మనతో గంటలు మాట్లాడిన ఎవరికైనా, సత్వ గుణము అలవాటు కావాలి, నెలలు గడిచేకొద్ది, మానసిక బలం పెరగాలి - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2127 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2162 General Articles and views 2,188,585; 104 తత్వాలు (Tatvaalu) and views 243,136.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*Anyone who has talked to us for hours and hours, the sattva quality should be habituated. Otherwise they are wasting both time. మనతో గంటలు గంటలు మాట్లాడిన వారు ఎవరికైనా, సత్వ గుణము అలవాటు కావాలి చిన్నగా, నెలలు ఏళ్ళు గడిచేకొద్ది, మానసిక బలం పెరగాలి. లేదంటే, వారు ఇద్దరి సమయాన్ని వ్రుధా చేస్తున్నారు.*

ఉదాహరణకు, అత్త కోడలు/ భార్యా భర్త/ తండ్రి కొడుకు/ తల్లి కూతురు/ ఇరుగు పొరుగు/ స్నేహితులు/ భాగస్వాములు/ బంధువులు/ ఓనరు ఉద్యోగి, రోజుకు 4 సార్లు జుట్టు పట్టుకుని తన్నుకుంటున్నారు.

దానిని ఇంకా పెంచడానికి, లేదా కళ్ళ నిండా చూస్తూ ఆనందించడానికి, వారిని ఇంకా విడిదీయడానికి, వారి తగవు మధ్యలో మన లాభం చూసుకునే వారు 80 శాతం ఉంటారు, ఇంకా నిప్పు రగిలిస్తూ, ఆజ్యం పోస్తూ, చోద్యం చూస్తూ.

ఈ ఇద్దరి మధ్యలో తగవులు కాక, ఎవరికి వారికి విడిగా, సొంత అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వ పతన లక్షణాలు, వీరిని మానసికముగా ఇంకా కుంగ తీసి, బలహీనులను చేస్తాయి.

మీ పతనమే వారికి/ వాటికి కావాలి, మాయకు బద్దులు కావాలి. ఎందుకంటే, మీరు వారూ ఇద్దరు రజో తమో గుణ దాసులు, మానసిక బలహీనులు. అందులో నుంచి బయటపడే ఉద్దేశ్యం, మానసిక బలం మీకు లేవు, మీ చుట్టూ ఉన్న వారు మానసిక నియంత్రణ పెంచలేరు, వారికీ తెలీదు. మీకు ఎంత పెత్తనం/ దురాశ ఉందో, వారికీ అంతే ఉంది. ఇంక పరిష్కారం ఎక్కడ ఉన్నది, మనశ్శాంతి ఎక్కడ ఉన్నది?

20 ఏళ్ళు అయినా, స్తిర చిత్తముగా ఉండి, ఒకే మాట ఒకే బాట గా ఉంటూ, సజీవ గురువు సేవ కనీసం 5+ ఏళ్ళు చేసినాడు, మీ నుంచి రూపాయి ఆశించని వాడు, మీకు ఉన్న మాయను తొలగిస్తాడు. మీ జాతకం చూడక్కరలేదు, మీ చేతులు కాళ్ళు ఒళ్ళు ఏదీ చూడక్కరలేదు, మీ గుణం చాలు. మీ గుణాలు, మీ ఆలోచనలు, మీ పనులు మీరు చెపితే చాలు, తప్పులు ఒప్పుకుంటే చాలు. అసలు మీ మాటలలోనే, మీ గుణం వారికి తెలిసిపోతుంది.

నిన్న స్టేటస్ లో చూసారు కదా, కంపెనీల యజమాని కూడా ఉదయం 5 కే ఫోన్, సత్వ గుణం అలవాటు కు, తన హోదా అన్ని మరచి పక్కన బెట్టి, సవినయముగా. మన ఇంటికి వస్తాము అంటే, మా ఇంట్లో మీకు తగ్గ సౌకర్యాలు లేవు అంటే, పర్లేదు 20 ఏళ్ళు గా మనకు తెలిసిందే కదా. మేము వచ్చి, మా చోటు కు తీసుకుని వెళతాం అంటున్నారు. కానీ మనల్ని వదలడం లేదు, ఏమీ లేని సన్యాసి/ సన్నాసి తో మనకేం పని అని అనడం లేదు.

సినిమా విలన్ రావుగోపాలరావుకు స్పష్టముగా తెలుసు, తన చుట్టూ ఉన్నవారు, తనలాగే తలకమాసిన వారు, తనను ఎప్పుడైనా వేసేస్తారు అని, అందుకే ముందు తన చుట్టూ ఉన్నవారిని తనే వేసేస్తాడు లేదా కొన్ని విషయాలలో దూరంగా పెడతాడు.

కంపెనీల యజమాని మనతో 5 కు మాట్లాడతారు అని, అదేదో గొప్ప అనుకోకండి, దానివలన మనకు ఏమీ రాదు. మీరూ మనము ఎంతో, వారు అంతే. ప్రాపంచిక మాయలు ఉండవు మాటలలో. మా మధ్య మాటలు కేవలం వారి రజో తమో గుణ స్తాయి, సత్వ గుణం వైపు పయనం, ఆధ్యాత్మిక పురోగతి అంత వరకే. వారు స్పష్టముగా ఒప్పుకుంటారు, ఆ మాయలేనిదే ఆ వ్యాపారం నడవదు అని. అది చివరకు పతనం చేస్తుంది అని వారికి స్పష్టముగా తెలుసు, వెన్నుపోటు గుండెపోటుతో. మనకు 3+ ఏళ్ళ ఆదాయం లేకపోయినా, వారు మనల్ని అడగరు బాధపడటం తప్ప మేము మీకు ఏమీ చేయలేకపోతున్నాము అని, సత్వ గుణం కాని వారి దగ్గర ధనం తీసుకోరని వారికి తెలుసు.

వారిది లేదా ఎవరిదైనా, రజో తమో గుణాల ప్రభావం తగ్గాలి. లేకపోతే, మనతో మాటలు అసలు ఎందుకు, టైం వేస్ట్ వారికే.

చెత్త మాటలకు, ప్రాపంచిక మోహాలకు, చుట్టూ వారికి 100 మంది ఉంటారు, రజో తమో గుణాలను పెంచడానికి పంచడానికి, భవిష్యత్ పతనం చేయడానికి, పంచభూతాల లేదా సొంత బిడ్డల/ భాగస్వామి/ వారి శిక్షణతో, నశిస్తుంటే ఆనందంగా చూడటానికి.

జాగ్రత్త గా వినండి, ఇప్పుడు మీరు అన్నము వండుతూ లేదా వండే ముందు, మాతో మాట్లాడుతూ లేదా మీలో గొణుగుతూ, గట్టి గా ఇంకొకరిని తిట్టడం కోపముతో చేస్తున్నారు అనుకోండి. అది రజో గుణం. మమ్మల్ని తిట్టిన కూడా, మనసులో అదే అర్థం. మీకు ఇష్టం లేకపోతే, ఎవరికైనా దూరంగా ఉండవచ్చు, ఇంకొకరిని తిట్టాల్సిన పని లేదు. అలాగే నిర్లక్ష్యం బద్దకం కూడా అంతే, అది తమో గుణం.

ఇప్పుడు అదే రజో తమో గుణ ప్రభావం, మీరు వండే వంటలో/ పంటలో/ మాటలో/ చేతలలో బాటలో, మీ చుట్టూ అన్నిటిలో చేరుతుంది. అంటే మన గొయ్యి మనమే తీసుకున్నట్లు.

అదే కాలక్రమేణా, మీ పైన మీ ఇంట్లో వారిచే తిరుగుబాటు చేయిస్తుంది. అదే నెగటివ్ ఎనర్జీ. దానిని మీ మనసులో పెంచి పోషించింది మీరే. దానిని ప్రొత్సాహం చేసింది, మీ చుట్టూ ఉన్న, మీ లాంటి పతన బుద్ది వారే.

తాగుబోతు/ తిరుగుబోతు/ తిండిపోతు/ రోగపోతు/ కపట నటన 2 నాల్కల బద్దక నిర్లక్ష్య పోతు కూడా, మన మాటలు తమకు నెగటివ్ అనుకుంటారు. ఎందుకంటే, వారికి మాయ అలా అనిపిస్తుంది, మానసిక బలహీనులు కాబట్టి. మనకు దూరంగా ఉంటారు వారు.

అందుకే మీకు 20 ఏళ్ళు గా చెపుతున్నది. నక్క పాము పులి, వెన్నుపోటు, గుండెపోటు, అప్పు కపటం నటన సమర్ధన చేస్తే, రీడ్ రిసీప్ట్ ఆపేస్తే, బొట్టులాంటి ప్రొఫైల్ బొమ్మ లేకుంటే, ఇవన్నీ మీ మనసులో ఉన్న, నెగటివ్ ఎనర్జీ మాలాంటి వారికి, మీ భవిష్యత్ స్పష్టం. అవే, మిమ్మల్ని అదే దోవలో పతనము చేస్తాయి. అది మీరు ఏరి కోరుకున్న దోవ మిత్రమా.

చూడండి రామన్న లేదా ముదుసలి తల్లి తండ్రులు ను వదిలే పిల్లలు, ఆయన లేదా వారి తల్లిదండ్రులు మీదే తిరుగుబాటు చేసారు/ చేస్తారు కదా, రజో తమో గుణాలతో. నేటికీ వారు మారరు, మనం చెప్పిన కూడా వినరు.

రేపు మీ వంతు. మారండి, సత్వ గుణం నేర్చుకోండి, వారితో తిరగండి, వారి మాట విని వారి అడుగు జాడలలో నడవండి. పంచభూతాలు, సత్వ గుణం కు సంతోషం. 80 శాతం మందికి, సత్వ గుణ పనులు ఆలోచనలు, మొదట చాలా కష్టం భయంకర అయిష్టం మాయా మోహ మద అహంకారం తో. కానీ తినగ తినగ వేము, తీయగా ఉండును అని వేమన చెప్పింది మరువద్దు.

సాధనమున సమకూరు అన్ని విద్యలు. ఇప్పుడు కాకపోయినా, 100 జన్మలకైనా, మనము ఆ దోవకు రావాలి. లేదంటీ, దెయ్యాలు భుతాలు రజో తమో గుణ దాసులు గా ఈ కష్టాలు కన్నీళ్ళు సీరియల్ గా జన్మ జన్మలకు సాగుతూనే ఉంటాయి.

మీకు మీరే కర్త కర్మ క్రియ, మీలోను దైవం ఉంది, మీలోను సత్వ గుణం ఉంది. సాధనతో సానపట్టండి. మనసును నియంత్రించండి. అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వీడండి. మీకు మేము ఎటూ తోడుగా ఉన్నాము. మాలాగా 5+ ఏళ్ళు సజీవ గురువు సేవ చేసిన వారు, మీ చుట్టూ కూడా ఉంటారు, వెతకండి, అదే ఆత్మ జ్ఞానం. మనల్ని మనం తెలుసుకుందాం ఈ జన్మలోనే.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2162 General Articles and views 2,188,585; 104 తత్వాలు (Tatvaalu) and views 243,136
Dt : 30-May-2024, Upd Dt : 30-May-2024, Category : General
Views : 294 ( + More Social Media views ), Id : 2107 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : anyone , talked , hours , sattva , quality , habituated
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content