దేవీస్తుతి - అమ్మల గన్నయమ్మ (పోతన), శ్రీ లలితా శివ జ్యోతి (రహస్యం), శివానీ భవానీ (స్వాతి కిరణం) - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,564; 104 తత్వాలు (Tatvaalu) and views 225,158.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*పాటతో పరమార్ధం - దేవీస్తుతి - అమ్మల గన్నయమ్మ (బమ్మెర పోతన), శ్రీ లలితా శివ జ్యోతి (రహస్యం), శివానీ భవానీ శర్వాణీ (స్వాతి కిరణం)*

Song Spirit - Ammala gannayamma (Bammera Potana), Sri lalita siva jyoti (Rahasyam), Sivani bhavani (Wwathi Kiranam)

మనకు మన అమ్మ గొప్ప, కొందరము మనకు ఉన్న, అన్ని సమాన వైద్య మరియు ఇతర సౌకర్యాలు కల్పించి, దగ్గర పెట్టుకుని పూజిస్తున్నాము. ప్రతి శనివారం, అమ్మ పాదాలకు పూజ, అలాగే ప్రతి రోజు అమ్మ పాదాలకు నమస్కారం చేయడం మీకు తెలుసు. అది అమ్మ కోసం కాదు, మనము అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లో నేటికీ లేము అని మనకు మనము సరి చూసుకోవడమే మిత్రమా.

మన అమ్మల కన్నా పెద్దమ్మ ను చూడటానికి, ప్రతి వారం గుడికి వచ్చే ముదుసలి అమ్మలను చూస్తుంటే, అమ్మ మరియు నేను, తలవంచి వారికి నమస్కరిస్తాము, ఎందుకంటే మాకన్నా తప్పక గొప్ప గుణవంతులు అయ్యి ఉంటారు వారు, వారి దీవెనలు కావాలి, దేవాలయ పెద్దమ్మ తో పాటుగా.

కొందరము అదే అమ్మను దూరముగా ఊళ్ళల్లో, ఒంటరిగా ఎవరి చేతిలోనే పెట్టి లేదా ఆశ్రమాల్లో డబ్బులు చేతిలో పెట్టి వదిలించుకుని, గుడికి వెళ్ళి మాత్రము, అమ్మా నాకు జన్మనిచ్చిన తల్లిని, అలా తక్కువ సౌకర్యాలతో ఎక్కడో విడచి గౌరవించా, నువ్వు కూడా ఇంకా ఐశ్వర్యం ఎక్కువ ఇస్తే, అరిషడ్వర్గాలకు బానిసననై, నిన్ను కూడా అంత కన్నా ఎక్కువ గా దూరం పెట్టి గౌరవిస్తాము, అని దురాశతో మొక్కుతాము.

ఆ లలితా దేవి కూడా చిరునవ్వు నవ్వి, రేపు నీ బిడ్డలు కూడా ఇదే ధన మోహములో నిన్నూ అలాగే దూరంగా వదులుతారు మూర్ఖుడా, చిన్నప్పుడు చెయ్యి పట్టుకోకపోతే నడవడానికి, ఎత్తుకోకపోతే, దగ్గర ఉంచుకోకపోతే ఎంత ఏడ్చావో, క్రుతఘ్నుడిగా మరచావు. ఇప్పుడు అదే ముసలి అమ్మ నాన్న కు, అలాగే అత్త మామ కు అయినా అవి తిరిగి ఇవ్వకుండా తప్పించుకుంటున్న స్వార్ధ ఘాతకుడవు, ఆ ధనమే నీ పాలిట శాపము అయ్యి, దానికి తప్ప అన్నిటికీ దూరము అవుతావని, అదే నిన్ను మరలా నేలపై నడిపిస్తుంది, అని చల్లని తల్లి దీవిస్తుంది.

తెలుగు ఫోన్ లో రాయడం రాని చదువు రాని వారికి లేదా పెద్ద వారికి, ఇదొక అవకాశం, తెలుగు భాషను ఇలా గౌరవిస్తూ, గొంతుతోనే మీ అరిషడ్వర్గాల సాధన చెప్పవచ్చు. అలాగే దేవుని పద్యాలు పాటలు పాడి మిత్రులకు పంపవచ్చు. వాక్సుద్ది అనేది చిన్న వయస్సు నుంచే ఉండాలి, మానసిక బలము నకు మిత్రమా. సాత్వికులు, ఎప్పుడులాగనే పాట ప్రయత్నము చేయగలరు, మమ్మల్ని ఆనందింప చేయగలరు. మనము గాయకులము కాదు గాత్ర మాధుర్యానికి, పెద్ద అమ్మ భక్తులము కాబట్టి ప్రయత్నమే ముఖ్యము సుమా.

మన సొంత మాటలు రాద్దాము, మన సొంత సాధనలు తెలుపుదాం, మన సొంత గొంతుతో పాడుదాం, లేకపోతే దేవుడు వాటిని ఆ జ్ఞానాన్ని వెనక్కు తీసుకుంటారు మిత్రమా.

1) అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ
చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన
యమ్మ దన్నులో నమ్మినవేల్పుటమ్మల మనమ్ముల
నుండెడియమ్మ దుర్గా మాయమ్మ కృపాబ్ధి యిచ్చుత
మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.

అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అనేది బమ్మెర పోతన రచించిన భాగవతములోని ప్రాచుర్యం వహించిన పద్యం. తెలుగు సేయబడిన భాగవత ప్రారంభంలోని ప్రార్థనా పద్యాలలో దుర్గాదేవిని ఉద్దేశించింది.

దుర్గాదేవి తల్లు లందరికి తల్లి సప్తమాతృకలను కన్నతల్లి, ముల్లోకాలకు మూల మైన లక్ష్మి సరస్వతి పార్వతులకే మూలమైన తల్లి, అందరు అమ్మల కన్నా అధికురా లైన మహాతల్లి, రక్కసి మూకలను అడగించిన యమ్మ, నమ్ముకున్న దేవతామతల్లుల నిండు మనసులలో నివసించే తల్లి. అట్టి మా అమ్మ దయాసముద్రి అయ్యి నా భాగవత ఆంధ్రీకరణ ప్రణీత మందు కవిత్వంలో గొప్పదనము, పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించు గాక.

2) శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా,
శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా.
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా.

జగముల చిరు నగముల పరిపాలించే జననీ,
అనయము మము కనికరమున కాపాడే జననీ 2
మనసే నీ వసమై, స్మరణే జీవనమై 2
మాయని వరమీయవె, పరమేశ్వరి మంగళ హారతి ||శ్రీ లలితా శివ||

అందరికన్నా చక్కని తల్లికి --- సూర్యహారతి,
అందలేలే చల్లని తల్లికి --- చంద్రహారతి,
రవ్వల తళుకుల కలలా జ్యోతుల --- కర్పూరహారతి..,
సకల నిగమ వినుత చరణ --- శాశ్వత మంగళ హారతి ||శ్రీ లలితా శివ||

3) శివానీ, భవానీ, శర్వాణీ
గిరినందిని శివరంజని, భవ భంజని జననీ 2
శతవిధాల శ్రుతి విధాన, స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివానీ
శివానీ, భవానీ, శర్వాణీ

శృంగారం తరంగించు సౌందర్యలహరివని 2
శాంతం మూర్తీభవించు శివానందలహరివని 2
కరుణ చిలుకు సిరినగవుల కనకధారవీవనీ
నీ దరహాసమే దాసుల దరిజేర్చే దారియని
శతవిధాల శ్రుతి విధాన, స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివానీ
శివానీ, భవానీ, శర్వాణీ

రౌద్రవీర రసోద్రిక్త, భద్రకాళివీవనీ, భీతావహ భక్తాళికి అభయపాణివీవనీ 2
బీభత్సానల కీలవు భీషణాస్త్ర కేళివనీ 2 భీషణాస్త్ర కేళివనీ
అద్భుతమౌ అతులితమౌ, లీల జూపినావనీ

గిరినందిని శివరంజని, భవ భంజని జననీ
శతవిధాల శ్రుతి విధాన, స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివానీ
శివానీ, భవానీ, శర్వాణీ

Swathi Kiranam Movie Songs, Shivani Bhavani Song, Mammootty, Radhika, K Viswanath, KV Mahadevan

Ammala Gannayamma, Sri Lalita Shiva Jyoti, Shivani Bhavani Sharvani  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,564; 104 తత్వాలు (Tatvaalu) and views 225,158
Dt : 22-Apr-2022, Upd Dt : 22-Apr-2022, Category : Songs
Views : 669 ( + More Social Media views ), Id : 1363 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ammala , gannayamma , lalita , sivajyoti , shivani , bhavani , sharvani , durga , goddess , Rahasyam , swathi , svati , kiranam
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content