పాటతో పరమార్ధం - అప్పన్నా తన మన (పేరడీ) - చుట్టలున్నారు జాగ్రత - కృష్ణ, శ్రీదేవి, కవిత - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,881,771; 104 తత్వాలు (Tatvaalu) and views 226,330.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Appanna Thanamana (Parody) - Chuttalunnaru Jagratha - Krishna, Sridevi, Kavitha

చుట్టలున్నారు జాగ్రత అంటేనే, చిత్రం 100 రోజులు ఆడింది అండి. మన ఇంట్లో మంచి చూసుకోవడము వదిలేసి, చుట్టాలు ఏదో చేస్తారు అంటే ఎలా? చేతనైతే సొంత కొడుకు/ కూతురుని తిట్టుకో, వచ్చిన అల్లుడు/ కోడలు ను ఎందుకు? అదే మన శని వార సాధనలు, మన తప్పు మనమే తెలుసుకుందాం, సరి చేసుకుందాం.

తాగినోడి వెంట నిజం వస్తుంది అంటారు. మరి వారేమో, మేము దేశం కోసము తాగుతున్నాము, మా టాక్స్ ధనము తో అభివ్రుద్ది జరుగుతున్నది అంటారు. కానీ అసలు నిజం, ధనం దుబారా చేస్తూ, ఇల్లు గుల్ల చేస్తూ, కుటుంబాన్ని స్వయముగా నాశనం చేస్తున్నా అని మాత్రం ఒప్పుకోరు, అవి గంటలో బయటకు పోతాయి, మనసు ఇంకా మొద్దు బారుతుంది, తెల్లారి అన్ని సమస్యలు అక్కడనే ఉంటాయి అని తెలుసు, కానీ అదో పిచ్చి బ్రమ, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం.

అందుకే ఓ అప్పన్నా తనా మనా, మహానుబావులు అందరికీ దండాలన్నా, సాధకుడి నోట నిజం, ఆచరణతో ఎల్లపుడు వస్తాదన్నా, అని 9 ఏళ్ళుగా నిరూపణ అయ్యిందా? ఎవరైనా, ధైర్యముగా 3 ఏళ్ళు పైన ఆదాయం లేదు అని చెపుతారా?

80 శాతం చెప్పరు, ఏవో అబద్దాలు చెపుతారు. కానీ ఆదాయం లేదు అని నిజం చెప్పడం వలన, అప్పు కోసం ఇంక మన దగ్గర కు ఎవరూ రారు మిత్రమా. మంచి కోరేవారు, చేయి అడ్డు పెట్టమంటావా అని తప్పక అడుగుతారు.

ఏలే వారిది ఏది బోయినా, మేసే వారిది మొత్తం బోయినా, మీకు మాకు ౠణమేముంది, వారి మోహం తో మనకు పని ఏముంది, దైవంమాట అన్నామా అన్నో చిన్నన్నా, నిజమన్న మాట ఔననవో అన్నో చిన్నన్నా. నక్క, పులి, పాముకు ఓటు, మన ఇంటికి చేటు కాదా, ఆ పాపములో మనకు బాధ్యత లేదా? ఆవును ఏనాటికీ గెలిపించమా? పెద్దలు నిజం చెప్పకపోతే, మంచి చేయకపోతే, నిన్న అక్క చెల్లెలు కధనములో చూసాము కదా?

ఆనాడు జగనన్న కు జైలు అన్నారు వారి అనుచరులు బాధపడ్డారు, నేడు చంద్రన్న కు జైలు అంటున్నారు వీరి అనుచరులకు బాధ. మరి ఈ కక్షలు కార్పణ్యాలు, మోహాలు వ్యామోహాలు, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం ఎందుకు అంటే, ఎవరూ వినరు. విడవమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం. అధికారం, బలగం, పదవి, ధనం ఉన్నది అని ఎవరినీ మనము తొక్కే ప్రయత్నం చెయ్యకూడదు. మరలా అది మనకే తిరిగి వస్తుంది. వెన్నుపోటు కపటం నాటకం, వారి సొంత ఇంట్లోనే రావటం, మనం ఎన్నో ఉదాహరణలుగా చూసాం వార్తలలో.

మనం మునిగినది గంగే కదన్నా, మనం మెచ్చినది కాశే కదన్నా, కాదని ఎవ్వరు వాదమాడినా, శంభో శివశంకర అందాం, ఆచరణలో చూపుదాం గురువా. చూసుకో జీవా, ఆత్మ సాధన ఏదో నేర్చుకో జీవా, ముక్తిని పొందు రావా అని ఆత్మ జ్ఞానాన్ని నేర్పాలి, నేర్చుకోవాలి.

రాబోయే రోజులు ఎంత దరిద్రముగా అవుతాయి అంటే, సొంత ఇంట్లోనే, ఇంకో ఒకరిని, ఒకరు నమ్మలేని పరిస్తితి. ఇక సంపాదన లేక లేదా రోగం వచ్చి మంచం ఎక్కారా, ఆ మంచం ఎప్పుడు ఖాళీ చేద్దాము వారిని పైకి పంపుదాము అన్న భావనే కానీ, వారికి ఓపికగా సేవ చేద్దాము అన్న రోజులు పోయాయి.

కల్ల నిజమౌతుంది, బూతు నీతౌతుంది, దేశమే/ రాష్ట్రమే/ కుటుంబమే/ మనసే అల్ల కల్లోల మౌతుందయ్యా. వేషాలు మార్చేటి, ఇంటా, బయటా, మన లోన మోసగాళ్ళందర్ని, కనిపెట్టడం కష్ట మౌతుందయ్యా. నమ్మాలిరా జీవా నమ్మాలిరా, ఆ గురుడు చెప్పిన మాట నమ్మాలిరా.

Parody

ఆ ఆ అప్పన్నా తనా మనా, అందరికీ దండాలన్నా, ఆ అహా
సాధకుడి నోట నిజం., ఆచరణతో వస్తాదన్నా 2 ||అప్పన్నా||

ఆ ఆ
ఏలే వారిది ఏది బోయినా, మేసే వారిది మొత్తం బోయినా 2
మీకు మాకు ౠణమేముంది, మోహం తో మన పని ఏముంది
దైవంమాట అన్నామా అన్నో.. చిన్నన్నా, నిజమన్నమాట ఔననవో అన్నో.. చిన్నన్నా||అప్పన్నా||

మనం మునిగినది గంగే కదర, మనం మెచ్చినది కాశే కదర 2
కాదని ఎవ్వరు వాదమాడినా, శంభో శివశంకర అందాం గురువా
చూసుకో జీవా, ఆత్మ సాధన ఏదో, నేర్చుకో జీవా 2 ||అప్పన్నా||

కల్ల నిజమౌతుంది, బూతు నీతౌతుంది, దేశమే కల్లోల మౌతుందయ్యా
వేషాలు మార్చేటి మోసగాళ్ళందర్ని, కనిపెట్టడం కష్ట మౌతుందయ్యా
నమ్మాలిరా జీవా నమ్మాలిరా, ఆ గురుడు చెప్పిన మాట నమ్మాలిరా 2 ||అప్పన్నా||

Original

ఆ ఆ అప్పన్నా తనా మనా, అందరికీ దండాలన్నా, ఆ అహా
తాగినోడి నోట నిజం., తన్నుకుని వస్తాదన్నా 2 ||అప్పన్నా||

ఆ ఆ
ఏలే వాడిది ఎద్దు బోయినా, కాసే వాడిది కన్ను బోయినా 2
నీకు నాకు తరుగేముంది, లోకం తో ఇక పని యేముంది
ఉన్నమాట అన్నారో అన్నో.. చిన్నన్నా, నేనన్నమాట ఔరనరో అన్నో.. చిన్నన్నా||అప్పన్నా||

నీవు మునిగినది గంగే కదర, నిన్ను మెచ్చినది రంభే కదరా 2
కాదని ఎవ్వరు వాదమాడినా, ఖండ ఖండములు చేద్దాం పదరా
చూసుకో రాజా, నా తడాఖ ఏదో, చూపుతా రాజా 2 ||అప్పన్నా||

కల్ల నిజమౌతుంది, బూతు నీతౌతుంది, దేశమే కల్లోల మౌతుందయ్యా
వేషాలు మార్చేటి మోసగాళ్ళందర్ని, కనిపెట్టడం కష్ట మౌతుందయ్యా
నమ్మాలిరా బాబు నమ్మాలిరా, ఆ గురుడు చెప్పిన మాట నమ్మాలిరా 2 ||అప్పన్నా||  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,881,771; 104 తత్వాలు (Tatvaalu) and views 226,330
Dt : 08-Sep-2023, Upd Dt : 08-Sep-2023, Category : Songs
Views : 277 ( + More Social Media views ), Id : 1912 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Appanna , Thanamana , Tanamana , Parody , Chuttalunnaru , Jagratha , Krishna , Sridevi , Kavitha
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content