బాబాయి అబ్బాయి ముచ్చట్లు మురిపాలు - రాజకీయ భీష్ముడిగా, యువత చేతికి అధికారం, త్యాగం తో? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2110 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2145 General Articles and views 2,136,683; 104 తత్వాలు (Tatvaalu) and views 239,954.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*Babai Abbai Mutchatlu Muripalu - As a political Bheeshma, power in the hands of youth, with sacrifice? బాబాయి అబ్బాయి ముచ్చట్లు మురిపాలు - రాజకీయ భీష్ముడిగా, యువత చేతికి అధికారం, త్యాగం తో?*

Bhishma Panduraja, Krishna Arjuna, Bali Chakravarti Vishnu, sacrifices possible? How can sacrifice more than Pawan?

భీష్మ పాండురాజు, క్రిష్ణ అర్జున, బలి చక్రవర్తి విష్ణువు, త్యాగాలు కుదురుతాయా? ఏమిచ్చి పవన్ కన్నా ఎక్కువ త్యాగం చూపగలం?

He is Not a Breeze, He is a Storm - PM Sri narendramodi ji about Sri PawanKalyan అతను గాలి కాదు, తుఫాను - శ్రీ పవన్ కళ్యాణ్ గురించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు.

చూసారా ఫోటోలలో, బాబాయి అబ్బాయి ముచ్చట్లు మురిపాలు, ఎలా కౌగలించుకున్నారో గట్టిగా, ఎలా చేతులు వేళ్ళు కలిపి పట్టుకున్నారో గట్టి బంధములా, ముసి ముసి నవ్వులతో. అసలు వీరు సొంత బంధువులా అని అందరూ విస్తుపోతున్నారు.

చంద్రన్న ఎప్పుడూ ఏ ఒక్క నాయకుని తో, ఇంత కెమిస్ట్రీ/ ఆత్మీయ బంధం చూపింది లేదు, ఇన్నాళ్ళ చరిత్రలో, హ్రుదయపూర్వకముగా. అందరినీ అనుమానముగా చూసారు, తనకే వెన్నుపోటు పొడుస్తారేమో అని భయముతో.

కానీ పవన్ ను తనకు రక్షకుడిగా ప్రస్తుతానికి నమ్మినట్లు కనపడుతున్నారు. మొన్న గెలిచిన వెంటనే, పవన్ దగ్గరకు వెళ్ళి కలిసారు. మనిషిలో కాస్త మార్పు వస్తున్నది, వాస్తవం గుర్తుకు తెస్తున్నది, పవన్ త్యాగానికి తలవంచుతున్నారా?

దేశమంతా మారు మ్రోగిపోతున్నది, పవన్ వరుస త్యాగాలతో, అన్ని ఎన్నికలలో. ప్రపంచ మంతా విస్తుపోతున్నది, పవన్ ఎంత తగ్గి, తాను తలవంచి, అవతల వ్యక్తి కి తన ప్రత్యర్ధికి, ఇంత బలం అండ అధికారం ఇచ్చి నిలబెడతారా అని, జైలుకు వచ్చి భుజం తడతారా? అసలు మన వర్గంలో, జగనన్న వర్గం లో ఇంత త్యాగం ఉన్నదా అని తనను తానే నమ్మలేక పోతున్నారు.

మన చుట్టూ చూస్తున్నాము, పదవులకోసం అధికారం కోసం, సొంత మామకే భాగస్వామికే స్నేహితులకే బంధువులకే బాబాయికే, వెన్నుపోట్లు మరియు గుండెపోట్లు, సొంత ముదుసలి తల్లి దండ్రులకు అనాధాశ్రమాలు తమ కుసంస్కార పెంపక బహుమతిగా ఇస్తున్న, నక్క పాము పులి గుణాల, క్రుతజ్ఞత విశ్వసనీయత లేని, ప్రభుద్దులను జంతు స్వభావ మానవత్వం లేని మనుషులను చూస్తున్నాము.

మరి పవన్, వర్గం పార్టీ సిద్దాంతాలు వేరు అయినా, అన్ని పక్కన పెట్టి, సాధు జీవి ఆవు గుణముతో, ఇంత భరించలేని త్యాగమా? పవన్ త్యాగాల ముందు, మనము, మన వర్గము, మన అనుభవము, మన సంపద, మన వంశం, మన ఖ్యాతి, మరగుజ్జు లాగా అయిపోయింది. మరి మనము కూడా తగ్గకుండా, అంత కన్నా ఎక్కువ ఇవ్వాలి, రుణం తీర్చుకోవాలి? ప్రపంచం నివ్వెర పోవాలి, చంద్రన్న తన స్వభావానికి విరుద్దముగా, ఇంత త్యాగం చెయ్యగలరా, కనీసం 74 ఏళ్ళ ముదుసలి వయసులో అయినా అని?

ఆ మహా విష్ణువే, వామనుడుగా వచ్చి, 3 పాదాల స్తలం దానం కావాలి, అని స్పష్టముగా చెప్పి అనుమతి తీసుకుని, తన రాజ్యాన్నే ఆక్రమించినా, తన నెత్తినే కాలు పెట్టినా, నవ్వుతూ నమస్కరించి తలవంచి మొక్కి, బలి చక్రవర్తి తనను తానే దానం ఇచ్చారు.

దానికి ప్రతిగా, బలి చక్రవర్తి ని, పాతాళ లోకానికి అధినేతను చేసి, ఆ మహా విష్ణువే కాపలాదారుగా రక్షణ కవచముగా నిలిచారు. ఇద్దరూ త్యాగాలలో తగ్గలేదు. ఒకరు రాక్షస అధినేత, ఒకరు దేవతలకు అధినేత, పరస్పర విరుద్ద భావజాలం, అయినా త్యాగాలలో తగ్గలేదు ఇద్దరూ. ఎందుకంటే అది తమ రాక్షస, అలాగే దేవత వంశాలకు చెందిన పేరు ప్రతిష్ట, దానిని విశ్వఖ్యాతి చెయ్యాలి. ఈ నాటికీ వారి త్యాగాలను స్మరించుకుంటున్నాము. అది ఇచ్చిపుచ్చుకోవడం అంటే.

మన రజో తమో గుణాల స్తాయి తెలిసి, అవి ఎంత ప్రమాదమో తెలిసి, ఒక పక్క నక్క పాము గుణాలని తెలివి తేటలని, మన అనుచరులు ఎలుగెత్తి చాటుతా ఉన్నా కూడా, మనకు కొండంత అండ ఇచ్చి దగ్గరకు వచ్చిన, పదవి అధికారం ఇచ్చి నిలబెట్టిన, మనల్ని నమ్మిన సత్వ గుణ జీవికి, మనము ఇవ్వబోయే ప్రత్యుపకారం, అతని కంటే ఎన్నో రెట్లు గొప్పగా ఏమి ఇచ్చి, ప్రపంచ రాజకీయ చరిత్రలో, మన పాత తప్పులు ఒప్పులు గా మారేటట్లు చరిత్ర స్రుష్టిస్తామా చంద్రన్నా?

ఆఖరికి మామ రామన్న కూడా, విస్తుపోతారు, మా అల్లుడు ఇంత మంచి పని చేసి, నాకు మనశ్శాంతిని ఇచ్చారు, పాప పరిహారంతో అని.

మీ కోటరీలో, ఇలాంటి త్యాగ ఆలోచనలు రావు. కనీసం ఇది చూసైనా, మీకు భవ బంధాల విముక్తి కి దోవ చూపుతారేమో చూద్దాము.

భీష్ముడు రాజ్యాలను జయించి, తాను రాజుగా ఉండకుండా, పాండురాజును రాజుగా చేసి, పక్కన కూర్చుని సలహాలు ఇచ్చారు. మరి ఇప్పుడు పవన్ భీష్ముడు అయ్యారు, త్యాగములో. మరి మీరు కురు వ్రుద్దులైన భీష్ముడిగా పరివర్తన చెంది, సత్వ గుణ ఆలోచనలతో, పవన్ మీ త్యాగం అమోఘం, మీరు చేసిన త్యాగానికి, మీరే ముఖ్యమంత్రి గా ఉండాలి, యువత చేతికి పగ్గలు నిస్వార్ధముగా ఇచ్చాను, అన్న కీర్తి ప్రతిష్టలు మాకు మిగలాలి. మేము మీకు సలహాదారులు గా ఉంటాము, మా అనుభవాన్ని మీ ఉన్నతికి ఉపయోగిస్తాము.

మోదీ దగ్గర మీకే విలువ ఎక్కువ ఉన్నది మాకన్నా, నేరుగా ఆయనను కలసి, మనకు రావాల్సింది తెస్తారు. నేను వెళితే, మోదీ కుదరదు అనవచ్చునేమో, గట్టిగా అడగలేను నాకున్న కేసులు స్టేలతో, గత నల్ల చరిత్రతో. కానీ పవన్ స్వచ్చమైన్ మనసు త్యాగం గల నిన్ను చూస్తే మాత్రం, మోదీ గౌరవముగా ప్రేమతో తన బిడ్డగా, అంతా మంచే చేస్తారు, నువ్వు గట్టిగా అడుగుతావు ఎటూ, ఇది రాష్ట్రానికి కూడా మంచిది.

నిన్న నువ్వే అన్నావు, జైలు లో చూసావు నన్ను, నలిగి పోయాను అని, వయసు పై బడింది. ఇంక ప్రతీకార ఇచ్చ, మాకు వద్దు, ఈ తుచ్చమైన పదవులు మాకు వద్దు. 2029 ఎన్నికల తలనొప్పి నాకు వద్దు, మనశ్శాంతి గా ఉంటాను. 10+ ఏళ్ళ సజీవ గురువు సేవ చేసిన ఆయన, నాకు ముక్తికి, అలాగే పాప పరిహారానికి, తేలిక మార్గం చెప్పారు. నాకు కావలసినంత ధనం ఉంది, పదవులు అనుభవించాను, ఇంక ఈ తలనొప్పులు వద్దు. ప్రజలకు త్యాగం నేర్పుదాము.

చిన్న గా పార్టీ కూడా, నీకే అప్పగిస్తాను, ఒక మంచి వ్యక్తి చేతిలో పెట్టాను, మా మామయ్య పార్టీని, మాది అన్ని వర్గాల పార్టీ, అని ఆనందముగా సంతోషముగా, మాకున్న వెన్నుపోటు పేరును తొలగించుకుంటాను. ఎటూ రాష్ట్రం అప్పుల్లో ఉంది, దానిని లాభాలలోకి తెచ్చే బాధ్యత మన ఇద్దరిది అని, పవన్ చేతులు పట్టుకుని ఒప్పించాలి. మామ రామన్నకు, భేషరతు క్షమాపణ చెప్పాలి.

నీ లాంటి ఉత్తముడు, నా బిడ్డ లోకేష్ కు కూడా, ఒక మంచి దోవ చూప గలడు అని బతిమాలి, మన త్యాగం గొప్పతనన్ని ప్రపంచానికి చాటుదామా? ఈ క్రిష్ణార్జునుల, బలి చక్రవర్తి విష్ణువుల, భీష్ముడు పాండురాజు త్యాగాలకు, అవని పులకించిపోతుంది.

మనకు రూపాయ ఇచ్చి కష్టకాలం లో నిలబెట్టిన వారికి, మనం 1000 లేదా లక్ష రూపాయలు ఇచ్చి రుణం తీర్చుకుంటాము, మనకు తల్లి దండ్రుల పెంపక సంస్కారం ఉంటే. మరి ఇన్ని ఇచ్చిన పవన్ కు, ఒక రకముగా మరలా రాజకీయ జన్మ నిచ్చిన పవన్ కు, ఏమి ఇచ్చి, మనము అంతకన్నా ఎక్కువ ఖ్యాతి పొందుతాము, నిస్వార్ధముగా?

యువకుడు పవన్ త్యాగం కన్నా, భీష్ముడను మా త్యాగం మిన్న, అని ప్రపంచం తో కొనియాడే రోజు, అలాగే అవకాశం చంద్రన్నకు వచ్చింది ఇప్పుడు. మరి ఆ త్యాగం సహ్రుదయాన్ని చూపుతారా, అందరినీ ఆశ్చర్యం లో ముంచి? తన స్వార్ధముతో, చంద్రన్న మారలేదు అని ప్రపంచానికి చాటుతారా, కాలమే మనకు రుజువులతో చూపిస్తుంది కదా.

ఋణపడి పోయాం తెలుగు తమ్ముళ్లు, ఒక్కసారి కాదు రెండూ సార్లు, రాజకీయ వ్రుద్ద నాయకుడు భీష్ముడు చంద్రన్న (74 ఏళ్ళు, 60+ సీనియర్ సిటిజెన్) ను సిఎం అవ్వటానికి కారణం ఐయ్యాడు, మన యువ నాయకుడు పవన్ స్టార్ త్యాగాల మీద త్యాగాలతో ఎన్నో మెట్లు తగ్గి, పదవులను త్యజించి, అతనిని గుండెల్లో పెట్టుకున్నా తప్పులేదు, క్రుతజ్ఞత విశ్వసనీయత ఉన్న ఎవరైనా, ముదుసలి తల్లి దండ్రుల సేవ చేసే వారైనా, రేపు ముదుసలి తనములో తమ బిడ్డలతో దేవుళ్ళుగా పూజించాలి అనుకునే ఎవరైనా సరే, గుండెల్లో పెట్టుకోవాలి. ముగ్గురు బీజేపీ, తెదేపా, జనసేన బంధం, ఇలాగే కలకాలం ఉంటే దేశం భవిష్యత్తు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము భవిష్యత్తు బాగుంటుంది.

కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులను ఓడించిన కృష్ణార్జున వలె, ఈ ఎన్నికల సంగ్రామంలో విజయ భేరి మ్రోగించిన, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి రథ సారద్యంలో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పుంతలు త్రొక్కాలని, ఆదర్శంగా నిలవాలని కాంక్షిస్తూ, త్యాగాలతో మురిసిపోవాలని, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

ఈ నేలపై ఏడాది కిందట ఊహించడానికైనా, ఎంతో మందికి అసాధ్యమైన దృశ్యాలు, నేడు అందరి కనుల ముందు ఆవిష్కృతమౌతున్నాయి. విభజిత, వికలిత ఆంధ్రప్రదేశ్ చరిత్ర తిరగ రాసేందుకు చంద్రబాబు తో, పవన్ కళ్యాణ్ పదం కలిపారు. కదం తొక్కారు. కమలం కలిసి వచ్చింది, పవన్ పట్టుదలతో.

ఇక కోకొల్లలుగా పెనవేసుకుపోయి, ప్రజానీకాన్ని కకావికలం చేస్తున్న సమస్యల పరిష్కారం, కూటమి ఇచ్చిన అసాధారణ వాగ్దానాల అమలుకు ఉపక్రమించాలి. సమయం లేదు నాయకులారా!! నడుం బిగించండి!! నలుగురి మన్ననలు పొందండి!! శుభం భూయాత్ !!!

ఇంకో కరోనా వచ్చినా, వైద్యం అంతా, ఆంధ్రాలోనే జరగాలి, హైదరాబాద్ కు మించి. తెలంగాణా సోదరులు, మన దగ్గరకు రావాలి, మంచి వైద్యం కోసం. అంతర్జాతీయ విమానాలు, విజయవాడకు రావాలి. తిరుమలలో అలాగే అన్ని దేవాలయాలలో, బోర్డ్ సభ్యులు చైర్మన్ అధికారులు, హిందువులు మంత్రాలు వచ్చిన, సత్వ గుణము, సజీవ గురువు సేవ ఉన్న ఉత్తములే ఉండాలి. సెక్యులర్ దేశం అన్నప్పుడు, అన్ని మతాలా దేవాలయాలకు ఒకటే రూల్ ఉండాలి కదా?

పవన్ కి కోపం ఎక్కువే, కానీ టైం వచ్చినప్పుడు చూపిస్తారు. ఎప్పుడు బడితే అప్పుడు కాదు. ఏ పదవి అయినా సమర్ధుడు.

జనసేన శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన సందర్భంలో ఆయన ఇచ్చిన స్పీచ్ చూడండి.... మీకే తెలుస్తుంది ఆయన పరిణితి, నిజాయితీ, నిబద్దత ... అందుకే మోడీ గారు కూడా అంతగా ఇష్టపడతారు....

పవన్ కళ్యాణ్ నిర్ణయం కి వ్యతిరేకం చెయ్యకుండా, తనకి ట్రస్ట్ చేసి తనతో కలిసి నడిచిన సైనికులు, మరియు తెదేపా క్యాడర్, ఆంధ్రా పీపుల్ కి థాంక్స్ అనేది చాల చిన్న మాట.... మమత దయ కరుణ క్రుతజ్ఞత విశ్వసనీయత ఉన్న వారి పట్ల అపారమైన గౌరవం...

** జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా పవన్ కళ్యాణ్ ఎన్నిక, మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు. తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ గారు ఈ సమావేశంలో జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా పవన్ కళ్యాణ్ గారు పేరు ప్రతిపాదించారు. సభ్యులు అందరూ ఏకగ్రీవంగా బలపరిచారు.

** జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, అనకాపల్లిలో శ్రీ నూకాంబిక అమ్మ వారిని దర్శించుకున్నారు. అమ్మవారికి అర్చనలు చేశారు.

** రామోజీ గారి పార్థివ దేహానికి నివాళులర్పించిన పవన్ కళ్యాణ్. రామోజీ రావు గారు కుమారుడు శ్రీ కిరణ్, కోడలు శ్రీమతి శైలజా కిరణ్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు.

** ప్రజారంజక పాలన అందించాలి. రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు పూర్తి చేసేలా పాలన ఉండాలన్నదే ఆకాంక్ష. అపార అనుభవం ఉన్న నాయకులు అవసరం రాష్ట్రానికి ఉంది ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారి పేరును ప్రతిపాదించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన టీడీపీ, జనసేన, బీజేపీ శాసనసభ్యులు

** ప్రజలతో శెభాష్ అనిపించుకునేలా పాలన చేద్దాం. ఈ విజయం ప్రతీకారం కోసం కాదు... అభివృద్ధి, సంక్షేమం కోసం. ప్రణాళికబద్ధంగా నియోజకవర్గాల సమస్యలను పరిష్కరిద్దాం. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి. వ్యక్తిగత విమర్శలు పూర్తిగా నిరోధించాలి  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2145 General Articles and views 2,136,683; 104 తత్వాలు (Tatvaalu) and views 239,954
Dt : 11-Jun-2024, Upd Dt : 11-Jun-2024, Category : General
Views : 171 ( + More Social Media views ), Id : 2112 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Babai , Abbai , Mutchatlu , Muripalu , political , Bheeshma , power , hands , youth , sacrifice , pawan , chandranna , modi , storm , tuphan , andhra , cm
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content