పాటతో పరమార్ధం- అరవైలో ఇరవై వచ్చింది- షష్టి పూర్తి 60 లో అమ్మ నాన్నల పెళ్ళి- భోగి మంటలు- కృష్ణ, రతి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2106 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2141 General Articles and views 2,097,122; 104 తత్వాలు (Tatvaalu) and views 237,831.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Aravailo Iravai Vachhindi - Shashtipurti Parents Marriage at 60 - Bhogi Mantalu - Krishna, Rati, Geetha, Sudhakar , గీత, సుధాకర్

గుణవంతులు, సంస్కారులు, సాత్వికులు అయిన పెద్దల మరియు చిన్నల ఆలనా పాలనా ఎలా ఉంటుందో చూడండి. తమ సొంత ముదుసలి తల్లి దండ్రులను, అత్తా మామలను ఎంత బాగా గౌరవముగా, ప్రేమగా, దేవతలు గా చూస్తారో ఈ పాటతో మనము చూడవచ్చు. కనీసం నోటితో పాడి అయినా వినిపిస్తారా, మన ఇంటి దేవతల కోసం?

అరవైలో ఇరవై వచ్చింది, కని పెంచి పోషించిన, లోకం లో బతికే జ్ఞానాన్ని ఇచ్చిన, మా అమ్మానాన్నకు, అలాగే భాగస్వామిని దానం చేసిన ఉత్తమ దాతలు మా అత్తామామకు కూడా, మళ్ళీ ఒక వసంతమొచ్చింది.

షష్టి పూర్తి పెళ్ళి మహోత్సవములో, అమ్మను, కొత్త పెళ్ళికూతురుగ చేస్తుంటే, అమ్మ మొఖములో మళ్ళీ అప్పటి సిగ్గొచ్చింది. పెళ్ళి కాని, ఈనాటి పిల్లలకు, ఆడతనం నేర్పింది. ఇక నాన్న మొఖములో ఆనందము, ఇంతటి ఉత్తమ సంస్కార వంతులను పెంచాను అని. మరి నెరిసీనెరవని మీసాల్లో, మెరిసే ముసిముసి నవ్వులలో, మన తండ్రి పెళ్ళికొడుకు ఎంత అల్లరివాడో, ఇప్పుడే మాకు తెలిసింది.

మనసులు, మమతలు, మారని వాళ్ళే నిజమైన దేవుళ్ళు. మనకు నిత్యం కన్పడుతున్న మన ఇంటి దేవుళ్ళే, అమ్మా నాన్నలూ, అత్తా మామలూ. ఆ దేవుళ్ళకు, క్రుతజ్ఞతలు విశ్వసనీయతతో చేసే పెళ్ళే, మనకూ దీవెనలూ. అలాంటి సాత్విక దీవెనలే, మన సాంప్రదాయ కోరికలైతే, మన పెద్దలకు నూరేళ్లు జీవితం, అలాగే మనకూ అండ.

ఆనాటి అయోధ్య జనరంజక పాలకుడు ఆ శ్రీరఘురాముడే, ఈనాటి మన ఇంటి కల్యాణ పట్టాభిరాముడు. మిధిలా నగరపు తండ్రి జనకుడు లేని కల్యాణాన్నే, సొంత కూతుళ్ళు మరియు కొడుకులు కలిసి చేస్తున్నారు. మన పెళ్ళి పెద్ద దమోతులకు, చక్కగ గంధం అలగండి, కమ్మటి చల్లని పన్నీరు చిలకండి.

తాళిని కట్టే సుముహూర్తపు వేళయ్యింది, గట్టి గా మేళం మ్రోగించండి. అందరూ ఆనందముగా మా సీతమ్మ పెళ్లి కూతురాయనే, మన రామయ్య పెళ్ళి కొడుకాయనే అంటూ మంగళ వచనాలు పలకండి.

* * *

అరవైలో ఇరవై వచ్చింది..
మా అమ్మానాన్నకు మళ్ళీ, ఒక వసంతమొచ్చింది.. 2
అరవైలో ఇరవై వచ్చింది..
మా అత్తామామకు మళ్ళీ ఒక వసంతమొచ్చింది 2

పెళ్ళికూతురుగ చేస్తుంటే, మళ్ళీ. అప్పటి సిగ్గొచ్చింది 2
పెళ్ళి కాని ఈనాటి పిల్లలకు, ఆడతనం నేర్పింది.. 2
నెరిసీనెరవని మీసాల్లో., మెరిసే ముసిముసి నవ్వులలో. 2
పెళ్ళికొడుకు ఎంత అల్లరివాడో.... ఇప్పుడే మాకు తెలిసింది 2
||అరవైలో అమ్మా|| ||అరవైలో అత్తా||

మనసులు, మమతలు, మారని వాళ్ళే దేవుళ్ళు 2
మనకగపడుతున్న దేవుళ్ళే, అమ్మా.నాన్నలూ..అత్తా మామలూ ..
ఆ దేవుళ్ళకు చేసే పెళ్ళే, మనకూ దీవెనలూ. 2
ఆ దీవెనలే, మన కోరికలైతే, వీళ్లకు నూరేళ్లు... వీళ్లకు నూరేళ్లు ||అరవైలో అత్తా|| ||అరవైలో అమ్మా||

ఆనాటి శ్రీరఘురాముడే... ఈనాటి పట్టాభిరాముడు..
జనకుడు లేని కల్యాణాన్నే, కొడుకులు కలిసి చేస్తున్నారు
చక్కగ గంధం అలగండి..., చల్లని పన్నీరు చిలకండి. 2
తాళిని కట్టే వేళయ్యింది.. గట్టి మేళం మ్రోగించండి
గట్టి మేళం మ్రోగించండి....

సీతమ్మ పెళ్లి కూతురాయనే.. మన రామయ్య పెళ్ళి కొడుకాయనే 2

చిత్రం : భోగి మంటలు (1972); సంగీతం : రమేశ్ నాయుడు; గీతరచయిత : ఆచార్య ఆత్రేయ; నేపధ్య గానం : బాలు, వాణీ జయరాం  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2141 General Articles and views 2,097,122; 104 తత్వాలు (Tatvaalu) and views 237,831
Dt : 21-Mar-2024, Upd Dt : 21-Mar-2024, Category : Songs
Views : 210 ( + More Social Media views ), Id : 2061 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Aravailo Iravai Vachhindi , Aravailo Eravai Vachinndi , Bhogi Mantalu , Krishna , Rati , Rathi , Geetha , Sudhakar , balu , Shashtipurti , Parents , Marriage , 60
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content