భూమి కోసం -ఎవరో వస్తారని ఏదో చేస్తారని -శ్రీశ్రీ, గుమ్మడి, జగ్గయ్య, జమున, చలం, ప్రభ, జయప్రద - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1632 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1667 General Articles, 64 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

భూమి కోసం -ఎవరో వస్తారని ఏదో చేస్తారని -శ్రీశ్రీ, గుమ్మడి, జగ్గయ్య, జమున, చలం, ప్రభ, జయప్రద

ఎవరో.. వస్తారని, ఏదో.. చేస్తారని
ఎదురు చూసి, మోసపోకుమా..
నిజము మరచి, నిదురపోకుమా..

బడులే.. లేని, పల్లెటూళ్ళలో..
బడులేలే.ని పల్లెటూళ్ళలో, చదువేరాని పిల్లలకు
చవుడు రాలే, చదువుల బడిలో
జీతాల్రాలని పంతుల్లకు
ఎవరో.. తోడు వస్తారని, ఏదో.. మేలు చేస్తారని
ఎదురు చూసి, మోసపోకుమా..||ఎవరో వస్తారని||

చాలీ.. చాలని, పూరిగుడిసెలో..
చాలీ చాలని, పూరిగుడిసెలో, కాలేకడుపుల పేదలకు
మందులు లే.ని, ఆసుపత్రిలో,
పడిగాపులు పడు రోగులకు
ఎవరో.. తోడు వస్తారని, ఏదో.. మేలు చేస్తారని
ఎదురు చూసి, మోసపోకుమా..||ఎవరో వస్తారని||

తరతరాలుగా, మూఢాచారపు
వలలో చిక్కిన, వనితలకు..
అజ్ఞానానికి, అన్యాయానికి,
బలియైపోయిన, పడతులకు..
ఎవరో.. తోడు వస్తారని, ఏదో.. మేలు చేస్తారని
ఎదురు చూసి, మోసపోకుమా..||ఎవరో వస్తారని||

కూలిడబ్బుతో. లాటరీ టికెట్, లాటరీ.. టికెట్
కూలిడబ్బుతో, లాటరీ టికెట్, కొనే దురాశా జీవులకు
దురలవాట్లతో, బాధ్యత మరచి
చెడె, నిరాశా జీవులకు..
ఎవరో.. తోడు వస్తారని, ఏదో.. మేలు చేస్తారని
ఎదురు చూసి, మోసపోకుమా..||ఎవరో వస్తారని||

సేద్యంలే.ని బీడునేలలో..2
పనులే. లేని, ప్రాణులకు
పగలూ రేయీ శ్రమపడుతున్నా
ఫలితం దక్కని దీనులకు
ఎవరో.. తోడు వస్తారని, ఏదో.. మేలు చేస్తారని
ఎదురు చూసి, మోసపోకుమా..||ఎవరో వస్తారని||

చిత్రం : భూమి కోసం (1974), సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు, గీతరచయిత : శ్రీశ్రీ, నేపధ్య గానం : ఘంటసాల

అశోక్ కుమార్, గుమ్మడి, జగ్గయ్య, జమున, ప్రభాకర్ రెడ్డి మరియు చలం, ప్రభ. ఇది జయప్రద తొలి సినిమా.

Movie : Bhumikosam (1974), Music : Pendyala Nageswara Rao, Lyricist : Sri Sri, Background Singer : Ghantasala

Ashok Kumar, Gummadi, Jaggayya, Jamuna, Prabhakar Reddy and Chalam, Prabha. Jayaprada.

Bhumikosam - evaro vastarani edo chestarani, Sri Sri, Gummadi, Jaggayya, Jamuna, Chalam, Prabha, Jayaprada

మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, గొంతులో కఫము తగ్గడానికి, మనసు నియంత్రణ బలం కు, మానసిక వ్యాధుల నివారణకు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1667 General Articles, 64 Tatvaalu
Dt : 11-Nov-2022, Upd Dt : 11-Nov-2022, Category : Songs
Views : 85 ( + More Social Media views ), Id : 1611 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : bhumikosam , evaro , vastarani , chestarani , srisri , gummadi , jaggayya , jamuna , chalam , prabha , jayaprada
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content