పాటతో పరమార్ధం- బహుదూరపు బాటసారీ ఇటు (భక్తి ఆధ్యాత్మికం పేరడీ)- ఘంటసాల ప్రైవేట్ ఆల్బమ్ నుండి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2183 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2218 General Articles and views 2,485,331; 104 తత్వాలు (Tatvaalu) and views 266,857.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Bahudoorapu Batasari (Devotional Spiritual Parody) - From Ghantasala Private Album

ప్రతి జీవి బహుదూరపు బాటసారే. ప్రతి రోజూ పరుగులే, తన ఆశల సౌధవాలను చేరడానికి, అది గుణముతో కూడిన చదువు, సంపాదన, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ. ఏదైనా కానీ, అందులో నీతి నియమం నిబద్దత ఉన్నదా? గీత లో చెప్పినట్లు, నీటి మడుగులో ఉన్నా, తామరాకును నీటి బొట్టు అంటనట్లుగా, విషయ వాసనలు అంటకుండా, ఉండగలమా? అదే జీవిత పరీక్ష.

80 శాతం మందికి అది అర్ధం కాదు, అర్ధమైనా చేతకాదు. వరాహం లాగా, ప్రాపంచిక బురదలో, నిత్యం ఆనందముగా పొర్లాడుతుంటారు - సంపాదన ఆస్తులు పదవి అధికారం అందం అని.

కానీ జీవితములో ఏదో ఒక సారి, తన గురించి తానే నిజం తెలుసుకుంటాడు. తాను ఇన్నాళ్ళు జీవితాన్ని వ్రుధా చేసుకున్నాను అని, ఇన్ని రోజులు పరుగులు తీసినవి అన్ని, తనకు నిరంతర మనశ్శాంతి ని ఇవ్వవు అని, తన సొంత ఇంటి వారే తనను చీత్కరించుకుని దూరంగా పెడతారని.

ఉదాహరణకు, ఒక వ్యక్తి సినిమా/ వ్యాపారం/ ఉద్యోగం/ పదవి/ ఆస్తులు లలో మొదటి స్థానానికి చేరారు. కానీ తన స్వధర్మం మరచారు, పిల్లల సంస్కార పెంపకం ను. తానే 60 ఏళ్ళ తర్వాత చెప్పారు, కోట్లు సంపాదించాక పదవి అధికారం పొందాక, ఇవన్నీ వ్రుధా, నా పిల్లలే నన్ను పట్టించుకోవడం లేదు.

కాబట్టి కాషాయం కట్టినా, ఇప్పుడు నాకు ఒక తోడు కావాలి అని, మరలా అదే దోవలో కొత్తగా జీవితం మొదలు పెట్టారు. అదీ బ్రమనే అని, తర్వాత తెలిసింది. తన జీవితం మొత్తము వ్రుధా అయ్యింది, కన్నీరు, మనశ్శాంతి లేదు చివర క్షణాలలో కూడా, చుట్టూ అన్నీ ఉన్నా, అందరూ ఉన్నా, తాను ఒంటరే. ఎవరూ అండగా రాలేదు. మరి మనము అంతకన్నా ఎక్కువనా ఆశ దురాశ లలో? అడుగులు తడబడే, తూలిపడే వయసులో ఎవరు అండగా ఉంటారు, ఎన్ని లక్షలు ఇచ్చినా, ప్రేమ గౌరవంతో?

ఇక సామాన్యులము మన బతుకులు ఎంత? సంపాదన ఆస్తులు పదవి అధికారం అందం తో మనశ్శాంతి దొరకదు. పంచభూతాలు వదలవు, మనం మరచిన క్రుతజ్ఞత, విశ్వసనీయత నేర్పుతాయి.

కాబట్టి మిత్రమా, భయపడకు, మేము ఉన్నాము మీ తోడు. ఇటు రా, ఒక్క సారి. ఆలోచన చెయ్యి ఒక్క సారి. ఏమిటి మన జీవిత లక్ష్యం? దేనికి వచ్చాము, దేనికి పరుగులు పెడుతున్నాము? అర్ధరాత్రి అపరాత్రి పెనుతుఫాన్ లో పరుగులు ఎందుకు? మనశ్శాంతి మా కుటీరం లో ఉంది, ప్రశాంతముగా నిద్రమో, మనశ్శాంతిని పొందు.

ఎక్కడికి పయనం? ఈ జీవిత పరుగులెచటికోయి, ఆ గమ్యమేమిటోయి, ఆలోచన చెయ్యి. ధర్మం లేని, అర్ధం కామాలు, మనతో ఉండవు, మనకు మనశ్శాంతిని ఇవ్వవు. అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం ను జయించు. ఈ ప్రాపంచిక బ్రమలు, ఈ ఆశలు వీడవోయి, మనలోని సొంత ఆత్మతో మాట్లాడుతూ, మంచి దోవలో మనశ్శాంతితో నడవవోయి సోదరా?

వచనం : మృతి అంటే భయం లేనటువంటి వ్యక్తి పాడుతున్న పాట

పల్లవి :
బహుదూరపు బాటసా.రీ...
ఇటు రా.వో. ఒక్కసా.రీ...॥ 2

చరణం : 1
అర్ధరాత్రి పయనమే.లనో.యి
పెనుతుఫాను రే.గనున్నదో.యి 2
మన కుటీరమిదేనోయ్ విశ్రమింప రా.వోయి 2
మనశ్శాంతి పొందవోయ్॥ బహుదూరపు

చరణం : 2
పయనమెచటికోయి, ఈ జీవిత పరుగులెచటికోయి,
ఆ గమ్యమేమిటో.యి. (2)
ఈ ఆశలు వీడవోయి,
ఆత్మతో నడవవోయి (2)॥ బహుదూరపు

ఈ పాట అసలుది ఘంటసాలకు చాలా ఇష్టమైన పాట. ఆయన గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా అందరికీ సుపరిచితులు. కాని ఆయనలో కవితాత్మ ఉందని కొద్దిమందికి మాత్రమే తెలుసు.

ఆయన పాడిన ప్రైవేటు గీతాల్ల్లో... బహుదూరపు బాటసారీ, మరువలేనె మరువలేనె నా వలపుల రాణి, మరణ సమయమిదియే ఓ సఖీ, ఎన్నినాళ్లు గడిచినాయో, మరుపురానిది తీయనైన బాధ, భూమి పొమ్మన్నది-ఆకాశం రమ్మన్నది అనే పాటలు ప్రజాదరణ పొందాయి.

ఆయన మరణానంతరం అజరామరమైన కొన్నిపాటలు బహుదూరపు బాటసారీ అనే ఆల్బమ్‌గా రిలీజైంది. ఆయన దాదాపు అరవైకి పైగా ప్రైవేటు గీతాలు పాడారు.

బాటసారి అయినా, బహుదూరపు బాటసారి అయినా, తన నటనా జీవితంలో శ్రీ ఘంటసాల సగభాగమై వున్నారు అని, సవినయంగా పలుమార్లు పలువేదికలపై చెప్పిన, నటసామ్రాట్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు.

బాటసారీ... ఒక్కసారీ...;ఆల్బమ్ : బహుదూరపు బాటసారీ; రచన, సంగీతం, గానం :ఘంటసాల

Devotional and Spiritual  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2218 General Articles and views 2,485,331; 104 తత్వాలు (Tatvaalu) and views 266,857
Dt : 14-Jun-2023, Upd Dt : 14-Jun-2023, Category : Songs
Views : 563 ( + More Social Media views ), Id : 1792 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Bahudoorapu , Batasari , Parody , Ghantasala , Album
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content