Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. మనసుకు సంతోషము కలిగినప్పుడు, ఎంతో ఆనందముగా ఉంటాము. అదే సినిమాలో అయితే, దానికి ఒక పాటగా, కొన్ని కారణాలతో మదురముగా చెబుతారు.
గుండెలోని కోరికలన్నీ, ముంగిటిలోనే నిలిచినరోజు, ఆనందమే కదా. కులదైవం పలికిన రోజు, కన్నతల్లి ఆశలన్నీ, సన్నజాజులై విరిసినరోజు, మధుర ఆనందమే కదా.
3వ చరణములో వినండి, ఘంటసాల మాస్టారు గురించి, ఆయన పుట్టిన రోజు బహుమతిగా ఎవరో రాశారు, ఆ చరణం ని. గానగంగ పొంగినరోజు, శృతులు కురులు విప్పినరోజు, ఘంటసాల పుట్టినరోజు అంటూ మంచిగా పదాలు కూర్చారు.
ఘంటసాల వెంకటేశ్వరరావు (1922 డిసెంబర్ 4 - ఫిబ్రవరి 11, 1974), గుడివాడ సమీపములోని చౌటపల్లి గ్రామంలో ఘంటసాల సూర్యనారాయణ, రత్నమ్మ అనే బ్రాహ్మణ దంపతులకు జన్మించారు.
భలే మంచిరోజు, పసందైన రోజు
వసంతాలు పూచే నేటిరోజు..ఆ..ఆయ్ 2 ||భలే మంచిరోజు||
గుండెలోని కోరికలన్నీ., గువ్వలుగా ఎగిసిన రోజు
గువ్వలైన ఆ కోరికలే.., గూటిలోన చేరిన రోజు.. - మొత్తం 2 సార్లు
నింగిలోని అందాలన్నీ, ముంగిటిలోనే నిలిచినరోజు ||భలే మంచిరోజు||
చందమామ అందినరోజు, బృందావని నవ్వినరోజు
తొలివలపులు చిలికినరోజు, కులదైవం పలికిన రోజు.. - మొత్తం 2 సార్లు
కన్నతల్లి ఆశలన్నీ, సన్నజాజులై విరిసినరోజు ||భలే మంచిరోజు||
గానగంగ పొంగినరోజు, శృతులు కురులు విప్పినరోజు
గతులు కదను తొక్కినరోజు, ఘంటసాల పుట్టినరోజు - మొత్తం 2 సార్లు
తెలుగుతల్లి గుండెలోన, తేనె జల్లులై కురిసినరోజు ||భలే మంచిరోజు||
Bhale manchi roju pasandaina roju, Jaggaiah, Krishna, Kanchana, Jarigina Katha (1969)
చిత్రం: జరిగిన కథ ( 1969 ); సంగీతం: ఘంటసాల; గీతరచయిత: సినారె; నేపధ్య గానం: ఘంటసాల; జగ్గయ్య, కృష్ణ, కాంచన
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,877,275; 104 తత్వాలు (Tatvaalu) and views 225,903 Dt : 26-Dec-2022, Upd Dt : 26-Dec-2022, Category : Songs
Views : 390
( + More Social Media views ), Id : 1664 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
bhale ,
manchi ,
roju ,
pasandaina ,
jaggaiah ,
krishna ,
kanchana ,
jarigina ,
katha Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments