త్రిమూర్తి దత్తాత్రేయుని జన్మ దినం, దత్త జయంతి, కోర్ల పౌర్ణమి - Devotional - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,368; 104 తత్వాలు (Tatvaalu) and views 225,591.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ఓం శ్రీ గురుదేవ్ దత్త, ఓం కాలాగ్ని శమనాయ మహా

ఓం దిగంబరాయ విద్మహే, అవధూతాయ ధీమహి, తన్నో దత్తః ప్రచోదయాత్
ఓం అత్రిపుత్రాయ విద్మహే, అవధూతయ ధీమహి, తన్నో దత్తః ప్రచోదయాత్

దత్తాత్రేయని జన్మ దినాన్ని, మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా, జరుపుకుంటారు. ఇది పవిత్రమైన రోజుగా పరిగణించబడుతోంది.

అత్రి మహాముని, మహా పతివ్రత అనసూయల సంతానమే దత్తాత్రేయుడు. ఈయన త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల అంశలతో జన్మించిన అవతారమూర్తి.

అందునా దత్తాత్రేయుడు విష్ణువు అంశతో, చంద్రుడు బ్రహ్మ అంశతో, దుర్వాసుడు శివుని అంశతో జన్మించారని పురాణ కథనం.

దత్తం అంటే ఇచ్చినవారు, అత్రి కుమారుడు కావడంతో ఆత్రేయుడయ్యాడు. దత్తాత్రేయుని ఉపనయనం అయిన వెంటనే, అడవికి వెళ్లి తపస్సు చేసి, సంపూర్ణ జ్ణానాన్ని పొందాడు.

దత్తాత్రేయుడు 24 మందిని తన గురువులుగా భావించి, వారి నుండి జ్ణానాన్ని పొందాడు. దత్తాత్రేయునికి 3 తలలు మరియు 6 చేతులున్నాయని పురాణాల ద్వారా తెలుస్తోంది. కార్తవీర్యుడు, పరశురాముడు, యదవు, అలర్కుడు, ప్రహ్లాదుడు వంటి పలువురు లోకప్రసిద్ధులకు ఆధ్యాత్మిక విద్యను బోధించాడు. అవధూత గీత, జీవన్ముక్త గీత, అవధూతోపనిషత్తు తదితర గ్రంథాలను రచించాడు.

దత్తుడికి గురువారం అత్యంత ప్రీతికరమైన రోజు అని పండితులు చెబుతుంటారు. మత్స్యపురాణం, స్మ్రుతి కౌస్తుభంలో దత్త చరితం గురించి వివరాలు ఉన్నాయి.

కొన్ని ప్రాంతాల్లో చంద్రపూజ చేస్తారని నీలమత పురాణం వివరిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఈ పౌర్ణమిని, కోర్ల పౌర్ణమి గా పిలుస్తారు.

దత్త జయంతి రోజున తెల్లవారు జామునే భక్తులు నదీస్నానం లేదా ఏటి స్నానం చేస్తారు. దత్తత్రేయునికి షోడశోపచారాలతో పూజ చేస్తారు. జప ధ్యానాలకు ఈ రోజు ప్రాముఖ్యం ఇస్తారు.

దత్తాత్రేయుని యోగమార్గం అవలంబిస్తామని సంకల్పించుకుంటారు. దత్త చరిత్ర, గురు చరిత్ర, అవధూత గీత, జీవన్ముక్త గీత, శ్రీపాదవల్లభ చరిత్ర, నృసింహసరస్వతి చరిత్ర, శ్రీదత్తదర్శనం వంటివి పారాయణ చేస్తారు.

ఈ రోజు ఉపవాసం ఉండడం కూడా ఆనవాయితీనే. సాయం వేళలో భజనలు చేస్తారు.

దత్తాత్రేయుడు 16 అవతారాలు ధరించినట్లు చెబుతున్నారు. వారి పేర్లు, జన్మదిన (చాంద్ర మాస పంచాంగం) వరకు కుండలీకరణాలలో ఇవ్వబడినాయి.

యోగిరాజ్ (కార్తీక్ షు.15)
అత్రివరద (కార్తీక్ క్రు.1)
దత్తాత్రేయ (కార్తీక్ క్రు.2)
కళాగ్నిషమాన్ (మార్గశీర్ష షు.14)
యోగిజనవల్లభ (మార్గశీర్ష షు.15)
లీలావిషంభర్ (పాష్ షు.15)
సిద్ధరాజ్ (మాఘ షు.15)
ధన్యసాగర్ (ఫాల్గుణ్ షు.10)
విషంభర్ (చైత్ర షు.15)
మాయాముక్త (వైశాఖ్ షు.15)
మాయాముక్త (జ్యేష్ట షు.13)
ఆదిగురు (ఆషాఢ షు.15)
శివరూప్ (శర్వాణ్ షు.8)
దేవదేవ్ (బాధ్రపద్ షు.14)
దిగంబర్ (అశ్విన్ షు.15)
కృష్ణశ్యామకమలనయన (కార్తీక షు.12)
ఈ 16 అవతారాలు గురించి శ్రీ వాసుదేవానంద సరస్వతి ఒక పుస్తకం రచించారు. ఆ తరువాత వచ్చిన వారు, ఈ అవతారాలలో, ఇతర గురువుల పేర్లు కలుపుకున్నారు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,368; 104 తత్వాలు (Tatvaalu) and views 225,591
Dt : 28-Dec-2020, Upd Dt : 28-Dec-2020, Category : Devotional
Views : 1092 ( + More Social Media views ), Id : 890 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : birthday , trimurti , dattatreya , datta jayanti , full moon , korla
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content