Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. beacon of hope for parents, spiritual, salvation, aspirants - a helping hand to stand as ideal in practice of ethical rules
*తల్లి దండ్రులకు ఆశాజ్యోతిగా, ఆధ్యాత్మిక, మోక్ష, సాధకులకు నీతి నియమాలు ఆచరణలో ఆదర్శముగా నిలిచేందుకు చేయూత నివ్వాలి*
*ప్రశ్న/ స్పందన* - ఏవండీ, ప్రపంచం లో ఎంతో మంది మాకు తెలిసిన వారు ఉన్నారు. 80 శాతం మంది అవసర అవకాశ వాదులు, మాతో కలిపి.
ఆధ్యాత్మికం కోసం అని, ఖర్చుతో లివింగ్ ఆర్ట్, ఖర్చుతో ఉష ఫండేషన్, ఖర్చుతో ఇన్నర్ అవుటర్ ఇంజనీరింగ్, ఖర్చుతో ఆచంద్ర మిషన్ అని (పేర్లు మార్చబడినవి) ఏళ్ళు గా ఎంతో సమయం, ఖర్చు వేలకు వేలు వ్రుధా గా ఖర్చుపెట్టాను. అలాగే యాత్రలు ఎన్నో, వ్రుధాగా, ఇంచె మార్పు లేదు. వారంతా ఆధ్యాత్మికం ఎంత చెప్పినా, ఎన్ని సాధనలు చేసినా, కొంత కాలం తర్వాత మానేస్తున్నాము. ఎందుకంటే, అదొక విడి పనిగా, సాధన గా తోస్తుంది. కొనసాగించినా, మాలో మార్పు లేదు.
కానీ వారెవరు, రోజు ఇంట్లో ముదుసలి తల్లి దండ్రుల/ అత్త మామల సేవ సజీవ గురువు సేవగా చేయమని (నర సేవ నారాయణ సేవ అని) సమాన వైద్యం అలాగే సౌకర్యాలు ఇవ్వమని 1 మైలు నడిపించమని, అనుభవాలు మాత్రుభాషలో రాయమని, వాక్సుద్ది సాధన త్రికరణ శుద్ది గా చేయమని, మానసిక నియంత్రణ బలం దైనందిక కార్యక్రమములో ఎలా వాడుతున్నామని, ఆహార ఆలోచన అరిషడ్వర్గ అష్టవ్యసన నియంత్రణ, నేల చాప నిద్ర, యోగా, ఉదయం 5 కే లెగవడం, పదిమందికి గురువు గారు అరిషడ్వర్గాల బానిసత్వం వీడండి అని నిరంతరం మేల్కొలపడం, 190 వారాలు 108 ప్రదక్షిణలు, ఇవన్నీ, ఎంత వరకు చేసామని అడగరు. వారికి, అలాగే మాకు అనవసరం - ఇక్కడనే మేము ఫెయిల్ అవుతున్నాము.
ఇవన్నీ చేయకుండా, మోక్షం, ఆధ్యాత్మికం, దైవ భక్తి, మనల్ని మనం తెలుసుకోవడం, ఎలా సాధ్యమో ఎవరికీ తెలీదు. కంప్యూటర్ నేర్చుకుంటే, దానిని ఉపయోగించి, తొందరగా పని చేయించాలి. అలాగే రైతు, దున్ని, పంట పండించాలి. అంటే సిద్దాంతం తో పాటుగా, ప్రాక్టికల్స్ ఫలితాలు ఉండాలి దేనికైనా.
అలాగే ఆధ్యాత్మిక సాధన లో పెరిగే కొద్దీ, వాటి ఫలితాలు చేతలలో కనపడాలి. కానీ, ఎవరి దగ్గరా లేవు. మీ శని వారం లిస్ట్ మేము రాయలేము, రాయడానికి సాధన ఏమీ లేదు, మేము చేస్తున్నది, ప్రాపంచిక మోహ బురదలో పొర్లాడటం తప్ప. ఆ చిన్నవే మేము చేయలేము. మీరు చెప్పిన ఉదాహరణలు అక్షర సత్యం - రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయమ్మ, కోడేలయ్య, ఎన్నో ఉదాహరణలు, చివరకు ఏమీ లేదు.
మాకు ఆధ్యాత్మిక సాధనలు నేర్పే వారు, ఇవన్నీ చెపితే, మా సాధన పురోగతి వీటిలో అడిగితే, మాలో ఒక్కరు కూడా, వారి దగ్గరకు మరలా పోరు, ఒళ్ళు వంచి, మమ్మల్ని మేము సరి చేసుకోవడం అంటే, మా వలన కాదు. డబ్బు పడేసి, ఆధ్యాత్మిక సాధన అంటే, కపటం నటనతో అనుచరులుగా, ఏళ్ళుగా జీవనం కొనసాగిస్తాము.
అంటే, మనలో సాత్విక భావనలు లేకుండా, ఈ బయట ప్రయత్నాలు అనవసరం, ఉపయోగం లేదు. ఈ పైన చెప్పిన సాధకులు ఎవరూ కూడా, తాము సజీవ గురువు సేవ చేస్తూ మీ లాగా, ఉచితముగా మాకు చెప్పి, మమ్మల్ని చేయమన్నవారు కాదు. చేసామో లేదో వారికి అవసరము లేదు. కేవలం అందరము ఆధ్యాత్మికాన్ని వ్యాపారం చేస్తూ, విలువ తగ్గిస్తున్నాము, బ్రమలలో బతుకుతున్నాము.
వ్యాపార ద్రుష్టి లేకుండా, నిస్వార్ధ ఆదిశంకరుని గా, ఆధ్యాత్మికాన్ని, ప్రాక్టికల్ గా, సజీవ గురువు సేవ లో అలాగే ఇతర సాధనలలో, మీరు మాత్రమే 9 ఏళ్ళు గా నిరూపించి చూపించారు సాక్ష్యంతో, 90 మందికి స్వయముగా పంపారు. 77+ ఏళ్ళ వయసు సొంతగా నడవలేని అమ్మ సేవ అంటే, ఇద్దరు 5 ఏళ్ళ పిల్లలను పెంచిన దానికన్నా ఎక్కువ శ్రమ.
కేవలం మీరు మాత్రమే, చిన్న చిన్న మానసిక నియంత్రణ సాధనాలు చెపుతూ, తెలుగు లో రాయి, ప్రొఫైల్ ఫోటో ఏదో ఒకటి పెట్టు స్వభావరీత్యా, రీడ్ రిసీప్ట్ ఆపవద్దు దొంగ లా, రెండు నాల్కల ధోరణి వద్దు దొంగా దొరా నీ ఇష్టం స్ధిరంగా ఏదో ఒకవైపు ఉండు, ముదుసలి తల్లి తండ్రుల అత్త మామ ల సజీవ గురువు సేవ గురించి, అలాగే సంస్కార పిల్లల పెంపకం దగ్గర ముదుసలి తనం లో దేవతలు గా ఉంటాం అని, అలాగే శనివారం సాధనలు లిస్ట్, ధైర్యంగా స్టేటస్ లో పెట్టామన్నారు, గట్టిగా బల్లగుద్ది 5 ఏళ్ళుగా మొహమాటం లేకుండా చెబుతున్నారు.
ఊళ్ళోళ్ళ సొమ్ముతో పధకాలకు మన కుటుంబ పేర్లు పెట్టి పతనం కావద్దు అని, గతములో చంద్రన్న పెట్టినా ఓడిపోయారు అని, ధైర్యముగా చెప్పారు సొంత బిడ్డలకు చెప్పినట్లుగా, భవిష్యత్ పంచభూతాల శిక్షణ తప్పించడానికి. నాయకులకన్నా, మొదటి తప్పు ఓటరు ది అని, బల్ల గుద్ది చెప్పారు, మీ సందేశాల చివర ఎప్పుడూ స్పష్టముగా ఉంటుంది. ఇవన్నీ, ఆ ఆధ్యాత్మిక వ్యాపారస్తులు చెప్పరు.
వీటిలో ఏ ఒక్కటి మనస్ఫూర్తిగా క్రమం తప్పకుండా చేసే శక్తి, ఓపికా, సహనం, పట్టుదల, దైవ భక్తి, సజీవ గురువు సేవ, మా మొఖాలు లో ఒకరికీ లేవు. మాకు సంస్కార పెంపకమే తెలీదు. రోగాలకు నిలయం అయిన శారీరక సుఖం తప్ప, మానసిక బలం శూన్యం.
మాకు తిట్టినా కొట్టినా, మంచి చెప్పే, ఇంట్లో మనిషి మీరు మాత్రమే. మన్నించాలి, మమ్మల్ని పంచభూతాల, రోగాల మరియు ముదుసలి వయసు బాధలు అవమానాలు శిక్షణ నుంచి, మీరే రక్షించాలి/ కాపాడాలి.
మీరు, ఎంతో మంది అరిషడ్వర్గ సాధకులకు కొంత సహాయం చేస్తాము, చూపించమని, మమ్మల్ని పాధేయ పడ్డారు 3 ఏళ్ళు గా. కానీ సాక్ష్యాల తో మాకు ఎవరు దొరకడం లేదు.
ఈ బయట సాధనలు, యాత్రల వ్రుధా ఖర్చు బదులు, మీకు కూడు గూడు గుడ్డ లాంటివి మేము అందిస్తే, మీరు 3 ఏళ్ళు పైన ఆదాయం లేకుండా ఉండి ఇబ్బందులు పడే పని ఉండదు మరలా భవిష్యత్ లో. కానీ మా దగ్గర అంత శక్తి తో పాటుగా, మీరు చెప్పే పాత్రత కూడా లేదు.
పాత్రత కలిగిన వారు, మీకు అన్ని సమకూర్చి, ఇవన్నీ నిరంతరము జరిగేటట్లు, అందరికీ ఈ సేవలు చేరేటట్లుగా, మిగతా ముదుసలి తల్లి దండ్రులకు ఆశాజ్యోతిగా, ఆధ్యాత్మిక, మోక్ష, సాధకులకు నీతి నియమాలు ఆచరణలో ఆదర్శముగా నిలిచేందుకు చేయూత నివ్వాలి. ధన్యవాదములు
*జవాబు* - గురువు గారు, మీ అభిమానానికి శిరస్సు వంచి నమస్కారములు. మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నము లో తప్పక మా ప్రోత్సాహం ఉంటుంది. మీరు శనివారం సాధనలు చిన్న గా మొదలు పెట్టి, మీ గురించి, మీ ఓపిక, సహనం, త్యాగం, నిస్వార్ధ మానసిక శారీరక సేవ, నీతి నియమం నిబద్దత గురించి, మీరు తెలుసుకోగలిగితే, చాలు.
ఇది మొదటి మెట్టు. ఇక్కడనే, చాలమంది, 100 జన్మలు ఎత్తినా, దాట లేరు. మీ పురోగతి అందరికీ చెప్పగలరు. ఇది మీ వ్యాపారం, కుటుంబం, సమాజం, వర్గం, ఉద్యోగం అందరికీ మంచిది. మానవత్వం లేని సాధన వారికి కూడా ఉపయోగ పడదు.
ఇక మా ఆదాయం గురించి మీరు బాధపడవద్దు, ఆలోచన వద్దు. కేవలం మీ సాధన, పాత్రత గురించి మాత్రమె ఆలోచన చెయ్యండి, ఎందుకంటే, అది మీ కుటుంబానికి అలాగే సమాజానికి ఉపయోగం. మేము ఇంట్లో పచ్చడి వేసుకుని అయినా తిని ఇవి కొనసాగిస్తాము లేదా గుడి మెట్లు అయినా ఉన్నాయి అని ఎప్పుడో చెప్పాము కదా? 3 ఏళ్ళు పైగా ఆదాయం లేకపోయినా, ఆనందముగా నే దైవ క్రుప వలన గడిచింది కదా?
పాత్రత గలిగిన వారు ఉంటే, తప్పక వారే ముందుకు వస్తారు, వేల మందికి తెలియ చేస్తారు. ఎందుకంటే, తమ పాపాలకు పశ్చాత్తాపం, ఇంకెక్కడా దొరకదు, సజీవ గురువు సేవ చేసిన వారి దగ్గర తప్ప. మనకు 20 ఏళ్ళు పైగా తెలిసిన, కోటీశ్వరులే ఉన్నారు. వారికి మనకు, అక్కడనే బేధం.
ప్రాపంచిక వ్యామోహ సంపాదన అర్హత మనకు లేదు అంటారు వారు, మనము అది ఒప్పుకుంటాము. ఎందుకంటే అదే అన్ని వెన్నుపోటులకు పతనాలకు, మూల కారణం.
వారికి ఆధ్యాత్మిక మానసిక నియంత్రణ కుటుంబ సంస్కారం పాత్రత అర్హత లేదు అని, అది లేనిదే ముదుసలి తనములో, కష్టసమయములో, రోగ సమయములో, మనశ్శాంతి మోక్షం ఉండవని మనము అంటాము, కానీ వారు ఒప్పుకోరు, ముదుసలి తనం వచ్చిన దాకా. ఆ తర్వాత ఒప్పుకుంటారు, కానీ ఫలితం శూన్యం.
గుర్తు ఉందా, 3 ఏళ్ళు ఆదాయం లేదంటే, ఒక గురువు మన వెంట పడి, 1 సంవత్సరం స్తిర ఆదాయ ఉద్యోగ మార్గం కోసం ప్రయత్నం చేసారు అని చెప్పాము. అది దైవ నిర్ణయం. ఆ తర్వాత, వారికీ పెద్ద పెద్ద ప్రమోషన్ లు వచ్చాయి.
రేపు ఉదయం భూకంపం వస్తే, మేము ఉండము. కాబట్టి, ఈ జన్మ అనుభవము సాధనలతో, మరు ఉత్తమ జన్మలో ఉత్తమ పనులు చేయడానికి, తగిన అర్హత సంపాదించాలి, ఇప్పుడే, ఈ నాడే.
మీరు కూడా. కేవలం, మీ గురించి, మీ కుటుంబ సంస్కార సాధన గురించి మాత్రమే ఆలోచన చెయ్యండి, పురోగతి మా అందరికీ తెలిపి, ఆనందింప చేయండి. ఉత్తమ సమాజ మార్పునకు, మీ వంతు క్రుషి చేయండి. ఇతర ముదుసలి తల్లి దండ్రులకు/ అత్త మామలకు ఆశా జ్యోతి వెలిగించండి.
ఎవరూ ఎవర్నీ కాపాడటం ఉండదు, మానసిక నియంత్రణ లేకపోతే. భీష్ముని అలాగే కర్ణుని ఎదురు గా, దేవ దేవుడు జగద్గురువు క్రిష్ణుడు ఉన్నా, కాపాడలేదు. ఎందుకంటే, తనకు ఫలితము దక్కాలి. కాబట్టి, మీ సాధనే మిమ్మల్ని కాపాడుతుంది.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,346,132; 104 తత్వాలు (Tatvaalu) and views 254,453 Dt : 13-Jun-2023, Upd Dt : 13-Jun-2023, Category : General
Views : 403
( + More Social Media views ), Id : 1791 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
beacon ,
hope ,
old ,
parents ,
spiritual ,
salvation ,
aspirants ,
helping ,
hand ,
stand ,
ideal ,
practice ,
ethical ,
rules Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments