పాటతో పరమార్ధం - అయ్యయ్యో చేతిలో డబ్బులు (పేరడీ) - కులగోత్రాలు - ANR, కృష్ణ కుమారి, కృష్ణ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,891,473; 104 తత్వాలు (Tatvaalu) and views 227,057.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Ayyayyo Chethilo Dabbulu (Parody) - Kula Gotralu - ANR, Krishna Kumari, Krishna

అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే, ఉన్నది కాస్తా ఊడింది, సర్వ మంగళం పాడింది, పెళ్ళాం మెళ్ళో నగలతో సహా, తిరుక్షవరమై పోయింది ఇది పాత మాట. ఇది మధ్యతరగతి లేదా రక రకాల జూదం ఆడేవారి పరిస్తితి, స్టాక్ మార్కెట్లో కూడా.

అన్నీ ఉన్నా కూడా, మనశ్శాంతి లేని వారు, ఇప్పుడు ఎందరో. అందరి చేతిలో ధనం బాగా ఆడుతుంది, ఆస్తులు, సౌకర్యాలు మరియు రోగాలు మరియు వెన్నుపోటులు ఏమీ తగ్గడం లేదు.

కాకపోతే, ఇంట్లో భాగస్వామి తో పిల్లలుతో గొడవ ఒక వైపు, ముదుసలి అమ్మ నాన్న అత్త మామ ల తో గొడవ ఇంకో వైపు, కొత్త మరియు పాత అప్పులతో ఇంకో గొడవ, పక్క వారు తమ కన్నా ఎక్కువ అప్పు మేకప్పు, కపట నాటక, 2 నాల్కల ధోరణీ చేస్తుంటే, వారి కన్నా మేము మా వాళ్ళు ఎక్కువ చేయలేక పోతున్నాము అని ఇంకో గొడవ, ఎటు చూసినా పరుగులే అంతా బ్రమలే. మరలా పండగకు, పూజలు యాత్రలు ప్రసాదాలు, ఇసకేస్తే రాలదు కింద, అంత జనం గుళ్ళు గోపురాలు మఠాలు గురువుల వెంట.

అందుకే ఈ పేరడీ పాట, అయ్యయ్యో, మదిన సాధన/శాంతము పోయెనే, అయ్యయ్యో బ్రమలు నిండా ఆయెనే - వాస్తవం ఎవరు వినరు అంతా మాయనే - అమ్మ అయ్య కన్నా, పరాయి మత భాషా బాబాయి పూజలే ఎక్కువు, ఇప్పుడు ఊరికి 4 భక్తి ముసుగు వ్యాపారాలతో - దానివలన ఇప్పుడు దాకా ఉన్నది కాస్తా ఊడుతుంది, సర్వ మంగళం పాడుతుంది భాగస్వామి విడాకులు లేదా ఇంట్లో వారి చెడు అలవాట్లు వలన, అప్పుడు మన ఇంట్లో, మన ఒంట్లో కూడా మనశ్శాంతి, తిరుక్షవరమై పోతుంది.

ఆ మహా మహా, నల మహా రాజుకే, తప్పలేదు అన్నా, కష్టాలు తప్పలేదు అన్నా, ఓర్చుకోవాలి అంటే వింటారా? అలాగే ఇప్పుడు, మనం ముందే చెప్పిన కూడా, ఎక్కలేదు ఎక్కదు అంటున్నారు. మరి అది మన తప్పుగాదు కదా అన్నా? ఆ తర్వాత తెలివి తక్కువగా, మోహ బ్రమలలో, దెబ్బ తింటివోయీ, బాబూ నిబ్బరించవోయీ అంటూ ఓదార్చడం కూడా తప్పడం లేదు.

మానసిక మరియు శారీరక కఠిన సాధన, ఆ దేవ దేవునికి చేసిన, ఫలితం దక్కేది, మానసిక బలం దక్కేది, గోవిందా గోవిందా అంటూ కన్నీళ్ళు పెడుతూ, మనసుకు శాంతి దక్కేది/ ఇచ్చేది, నరుని సేవ నారాయణ సేవగా, మోక్షం దక్కేది, మనకు అంతటి జ్ఞానమేది అని ఎంత వగచినా, వ్రుధాగా పోయిన జీవితము వెనక్కు రాదు మిత్రమా. ఆఖరకు, సొంత పిల్లలు కూడా, అనాధాశ్రమము నుంచి వెనక్కు తీసుకుని రారు. మన పాపాలకు శిక్షణ తప్పదు.

మరి ప్రపంచ మోహాలు వీడి, ఇంత సాధన చేస్తే ఏమి జరుగుతుంది/ మిగులుతుంది? మనం చిత్తశుద్ది వాక్సుద్ది తో సాధన మొదలు పెడితే, సాధనలో గెల్పు ఓటమి దైవాధీనం, కాలం ఖర్మ మారవచ్చు, ఆగితే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించవచ్చు. మనకు మనము కాకపోతే, ఇంకా బుద్ది ఎవరు చెప్పు అని ప్రతి ఒక్కరు అనుకోవాలి. అప్పుడు మన ఇల్లు, మనము, బాగు అవ్వొచ్చు.

సాధన కలిగితే అంటే అలవాటు పడితే, ఈ దెబ్బతో, మన పాపం తీరవచ్చు, కష్టాలు గట్టు ఎక్కవచ్చు. ఎవరో 3 ఏళ్ళు ఆదాయం లేకపోయినా, సజీవ గురువు సేవ ఆపలేదు, మన అందరికీ తెలుసు కదా? లేదా ఒకవేళ సాధన కుదరకపోతే, చివరకు అనుభవమ్ము వచ్చు, వచ్చే జన్మకు అది పునాది, ఈ జన్మలో చివరకు కనీసం శాంతి పొందవచ్చు.

Parody/ పేరడీ

అయ్యయ్యో, మదిన సాధన/శాంతము పోయెనే,
అయ్యయ్యో బ్రమలు నిండా ఆయెనే.. (అయ్యయ్యో)

ఉన్నది కాస్తా ఊడుతుంది, సర్వ మంగళం పాడుతుంది (2)
ఇంట్లో, ఒంట్లో శ్శాంతి, తిరుక్షవరమై పోతుంది (అయ్యయ్యో)

ఆ మహా మహా, నల మహా రాజుకే, తప్పలేదు భాయీ
కష్టాలు తప్పలేదు భాయీ, మీరుచెప్పిన ఎక్కలేదు భాయీ
అది మన తప్పుగాదు భాయీ
తెలివి తక్కువగా, మోహ బ్రమలలో, దెబ్బ తింటివోయీ
బాబూ నిబ్బరించవోయీ (అయ్యయ్యో)

కఠిన సాధన, దేవునికిచేసిన, ఫలితం దక్కేది
మానసిక బలం దక్కేది, గోవిందా...గోవిందా...(నిలువు) - 2
మనసుకు శాంతి దక్కేది/ ఇచ్చేది
నరుని సేవ నారాయణ సేవగా, మోక్షం దక్కేది
మనకు అంతటి జ్ఞానమేది(అయ్యయ్యో)

గెల్పు ఓటమి దైవాధీనం, కాలం మారవచ్చు
మల్లీ ప్రయత్నించవచ్చు, ఇంకా బుద్ది ఎవరు చెప్పు
ఇల్లు, మనము, బాగు అవ్వొచ్చు
సాధన కలిగితే, ఈ దెబ్బతో, మనపాపం తీరవచ్చు
లేదా... అనుభవమ్ము వచ్చు,
చివరకు శాంతి పొందవచ్చు (అయ్యయ్యో)

Original/ అసలు

అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే (అయ్యయ్యో)

ఉన్నది కాస్తా ఊడింది
సర్వ మంగళం పాడింది (2)
పెళ్ళాం మెళ్ళో నగలతో సహా
తిరుక్షవరమై పోయింది (అయ్యయ్యో)

ఆ మహా మహా నలమహారాజుకే, తప్పలేదు భాయీ
ఓటమి తప్పలేదు భాయీ, మరి నువ్వు చెప్పలేదు భాయీ
ఆడి నా తప్పుగాదు భాయీ
తెలివి తక్కువగా, చీట్ల పేకలో దెబ్బ తింటివోయీ
బాబూ నిబ్బరించవోయీ (అయ్యయ్యో)

నిలువు దోపిడీ దేవుడికిచ్చిన, ఫలితం దక్కేది
ఎంతో పుణ్యం దక్కేది, గోవిందా...గోవిందా...(నిలువు) - 2
చక్కెర పొంగలి చిక్కేది
ఎలక్షన్లలో ఖర్చుపెడితే, MLA దక్కేది
మనకు అంతటి లక్కేది (అయ్యయ్యో)

గెలుపూ ఓటమి దైవాధీనం, చెయ్యి తిరగవచ్చు
మల్లీ ఆడి గెల్వవచ్చు, ఇంకా పెట్టుబడెవడిచ్చు
ఇల్లు కుదవ చేర్చవచ్చు
చాన్సు తగిలితే ఈ దెబ్బతో, మన కరువు తీరవచ్చు
పోతే... అనుభవమ్ము వచ్చు,
చివరకు జోలె కట్టవచ్చు (అయ్యయ్యో)

చిత్రం : కులగోత్రాలు (1962); సంగీతం : సాలూరి రాజేశ్వరరావు; సాహిత్యం : కొసరాజు; గానం : మాధవపెద్ది, పిఠాపురం, రాఘవులు  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,891,473; 104 తత్వాలు (Tatvaalu) and views 227,057
Dt : 17-Sep-2023, Upd Dt : 17-Sep-2023, Category : Songs
Views : 299 ( + More Social Media views ), Id : 1918 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Ayyayyo , Chethilo , Dabbulu , Parody , Kula , Gotralu , ANR , Krishna , Kumari
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content