బాపట్ల పార్లమెంటు పరిధి లో, 2 సురేష్ లు నాయకులు, ఉత్తమ బాధ్యత పరంగా పోలిక - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,876,078; 104 తత్వాలు (Tatvaalu) and views 225,817.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ఏవండీ బాపట్ల పార్లమెంటు పరిధి లో, 2 సురేష్ లు నాయకులు గా ఉన్నారు, వారి గురించి ఉత్తమ బాధ్యత పరంగా పోలిక చెప్పగలరు.

జవాబు,

* కరెక్ట్, ఒకరు బాపట్ల ఎంపీ సురేష్ గారు. గతంలో కూడా చెప్పాము ఆయన గొప్పతనం.

మేము మా పార్లమెంటు పరిధిలో అభివృద్ధి గురించి, అసలు పట్టించుకోకుండా, అన్నింటికీ దూరంగా ఉండే వ్యక్తులనే, ఎప్పుడూ నిబద్ధత నిజాయితీ తో ఎన్నుకుంటాము, మా విలువైన ఓట్లు ను వృధా చేస్తూ గత 20 ఏళ్లుగా.

అన్ని పార్టీలు కూడా, మా నిర్లక్ష్యం ను గుర్తించి, అలాంటి వ్యక్తులనే, ఏరి కోరి, ఎంపీలు గా పెడుతున్నారు.

గెలిచిన ఎంపీలు కూడా, ప్రజల మనోభావాలు గౌరవిస్తూ, అసలు ఈ పార్లమెంటు నా స్ధానమేనా అని విధముగా, గెలిపించిన తర్వాత, 5 ఏళ్ళు మరచిపోతారు.

ఉదాహరణకు దగ్గుబాటి వారందరూ, నేదురుమల్లి, పనబాక ఇప్పుడు సురేష్ గార్లు ఎవరూ కూడా, బాపట్ల పార్లమెంటు పరిధి అభివృద్ధి గురించి పార్లమెంటులో అడగరు, స్మార్ట్ సిటీ బీచ్ లాంటివి తీసుకుని రారు, ముఖ్యమంత్రి దగ్గర అసలు నోరు ఎత్తరు ఏవీ అడగరు.

గతంలో కూడా బాధతో కూడిన ఆనందము తో కధనాలు రాశాము. link.

అయితే మిగతా వారి కన్నా, ఎంపీ సురేష్ లో గొప్పతనం ఏమిటి అంటే, చేతిలో చిడతలు తంబూర లేకపోయినా, నారదుడు నారాయణ స్మరణ లాగా, కేవలం జగనన్న నామస్మరణ లో మునిగి తేలుతూ, జగనన్న వెంటే పడుతుంటారు, స్ధానిక ప్రజలను అభివృద్ధి గాలిని వదిలేసి.

అలాగే ఢిల్లీలో పార్లమెంటు బయట, ఇంకో ఎంపీ ని లేదా చంద్రన్న ను తిట్టమంటే మాత్రం, రెచ్చిపోయి మైకులు విరగకొడతారు, పార్టీ విధేయత చాటడం కోసం.

జగనన్న కూడా మురిసిపోతారు, ఆ అనన్య భక్తి భావ ప్రకటన చూసి, అంతే గాని, ఇక చాలు వెళ్లి పార్లమెంటు స్ధానం లో, ఖచ్చితంగా 15 రోజులు ఇల్లు అద్దెకు తీసుకుని ఉండి, ప్రతి అసెంబ్లీ పరిధి తిరిగి, ఫోటో సాక్ష్యం పెట్టమని అడగరు చెప్పరు.

ఈయన కూడా, అధికారులు సోషల్ మీడియా గురించి పట్టించుకోకుండా ఉన్నారు.

* మా చీరాల అసెంబ్లీ కూడా అంతే, అభివృద్ధి గురించి మాట్లాడని, వారినే ఎన్నుకుంటాం.

చీరాల జిల్లా, ఫిషింగ్ హార్బర్, చేనేత పార్కు కావాలి అనే ధైర్యం పట్టుదల, మా కరణం బాబాయి కి, మా అమంచి కృష్ణ మోహన్ అన్నకు, లేనే లేవు. ధర్నా నిరాహారదీక్ష చేయను గాక చేయరు.

కరణం బాబాయి అయితే ఒంగోలు లో ఉంటూ, ఒంగోలు అభివృద్ధి కి, బాలినేని కి కలెక్టర్ కి, సలహాలు ఇస్తుంటారు, అక్కడ అందుబాటులో ఉండి. మా జనము అధికారులు కాళ్ళు ఈడ్చుకుంటూ, చలో ఒంగోల్.

వీరు కూడా, అధికారులు సోషల్ మీడియా, గురించి పట్టించుకోకుండా ఉన్నారు.

* మా ఒంగోలు ఎంపీ మాగుంట కూడా అంతే, నెలకి 3 రోజులు ఒంగోలులో కనపడితే చాలు, మా జనం హాపీ, ఈలలు డాన్సులు సంబరాలు. అయ్యా మా అభివ్రుద్ది కన్నా మీ వ్యాపారాలు ముఖ్యం అని దండం పెడతారు, ఇంకో దిక్కు లేక.

ఒంగోలు చుట్టుపక్కల, ఎండాకాలం నీళ్లు సమస్యలు, గత 20 ఏళ్లుగా ఉన్నాయి, ఇంకో 20 ఏళ్ళు కూడా అలాగే ఉంటాయి.

మా మంత్రి బాలినేని వాసన్న, మాగుంట, వారి ఇద్దరు వారసులు, కలెక్టర్ తో కలసి, ఇంకో 50 ఏళ్ల కైనా ఎలాగైనా నీటి సమస్య తీరుద్దాం, అని గట్టిగా ప్రయత్నం చేస్తునే ఉంటారు. మేము కూడా అఖండ మెజారిటీ తో గెలిపిస్తూనే ఉంటాము.

వీరు కూడా, అధికారులు సోషల్ మీడియా, గురించి పట్టించుకోకుండా ఉన్నారు.

అంత నిర్లక్ష్య అమాయక జనం, మా జిల్లా ప్రజలు. మరి మమ్మల్ని కరోనా గురువు అన్నా, మారుస్తారో లేదో.

* ఇంకొకరు అందరికీ వర్తించే, రాష్ట్ర విద్యామంత్రి సురేష్. సౌమ్యంగా మాట్లాడుతూ, పద్దతి గా ఉంటారు.

మా బాపట్ల ఎంపీ కన్నా, మంత్రి సురేష్ గారు, మాట పరంగా బాధ్యత పరంగా, వంద శాతం నయం, ఉత్తములు.

జగనన్న భజన అతిగా ఉండదు. సమస్య వరకే చక్కగా మాట్లాడుతూ ఉంటారు, ఇతరుల ను పద్దతి గా సున్నితంగా విమర్శలు చేస్తారు.

యర్రగొండపాలెం అనుకుంటా అసెంబ్లీ. ఇంకా ఎక్కువ కృషి చేస్తూ , స్ధానిక అసెంబ్లీ అభివృద్ధి ఫోటోలు పెట్టాలి సోషల్ మీడియాలో.

విద్యాశాఖ లో మనం ఎత్తి చూపిన లోపాలను సరిచేస్తూ, జగనన్న కు పేరు ప్రఖ్యాతి తెచ్చి, మన ప్రకాశం పరువు ప్రతిష్ట నిలపాలని, వారిని సవినయంగా కోరాము కోరుతున్నాము.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,876,078; 104 తత్వాలు (Tatvaalu) and views 225,817
Dt : 02-May-2021, Upd Dt : 02-May-2021, Category : Politics
Views : 784 ( + More Social Media views ), Id : 1145 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : bapatla , mp , parliamentary , constituency , suresh , leaders , comparison , responsibility , prakasam , minister
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content