళ్ళు లో. మీ పెద్దలు ను అంటే, సంస్కారం ఉన్న వారిని అడగండి.

రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ‌‌‌, కాఫీడేఅయ్య, మాల్యయ్య, సింఘానియయ్య, మీ ఇంట్లో మా ఇంట్లో, లాంటి మహానుభావుల చివరి పేజీలు చదవండి. అందుకే ఆవు గుణాల కు లేదా నోటాకు ఓటేద్దాము. నక్క, పులి, పాము గుణాలకు ఓటేస్తే, మన బతుకు వాటి చేతిలోనే రాలిపోతుంది.

ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే
చందమామకి రూపముండదు తెల్లవారితే
ఈ మజిలీ మూడు నాళ్ళే ఈ జీవయాత్రలో
ఒక పూటలొనె రాలు పూవులెన్నో
నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలె ఇక రోజాలా
కన్నీటి మీద నావసాగనేల

నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా

కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసంలో
తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు రోజే చాలులే
చింత పడే చిలిపి చిలకా చిత్రములే బ్రతుకు నడకా
పుట్టే ప్రతి మనిషి కను మూసే తీరు
మళ్ళీ తన మనిషై ఒడిలోకే చేరు
మమతానురాగ స్వాగతాలు పాడ

నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా

నీ సిగపాయల నీలపు ఛాయల చేరుకున్న ఈ రోజాలే
నీ జడ కోరని కోవెల చేరని రోజే వచ్చులే
పంజరమై బ్రతుకు మిగులు పావురమే బైటికెగురు
మైనా క్షణమైనా పలికిందే భాష
ఉన్నా కలగన్నా విడిపోదీ ఆశ
విధి రాతకన్నా లేదు వింత పాట

నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలె ఇక రోజాలా
కన్నీటి మీద నావసాగనేల
నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా

1992 S. P. Balu  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,392,471; 104 తత్వాలు (Tatvaalu) and views 258,589
Dt : 29-Mar-2024, Upd Dt : 29-Mar-2024, Category : Songs
Views : 424 ( + More Social Media views ), Id : 2070 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Aakasana Suryudundadu , Sundarakanda , Venkatesh , Meena , Aparna , balu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content