పాటతో పరమార్ధం - అందరి దైవం నీవన్నా - నోము - రామకృష్ణ, చంద్రకళ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,881,760; 104 తత్వాలు (Tatvaalu) and views 226,324.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Andari Daivam Neevanna - Nomu - RamaKrishna, Chandrakala

హైందవ సనాతన ధర్మ మతము, సర్వ జీవులను భూత దయతో చూడమని చెపుతుంది. అందులో భాగమే ఈ నాగేంద్రుని/ నాగరాజుని పూజ. ఒక దేవతను 1 ఏడు పూజించాము అంటే, అది రాముడు క్రిష్ణుడు ఎవరైనా, వారి లక్షణాలు త్యాగాలు సేవలు, మన రోజూ వారి పని చేతలలో కనపడాలి.

మరి సొంత ముదుసలి తల్లి తండ్రి అత్త మామ సేవ చేయని మనము, దైవ గుణాలను, 100 జన్మలకైనా చూపగలమా? అసలు త్యాగం అంటే మనకు తెలుసా, ఎదుటివారిని హింసించి అవమానించి మోసము ద్రోహము అప్పులు అబద్దాలు వెన్నుపోటుతో, మనము సంతోషపడటం ఎదగడం, ఇదేనా త్యాగం అంటే?

మంచి చెడు తెలియని జంతువైన పాము కాటుతో బయటపడిన వారు ఉన్నారు, కాని మానవ కాటుతో మరలా కన్నులు తెరవని తోటి మానవులు జంతువులు ఎందరో. అవి హాని కలిగిస్తేనే, మన జోలికి వస్తాయి. కానీ మానవుడు, తనకు అడ్డు వచ్చిన వారిని అందరిని, తన మన భేధము లేకుండా, నిర్దాక్షిణ్యముగా తొలగించుకుంటున్నారు.

నాగుల చవితి మా నాగన్నా, మా పూజలు గొనుమన్నా, మీకు పాలు పోసేము, నోము నోచేము, మము చల్లంగ, చూడాలి నాగన్నా అంటూ మనము ఎన్నో సార్లు వేడుకున్నాము. మనమూ వాటికి హాని జరగకుండా చూడాలి, వాటికి నివసించే హక్కు ఉందని గ్రహించాలి.

మల్లెలు తెచ్చామయ్య, మల్లెల నాగేంద్రా, చలిమిడి పెట్టామయ్య, చల్లని నాగేంద్రా, కన్నెలము కొలిచేమయ్యా, కరుణించ వయ్యా అంటూ మహిళలు కోరుతూ పాటలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి, గత సాంప్రదాయాలకు మనకు తెలియని ఎన్నొ అంతరార్ధాలు నియమాలు ఉన్నాయి, అవన్నీ వదిలేస్తే, ఇప్పుడు ఏ బంధానికి విలువలేకుండా పోయింది, ఎవరిని ఎవరు ఎప్పుడు ఏమి చేస్తారో కూడా తెలీదు.

అందుకే, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వమును వదులుదాము, కపట నాటక 2 నాల్కలు మనకు వద్దు. నిజాయితీ గా మనకు కేసులు స్టేలు ఉన్నాయి, మనకు నక్క పాము పులి బుద్దులు ఉన్నాయి అని ధైర్యముగా చెప్పినా కూడా, అవే బుద్దులు గల ఓటర్లు మనల్ని వదలరు, మన తప్పుడు పనులను సమర్దించి, మనల్ని పోషిస్తూ, ఆ ఓటర్లు పతనము పొందుతారు తమ తప్పుడు ఓటుకు ఫలితముగా.

అందరి దైవం నీవన్నా., ఆశలు తీర్చన్నా..
నాగుల చవితి నాగన్నా., పూజలు గొనుమన్నా.
పా.లు పోసే.ము, నో.ము నోచే.ము
మము చల్లం.గ, చూడా.లి నాగన్నా… ||అందరి దైవం||

పానకాలు చిమ్మి.ళ్ళు, కానుక తెచ్చా.ము
ముంగిట ముత్యా.ల, ముగ్గులు పె.ట్టాము
భక్తితో. నిను గూర్చి, పాటలు పాడే.ము
సిరి సంపద లిచ్చి, మురిపించ వయ్యా.. ||అందరి దైవం||

మల్లెలు తెచ్చా.మయ్య, మల్లెల నాగేం.ద్రా..
చలిమిడి పెట్టామయ్య, చల్లని నాగేం.ద్రా
కన్నెలము కొలిచేమయ్యా, కరుణించ వయ్యా..
అడిగిన వరమిచ్చి, అలరించ వయ్యా..||అందరి దైవం||

చిత్రం : నోము (1974); సంగీతం : సత్యం; గీతరచయిత : సినారె; నేపధ్య గానం : సుశీల  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,881,760; 104 తత్వాలు (Tatvaalu) and views 226,324
Dt : 10-Sep-2023, Upd Dt : 10-Sep-2023, Category : Songs
Views : 213 ( + More Social Media views ), Id : 1913 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Andari , Daivam , Neevanna , Nomu , RamaKrishna , Chandrakala , nagula , chaviti , naganna , nagaraju
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content